<font face="mangal" size="3">కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ఆస్తుల వర్గ - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ఆస్తుల వర్గీకరణ మరియు కేటాయింపులు (అసెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రొవిషనింగ్)
RBI/2019-20/220 ఏప్రిల్ 17, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) అమ్మా / అయ్యా, కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ఆస్తుల వర్గీకరణ మరియు కేటాయింపులు (అసెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రొవిషనింగ్) వ్యాపార, ఆర్థిక రంగాలపై కోవిడ్–19 దుష్ప్రభావాన్ని తగ్గించే దిశగా, అదనపు నియంత్రణ చర్యలు సూచిస్తూ, ఏప్రిల్ 17, 2020 తేదీన గవర్నర్ చేసిన ప్రకటన దయచేసి జ్ఞప్తికి తెచ్చుకోవలెను. బ్యాంకింగ్ నియంత్రణపై బాజెల్ కమిటీ, విశ్వవ్యాప్తంగా చేపట్టిన సమన్వయ చర్యలను అనుసరించి, ఈ ప్రకటన చేయబడింది. ఈ సందర్భంగా, ఆస్తుల వర్గీకరణ, మరియు కేటాయింపులపై జారీచేసిన ఆదేశాలు ఈక్రింద వివరించబడ్డాయి: (i) ప్రూడెన్షియల్ నిబంధనల క్రింద ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ ఆధారంగా, ఆస్తుల వర్గీకరణ (ఐ ఆర్ ఎ సి) 2. సర్క్యులర్ DOR.No.BP.BC.47/21.04.048/2019-20, తేదీ మార్చి 27, 2020 (రెగ్యులేటరీ ప్యాకేజ్) అనుసారం, ఋణ సంస్థలు, మార్చి 1, 2020 మరియు మే 31, 2020 మధ్యలో చెల్లించవలసిన నియమితకాల రుణాల వాయిదాలపై, మూడునెలల ‘మారటోరియం’ జారీ చేయుటకు అనుమతించబడినవి. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణపై బాజెల్ కమిటీ ఇచ్చిన వివరణ ఆధారంగా, బకాయిల వర్గీకరణకు (ఐ ఆర్ ఏ సి నిబంధనలను అనుసరించి), ఫిబ్రవరి 29, 2020 తేదీన ‘స్టాండర్డ్’గా వర్గీకరించిన అన్ని రుణాలపై (గడువు మీరినఋణాలతోసహా), జారీచేసిన మారటోరియం గడువు మినహాయించవలెను. 3. ఇదే విధంగా, వర్కింగ్ కేపిటల్ కొరకు జారీ చేసిన క్యాష్ క్రెడిట్ / ఓవర్ డ్రాఫ్ట్ ల పై (CC /OD) మార్చి 1, 2020 నుండి మే 31, 2020 మధ్యలో చెల్లించవలసిన వడ్డీ వసూలు, వాయిదా వేయుటకు ‘రెగ్యులేటరీ ప్యాకేజ్’ అనుమతించినది (‘వాయిదా సమయం’’, ‘deferment period’). స్టాండర్డ్’ గా వర్గీకరించిన అన్ని సదుపాయాలు (SMA తోసహా) అవి దుస్థితిలో ఉన్నాయని నిర్ణయించేముందు, జారీ చేసిన ‘వాయిదా సమయాన్ని’, (‘deferment period’) మినహాయించవలెను. 4. