RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527752

గవర్నర్ యొక్క ప్రకటన – ఏప్రిల్ 07, 2021

ఏప్రిల్ 07, 2021

గవర్నర్ యొక్క ప్రకటన – ఏప్రిల్ 07, 2021

ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) 5, 6 మరియు ఏప్రిల్ 7 తేదీలలో 2021, సమావేశమై దేశం లోపల మరియు ప్రపంచ వ్యాప్తంగా వర్తమానంలో స్థూలఆర్ధిక మరియు ఫైనాన్షియల్ పరిణామాల గురించి చర్చించింది. పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మారకుండా ఉండటానికి ఎంపిసి ఏకగ్రీవంగా ఓటు వేశారు. రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని కూడా MPC నిర్ణయించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటు 4.25 శాతంలో మార్పులేదు. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో మార్పులేదు.

2. MPC యొక్క నిర్ణయం మరియు దాని అంతర్లీన ఔచిత్యం ను క్లుప్తంగా చెప్పడం ద్వారా మొదలిడతాను. గతంలో జరిగిన సమావేశం నుండి, హెడ్లైన్ ద్రవ్యోల్బణం, జనవరి 2021 లో లక్ష్యo రేటుకు దగ్గరగా ఉన్న తరువాత, ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ ప్రతికూలంగా ఉండడంతో ఫిబ్రవరి 2021 లో 5.0 శాతానికి పెరిగింది. ఒకసారి ముందుచూపుతో పరిశీలిస్తే, మారుతున్న CPI ద్రవ్యోల్బణం పధంలో ఊర్ధ్వగతి మరియు అధోగతి ఒత్తిళ్ళు రెండూ లోనుగావచ్చు. 2020-21లో ఆహార ధాన్యాల బంపర్ ఉత్పత్తి ఫలితంగా తృణధాన్యాల ధరలు సరళంగా ముందుకు సాగవచ్చు. ప్రోటీన్-ఆధారిత కంపోనెంట్లు మరియు వంట నూనెలు వంటి కీలకమైన ఆహార పదార్థాలపై ధరల ఒత్తిడిని తగ్గించడం సరఫరా వైపు చర్యలు మరియు అంతర్జాతీయ ధరల సడలింపులపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా కమోడిటీల అధిక ధరలు మరియు లాజిస్టిక్స్ ఖర్చుల ప్రభావంతో అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు బయటపడతాయని MPC గుర్తించింది. ఇటీవలి వారాల్లో చమురు ముడి ధరలలో కనిపించే మృదుత్వం ఇన్పుట్ ఖర్చుల ఒత్తిళ్ళను ఉపశమింపజేయవచ్చు.

3. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) ఫిబ్రవరి 26, 2021న తన నవీకరణలో 2020-21 సంవత్సరానికి వాస్తవిక జిడిపి సంకోచించి 8.0 శాతం గా చెప్పింది. టీకా కార్యక్రమం పురోగతితో 2021-22 సంవత్సరపు ప్రాస్పెక్ట్స్ బలపడ్డాయి. ఇన్ఫెక్షన్ ల ఇటీవలి చొచ్చుబాటు వల్ల వృద్ధి మరింత అనిశ్చితికి దారితీసింది అందువల్ల దీనిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే స్థానికంగాను మరియు ప్రాంతీయంగాను లాక్‌డౌన్లు గిరాకీ మెరుగుదలను క్రుంగదీసి, సాధారణ పరిస్థితుల ఆగమనాన్ని ఆలస్యం చేశాయి. ఈ నేపథ్యంలో, రికవరీకి మద్దతు ఇవ్వడానికి మరియు పెంపొందించడానికి ద్రవ్య విధానం సర్దుబాటు ధోరణి ఉండాలని MPC తీర్పు ఇచ్చింది. మరో మాటలో చెప్పాలంటే, మార్పుచెందుతున్న ద్రవ్యోల్బణం ఔట్లుక్ ను నిశితంగా గమనిస్తుండాలి ఇంకా రికవరీ స్థిరపడే వరకు ద్రవ్య విధాన వైఖరి సర్దుబాటు ధోరణి కొనసాగాలి.

అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణం అంచనాలు

అభివృద్ధి

4. గ్లోబల్ వృద్ధి క్రమంగా మందగమనం నుండి కోలుకుంటుంది, అయితే కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లు, స్థిరమైన సర్దుబాటు ధోరణి ద్రవ్య విధానాలు మరియు మరింత గణనీయమైన ఆర్థిక ఉద్దీపనల ద్వారా వివిధ దేశాలలోఈ వృద్ధి అసమానంగా ఉంది. టీకా పంపిణీ వేగం మరియు వైరస్ వివిధ వైవిధ్యాలను టీకాకరణ ఎలా ఎదుర్కుంటుందనే సందిగ్ధత ఉన్నప్పటికీ, ప్రపంచ ఉత్పత్తిని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఇసిడి), 2021 మధ్య నాటికి దాని పూర్వ-మహమ్మారి స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ డిమాండ్ వల్ల భారతదేశ ఎగుమతులకు మరియు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కు మద్దతు పెరగొచ్చు.

