RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504554

అయిదవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018
భారతీయ రిజర్వ్ బంక్ ధ్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము

December 06, 2017

అయిదవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018
భారతీయ రిజర్వ్ బంక్ ధ్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము

ప్రస్తుత మరియు రాబోయే స్థూల ఆర్థిక పరిస్థితులపై అంచనాల ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి),ఈనాటి వారి సమావేశంలో ఈ క్రింది విధంగా నిర్ణయించినది:

• ద్రవ్య తసవరింపు సౌకర్యం (లిక్విడిటీ ఎడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ,ఎల్ఏఎఫ్) క్రింద పాలిసీ రెపోరేట్, మార్పులేకుండా 6.0% గానే ఉంచ వలెను.అందువల్ల, ఎల్ ఏ ఎఫ్ క్రింద, రివర్శ రేపోరేట్ 5.75% గానే కొనసాగుతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంక్రేట్లు 6.25% ఉంటాయి.

ఎమ్ పి సి యొక్కఈ నిర్ణయం,అభివృద్ధికి ఊతం ఇస్తూ,వినియోగదారుల ధరల సూచీలో (CPI) మధ్యకాలీనద్రవ్యోల్బణలక్ష్యం 4 శాతం (+/- 2 శాతంపరిమితిలో) సాధించడానికి, ద్రవ్యవిధానం తటస్థంగా ఉండాలి అన్నఉద్దేశానికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణాలు ఈ క్రింద వివరించబడ్డాయి.

అంచనా

2.అక్టోబర్ 2017 లో జరిగిన క్రిందటి ఎంపిసి సమావేశం తరువాత,ముఖ్యంగా, అభివృద్ధిచెందిన దేశాల(ఏఇ,అడ్వాన్‌స్డ్ ఎకానమీస్) ప్రేరణతో,ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్నది. యుఎస్ (US) 2017 ఆర్థికవ్యవస్థ, తుఫానుల భీభత్సానికి గురి అయినా,ఆఖరి మూడుత్రైమాసికాలలో, అత్యంతవేగంతో వృద్ధిచెందింది. ప్రజల వినియోగంలో /పెట్టుబడులు మరియు నికర ఎగుమతులలో వృద్ధి,దీనికి ముఖ్యకారణాలు.నిరుద్యోగం, అక్టోబర్‌లో4.1% కి దిగివచ్చింది (17 సంవత్సరాలలో కనిష్ఠ స్థాయి).యూరో దేశాలలో, సానుకూలమైన ద్రవ్య విధానం,ఉద్యోగ అవకాశాలు చురుకుగా పెరగడం కారణాల వల్ల, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకొన్నాయి.దేశీయ వినియోగం నీరస పడ్డా, విదేశీ గిరాకీ ఈ లోటును పూరించడం వల్ల, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి కొనసాగుతూనే ఉంది.

3. ప్రధాన ఎమెర్జింగ్ మార్కెట్ ఎకానమీస్‌ లో (ఇఎంఇ), చైనా మూడవ త్రైమాసిక వృద్ధి, ప్రధానంగా, సేవారంగం ద్వారా కలిగింది. అయితే, రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలలోబలహీనత, అభివృద్ధికి ఒక గుదిబండగా మారింది. బ్రజిల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మూడవ త్రైమాసికంలో, నిరుద్యోగ శాతం ఈ సంవత్సర కనిష్ఠ స్థాయి చేరుకోవడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా కోలుకొంటోందని సూచిస్తోంది.మూడవ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంవల్ల, రష్యా ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించింది.తయారీ రంగం బలహీన పడడం, నిరుద్యోగస్థాయి పెరగడం, రాజకీయ అస్థిరత కారణంగా, దక్షిణ ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలో ఎదురుగా లివీస్తోంది.

4. ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైసేషున్ WTO), ఇటీవలి అంచనాల ప్రకారం, నాలుగవ త్రైమాసికంలో, ఎగుమతులు క్షీణించే కారణంగా, ఆర్థిక పురోగతి కుంటు పడుతుంది. 'చమురు ఎగుమతి దేశాల సమితి' (OPEC, Organisation of Petroleum Exporting Countries) మార్కెట్‌ను తిరిగి సమతుల్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నందువల్ల,ముడిచమురు ధర, రెండున్నరఏళ్ళలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. యు ఏ ఎస్ డాలర్ పటిష్ఠం కావడం కారణంగా, పసిడి, అమ్మకం ఒత్తిళ్ళకు గురి అయింది. చమురు కాక ఇతర వస్తువుల ధరలు తగ్గడం, వేతన సవరణలు కట్టడి చేసిన కారణంగా,ఏఈలలో ద్రవ్యోల్బణం స్వాధీనం లోనే ఉంది. ఇతర ఇఎమ్‌ఇ దేశాలలో ద్రవ్యోల్బణం,వివిధ రీతులలో ఉంది.

5. మెరుగవుతున్న ఆర్థిక దృక్పథం;యు ఎస్ ఫెడ్ (US Fed) ఆర్థిక విధానం క్రమంగా యథాస్థితికి చేరడం వల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు ఉత్సాహ భరితంగా ఉన్నాయి. కార్పొరేట్ల ఆదాయం పెరగడం వల్ల, యుఎస్, పెద్దమొత్తంలో పన్నులు తగ్గిస్తుందని ఆశా భావంతో, ఈక్విటీ మార్కెట్లు లాభ పడ్డాయి. ఇఎమ్‌ఇ దేశాలలో, ఈక్విటీ మార్కెట్లు సాధారణంగా లాభాలు గడించినా, కొన్ని ఆర్థిక వ్యవస్థలు,నష్ట భయం ఎదుర్కోవడానికి విముఖత చూపించాయి.ద్రవ్యోల్బణఒత్తిడి లేనందు వల్ల, చాలా ఏఇ దేశాల్లో, బాండ్లపై రాబడి కాస్త అటూ ఇటూ మారినా, కొన్ని దేశాల్లో ప్రత్యేక కారణాల వల్ల, రాబడి పెరిగింది. కరెన్సీ మార్కెట్లలో, యు ఎస్ డాలర్ విలువ పెరిగింది. యూరో విలువ,సానుకూల ఆర్థిక గణాంకాల బలంతో పెరిగినా, రాజకీయ అనిశ్చితి వల్ల, వేగం తగ్గింది. ఎమెర్జింగ్మార్కెట్ల కరెన్సీలు, దేశీయ పరిస్థితుల వల్ల బలహీనమయ్యాయి. 'నష్టభయం – రాబడి పై మదుపరుల అంచనాలని బట్టి'మూలధన ప్రవాహాలు,ప్రతి దేశానికీ విభిన్నంగా ఉన్నాయి.

6. దేశీయంగా, వరుసగా ఐదు త్రైమాసికాల్లో తగ్గుతూ వచ్చిన, రియల్ గ్రోస్స్ వాల్యూ అడ్డేడ్ (జివిఏ), 2017-18 లో పారిశ్రామిక ఉత్పత్తి చురుకుగా వృద్ధిచెందడం వల్ల, వరుసగా రెండు త్రైమాసికాలు పెరుగుదల చూపింది. పరిశ్రమలోని మూడు ఉప రంగాలు, పెరుగుదల చూపాయి. పరిశ్రమలో కీలకమైన తయారీ రంగంలో పెరుగుదల –వస్తు సేవా పన్ను (GST) అమలు తరువాత –గిరాకీ పెరగడం, రి-స్తోక్కింగ్ కారణాల వల్ల, వేగవంతమయింది. బొగ్గు, సహజ వాయువు ఉత్పాదన పెరగడం వల్ల, గనుల రంగం,రెండవ త్రైమాసికంలో మెరుగయింది. విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ రంగాల జివిఏ పెరుగుదల,పెరిగిన గిరాకీ కారణంగా బలోపేత మయింది. అయితే, దీనికి భిన్నంగా, ఖారీఫ్ దిగుబడి ఆశించినంత లేనందువల్ల, వ్యవసాయం /తదను బంధ కార్యకలాపాల పెరుగుదల, మందగించింది. మొదటి త్రైమాసికంలో,ప్రభుత్వం ముందే అత్యధిక వ్యయం చేసిన కారణంగా, ఆర్థిక, బీమా, స్థిరాస్థి మరియు వృత్తి సంబంధ సేవలు; పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవా (PADO) రంగాలలోక్రియాకలాపాలు,మందగించాయి. ఆర్ఇఆర్ఏ (RERA), జిఎస్టి (GST)అమలు ద్వారా కలిగిన తాత్కాలిక ఊరట వల్ల, నిర్మాణ రంగం, కొంత వృద్ధి చూపినా, మొత్తానికి స్థబ్దుగానే ఉంది. వ్యాపారం, హోటళ్ళు, రవాణా, సమాచార ఉపరంగాలు, రెండవ త్రైమాసికంలో –ముందటి త్రైమాసికంతో పోలిస్తే కొంత నీరసించినా –ఊపందు కొన్నాయి. ఇంక వ్యయానికొస్తే, గ్రోస్స్ ఫిక్సెడ్ కాపిటల్ ఫోర్మషున్ (gross fixed capital formation) లో పెరుగుదల వరుసగా రెండు త్రైమాసికాలలో మెరుగయింది. అయినప్పటికీ, సమిష్టి గిరాకీకి ప్రధానమైన ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షున్ వ్యయం (private final consumption expenditure),రెండవ త్రైమాసికంలో, ఎనిమిది త్రైమాసికాల, అథమస్థాయికి పడిపోయింది.

