RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525851

గవర్నర్ యొక్క ప్రకటన: ఫిబ్రవరి 10, 2022

ఫిబ్రవరి 10, 2022

గవర్నర్ యొక్క ప్రకటన: ఫిబ్రవరి 10, 2022

మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి బంధనం చేసిందని నాప్రకటన. తగ్గినట్లుగా సంకేతాలు గోచరించుతున్నప్పటికీ, అనేక దేశాలలో రోజువారీ ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ఫలితంగా, చేపట్టిన నియంత్రణ చర్యలు ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి, ముఖ్యంగా కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్లలో. కొనసాగుతున్న సరఫరా అంతరాయాలు మరియు పరిమితం చేయబడిన వర్క్‌ఫోర్స్ భాగస్వామ్యం కార్మిక (లేబర్) మార్కెట్లను కఠినతరం చేస్తున్నాయి. అనేక దేశాలలో ద్రవ్యోల్బణం బహు-దశకాల గరిష్ట స్థాయికి చేరుకుంది స్థూల ఆర్థిక వాతావరణాన్ని అత్యంత అనిశ్చితంగా చేసింది . విభిన్న ద్రవ్య విధాన ఉద్దేశాలు మరియు చర్యల వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఆర్థిక మార్కెట్ అస్థిరత మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దృక్పథానికి సందిగ్ధత పొరలను జోడిస్తున్నాయి.

2. COVID-19 యొక్క Omicron వేరియంట్ ద్వారా అత్యంత వేగవంతమైన మూడవ తరంగం ఉన్నప్పటికీ, భారత్ ప్రపంచ దేశాల కన్నా భిన్నమైన రికవరీ పధాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చేసిన అంచనాల ప్రకారం ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో, భారతదేశం ఏ యేటికాయేడు అత్యంత వేగంగా వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. ఈ పునరుద్ధరణ పెద్దమొత్తంలో టీకాకరణ మరియు నిరంతర ఆర్ధిక మరియు ద్రవ్య మద్దతు లభించడంతో సాధ్యమయ్యింది, మరోసారి, మన ఫ్రంట్‌లైన్ యోధులు ప్రశంసనీయమైన విధిని ప్రదర్శించారు.

3. మహమ్మారి యొక్క పునరావృత తరంగాల నుండి మనం విలువైన అనుభవాన్ని పొందుతున్నందున, మన ప్రతిస్పందనలు అత్యల్పమైన వ్యత్యాసoతోనూ మరియు క్రమాంకనం చేయబడుతున్నాయి. ప్రాణాన్ని రక్షించడం ప్రధానం; మరియు జీవనోపాధిని రక్షించడం ప్రాధాన్యతల శ్రేణిలో ఎగువనున్నది. బలహీనులు, వేతన జీవులు మరియు అత్యంత గా ప్రభావితమైన వారిని ఆర్ధికంగాను మరియు వారి ఆర్థిక పరిస్థితులను సురక్షితం చేయడంపైన దృష్టి కేంద్రీకరించబడింది. దీని ప్రకారం, లక్ష్య నివారణ వ్యూహాలు మరియు సార్వత్రిక ఇమ్యునైజేషన్ మరియు బూస్టర్ డోస్‌ల ప్రచారంపై ప్రాధాన్యత అంతా ఇమిడి ఉంది. మన పని ప్రదేశాలలో మరియు మన దైనందిన జీవితంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ విధానం పరిపూర్ణం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలలో అంతరాయాలను పరిమితం చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ద్రవ్య విధాన కమిటీ చర్చలు

4. ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) 2022, ఫిబ్రవరి 8, 9 మరియు 10 తేదీల్లో సమావేశమైంది మరియు ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాల అంచనా ఆధారంగా, పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మారకుండా ఉంచడానికి ఎంపిసి(MPC) ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఇంకా, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం ను పరిమితం చేసేందుకు, వృద్ధిని ప్రేరేపించి మన్నికైన స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని కూడా ఎంపిసి(MPC), 5 నుండి 1 మెజారిటీతో, నిర్ణయించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు మరియు బ్యాంకు రేటు 4.25 శాతంలో మార్పులేదు. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో మార్పులేదు.

