RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508755

సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), క్రింద నిర్దేశాలు – ది భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్ - కాలపరిమితి పొడిగి

తేదీ: ఆగస్ట్ 02, 2017

సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), క్రింద నిర్దేశాలు – ది భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్ - కాలపరిమితి పొడిగింపు

ది భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్‌కు, అక్టోబర్ 29, 2012 మరియు జనవరి 25, 2017 విధించిన నిర్దేశాలు, ప్రజాహితం దృష్ట్యా, జులై 31, 2017 వరకు పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిందని, ఇందు మూలముగా ప్రజలకు తెలియచేయడమైననది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, అక్టోబర్ 29, 2012 తేదీన భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, (మధ్య ప్రదేశ్) కు జారీ చేయబడి, చివరి సారి జులై 31, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా ఆగస్ట్ 01, 2017 నుండి జనవరి 31, 2018 వరకు) వర్తిస్తాయని, జులై 25, 2017 తేదీన అదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు. పై నిర్దేశాల ప్రతులు, ప్రజల సమాచారంకొరకై, భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ ఆవరణలో ప్రదర్శింపబడినవి.

పైన చెప్పిన నిర్దేశాలు జారీ చేసినంతమాత్రాన, వారి బ్యాంకింగ్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిందని భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులనిబట్టి రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/318

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?