7. ముందటి సంవత్సరం ఇదే కాలపు సగటుతో పోలిస్తే, మూడవ త్రైమాసికంలో రాబినాట్లు కొంత వెనుకబడ్డాయి. అక్టోబర్నుండి వర్షపాతం, దీర్ఘకాలిక సగటుకన్న (LPA), 13% తక్కువ ఉంది. ప్రధాన జలాయాల్లో నీరు, క్రిందటి సంవత్సరం పూర్తి జలాశయ మట్టంలో67% ఉండగా, ఈ సంవత్సరం 64 % మాత్రమే ఉంది. అన్ని కాయధాన్యాల ఎగుమతుల పై నిషేధం ఎత్తివేయడంతో, కాయ ధాన్యాల నాట్లు చెప్పుకో దగినంతగా పెరగడం, సానుకూలమైన అంశం.

8. హైఫ్రీక్వెన్సీ సూచికలు (high-frequency indicators), మూడవ త్రైమాసికంలో పారిశ్రామిక క్రియాకలాపాల గురించి,మిశ్రమ చిత్రాన్ని సూచిస్తున్నాయి. ఉక్కు, ఎరువులు తప్ప అక్టోబర్‌లో, అన్ని కీలక పరిశ్రమలలో పెరుగుదల క్షీణించింది. బొగ్గు తవ్వకాలు,రెండవ త్రైమాసికంలో పుంజుకొన్నా,ప్రస్తుతం బలహీన పడ్డాయి. సిమెంట్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీనికి భిన్నంగా, అక్టోబర్‌ లో దిగజారిన పర్చేజింగ్మానేజర్స్ ఇండెక్స్ (PMI), నవంబర్‌లో తిరిగి బల పడింది. ఉత్పాదన పెరగడం, క్రొత్త గిరాకీ,దీనికి కారణాలు. పైగా, రిజర్వ్ బంక్ ఇండస్ట్రియల్ ఔట్లుక్ సుర్వెరి మూడవ త్రైమాసికంలో, కలగబోయే అధిక గిరాకీ కారణంగా, ఉత్పత్తులు పెరుగుతాయని సూచిస్తోంది.

9. అక్టోబర్‌లో, సేవారంగ క్రియాకలాపాలు మిశ్రిమంగా ఉన్నాయి. రవాణా రంగంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గాయి; ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా వేగం కోల్పోయాయి.కానీ, దీనికి వ్యత్యాసంగా,దేశీయ /అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య / వస్తు రవాణా;రైళ్ళలో సరకు రవాణా, గణనీయంగా పెరిగాయి. రిజర్వ్బ్యాంక్సర్వే, మూడవ త్రైమాసికంలో, సేవారంగంలో క్రియాకలాపాలు బలం పుంజు కొంటాయని ఆశా భావం వ్యక్తం చేస్తోంది. వాహన అమ్మకాలు, నవంబరులో తిరిగి అధిక మయ్యాయి. అయినప్పటికీ, సేవారంగపు పిఎమ్‌ ఐ (PMI)నవంబరులో, సంకోచ దశకు చేరింది.