5. అత్యంత అంటువ్యాధి Omicron వేరియంట్ నుండి ఆర్థిక కార్యకలాపాలకు జరగబోయే ప్రతికూల ప్రమాదాలను MPC గుర్తు చేసింది. భరోసా ఏమిటంటే, ఈ లక్షణాలు సాపేక్షంగా తేలికపాటివిగా ఉన్నాయి మరియు ఇన్ఫెక్షన్ యొక్క వేగం పురోగమిస్తున్న కొద్దీ, ఇవి త్వరగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాల వేగంలో కొంత నియంత్రణ ఉంది, ఇది తయారీ మరియు సేవల రెండింటి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండైసెస్, పూర్తయిన ఉక్కు వినియోగం మరియు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు మరియు ప్రయాణీకుల వాహనాల విక్రయాలు వంటి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ లలో ప్రతిబింబిస్తున్నది. కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలకు డిమాండ్ ఇప్పటికీ తక్కువగానే ఉంది. రాబోయేరోజుల్లో ఉధృతమైన రబీ పంట అవకాశాలు, బలమైన ఎగుమతి డిమాండ్, స్థిరమైన ద్రవ్య మరియు లిక్విడిటీ పరిస్థితులు, మెరుగైన ఋణ మేళాలు (క్రెడిట్ ఆఫ్‌టేక్) మరియు 2022-23 యూనియన్ బడ్జెట్‌లో మూలధన వ్యయం మరియు మౌలిక సదుపాయాలపై నిరంతర వొరవడి (ఒత్తిడి) వంటి సానుకూల ప్రేరణలు రికవరీ వేగాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది.

6. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం MPC చివరి సమావేశం నుండి ఎక్కువగా పెరిగిందని, అయితే చాలావరకు ఊహించిన విధంగానే ఉందని MPC పేర్కొంది. నెలవారీగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, డిసెంబరులో ద్రవ్యోల్బణం పెరుగుదల పూర్తిగా ప్రతికూల బేస్ ఎఫెక్ట్‌ల కారణంగా ఏర్పడింది. పుష్కళం గా ఆహార ధాన్యాల బఫర్ స్టాక్స్ మరియు సమర్థవంతమైన సరఫరా వైపు చర్యలు ఆహార ద్రవ్యోల్బణo అదుపుకోసం తోడ్పడవచ్చును. ప్రధాన ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది, కానీ డిమాండ్-ఆధారిత ఒత్తిళ్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో తాజా పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

7. మొత్తంమీద, హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం Q4: 2021-22లో టాలరెన్స్ బ్యాండ్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మరియు H2: 2022-23లో లక్ష్యానికి సమీపంలో ఒక మోస్తరుగా ఉంటుంది, ద్రవ్య విధానానికి అనువుగా ఉండటానికి అవకాశాన్ని అందిస్తుంది. అదే సమయంలో, ఉత్పత్తి దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే స్వల్పాధిక్యం లోనే ఉంది, అయితే ప్రైవేట్ వినియోగం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిళ్ళ ఎదురుగాలులు తీవ్రమవుతున్నాయి. మొత్తంమీద, ద్రవ్యోల్బణం మరియు వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే, (ముఖ్యంగా ఓమిక్రాన్ వంటి గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లకు సంబంధించిన అనిశ్చితులు మరియు సులభతరం చేయబడిన ద్రవ్యోల్బణ దృక్పథo వంటివి) స్థిరమైన మరియు మన్నికైన రికవరీ కి, నిరంతర విధాన పరమైన మద్దతు అవసరం ఉందని MPC అభిప్రాయపడింది.

దేశీయ అబివృద్ధి

8. భారత్ లో, 2021-22కి 9.2 శాతం వాస్తవ GDP వృద్ధి 2019-20లో GDP స్థాయి కంటే స్వల్పంగా పెరిగింది. దేశీయ డిమాండ్‌కు ప్రధానమైన ప్రైవేట్ వినియోగం, దాని ప్రీ-పాండమిక్ స్థాయిల నుండి వెనకబడుతున్నది. అంతర్జాతీయ వస్తువుల ధరలలో నిరంతర పెరుగుదల, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల లో పెరిగిన అస్థిరత మరియు గ్లోబల్ సరఫరా పరిమితులు దృక్పథం అవకాశాలకు నష్టాలను పెంచుతాయి.