5. దేశీయ ఆర్థిక వ్యవస్థలోఇప్పుడు వైరస్ వ్యాప్తిని అరికట్టడం తో పాటు ఆర్థిక పునరుజ్జీవనంపై కూడా దృష్టి పెట్టాలి - ఇప్పటివరకు సాధించిన లబ్ది ని ఏకీకృతం చేయడం మరియు కొత్త ఆర్థిక సంవత్సరంలో (2021-22) వృద్ధి యొక్క ప్రేరణలను కొనసాగించడం ద్వారా. ఈ వ్యూహం యొక్క ముఖ్య అంశం ఏమిటంటే స్థూల ఆర్థిక స్థిరత్వం మూలాలను బలోపేతం చేయడం తద్వారా మహమ్మారి నుండి రివైవల్ కు బాట వేయడం. ఇది సమర్థవంతంగా ఖర్చు నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు దీర్ఘకాలం సహాయపడుతుంది, దాంతో పెట్టుబడి వాతావరణం మెరుగుపడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలలో ప్రభుత్వo పెట్టుబడు పెట్టడమనేది క్యాపిటల్ స్టాక్ మరియు ప్రొడక్టివిటీ ని పెంచుతుంది మరియు ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆహ్వానించడం తో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సామర్ధ్యం కలిగిన చారిత్రాత్మకంగా నిరూపితమైన శక్తి గుణకం గా నిలుస్తుంది. కేంద్ర బడ్జెట్ 2021-22 ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సాహక చర్యలు - క్యాపిటల్ వ్యయం కేటాయింపులను పెంచడం, ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథక(PLI) విస్తారణ మరియు కెపాసిటీ యుటిలైజేషణ్ ను పెంచడం (Q2: 2020-21 లో 63.3 శాతం నుండి Q 3: 2020-21 లో 66.6 శాతం వరకు) – వీటి ఫోకస్ ద్వారా ఆర్ధిక పునరుద్ధరణ ప్రక్రియను బలోపేతం చేయడమే. వాస్తవానికి, మార్చి 2021 లో రిజర్వు బ్యాంకు పోల్ చేసిన తయారీ, సేవలు మరియు మౌలిక సదుపాయాలలో నిమగ్నమైన సంస్థలు, ఆర్ధిక సంవత్సరం 2021-22 వరకు డిమాండ్ మరియు వ్యాపార కార్యకలాపాల విస్తరణ గురించి ఆశాజనకంగా ఉన్నాయని గమనించబడింది

6. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్, ఆర్ధిక కార్యకలాపాలు ఇన్ఫెక్షన్ల ఉధృతి ఉన్నప్పటికీ, సాధారణ స్థితికు చేరుతున్నాయని తెలుపుతున్నాయి. గ్రామీణ గిరాకీ ఉత్సాహంగా ఉంది మరియు 2020-21లో వ్యవసాయo రికార్డు ఉత్పత్తిని నమోదు చేస్తుంది. పట్టణ గిరాకీ గాడిలో పడింది, కొనసాగుతున్న టీకాకరణ వల్ల వేగం పెరుగుతుంది.

7. COVID-19 ఇన్ఫెక్షన్ల ఇటీవలి ఉధృతి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలను కఠినతరం చేయడం వల్ల దేశీయ వృద్ధి దృక్పథానికి అనిశ్చితిని జోడిస్తున్నది. భారతదేశంలో, అంటువ్యాధులలో ఈ పునరుత్థానం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మేము ఇప్పుడు బాగా సిద్ధంగా ఉన్నాము. విత్త సంబంధిత మరియు ద్రవ్య సంబంధిత అధికారులు ఆర్ధిక వ్యవస్థ మీద మరియు కొనసాగుతున్న రికవరీ మీద ఇన్ఫెక్షన్ తుంపర్ల ప్రభావాన్నిపరిమితం చేయడానికి సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండడంతో కొంత ఆందోళనైతే ఉంది, అయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిందే ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను: “ మనం నిరాశను తప్పక అంతం చేయాలి, కానీ అనంతాశను ఎన్నటికి వదులుకోకూడదు “.1

8. ఫిబ్రవరి పాలసీ నుండి అంతర్జాతీయ కమాడిటీల ధరలు పెరగడం మరియు ఫిబ్రవరి చివర్లో విశ్వవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి పునరావృత్తం కావడం వల్ల డౌన్-సైడ్ రిస్కులు పెరిగాయి. అయితే, అప్-సైడ్ రిస్కులు వచ్చేవి (i) టీకా కార్యక్రమం వేగమంతమయి జనాభా అంతటా అన్ని సెగ్మెంట్లకు విస్తరించడం; (ii) వొక క్రమంలో పైకి లేస్తున్న గిరాకీ మరియు (iii) ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడి-వృద్ధి మరియు వృద్ధి-సహాయ సంస్కరణ చర్యలు తీసుకోవడం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రియల్ జిడిపి వృద్ధి 2021-22లో 10.5 శాతంగానే అంచనా ఉంచబడింది – త్రైమాసికం-1 లో 26.2 శాతం; త్రైమాసికం-2 లో 8.3. శాతం త్రైమాసికం-3 లో 5.4 శాతం మరియు త్రైమాసికం 4 లో 6.2 శాతం తో కలుపుకుని.