10. వినియగదారుల ధరల సూచీ (CPI), ప్రతి సంవత్సర మార్పులతో పోల్చినప్పుడు, అక్టోబరులో ఏడు నెలల గరిష్ఠస్థాయికి చేరింది. కొన్ని మూల అంశాలు అనుకూలంగా ఉన్నా, శీఘ్రంగా పెరిగింది.ఆహార ద్రవ్యోల్బణం,గత రెండు నెలలుగా అస్థిరంగా ఉంది. కూరగాయలు, పండ్ల ధరలు చవక అయిన కారణంగా, సెప్టెంబరులో చాలా వరకు తగ్గిన ద్రవ్యోల్బణం, అక్టోబరులో తిరిగి పెరిగింది. పాలు మరియు కోడిగుడ్ల ద్రవ్యోల్బణం పెరిగింది. కాయధాన్యాల ద్రవ్యోల్బణం, అక్టోబర్నెలకు,వరుసగా పదకొండు నెలలు తగ్గుతూనే ఉంది. తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. ఎల్పిజి, కెరోసిన్‌, కోక్మరియు విద్యుత్తు ధరలు పెరగడంతో, జులై నుండి పెరుగుతూ ఉన్న ఇంధన ద్రవ్యోల్బణం, మరింత వేగంగా పెరిగింది.

11. ఆహారం, ఇంధనం మినహా, జులై నుండి సెప్టెంబర్వరకు పెరుగుతూ వచ్చినవి నియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (CPI inflation), అక్టోబరులో స్థిరంగా ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వెనక్కు తీసుకోవడం వల్ల కొంత తగ్గాయని ఇది సూచిస్తుంది. కానీ, ఏడవ కేంద్ర పే కమిషన్‌, గృహభత్యం పెంచి నందువల్ల గృహద్రవ్యోల్బణం పెరిగింది.

12. రిజర్వ్ బంక్ జరిపిన సర్వేలో, ద్రవ్యోల్బణం రానున్న మూడు నెలల్లో /సంవత్సరంలో మరింత పెరుగుతుందని కుటుంబాలు భావిస్తున్నాయని వెల్లడయింది. వ్యవసాయ, పారిశ్రామిక ముడి సరుకుల ధరలు అక్టోబరులో పెరిగాయి. రిజర్వ్బ్యాంక్ ఇండస్ట్రియల్ ఔట్‌లుక్సర్వేకి స్పందించిన సంస్థలు, ఈ పెరిగిన ధరలను, తయారీ ధరలో కలప వచ్చని ఆశిస్తున్నాయి. ఇతర ధరల విషయానికి వస్తే, సంఘటిత రంగంలో వేతనాలు పెరిగాయి, గ్రామీణ వేతనాల పెరుగుదల –ప్రత్యేకించి వ్యవసాయంలో -నెమ్మదించింది.