9. భవిష్యత్తులో, మూలధన వ్యయం మరియు ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని మరియు సమిష్టి డిమాండ్‌ను బలోపేతం చేస్తుందని అంచనా వేయబడింది. ఇది ప్రైవేట్ పెట్టుబడులకు కూడా దారి తీస్తుంది. ఆర్‌బిఐ విధాన చర్యల వల్ల ఉత్పన్నమయ్యే అనుకూల ఆర్థిక పరిస్థితులు పెట్టుబడి కార్యకలాపాలకు ఊపునిస్తాయి. RBI నిర్వహించిన సర్వేలు సామర్థ్య వినియోగం పెరుగుతోందని సూచిస్తున్నాయి మరియు వ్యాపారం మరియు వినియోగదారుల విశ్వాసంపై ఔట్లుక్ (దృక్పథం) ఆశావాద పరిభాగంలోనే ఉంది, ఇది పెట్టుబడితో పాటు వినియోగo డిమాండ్‌కు మద్దతు ఇస్తుంది. శీతాకాలo పంటలకు విత్తనము వేయడములో మంచి పురోగతి వ్యవసాయ అవకాశాలను బాగా ప్రకాశవంతం చేసింది.

10. మొత్తంమీద, గ్లోబల్ కారకాలు ప్రతికూలంగా మారుతున్నప్పుడు సమీప-కాల వృద్ధి ఊపందుకోవడంలో కొంత నియంత్రణ ఉంది. ముందుకు చూస్తే, దేశీయ వృద్ధి కారకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, 2022-23లో వాస్తవ GDP వృద్ధి 7.8 శాతం, Q1: 2022-23లో 17.2 శాతం; Q2లో 7.0 శాతం; Q3లో 4.3 శాతం; మరియు Q4లో 4.5 శాతంగా అంచనా వేయబడింది.

ద్రవ్యోల్బణం

11. CPI ద్రవ్యోల్బణం పథం, మన అంచనాలకు దగ్గర దగ్గర సరిపోతుంది. ముఖ్యంగా ఆహార ధరలు తగ్గడం చాలా ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా, శీతాకాలపు పంటల రాకతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మెరుగుదల మరియు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలపై ఆశావాదం పెరుగుతోంది. అంతేకాకుండా, ప్రభుత్వం యొక్క బలమైన సరఫరా వైపు జోక్యం మరియు దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా పప్పుధాన్యాలు మరియు ఎడిబుల్ ఆయిల్ ధరల తగ్గింపు కొనసాగుతుంది.

12. అయితే ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ ఔట్లుక్ ను తలకిందులుగా చేసే ప్రమాదాన్ని అందిస్తున్నది. గత నవంబర్‌లో పెట్రోల్ మరియు డీజిల్‌కు సంబంధించిన పన్ను తగ్గింపులను కొనసాగించడం వల్ల ఇన్‌పుట్ ధర ఒత్తిడిని కొంతమేర తగ్గించడంలో సహాయపడినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణo టాలరెన్స్ పరీక్ష స్థాయిలలో ఎక్కువగానే ఉంది. డిమాండ్‌లో కొనసాగుతున్న నియంత్రణ దృష్ట్యా అమ్మకపు ధరలపై ఇన్‌పుట్ కాస్ట్ ఒత్తిళ్ల వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అంతేకాదు, ఓమిక్రాన్ రిస్క్‌లు సడలడం మరియు సప్లై శృంఖలాల ఒత్తిడి తగ్గడం వల్ల ప్రధాన ద్రవ్యోల్బణంలో కొంత నియంత్రణ ఉండవచ్చు. మొత్తంమీద, 2021-22కి ద్రవ్యోల్బణం అంచనా 5.3 శాతం వద్ద, Q4 లో ప్రతికూలమైన బేస్ ఎఫెక్ట్‌ల కారణంగా 5.7 శాతం వద్ద ఉన్నప్పటికీ, ఆ తరువాత తగ్గుతుంది. ముఖ్యంగా, అననుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా జనవరి 2022కి సంబంధించిన CPI రీడింగ్ ఎగువ టాలరెన్స్ బ్యాండ్‌కు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మరియు సాధారణ రుతుపవనాల ఉంటాయనే ఊహతో, (స్థూలంగా రిస్క్‌లు సమతుల్యం) 2022-23 సంవత్సారానికి CPI ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేయబడింది, 2022-23:Q1లో కి 4.9 శాతం; Q2లో 5.0 శాతం; Q3లో 4.0 శాతం మరియు Q4లో 4.2 శాతంగా అంచనా వేయబడింది.