ద్రవ్యోల్బణం

9. ఒకవైపు ఫిబ్రవరి 2021 లో హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం టాలరెన్స్ లిమిట్ లోపున 5.0 శాతం వద్ద ఉంటె, కొన్ని అంతర్లీన భాగాలు టాలరెన్స్ లిమిట్ పై భాగాన్ని పరీక్షించుతున్నాయి.

10. ముందుగా, ఆహార ద్రవ్యోల్బణ పథం(trajectory)అనేది ప్రత్యేకించి ఆధారపడేది - నైరుతి రుతుపవనాలు వాటి 2021 సీజన్ వ్యాప్తి తీవ్రత మరియు స్తాయిత్వం మీద. రెండవది, కేంద్రం మరియు రాష్ట్రాల సమన్వయ చర్యల తో పెట్రోలియం ఉత్పత్తులపై దేశీయ పన్నుల నుండి కొంత ఉపశమనం కల్పించవచ్చు, పైపెచ్చుఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా సడిలాయి. మూడవది, పెరిగిన అంతర్జాతీయ వస్తువుల ధరలు మరియు లాజిస్టిక్ ఖర్చులు కలిసి తయారీ మరియు సేవల రంగాలలో ఇన్పుట్ ఖర్చుల ఒత్తిడిని ఎగదోసే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా త్రైమాసికం-4: 2020-21 కి 5.00 శాతంగా అంచనా వేయబడింది; త్రైమాసికం-1: 2021-22 కి 5.2 శాతం, త్రైమాసికం-2: కి 5.2 శాతం గా, త్రైమాసికం-3 కి 4.4 శాతం మరియు త్రైమాసికం-4 కి 5.1 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, ఇపుడు ప్రొజెక్ట్ చేయబడింది

11. మార్చి 31, 2021 న, వచ్చే ఐదేళ్ళకు (ఏప్రిల్ 2021-మార్చి 2026) ప్రభుత్వం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతంగా ఉంచింది; దీంట్లో దిగువ మరియు ఎగువ టాలరెన్స్ స్థాయిలు వరుసగా 2 శాతం, మరియు 6 శాతo తో ఉన్నాయి. మధ్యస్థ కాలానికి 4 శాతం ద్రవ్యోల్బణ రేటు ఇప్పుడు ఆర్థిక పరిదృశ్యం లో విజయవంతంగా స్థిరపడింది. ద్రవ్య విధాన విశ్వసనీయత సాధించిన అనుభవం మరియు 2016 లో ద్రవ్యోల్బణ టార్గెటింగ్ ఫ్రేమ్‌వర్క్ మొదలైనప్పటినుండి ధరలలో స్థిరత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించడం , టార్గెట్ ను యధావిధిగాను మరియు టాలరెన్సుబ్యాండ్‌ను నిలుపుకోవడం ద్వారా ఇవి మరింత బలోపేతo అయ్యాయి. సెప్టెంబర్ 2016 లో ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఏర్పడినప్పటి నుండి, సగటు సిపిఐ ద్రవ్యోల్బణం అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2020 వరకు - COVID-19 మహమ్మారి ప్రారంభానికి ముందు - 3.8 శాతం గా ఉంది, 2012 జనవరి నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు సగటు 7.3 శాతం నుండి దిగి. మన ద్రవ్యోల్బణం పంధా ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషణ్ టార్గెటింగ్ పీరియడ్ లో షుమారు 4 శాతానికి ఇటీవలికాలంలో మోడరేట్ అయిందని రీసెర్చ్ సూచిస్తున్నది. బిజినెస్-చక్రo పరిభ్రమణం నందు వృద్ధి - ఇన్ఫ్లేషణ్ ట్రేడ్-ఆఫ్స్ మరియు సప్లై వైపు షాక్‌లకు ప్రతిస్పందించడానికి ఫ్రేమ్‌వర్క్ యొక్క వశ్యతకు COVID-19 కాలం అనుభవమే సాక్ష్యమిచ్చింది. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషణ్ టార్గెటింగ్ మొదటి ఐదు సంవత్సరాలలో ఆర్జించిన విశ్వసనీయతను ఏకీకృతం చేసి మరింత బలo చేకూర్చడమే, రాబోయే ఐదేళ్ళ ద్రవ్య విధానం లక్ష్యం.

లిక్విడిటీ గైడెన్స్

12. గత కొన్ని విధానపరమైన అనౌన్సుమెంట్ల యందు నా యొక్క ప్రకటనలలో, MPC యొక్క సర్దుబాటు ధోరణి వైఖరికి అనుగుణంగా వ్యవస్థలో తగినంత ద్రవ్యత ఉండేలా రిజర్వు బ్యాంకు నిబద్ధతతో ఉండడాన్ని నేను పునరుద్ఘాటిస్తున్నాను. నేను తగినంత ద్రవ్యత అని చెప్పినప్పుడు, అన్ని ఆర్థిక మార్కెట్ సెగ్మెంట్లు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక రంగాల అవసరాలను తీర్చిన తర్వాత కూడా వ్యవస్థను మిగులులో ఉంచే ఒక స్థాయి ద్రవ్యత అని నా ఉద్దేశ్యం. ఆ దృక్కోణంలో, క్రమబద్ధమైన మార్కెట్ పరిస్థితులను ప్రోత్సహించడానికి అనుకూలమైన ద్రవ్య నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం మా ప్రయత్నం. ఈ విధానం డివిడెండ్లను ఇచ్చింది. దీనివల్ల 2020-21 సంవత్సరంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణ కార్యక్రమాలు తక్కువ ఖర్చు మరియు దీర్ఘకాలిక పరిపక్వత తో దగ్గర దగ్గర 22.0 లక్షల కోట్లు విజయవంతంగా పూర్తి చేయడానికి ఇది దోహదపడింది. కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్ మరియు డిబెంచర్ల ద్వారా గణనీయమైన మొత్తంలో ప్రైవేట్ రుణాలు తీసుకోవడానికి ఇది దోహదపడింది.

