<font face="mangal" size="3px">సెప్టెంబర్ 1 నుండి రెండవ, నాలుగవ శనివారాల్లో & - ఆర్బిఐ - Reserve Bank of India
సెప్టెంబర్ 1 నుండి రెండవ, నాలుగవ శనివారాల్లో బ్యాంకులకు సెలవు; భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహాయక సేవలు
ఆగస్ట్ 28, 2015 సెప్టెంబర్ 1 నుండి రెండవ, నాలుగవ శనివారాల్లో బ్యాంకులకు సెలవు; భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహాయక సేవలు అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు – ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీయ, సహకార, గ్రామీణ, స్థానీయ బ్యాంకులు, సెప్టెంబర్ 1, 2015 నుండి ప్రతి రెండవ, నాలుగవ శనివారాలు, సెలవు పాటిస్తాయి. రెండు, నాలుగు శనివారాలు కాకుండా మిగిలిన శనివారాలు పూర్తిగా పనిచేస్తాయి (పత్రికా ప్రకటనలో, 'పనిచే్సే శనివారాలు' అని చెప్పబడింది). తదనుసారంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్, తమ కార్యసరళిలో సెప్టెంబర్ 1, 2015, నుండి ఈక్రింది మార్పుల్ని ప్రకటించింది. I. ఆర్థిక విపణుల విభాగాలు (Financial Market Segments): (a) ప్రస్తుతం ప్రతి శనివారమూ తెరిచి ఉండే ఆర్థిక విపణులు, ఇకనుంచి ప్రతి ‘పనిచేసే శనివారము’ తెరిచి ఉంటాయి. అంటే,
(b) రిజర్వ్ బ్యాంక్, ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) సదుపాయాల్ని ప్రతి 'పనిచేసే శనివారాల్లో', మిగిలిన సాధారణ పని దినాల్లో లాగే, సాయంత్రం 7.00 నుంచి 7.30 గం. వరకు, నిర్వహిస్తుంది. (c) రిజర్వ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ రేట్ లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (LAF) రెపో విండో, ప్రతి 'పనిచేసే శనివారాల్లో' ఉదయం 9.30 - 10. 30గం. మధ్యలో నిర్వహిస్తుంది. 'పనిచేసే శనివారాల్లొ' నిర్వహించే LAF రెపో విండో, నిజానికి శుక్రవారపు LAF విండోకి పొడిగింపు. అంటే, బ్యాంకులు, వారికి నిర్ణయించిన పరిమితిలో, మూడు రోజుల రుణ సౌకర్యాన్ని, శుక్రవారం రోజే పొందవచ్చు. మిగిలిన పరిమితిని, రెండురోజులవ్యవధిలో, పనిచేసే శనివారాల్లో ఉపయోగించుకోవచ్చు. II. చెల్లింపు వ్యవస్థలు (Payment Systems) (i) రెండవ, నాలుగవ శనివారాల్లో చెల్లింపు వ్యవస్థలు నిర్వహించబడవు. కానీ 'పనిచేసే శనివారాల్లో' ఇవి రోజంతా అందుబాటులో ఉంటాయి. ఈ వ్యవస్థలో, సాధారణంగా, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), జాతీయ ఎలక్‌ట్రానిక్ నగదు బదిలీ (NEFT), దేశవ్యాప్తంగా బ్యాంకర్ల క్లియరింగ్ హౌసెస్ లో జరిగే చెక్ క్లియరింగ్ కార్యకలాపాలు (గ్రిడ్ ఆధారిత చెక్ ట్రంకేషన్ విధానం (CTS) తో సహా), ఎలక్‌ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ సూట్ (ECS), ప్రాంతీయ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (RECS) ఇంకా జాతీయ ఎలక్‌ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (NECS), కూడి ఉంటాయి. (ii) భవిష్యత్తులో నిర్ధారిత తేదీన విలువ ఆధారంగా జరపవలసిన లావాదేవీలు (future value dated transactions), ఒక వేళ ఆ తేదీ రెండవ లేక నాలుగవ శనివారం అయినట్లయితే, RTGS, ECS సూట్ ల పరిధిలో చర్యకై చేపట్టబడవు. (III) బ్యాంకింగ్ విభాగము రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లొ బ్యాంకింగ్ విభాగాలు, ఫైనాన్షియల్ మార్కెట్లు, పేమెంట్ సిస్టమ్స్ నిర్వహణకు అనుకూలంగా, 'పనిచేసే శనివారాల్లో', రోజంతా తెరిచి ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, 'పనిచే్సే శనివారాల్లో', ప్రాతినిధ్య బ్యాంకులు నిర్వహిస్తాయి. భారత ప్రభుత్వం ఆగస్ట్ 20, 2015 న జారీచేసిన ప్రకటనద్వారా [గెజట్ ఆఫ్ ఇండియా (విశేష) పార్ట్ II, సెక్షన్ 3, సబ్ సెక్షన్ (ii) లో ప్రచురించబడింది] ప్రతి రెండవ, నాలుగవ శనివారాలు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏక్ట్, 1881( 26 ఆఫ్ 1881) క్రింద సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసినదే. తదనుసారంగా, అన్ని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్, 1934 (2 ఆఫ్ 1934) రెండవ షెడ్యూలు లో చేర్చబడినా, లేకున్నా, సెప్టెంబర్ 1, 2015 నుంచి, రెండవ, నాలుగవ శనివారాలు సెలవు దినంగా పాటిస్తాయి. బ్యాంకుల, ఆర్థిక విపణుల, పేమెంట్ మరియు సెటిల్‌మెంట్ సిస్టమ్‌ల నియంత్రణాధికారులుగా, రిజర్వ్ బ్యాంక్, కొన్ని విభాగాల కార్యసరళిలో సానుకూల మార్పుల్ని చేసింది. ఈ పైన వివరించిన ఏర్పాట్లు, ఆరు నెలల తరువాత సమీక్షించబడతాయి. అల్పన కిల్లావాలా పత్రికా ప్రకటన: 2015-2016/528 |