13. ప్రస్తుత సమయంలో, దేశీయ ద్రవ్య విధానం యొక్క నిర్వహణ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వృద్ధి డైనమిక్స్‌కు అనుగుణంగా ఉంది, గ్లోబల్ గా సందిగ్ధమైన మార్పులు మరియు విభిన్న ద్రవ్య విధాన ప్రతిస్పందనల స్పిల్‌ఓవర్ గురించి మేము అప్రమత్తంగా ఉన్నప్పటికీ. బలమైన మరియు స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు భరోసానిస్తూ, మధ్యకాలానికి దాని ప్రాథమిక ఆదేశమైన ధరల స్థిరత్వం ద్వారా మా ద్రవ్య విధానం మార్గనిర్దేశం చేయబడుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మన చర్యలు బాగా ఆలోచించబడతాయి మరియు బాగా కమ్యూనికేట్ చేయబడతాయి.

ఆర్ధిక స్థిరత్వం

14. ధృడమైన మరియు ఉత్తమనిర్వహణ గల ఆర్థిక రంగం వృద్ధికి మరియు అభివృద్ధికి పునాది వేస్తుంది. లిక్విడిటీ ఇబ్బందులను తగ్గించడానికి, మార్కెట్ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మరియు ఆర్థిక మార్కెట్‌లోని ఇతర విభాగాలకు సంసర్గమును నిరోధించడానికి సత్వర మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి రిజర్వు బ్యాంకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. మేము బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకు ఫైనాన్షియల్ సెక్టార్‌ల కోసం, ముందస్తుగా వాటిలోని బలహీనతలను గుర్తించి, అంచానా వేసి మరియు వాటిని పరిష్కరించడానికై వాటి రెగ్యులేటరీ మరియు సూపర్‌వైజరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నాము.

15. అందువల్ల, మహమ్మారి ద్వారా అస్థిరత ఏర్పడినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉంది మరియు రికవరీ పుంజుకోవడం ఇంకా పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకోవడంతో క్రెడిట్ డిమాండ్‌లను తీర్చడానికి ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ (SCBలు) మునుపటి సంవత్సరాలతో పోలిస్తే అధిక మూలధన సమృద్ధి, తగ్గిన NPAలు, అధిక ప్రొవిజనింగ్ ఏర్పాటు మరియు మెరుగైన లాభదాయకతతో సాపేక్షంగా బలంగా ఉంది.

16. అయితే, రెగ్యులేటరీ రిలీఫ్‌లు మరియు పరిష్కారాల ప్రభావాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నప్పుడు బ్యాంకింగ్ మరియు NBFC రంగాలపై మహమ్మారి ప్రభావం గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. ధైర్యంగా ముందుకుపోయే క్రమంలో మరియు అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో స్థితిస్థాపకతను నిర్మించడానికి బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్పొరేట్ సుపరిపాలన మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను మరింత పటిష్టం చేసుకోవడం క్షేమకరమని చెప్పడం జరిగింది. మూలధన వృద్ధి మరియు తగిన బఫర్‌ల సృష్టి ప్రక్రియను కూడా వారు కొనసాగించాలి.