13. జనవరి 15, 2021 నుండి 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (విఆర్ఆర్ఆర్) వేలం తిరిగి ప్రారంభమైనప్పటికీ, స్థిరరేటు (fixed rate) రివర్స్ రెపో ద్వారా గ్రహించిన ద్రవ్యత (లిక్విడిటీ) జనవరిలో ఒక పక్షం సగటున జనవరి 16-29 లో 4.3 లక్షల కోట్ల నుండి జనవరి 30-మార్చి 31,2021 లో 4.9 కోట్లకు క్రమంగా పెరిగింది. మిగులు ద్రవ్యతను ప్రతిబింబిస్తూ, రిజర్వ్ మనీ మార్చి 26, 2021 నాటికి కరెన్సీ డిమాండ్‌ వల్ల 14.2 శాతం (ఏటికేడాది) (YOY) పెరిగింది, అయితే డబ్బు సరఫరా(మనీ సప్లై) (M3) 11.8 శాతం (YOY) (మార్చి 26 నాటికి) పెరిగింది, బ్యాంక్ క్రెడిట్‌ వృద్ధి 5.6 శాతం (YOY) (మార్చి 26 నాటికి) తో. VRRR యొక్క విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ద్రవ్యత మిగులు స్థాయి పెరుగుతుండడంతో, ఫిబ్రవరి 06, 2020 న ప్రకటించిన సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో సూచించిన విధంగా ఎక్కువ పరిపక్వత కలిగిన VRRR వేలం నిర్వహించాలని నిర్ణయించారు. మారుతున్నలిక్విడిటీ మరియు ఆర్ధిక పరిస్థితుల ఆధారంతో ఆక్షన్ మొత్తం మరియు పరిపక్వత నిర్ణయించబడతాయి. ఇది ఆర్బిఐ యొక్క లిక్విడిటీ మేనేజ్మెంట్ ఆపరేషన్లలో ఒక భాగం మరియు లిక్విడిటీని కట్టడి చేస్తున్నట్లుగా భావించరాదు. వాస్తవానికి, వీఆర్‌ఆర్‌ఆర్ వేలం ద్వారా లిక్విడిటీ శోషణలపై అధిక వడ్డీని చెల్లించడం ద్వారా, ఆర్‌బిఐ పరోక్షంగా ద్రవ్యతను (లిక్విడిటీని) విస్తరిస్తోంది.

14. అంతర్జాతీయ వస్తువుల ధరల పెరుగుదల మరియు బలమైన వృద్ధి అంచనాల వల్ల జనించిన ద్రవ్యోల్బణ ఆందోళనలమూలంగా సార్వభౌమ బాండ్ల రాబడులు ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్య నుండి పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లు అస్థిరత్వంవైపు మళ్ళాయి. బాండ్ల మార్కెట్ అస్థిరత మరియు యుఎస్ డాలర్ ధృడత్వం సెగ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సోకింది. యుఎస్‌లో పునరుల్బణ ఆవృత్తి అంచనాలు ఎమర్జింగ్ మార్కెట్ ఆర్దికవ్యవస్థల(ఇఎమ్‌ఇ)నుండి పోర్ట్‌ఫోలియో ప్రవాహం వెనుదిరిగిపోవడానికి దారితీశాయి. ఈ తంతు మార్చి వరకు కొనసాగింది.

15. గ్లోబల్ ఫైనాన్షియల్ పరిదృశ్యం లోకి అన్ని దేశాల ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా ఘటబంధనం చెందడంతో, RBI పదే పదే హమీలు మరియు మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ భారతదేశంలో ఇన్వెస్టర్ల అసులభత ఎక్కువైంది. ఏప్రిల్ 2020 నుండి జనవరి 2021 వరకు 5.93 శాతం (సగటున)గా ట్రేడ్ అయిన బెంచ్ మార్క్10 ఇయర్ రాబడి, మార్చి 10, 2021 నాటికి 6.25 కు శాతం నకు ఎదిగింది, మళ్లి క్రిందికి దిగివచ్చే ముందు వరకు. ఇటీవలికాలంలో, జి-సెక్ రాబడులతో సమంగా, జారీదారు ఏవరైనా లేదా రేటింగ్ ఏదైనాగాని అన్ని కార్పొరేట్ బాండ్ల రాబడులు(యీల్డ్ లు) కూడా కఠినంగా మారాయి. 2021 జనవరి చివరినుండి, 3 సంవత్సరాల మరియు 5 సంవత్సరాల మెచ్యూరిటీల AAA కార్పొరేట్ బాండ్ రాబడులు వరుసగా 30 బిపిఎస్ మరియు 31 బిపిఎస్ పెరిగింది. ఈ పరిణామాలను ప్రతిబింబిస్తూ, 2020 డిసెంబర్లో అత్యధికంగా 88,130 కోట్లు నమోదైన కార్పొరేట్ బాండ్ల జారీ ఫిబ్రవరి లో 45,685 కోట్లకు తగ్గింది.

