<font face="mangal" size="3">బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్ - ఆర్‌బిఐ - Reserve Bank of India
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్‌బీఐ ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడం
22 జూలై 2022 బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్‌బీఐ ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడం పది (10) సంవత్సరాలుగా నిర్వహించబడని సేవింగ్స్ / కరెంట్ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి పది(10) సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని ఫిక్స్‌డ్ డిపాజిట్లు "అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు" గా వర్గీకరించబడతాయి. ఈ మొత్తాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన "డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్" (DEA) ఫండ్‌కి బ్యాంకులు బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్ లు తర్వాత తేదీలో వడ్డీతో సహా డిపాజిట్ చేసిన బ్యాంక్(ల) నుండి ఈ డిపాజిట్ లను క్లెయిమ్ చేయడానికి అర్హులే. అయినప్పటికీ, బ్యాంకులు మరియు ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేసినప్పటికీ, అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్‌లలో పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం ఎక్కువగా పెరగడo అనేది, ప్రధానంగా డిపాజిటర్లు ఇకపై ఆపరేట్ చేయకూడదనుకునే సేవింగ్స్/కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల లేదా మెచ్యూర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రికవరీ క్లెయిమ్‌లు సమర్పించబడకపోవడం వల్ల జరుగుతుంది. కొన్ని మరణించిన డిపాజిటర్ల ఖాతాల కేసులు కూడా ఉన్నాయి, కారణం నామినీలు/చట్టపరమైన వారసులు సంబంధిత బ్యాంకు(ల)తో క్లెయిమ్ చేయడానికి ముందుకు రారు. అటువంటి డిపాజిటర్లు లేదా మరణించిన డిపాజిటర్ల నామినీలు/చట్టపరమైన వారసుల డిపాజిట్లను గుర్తించి, క్లెయిమ్ చేయడంలో వారికి సహాయపడటానికి, బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో నిర్దిష్ట గుర్తించదగిన వివరాలతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల జాబితాను అందజేస్తున్నాయి. అందువల్ల అటువంటి డిపాజిట్లను క్లెయిమ్ చేయడానికి సంబంధిత బ్యాంకును గుర్తించి, సంప్రదించవలసిందిగా ప్రజానీకo ప్రోత్సహించబడుతున్నది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/S84 |