ద్రవ్యత మరియు ఫైనాన్షియల్ మార్కెట్ పరిస్థితులు

17. మహమ్మారి శతాబ్దానికి సరిపడ సంక్షోభాన్ని అందించింది, దీంతో హెల్త్ షాక్ కాస్తా స్థూల ఆర్ధిక మరియు ఫైనాన్షియల్ షాక్ గా మార్పుచెందింది ఇలాంటి అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది. ఫలితంగా, బారోయింగ్ ఖర్చులు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి మరియు అన్ని రేటింగ్ ఏజెన్సీల స్ప్రెడ్ లు కుంచించుకుపోయాయి. రికార్డు స్థాయిలో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు మరియు డిబెంచర్లు జారీ చేయబడ్డాయి. కార్పొరేట్ సంస్థలు లాభదాయకతను మెరుగుపరుస్తూ, భవిష్యత్తు క్యాపెక్స్ (మూలధన వ్యయాలు) కోసం నిలుపుకున్న ఆదాయాలను సజావుగా డి-లివరేజ్ చేయగలవు మరియు అధిక ధరల (హై-కాస్ట్) రుణాన్ని తగ్గించుకోగలవు. మొత్తంమీద, ఆర్థిక రంగం పూర్తిగా పని చేస్తూనే ఉంది మరియు రికవరీ ప్రక్రియకు మద్దతు ఇచ్చింది. మా అంచనాలో, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధాన చర్యలు సజావుగా మరియు క్రమపద్ధతిలో ఆశించిన ఫలితాలను ఇచ్చాయి.

18. ప్రక్రియను నిరంతరప్రాతిపదికన ఈ లక్ష్యాలను సాధించడం వల్ల, రిజర్వు బ్యాంకు డైనమిక్ ప్రాతిపదికన లిక్విడిటీని రీబ్యాలెన్స్ చేయడం వైపు మొగ్గు చూపింది, అదే సమయంలో దాని అనుకూల వైఖరికి మద్దతుగా తగిన ద్రవ్యతను కొనసాగిస్తోంది. ఈ రీబ్యాలెన్సింగ్ రెండు-విధాల్లో కార్యకలాపాలను కలిగి ఉంటుంది: మొదటిది, 14-రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) వేలం వైపుకు, ఓవర్‌నైట్ ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో (ఓవర్‌నైట్) నుండి లిక్విడిటీని రీబ్యాలెన్స్ చేయడం ప్రధాన చర్య, దీనికి ఫిబ్రవరి 2020 లో సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఊహించిన విధంగా వివిధ టేనర్‌ల ఫైన్-ట్యూనింగ్ వేలం ద్వారా మద్దతు లభిస్తుంది. మరియు రెండవది, స్వల్పకాలిక లిక్విడిటీ అసమతుల్యత మరియు లోటుపాట్లను తీర్చడానికి 1-3 రోజుల మెచ్యూరిటీల రెపో వేలం నిర్వహించడం, ఉదాహరణకు ఇటీవలి సందర్భంలో జనవరి 2022 మూడవ వారంలో ఊహించిన దాని కంటే ఎక్కువ GST అవుట్‌ఫ్లోలు ఉండడం లాంటివి. సమర్థవంతమైన లిక్విడిటీ నిర్వహణకు కీలకం 'టైమింగ్' మరియు లిక్విడిటీ మారుతున్న విధానానికి వేగంగా స్పందించే సూక్ష్మ మరియు చురుకైన విధానం.

19. RBI యొక్క రీబ్యాలెన్సింగ్ కార్యకలాపాల ఫలితంగా, రీబ్యాలెన్సింగ్ ప్రారంభించిన ఆగస్టు 2021 నుండి ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో క్రింద రోజువారీ సగటు శోషణ గణనీయంగా తగ్గింది. అయితే మొత్తం సిస్టమ్ లిక్విడిటీ మిగులు ఎక్కువలో ఉంది, అదే కాలంలో ఇది మోడరేట్ అయినప్పటికీ. ఓవర్‌నైట్ విండో నుండి సుదీర్ఘ కాల వ్యవధికి మిగులు లిక్విడిటీ యొక్క మైగ్రేషన్‌ను ప్రతిబింబిస్తూ, ప్రభావిత రివర్స్ రెపో రేటు - ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో యొక్క వెయిటెడ్ యావరేజ్ రేటు మరియు దీర్ఘతర మెచ్యూరిటీ గల VRRRలు - ఆగస్టు 2021 చివరి నాటికి 3.37 శాతం నుండి ఫిబ్రవరి 4, 2022 నాటికి 3.87 శాతం కు పెరిగాయి.