16. మార్కెట్ యొక్క అసహజత ను గమనించి, తగినంత ద్రవ్యత మరియు క్రమమైన మార్కెట్ పరిస్థితులను నిర్ధారించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా, రిజర్వు బ్యాంకు ఫిబ్రవరిలో తన బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను (OMO ఫిబ్రవరి లో) బాగా పెంచింది మరియు ఫిబ్రవరి మరియు మార్చిలో ఐదు ప్రత్యేక OMO లను (ఆపరేషన్ ట్విస్ట్) నిర్వహించింది; మార్చి 4, 2021 న ఆపరేషన్ ట్విస్ట్ (OT) వేలం మొత్తాన్ని 10,000 కోట్ల నుండి 15,000 కోట్లకు పెంచింది; టర్మ్ ప్రీమియా యొక్క కుదింపును బలోపేతం చేయడానికి మరియు ద్రవ్యత ఇంజెక్ట్ చేయడానికి మార్చి 10, 2021 న వినూత్న అసమాన ప్రత్యేక OMO ( 20,000 కోట్ల కొనుగోలు మరియు 15,000 కోట్ల అమ్మకం) ను స్వీకరించింది. దీనికి మార్కెట్ అనుకూలంగా ప్రతిస్పందించింది. రిజర్వు బ్యాంకు తన టూల్‌కిట్‌లోని వివిధ సాధనాల ద్వారా తగినంత ద్రవ్యతతో మార్కెట్‌కు మద్దతు ఇస్తుందని ఇవి స్పష్టమైన సంకేతాలు. OMO యొక్క లిక్విడిటీ ప్రభావం ముఖ్యంగా తెలియజేసేదేమిటంటే 2020-21 నందు నికర మొత్తం కొనుగోళ్లు రూ .3.13 లక్షల కోట్లు పూర్తిచేశాము.

17. 2021-22 సంవత్సారానికి, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, దీనికి ఒక ప్రత్యెక రూపం ఇవ్వడానికి “సెకండరీ మార్కెట్ G-sec అక్విజిషణ్ ప్రోగ్రాం లేదా G-SAP 1.0” ను ప్రకటించాము. ఈ కార్యక్రమం కింద, సౌకర్యవంతమైన ద్రవ్యత పరిస్థితుల మధ్య రాబడి వక్రరేఖ యొక్క స్థిరమైన మరియు క్రమమైన పరిణామానికి వీలు కల్పించే ఉద్దేశ్యంతో ఆర్బిఐ ప్రభుత్వ సెక్యూరిటీల యొక్క బహిరంగ మార్కెట్ కొనుగోళ్లకు ముందస్తుగా కట్టుబడి ఉంటుంది. రికవరీ ని ఒక గాడిలో పెట్టేందుకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితులను నిర్ధారించడమే ఈ ప్రయత్నం. 2021-22:Q 1 కోసం, 1 లక్ష కోట్ల జి-సాప్ ప్రకటించాలని నిర్ణయించారు. G-SAP 1.0 కింద మొత్తం 25,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీల మొదటి కొనుగోలు ఏప్రిల్ 15, 2021 న నిర్వహించబడుతుంది.

18. G-Sec రాబడి కర్వ్ ను ప్రైసింగ్ బెంచ్-మార్క్ గా ఆధారపడే ఆర్ధిక మార్కెట్ల వివిధ సెగ్మెంట్లదృష్టిలో ఉంచుకొని G-SAP 1.0 కార్యకలాపాల యొక్క సానుకూల బాహ్యతలను చూడవలసిఉంటుంది. అదనంగా, హెల్డ్-టు-మెచ్యూరిటీ (హెచ్‌టిఎం) వ్యవస్థ పొడిగింపు వల్ల 4.0 లక్షల కోట్ల కంటే ఎక్కువ అవకాశాన్నిపెట్టుబడులకు వీలు కలిగించుతున్నది. ద్రవ్య విధానం యొక్క వైఖరికి అనుగుణంగా ద్రవ్య పరిస్థితులు అభివృద్ధి చెందుతాయని నిర్ధారించడానికి, మరియు ఆర్థిక పరిస్థితులు వాటాదారులందరకు మద్దతుగా ఉండడానికి, మేము మా సాధారణ కార్యకలాపాలను LAF, దీర్ఘకాలిక రెపో / రివర్స్ రెపో వేలం, ఫారెక్స్ కార్యకలాపాలు మరియు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు ప్రత్యేక OMOలను కలుపుకుని, అమలు చేయడాన్ని కొనసాగిస్తాము.

