<font face="mangal" size="3">కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షి - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షియల్ నిబంధనల ప్రకారం, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిష్కారానికి కాలపరిమితులు – సమీక్ష
RBI/2019-20/245 మే 23, 2020 అన్ని షెడ్యూల్డ్ (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా); అన్ని జాతీయ అర్థిక సంస్థలు (నాబార్డ్, NABARD; ఎన్ ఎచ్ బి, NHB; ఏ ఎక్స్ ఐ ఎమ్ బ్యాంక్, EXIM Bank మరియు ఎస్ ఐ డి బి ఐ, SIDBI); వ్యవస్థకు ముఖ్యమైన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (డిపాజిట్లు స్వీకరించని)(NBFC-ND-SI); డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర సంస్థలు(NBFC-D) అమ్మా / అయ్యా, కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షియల్ నిబంధనల ప్రకారం, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిష్కారానికి కాలపరిమితులు – సమీక్ష ప్రూడెన్షియల్ నిబంధనల క్రింద, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిష్కారానికి సమయ పరిమితి పెంచుతూ, ఏప్రిల్ 17, 2020 తేదీన జారీచేసిన మా సర్క్యులర్ DOR.No.BP.BC.62/21.04.048/2019-20 (‘ప్రూడెన్షియల్ ఫ్రేమ్ వర్క్’) దయచేసి చూడండి. ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై కొనసాగుతున్న సవాళ్లను ఎదుర్కొనుటకు, గవర్నర్ నివేదిక మే 22, 2020 లో ప్రకటించినట్లు, సమయ పరిమితి ఈక్రింద సూచించినట్లు మరింత పెంచబడింది: 2. మార్చి 1, 2020 తేదీన, సమీక్షా కాలం నడుస్తూ ఉన్న ఖాతాలకు, మార్చి 1, 2020 నుంచి ఆగస్ట్ 31, 2020 గల సమయం, 30 రోజుల సమీక్షా కాలం లెక్కించుటలో మినహాయించబడుతుంది. అటువంటి అన్ని ఖాతాలకు, మిగిలిన సమీక్షాకాలం సెప్టెంబర్ 1, 2020 నుండి ఆరంభమవుతుంది. ఈ సమయం తరువాత, పరిష్కారానికి మామూలుగానే 180 రోజుల సమయం ఉంటుంది. 3. సమీక్షా కాలం పూర్తి అయి ఉండి, మార్చి 1, 2020 నాటికి 180 రోజుల పరిష్కార సమయం పూర్తికాని ఖాతాలకు, పరిష్కార సమయం అసలు పూర్తి కావలసినతేదీనుండి, ఇంకా 180 రోజులు పొడిగించబడుతుంది. 4. అందువల్ల, ప్రూడెన్షియల్ నిబంధనలు, పేరాగ్రాఫ్ 17 ప్రకారం అదనపు కేటాయింపులు, చేయవలసిన సమయం, పైన తెలిపిన విధంగా పొడిగించిన కాలం ముగిసిన తరువాత, మొదలవుతుంది. 5. ఏప్రిల్ 17, 2020 తేదీ సర్క్యులర్లో పేర్కొన్న అన్ని ఇతర నిబంధనలు, అమలులో కొనసాగుతాయి. మీ విశ్వాసపాత్రులు, (సౌరవ్ సిన్హా) |