13. అక్టోబర్, నవంబర్నెలల్లో, వ్యవస్థలోని అధిక ద్రవ్య తక్షీణిస్తూ వచ్చింది. మూడవ త్రైమాసికంలో (డిసెంబర్ 01, 2017 వరకు), చెలామణిలోఉన్నకరెన్సీ, పండగల గిరాకీవల్ల, సెప్టెంబర్నెల చివరితో పోలిస్తే, రూ. 736 బిలియన్‌ పెరిగింది.వారియబుల్ రేట్ రివర్స్ రేపో (ఓవర్‌ నైట్నుండి 28 రోజుల కాల వ్యవధులకు) నిర్వహణ ద్వారా, రిజర్వ్బ్యాంక్, అధిక ద్రవ్యతను నిభాయించింది. ఎల్ఏఎఫ్ (LAF) ద్వారా, నికరంగా గ్రహించిన రోజు సగటు మొత్తం, సెప్టెంబరులో ఉన్నరూ. 2229 బిలియన్‌ నుండి, అక్టోబర్ 2017 కిరూ.1,400 బిలియన్‌కు, నవంబరులో రూ.718 బిలియన్‌కు తగ్గింది.రిజర్వ్బ్యాంక్, అక్టోబర్-నవంబర్నెలల్లోరూ. 300 బిలియన్‌ బహిరంగ విపణిలో విక్రయాలు (open market sales) నిర్వహించింది.దీనితో ఈ ఆర్థిక సంవత్సరంలో, రిజర్వ్బ్యాంక్గ్రహించిన అధిక ద్రవ్యత రూ. 1.9 ట్రిలియన్‌కు చేరింది (రూ. 900 బిలియన్‌ బహిరంగ విక్రయాలు; రూ. 1 ట్రిలియన్‌ మార్కెట్స్టెబిలైజేషన్‌ పథకం క్రింద జారీ చేసిన దీర్ఘకాలిక ట్రెజరీ బిల్స్).వైటెడ్ఏవరేజ్కాల్రేట్ (WACR),రిపోరేటుకు, అక్టోబరులో 12 బేసిస్పాయింట్లు; నవంబరులో 15 బేసిస్పాయింట్లు తక్కువగా ట్రేడ్చేయబడింది. (సెప్టెంబరులో 13 బేసిస్పాయింట్లు తక్కువ).

14. వరుసగా 14 నెలలు పెరుగుతూ వచ్చిన సరకు ఎగుమతులు, అక్టోబర్ 2017 లో 1.1 % తగ్గాయి. ఈ నెలలో, ఇంజనీరింగ్పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తులు , రసాయనాల ఎగుమతులు పెరిగినా, వజ్రాలు మరియు ఆభరణాలు, రెడీమేడ్దుస్తులు, మందులు మరియు ఔషధాల ఎగుమతులలో క్షీణత,దీనికన్నఅధికంగా ఉంది. దిగుమతులు ఒక మోస్తరుగా పెరుగుతున్నాయి. అక్టోబరులో,పసిడి దిగుమతులు పెరిగినా,నిరుటి సంవత్సరంతో పోలిస్తే కొంత నెమ్మదించాయి. ఈ కారణాలవల్ల, అక్టోబర్‌ లో వాణిజ్యలోటు (trade deficit) ఎక్కువయింది. సెప్టెంబరులో ఒక మోస్తరుగాఉన్న నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, 2017-18 మొదటి అర్ధభాగంలో మునుపటి సంవత్సరపుస్థాయిలోనే ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులకు రీ-క్యాపిటలైజేషన్‌ (recapitalisation)పథకం ప్రకటించిన తరువాత, ఈక్విటీస్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, ముందునెలలో తగ్గినా, అక్టోబరులో తిరిగి చురుకుగా ఊపందు కొన్నాయి. భారత దేశపు విదేశీ ద్రవ్య నిల్వలు, నవంబర్ 30, 2017 నాటికి యుఎస్ $ 401. 94 బిలియన్‌.