19. 2021-22 కొరకు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీని నిర్దేశిస్తున్నప్పుడు రిజర్వు బ్యాంకు ప్రయత్నం ఫండమెంటల్స్ అనుగుణంగా, ఒక నిర్దిష్ట స్థాయికి భిన్నంగా యీల్డ్ కర్వ్ (రాబడి రేఖ) యొక్క క్రమబద్ధమైన పరిణామాన్ని నిర్ధారించడం అని నిస్సందేహంగా తెలియజేస్తాను. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు రెండిటిలోని ఇతర ఆర్థిక మార్కెట్ సాధనాల (వివిధ కాలపరిమితుల మరియు జారీదారుల) ధరల యొక్క ప్రధాన పాత్రను దృష్టిలో ఉంచుకుని జి-సెక్ మార్కెట్లో అస్థిరతను తొలగించడం మా లక్ష్యం . నవజాత మరియు ఊగిసలాడే రికవరీ మన్నికగా మరియు బలంగా స్థిరపడడానికి ఇది ముఖ్యమైన హేతువు. జోడించాల్సిన అవసరం లేదు, ఫండమెంటల్స్‌కు అనుగుణంగా బాండ్ రాబడులలో రెండు వైపుల కదలికలు కూడా మార్కెట్ కోణం నుండి చాలా సాధారణం; ఏదేమైనా, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంటే ఇటువంటి కదలికలు ఆకస్మికంగా మరియు విఘాతం కలిగించకూడదు.

20. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి మరియు దేశీయ ఆర్థిక మార్కెట్లను గ్లోబల్ స్పిల్‌ఓవర్ల నుండి నిరోధించడానికి మరియు దాని పర్యవసానంగా అస్థిరతకు ఏమైనా చేస్తూనే ఉంటుంది. మా చర్యలు, కమ్యూనికేషన్ మరియు సంకేతాలను సమతుల్య పద్ధతిలో జాగ్రత్తగా గమనించాలని మార్కెట్ పాల్గొనేవారిని నేను కోరుతున్నాను. కలిసి, మనం సవాళ్లను అధిగమించగలము మరియు మహమ్మారికి మించిన మన్నికైన పునరుద్ధరణకు పునాదులు వేయవచ్చు. మన సామర్థ్యంతో గట్టిగా మన ప్రయత్నానికి సిద్ధం చేద్దాం.

21. ఈ నేపథ్యంలో, మరియు రికవరీని పెంపొందించే ఉద్దేశ్యంతో, కొన్ని అదనపు చర్యలు ప్రకటించబడుతున్నాయి. చర్యల వివరాలు ద్రవ్య విధాన ప్రకటన యొక్క అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై (పార్ట్-బి)ఇచ్చిన ప్రకటనలో పేర్కొనబడ్డాయి.

టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – చివరి గడువు పొడిగింపు

22. నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో, అక్టోబర్ 9, 2020 న ప్రకటించిన ఆర్‌బిఐ టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్ ట్యాప్) స్కీమ్‌ మార్చి 31, 2021 వరకుఅందుబాటులోకి వచ్చింది, ఇప్పుడు దీనిని ఆరు నెలల కాలానికి అంటే, సెప్టెంబర్ 30, 2021 వరకు విస్తరిస్తున్నారు.

అఖిల భారత ఆర్థిక సంస్థలకు లిక్విడిటీ సౌకర్యం

23. ఏప్రిల్-ఆగస్టు 2020 లో నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బి మరియు ఎక్సిమ్ బ్యాంక్ వంటి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ (ఎఐఎఫ్ఐ) లకు ప్రత్యేక రీఫైనాన్స్ సదుపాయాలు అందించబడ్డాయి. ఇంకా సుషుప్త అవస్థలోనే ఉన్న వృద్ధి అంకురాలకు పోషణ నిమిత్తం, వాస్తవిక ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఋణo వసతికి మద్దతు ఇవ్వడం అవసరం. దీని ప్రకారం, 2021-22 మధ్య కాలంలో తాజా రుణాలు ఇవ్వడానికి 50,000 కోట్ల లిక్విడిటీ సపోర్ట్ AIFI లకు అందించబడుతుంది: నాబార్డ్‌కు 25,000 కోట్లు; ఎన్‌హెచ్‌బికి 10,000 కోట్లు; మరియు సిడ్బికి 15,000 కోట్లు.

చెల్లింపుల బ్యాంకులకు గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని పెంచడం

24. ఆర్థిక సమీకరణకు మరింత ఊతం ఇచ్చేందుకు మరియు వారి వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి చెల్లింపుల బ్యాంకుల సామర్థ్యాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో, రోజు ముగింపుకు వ్యక్తిగత కస్టమర్ గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని 1 లక్ష నుండి 2 లక్షలకు తక్షణం పెంచడం జరుగుతుంది.

ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు (ARCs) - ఒక కమిటీ ఏర్పాటు

25. ఒత్తిడితో కూడిన ఆస్తుల పరిష్కారంలో ఆస్తి పునర్నిర్మాణ సంస్థలు (ARC లు) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వారి సామర్థ్యం ఇంకా పూర్తిగా వినియోగింపబడలేదు. అందువల్ల, ARC ల పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మరియు ఆర్థిక రంగం యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ఈ సంస్థలను అనుమతించే చర్యలను సిఫారసు చేయాలని ప్రతిపాదించబడింది.

ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా ఆన్-లేండ్(onlend) చేయడానికి బ్యాంకులకు అనుమతి

26. అట్టడుగున ఉన్న సంస్థలకు క్రెడిట్ అందుబాటులో ఉంచడంలో ఎన్‌బిఎఫ్‌సిలు పోషించిన కీలక పాత్రను గుర్తించి, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ మరియు హౌసింగ్‌లకు రుణాలు ఇవ్వడానికి రిజిస్టర్డ్ ఎన్‌బిఎఫ్‌సిలకు (ఎంఎఫ్‌ఐలు కాకుండా) బ్యాంకు రుణాలు ఇవ్వడం ను ప్రాధాన్యతా రంగాలకు ఋణాలు (పిఎస్‌ఎల్) గా వర్గీకరించడానికి అనుమతించబడింది. ఆగస్టు 13, 2019 నుండి మార్చి 31, 2021 వరకు లభించిన ఈ విధి విధానంను మరో ఆరు నెలలు సెప్టెంబర్ 30, 202 1 వరకు పొడిగిస్తున్నారు.

ప్రాధాన్యతా రంగ రుణాల (పిఎస్‌ఎల్) - ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ / ఎన్‌డబ్ల్యుఆర్‌ (eNWR/NWR) ల మీద ఉన్న రుణ పరిమితిని పెంచడం

27. వ్యవసాయ ఉత్పత్తుల కుదువ / హైపోథెకేషన్ మీద వ్యక్తిగత రైతులకు వ్యవసాయ రుణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, వ్యవసాయ ఉత్పత్తుల కుదువ / హైపోథెకేషన్ మారుగా జారీ చేయబడిన డబ్ల్యుడిఆర్‌ఎ నమోదు చేసిన మరియు నియంత్రించబడే గిడ్డంగులచే జారీ చేయబడిన ఎన్‌డబ్ల్యుఆర్ / ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ ల మీద వ్యక్తిగత రుణగ్రహీతకు రుణ పరిమితిని 50 లక్షల నుండి 75 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఇతర వేర్‌హౌస్ రసీదుల మద్దతు ఉన్న ప్రాధాన్యతా రంగ రుణ పరిమితి ప్రతి రుణగ్రహీతకు 50 లక్షలుగా కొనసాగుతుంది.

ఆర్దిక సమీకరణ ఇండెక్స్

28. ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు మరియు ఇతర నిర్దేశకులకు ఆర్ధిక సమీకరణ ఒక ప్రధాన అంశం అయ్యింది, సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి ఉంది. దేశంలో ఆర్థిక సమీకరణ యొక్క పరిధిని కొలవడానికి, రిజర్వు బ్యాంకు బహుళ పారామితుల ఆధారంగా ఆర్థిక సమీకరణ సూచిక (ఎఫ్ఐ ఇండెక్స్) ను నిర్మించి ప్రచురించాలని ప్రతిపాదించింది. మునుపటి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇది ప్రతి సంవత్సరం జూలైలో ప్రచురించబడుతుంది.

సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ (సిపిఎస్), అంటే ఆర్టిజిఎస్ మరియు నెఫ్ట్ - బ్యాంకులు కాకుండా ఇతర సంస్థలకు సభ్యత్వం

29. ఆర్‌బిఐ-ఆపరేటెడ్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ (సిపిఎస్) - ఆర్‌టిజిఎస్ మరియు ఎన్‌ఇఎఫ్‌టి సభ్యత్వం ప్రస్తుతం కొన్ని మినహాయింపులతో బ్యాంకులకే పరిమితం చేయబడింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) జారీచేసేవారు, కార్డ్ నెట్‌వర్క్‌లు, వైట్ లేబుల్ ఎటిఎం ఆపరేటర్లు మరియు రిజర్వు బ్యాంకు నియంత్రణలో ఉన్న ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టిఆర్‌డిఎస్) ప్లాట్‌ఫారమ్‌ల వంటి బ్యాంకేతర చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లను సిపిఎస్‌లలో ప్రత్యక్ష సభ్యత్వం పొందటానికి వీలు కల్పించాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. ఈ సదుపాయం ఆర్థిక వ్యవస్థలో పరిష్కార ప్రమాదాన్ని (సెటిల్మెంట్ రిస్క్ ను) తగ్గిస్తుందని మరియు అన్ని వినియోగదారు విభాగాలకు డిజిటల్ ఆర్థిక సేవలను చేరుకోగలదని భావిస్తున్నారు.

ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐ) కు అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ), మరియు ఖాతా పరిమితిని 2 లక్షలకు పెంపుదల

30. పూర్తి-కెవైసి ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాల (పిపిఐ) కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ), అడాప్ట్ చేసుకోవడానికి రిజర్వు బ్యాంకు 2018 అక్టోబర్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది. అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ), వైపు మైగ్రేషన్లు గణనీయంగా లేనందున, పూర్తి-కెవైసి పిపిఐలకు మరియు అన్ని చెల్లింపు అంగీకార మౌలిక సదుపాయాల కోసం అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) ని తప్పనిసరి చేయాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. పిపిఐల పూర్తి-కెవైసికి మైగ్రేషన్లను ప్రోత్సహించడానికి, అటువంటి పిపిఐలలో బకాయిలపై ప్రస్తుత పరిమితిని 1 లక్ష నుండి 2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించబడింది.