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (IndAS) అమలుచేయవలసిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ‘ఇంపైర్మెంట్’ (‘impairment’) వల్ల కలిగిన నష్టాలు లెక్కవేయుటకు, ఇప్పటివలేనే, వారి బోర్డ్ అనుమతించిన మార్గదర్శకాలు, ఐ సి ఎ ఐ (ICAI) సలహాలు పాటించవలెను. (ii) కేటాయింపులు (provisioning) 5. బకాయిలో ఉన్నఖాతాలు (స్టాండర్డ్ ఖాతాలు అయి ఉండాలి), పైన తెలిపిన పేరాగ్రాఫులు (2) మరియు (3) నిబంధనల ప్రకారం, ఆస్తుల వర్గీకరణ చేయబడి ఉన్నట్లయితే, ఋణ సంస్థలు అటువంటి ఖాతాల మొత్తంపై, 10%నికి తక్కువ కాకుండా, ఈక్రింద చూపినట్లు, రెండు త్రైమాసికాలకు కేటాయించాలి: (i) మార్చి 31, 2020 కి ముగిసిన త్రైమాసికం – 5% నికి తక్కువ కాకుండా (ii) జూన్ 30, 2020 కి ముగిసే త్రైమాసికం – 5% నికి తక్కువ కాకుండా 6. ఈ కేటాయింపులకు గుర్తింపబడిన ఖాతాల విషయంలో, ‘స్లిపేజ్’ లకు చేయవలసిన వాస్తవ కేటాయింపులలో, పైన తెలిపిన కేటాయింపులు సర్దుబాటు చేయవలెను. ఆర్థిక సంవత్సరపు చివరకు మిగిలిన కేటాయింపులు త్రిప్పి రాయవలెను లేదా ఇతర ఖాతాల కేటాయింపులకు సరిపెట్టవలెను. 7. పైన పేరాగ్రాఫ్ 6లో తెలిపిన విధంగా వాస్తవ కేటాయింపులు సర్దుబాటు చేసిన తరువాతగాని పైన చేసిన కేటాయింపులు, నికర నిరర్థక ఆస్తులవలె లెక్కించరాదు. ఇంతేగాక, సర్దుబాటు చేయనంతవరకు, రుణాల మొత్తంనుండి తగ్గించరాదు. ఈ మొత్తం, బ్యాలెన్స్ షీట్ లో తగినచోట, వేరుగా చూపించవలెను. 8. ఋణ సంస్థలు చేయవలసిన ఇతర కేటాయింపులు (ఫిబ్రవరి 29, 2020 నాటికి నిరర్థక ఆస్తులు, మరియు ఈఖాతాలలో కాలంచెల్లుతున్న లావాదేవీలతో సహా) ఇంతకు ముందువలెనే చేయవలెను. ఇతర షరతులు 9. ఋణ సంస్థలు, పైన పేరాగ్రాఫ్ 2 మరియు 3 లలో అనుమతించిన మినహాయింపులు, పర్యవేక్షక నివేదికలలో(supervisory reporting) మరియు పరపతి సమాచార సంస్థలకు (CICs) సమర్పించే నివేదికలలో పేర్కొనవలెను; అనగా – మార్చి 1, 2020 తేదీన గడువుమీరిన కాలం, ఎస్ ఎమ్ ఎ స్థాయి, వర్తించినట్లయితే, దానిలో మే 31, 2020 వరకు ఎట్టి మార్పూ ఉండదు. 10. సెప్టెంబర్ 30, 2020 అర్ధ సంవత్సరపు ఆర్థిక నివేదికలో మరియు 2019-20, 2020-21 సంవత్సరాల ఆర్థిక నివేదికలలో, ఋణ సంస్థలు ఈ క్రింద సూచించిన అంశాలు ‘నోట్స్ టు అకౌంట్స్’ (Notes to Accounts) క్రింద ప్రకటించవలెను. (i) పైన పేరాగ్రాఫ్ 2 మరియు 3 ప్రకారం మారటోరియం / వాయిదా అనుమతించిన ఎస్ ఎమ్ ఎ, బకాయిల మొత్తం; (ii) ఆస్తుల వర్గీకరణ సౌకర్యం కల్పించబడిన మొత్తాలు; (iii) పైన పేరాగ్రాఫ్ 5 ను అనుసరించి, 2020, నాలుగవ త్రైమాసికంలో; 2021 మొదటి త్రైమాసికంలో, చేసిన కేటాయింపులు; (iv) పైన పేరాగ్రాఫ్ 6 ప్రకారం, సంబంధిత అకౌంటింగ్ అవధులలో, ‘స్లిపేజెస్’ కు సర్దుబాటు చేసిన కేటాయింపులు మరియు మిగిలిఉన్న కేటాయింపులు. మీ విశ్వాసపాత్రులు, (సౌరవ్ సిన్హా) |