దృక్పథం

15. అక్టోబర్ త్రైమాసిక నివేదిక, సంవత్సరపు రెండవ అర్ధభాగంలో, ద్రవ్యోల్బణం 4. 2 - 4. 6 % ఉండవచ్చని సూచిస్తోంది (కేంద్రం పెంచిన గృహభత్యం ప్రభావంతో కలిపి).హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం, దాదాపుగా అనుకొన్నరీతిలోనే పెరిగింది. రాబోయే కాలంలో, ద్రవ్యోల్బణ చలనం అనేక అంశాల పై ఆధారపడి ఉంటుంది. మొదటిగా, 2017-18 మొదటి త్రైమాసికంలో ఆహారం, ఇంధనం మినహా ఒక మోస్తరుగా ఉన్న ద్రవ్యోల్బణం, పెరుగుదల సూచిస్తోంది. వచ్చేకాలంలో ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం పెంచిన గృహభత్యం ప్రభావం, డిసెంబర్నెలలో అత్యధికమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గృహభత్యం, గృహద్రవ్యోల్బణాన్ని, తత్సంబంధమైన ఇతర అంశాలని, 2018లో మరింత ప్రభావితం చేస్తుంది. మూడవది, వచ్చే సంవత్సరంలో, ఉత్పత్తి తగ్గించాలని ఓపిఇసి దేశాలు తీసుకొన్న నిర్ణయంవల్ల పెరిగిన ముడిచమురుధరలు, అలాగే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో, ఏవేని భౌగోళిక, రాజకీయ సంక్షోభాలవల్ల, సరఫరాకు అంతరాయం కలిగితే, ధరలు మరింత పెరుగుతాయి. ఇటీవల కూరగాయల ధరలు పెరిగినా, శీతకాలం మొదలయింది గనుక, వచ్చే నెలల్లో అదుపు కావచ్చు. కాయ ధాన్యాల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జిఎస్టికౌన్సిల్ (GST Council), క్రిందటి సమావేశంలో, అనేక చిల్లర సరకులు / సేవలపైపన్నులను తగ్గించింది. దీనివల్ల వస్తువుల చిల్లర ధర తగ్గాలి. మొత్తం మీద, ఈ సంవత్సరం 3, 4 త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం, 4. 3 - 4. 7 ఉండవచ్చని అంచనా (35 బేసిస్పాయింట్లు గృహభత్యం ప్రభావంతో కలిపి,) (చార్ట్ 1)

16. ఇక జివిఎ (GVA) మీద అంచనాలు పరిశీలిస్తే, అక్టోబరు లో తీర్మానించిన దానికన్న రెండవ త్రైమాసికంలో పెరుగుదల తక్కువగా ఉంది. ఇటీవల పెంచిన చమురు ధరలు, సంస్థల ఆదాయం పైన/ జివిఏ పెరుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపి ఉండవచ్చు. ఖారిఫ్దిగుబడిలో / రాబినాట్లలో తగ్గుదల వల్ల, వ్యవసాయం అధోముఖం పట్టే ప్రమాదం ఉంది. సానుకూల అంశాలు ఆలోచిస్తే, ఇటీవలి నెలల్లో, పరపతి వినియోగం పెరిగింది. ప్రభుత్వ బ్యాంకుల రీ-క్యాపిటలైజేషన్‌, దీన్ని మరింత మెరుగు పరచవచ్చు. స్థిరాస్థివంటి సేవా రంగాలలో, కొన్ని బలహీనతలు ఉన్నా, రిజర్వ్బ్యాంక్సర్వేప్రకారం, సేవా / మౌలిక రంగాలలో గిరాకీ /ఆర్థిక పరిస్థితులు /వ్యాపార పరిస్థితులు, నాలుగవ త్రైమాసికంలో మెరుగుపడతాయని ఆశతో ఉన్నాయి. పై అంశాలన్నీ పరిగణన లోనికితీసుకొని, 2017-18 లో GVA పెరుగుదలపై అంచనా, అక్టోబరులో తీర్మానించినట్లుగా 6. 7% గానే ఉంచడం జరిగింది (చార్ట్ 2).