నాన్-బ్యాంకులు జారీ చేసిన పూర్తి-కెవైసి పిపిఐల నుండి నగదు ఉపసంహరణకు అనుమతి

31. ప్రస్తుతం, బ్యాంకులు జారీ చేసిన పూర్తి-కెవైసి పిపిఐలకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుమతి ఉంది. విశ్వాసాన్ని పెంచే చర్యగా, మరియు పిపిఐ జారీచేసేవారిలో ఏకరూపతను తీసుకురావడానికి, బ్యాంకుయేతర పిపిఐ జారీచేసేవారి పూర్తి-కెవైసి పిపిఐల కోసం నగదు ఉపసంహరణను అనుమతించాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. ఈ చర్య, అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) తో కలిసి ఫుల్-KYC PPIల మైగ్రేషన్ లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు టైర్ III నుండి VI కేంద్రాలకు అంగీకార మౌలిక సదుపాయాలను కూడా పూర్తి చేస్తుంది.

ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఇసిబి) నిధులను

టర్మ్ డిపాజిట్ లో ఉంచే కాలవ్యవధి పొడిగింపు

32. ప్రస్తుత ఇసిబి ఫ్రేమ్‌వర్క్ కింద, ఇసిబి రుణగ్రహీతలు ఇసిబి నిధులను టర్మ్ డిపాజిట్లలో భారతదేశంలోని ఎడి కేటగిరీ -1 బ్యాంకులతో గరిష్టంగా 12 నెలల పాటు ఉంచడానికి అనుమతిచబడతారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, 2020 మార్చి 1 న లేదా అంతకు ముందు డ్రా చేయబడిన వినియోగించని ఇసిబి ప్రొసీడ్స్ ను భారతదేశంలోని ఎడి కేటగిరీ -1 బ్యాంకులతో టర్మ్ డిపాజిట్లలో మార్చి 1, 2022 వరకు.పార్కింగ్ చేయడానికి అనుమతించాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిల కోసం వేస్ అండ్ మీన్స్

అడ్వాన్స్ (డబ్ల్యుఎంఏ) లిమిట్.

33. రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ (డబ్ల్యుఎంఏ) పరిమితులను మరియు ఇతర సంబంధిత సమస్యలను సమీక్షించడానికి రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సలహా కమిటీ సిఫార్సులను అంగీకరించాలని మేము నిర్ణయించుకున్నాము. దీని ప్రకారం, రాష్ట్రాలు మరియు యుటిల మొత్తం డబ్ల్యుఎంఏ పరిమితిని, 47,010 కోట్లకు పెంచాలని నిర్ణయించారు, ఇది ఫిబ్రవరి 2016 లో నిర్ణయించిన ప్రస్తుత పరిమితి 32,225 కోట్ల నుండి 46 శాతం పెరుగుదల. ఇంకా, ఇది కూడా నిర్ణయించబడింది మహమ్మారి కారణంగా ఆర్‌బిఐ మంజూరు చేసిన, 51,560 కోట్ల మెరుగైన మధ్యంతర డబ్ల్యూఎంఏ పరిమితిని మరో ఆరు నెలల కాలానికి, అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు కొనసాగించడం.

ముగింపు

34. మునుపటి సంవత్సరానికి భిన్నంగా, 2021 సంవత్సరం ప్రారంభంలో అనేక దేశాలలో టీకా డ్రైవ్‌ల ద్వారా ఏర్పడిన ఆశలు పెరుగుతున్న అంటువ్యాధులు మరియు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఉత్పరివర్తన జాతుల ద్వారా కొంతవరకు అధ్యస్తం (offset) చేయబడ్డాయి. అయినప్పటికీ, వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ప్రపంచం శాస్త్రీయ శక్తులను సమీకరించిన వేగం మరియు సామూహిక ప్రయత్నం, మరియు ఇప్పుడు జీవన విధానంగా మారిన మహమ్మారికి సంబంధించిన ప్రోటోకాల్‌లు, ఈ పునరుద్ధరించిన రెండవ / మూడవ వేవ్ ద్వారా మేము ప్రయాణించగలమని మాకు ఆశను మరియు విశ్వాసంను ఇస్తాయి. ఇన్ఫెక్షన్ల స్థానికీకరణ రేట్లలో స్ఫర్ధ కూడా COVID-19 టీకాకరణ వేగవంతమైన డ్రైవ్‌లతో పూర్తిగా సమసిపోతుంది. 2020 లో వైరస్ ద్వారా విచారణను, స్థితిస్థాపకత మరియు ధైర్యం మరియు మనుగడ యొక్క సంకల్పంతో ఎదుర్కొన్న మానవ జాతి యొక్క లొంగని ఆత్మను నేను నిజంగా నమ్ముతున్నాను. 2021 భారతదేశానికి కొత్త ఆర్థిక యుగానికి దారితీస్తుంది. మహాత్మా గాంధీ గారి నుండి ఒక కోట్ ద్వారా నేను ముగిస్తాను, వారు మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు: “సహనానికి విలువైనది ఏదైనా అయితే అది సమయం, చివరి వరకు భరించాలి. మరియు జీవించే విశ్వాసం కూడా అత్యంత ఘోర తుఫాను మధ్యనుండే తయారవుతుంది”2

ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/15


1 Address in Washington D.C. in February 1968

2 Mahatma Gandhi (1969). “Collected Works of Mahatma Gandhi

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?