<font face="mangal" size="3">ప్రాధాన్య రంగ రుణాలు - నాన్‌-కార్పొరేట్ వ్యవĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాధాన్య రంగ రుణాలు - నాన్-కార్పొరేట్ వ్యవసాయదారులకు రుణాలు – ఆర్థిక సంవత్సరం 2019-20
RBI/2019-20/63 సెప్టెంబర్ 19, 2019 ది చైర్మన్/మానేజింగ్ డైరెక్టర్, అయ్యా / అమ్మా, ప్రాధాన్య రంగ రుణాలు - నాన్-కార్పొరేట్ వ్యవసాయదారులకు రుణాలు – ఆర్థిక సంవత్సరం 2019-20 గత మూడు ఏళ్ళుగా, నాన్-కార్పొరేట్ వ్యవసాయదారులకు ప్రత్యక్ష రుణాలు అందించుటలో సాధించిన వ్యవస్థాగత సగటు విలువ ఇతర అంశాలతోబాటు, ప్రతి సంవత్సరం ఆరంభంలో తెలియచేయబడుతుందని ప్రకటిస్తూ జారీచేసిన మా సర్క్యులర్ No. FIDD.CO. Plan.BC.08/04.09.01/2015-16 తేదీ జులై 16, 2015, దయచేసి చూడండి. 2. ఈ సందర్భంగా, ప్రాధాన్య రంగ రుణాల లక్ష్య సాధన లెక్కించుటకు, 2019-20 ఆర్థిక సంవత్సరానికి వర్తించే వ్యవస్థాగత సగటు 12. 11 శాతమని, తెలియచేస్తున్నాము. మీ విశ్వాసపాత్రులు, (గౌతమ్ ప్రసాద్ బోరా) |