17. రాబోతున్న పరిణామాలను నిశితంగా పర్యవేక్షించాలని ఎంపిసి (MPC) గమనించింది. ముఖ్యంగా, జీవన వ్యయం, ద్రవ్యోల్బణ అంచనాలకు ప్రధానమైన ఆహార /ఇంధన ధరలు నవంబరులో పెరిగాయి. రిజర్వ్బ్యాంక్నిర్వహించిన కుటుంబ సర్వేలో, ఇవి పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఆహార / ఇంధన ధరలు ఇంక ఏమాత్రం పెరిగినా, ఈ అంచనాలు మరితకఠినంగా మారతాయి. రెండవది, ఇటీవల జరిపిన సర్వేల్లో, తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరల్లో పెరుగుదల వల్ల, చిల్లర అమ్మకం ధరలు పెరిగే ప్రమాదం ఉందని వెల్లడయింది. మూడో విషయం, కొన్ని రాష్ట్రాలు వ్యవసాయ రుణాలు రద్దు చేయడం;పెట్రోలియం ఉత్పత్తుల పై ఎక్సైజ్ / VAT తగ్గించడం;పలు వస్తువులు/ సేవల మీద జిఎస్టి రేట్లు తగ్గించడం వల్ల ప్రభుత్వ రాబడికి గండిపడి, ఆ ప్రభావం ద్రవ్యోల్బణం పై పడవచ్చు. నాలుగోది, ఏఇల ఆర్థిక విధానాలు సామాన్య స్థితికి రావడం పై అనిశ్చితి / ఈ ప్రక్రియకు పడుతున్న సమయం; యుఎస్లో ఆర్థిక విస్తరణ కారణంగా విశ్వవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల,ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. కాలానుగతంగా కూరగాయలు /పండ్ల ధరలు చవక అయే సంభావన;జిఎస్టి కౌన్సిల్తగ్గించినపన్నురేట్లు, ధరల పెరుగుదలలో కొంత ఉపశమనం కలిగించవచ్చు. తదనుసారంగా, ఎంపిసి, పాలిసీ రిపోరేట్‌లో మార్పు చేయలేదు.అయినప్పటికీ, ఉత్పాదనలలో లోటు దృష్ట్యా, తటస్థ విధాన వైఖరి అవలంబిస్తూ, గణాంకాలని గమనిస్తూ ఉండాలని ఎమ్పిసి నిశ్చయించింది. హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం, దీర్ఘకాలానికి,4% నికి దగ్గరగా ఉంచాలన్న ఆశయానికి ఎంపిసి కట్టుబడి ఉంది.

18. ఎమ్‌పిసి అంచనా ప్రకారం, ఇటీవల కాలంలో, అభివృద్ధికి తోడ్పడే విశేష పరిణామాలు ‌చోటు చేసు కొన్నాయి. మొదటిగా, ఎన్నో సంవత్సరాలు మందకొడిగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌లో మూలధన సేకరణ, బాగా పెరిగింది. ఈ మూలధనం, క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో వినియోగించడంవల్ల, స్వల్పకాలికంగా గిరాకీ పెరిగి, మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తుంది. రెండవది, వాణిజ్యం జరుపుటలో సరళతకు పొందిన మెరుగైన శ్రేణి ఆర్థిక వ్యవస్థలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (foreign direct investment) ప్రోత్సహిస్తుంది. మూడవది, దుస్థితిలో ఉన్న భారీ రుణాల పరిష్కారానికి ఇన్సాల్వెన్సీ అండ్బాంక్రప్ట్సీకోడ్కు (Insolvency and Bankruptcy Code) అప్పగించడం జరుగుతోంది. పైగా, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీ-క్యాపిటలైజేషన్‌ అందించబడుతోంది. దీనితో ఈ బ్యాంకులు,అధిక నిధులు కేటాయించేసామర్థ్యం పొందుతాయి.అయితే, ప్రస్థుత బకాయి రుణాలకు,గతంలో చేయబడిన ద్రవ్యవిధాన మార్పుల ప్రయోజనం అందజేసి, దేశీయ రుణాల ధర తగ్గించడం ద్వారా, పై అంశాలకు బ్యాంకులు ఊతమివ్వాలని ఎమ్‌పిసి, అభిప్రాయపడుతోంది.

19. డా. చేతన్‌ ఘాటే, డా. పామిదువా, డా. మైకేల్దేబబ్రతపాత్రా, డా. విరల్విఆచార్య మరియు డా. ఉర్జిత్పటేల్,ఈ ద్రవ్య విధాన నిర్ణయాలకు మద్దతు పలికారు. డా. రవీంద్రఎచ్. ఢోలాకియా,పాలిసీ రేట్ 25 బేసిస్పాయింట్లు తగ్గించాలని వోట్చేశారు. ఎమ్‌పిసి యొక్క సమావేశ వ్యవహార నివేదిక (minutes) డిసెంబర్ 20, 2017 తేదీలోగా ప్రచురించ బడుతుంది.ఎమ్‌పిసి యొక్క తదుపరి సమావేశం, ఫిబ్రవరి 6 మరియు 7, 2018 తేదీలలో నిర్వహించ బడుతుంది.

జోస్జెకత్తూర్
చీఫ్జనరల్మానేజర్

పత్రికాప్రకటన: 2017-2018/1542

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?