20. ఫిబ్రవరి 6, 2020న రివైజ్డ్ లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేస్తున్నప్పుడు, రోజువారీ ఫిక్స్‌డ్ రేట్ రెపోలు మరియు రిపోర్టింగ్ పక్షం రోజుల సంబంధిత నాలుగు 14-రోజుల టర్మ్ రెపోలు ఉపసంహరించబడ్డాయి. మహమ్మారి వల్ల మరియు సంబంధిత ఇంటి నుండి పని మరియు సామాజిక దూర ప్రోటోకాల్‌ల దృష్ట్యా, MSF మరియు ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో విండోలు సాధారణ పరిస్థితులలో రోజూ చివరిలో మాత్రమే కాకుండా, రోజంతా పనిచేస్తాయి. మహమ్మారి పరిస్థితిలు ఉన్నప్పుడు, లిక్విడిటీ మేనేజ్‌మెంట్ యొక్క ఈ నిష్క్రియ పద్ధతి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగినంత లిక్విడిటీ కేటాయింపు/శోషణను నిర్ధారించడానికి, ఉత్తమంగా పనిచేసింది.

21. ఆర్‌బిఐ నుండి స్వల్పకాల లిక్విడిటీ డిమాండ్‌తో సహా సాధారణస్థితి క్రమంగా తిరిగి రావడంతో, సవరించిన (రివైజ్డ్) లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ ను మరింత సరళంగా మరియు సమర్థవంతంగా చేయడానికి పునరుద్ధరించడం సబబు. దీని ప్రకారం నాలుగు నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా, వివిధ అవధుల వేరియబుల్ రేట్ రెపో కార్యకలాపాలు ఇక నుండి, నగదు నిల్వ నిష్పత్తి (CRR) నిర్వహణక్రమంలో మారుతున్న లిక్విడిటీ మరియు ఆర్థిక పరిస్థితులను బట్టి, అవసరమైన విధంగా నిర్వహించబడతాయి. రెండవది, 14 రోజుల వ్యవధి గల వేరియబుల్ రేట్ రెపో (VRR) మరియు వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) లిక్విడిటీ పొజిషన్‌ను బట్టి కీలక లిక్విడిటీ మేనేజ్‌మెంట్ సాధనాలుగా పనిచేస్తాయి మరియు CRR నిర్వహణచక్రంతో సమానంగా నిర్వహించబడతాయి. మూడవది, ఈ ప్రధాన కార్యకలాపాలు రిజర్వ్ మెయింటెనెన్స్ వ్యవధిలో ఏదైనా ఊహించని లిక్విడిటీ మార్పులను ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యకలాపాల ద్వారా మద్దతునిస్తాయి. అవసరాన్ని బట్టి లాంగ్ మెచ్యూరిటీ వేలం కూడా నిర్వహిస్తారు. నాల్గవది, మార్చి 01, 2022 నుండి, ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో మరియు MSF ఆపరేషన్‌లు అన్ని రోజులలో 17.30-23.59 గంటలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. (మహమ్మారి పరిస్థితిని ఎదుర్కోవటానికి మార్చి 30, 2020న అమలు చేయబడిన 09.00-23.59 గంటలలో కాదు.) మార్కెట్ పార్టిసిపెంట్లు బ్యాలెన్స్ మొత్తాన్ని ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో నుండి VRRR వేలానికి బదిలీ చేయాలని మరియు కార్యాచరణ సౌలభ్యం కోసం1 e-Kuber పోర్టల్‌లో ఆటోమేటిక్ స్వీప్-ఇన్ మరియు స్వీప్-అవుట్ (ASISO) సౌకర్యాన్ని పొందాలని సూచించడం జరిగింది.

22. ఫారెక్స్ మార్కెట్‌లో, గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లు ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ దేశాలతో పోలిస్తే భారతీయ రూపాయి (INR) స్థితిస్థాపకతను చూపింది. అధిక విదేశీ మారక నిల్వల బఫర్ మరియు నిరాడంబరమైన స్థాయి లో ఉన్న కరెంట్ ఖాతా లోటు (CAD) భారత్ యొక్క బాహ్య రంగ స్థిరత్వానికి మద్దతునిచ్చాయి. దేశీయంగా, ఆర్ధిక రికవరీ లో భాగంగా ఇటీవలి నెలల్లో వస్తువుల వాణిజ్య లోటు పెరిగింది, దీనికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మరియు చమురుయేతర దిగుమతుల పెరుగుదల కూడా కొంత కారణమయ్యింది. ఏది ఏమైనప్పటికీ, బలమైన వృద్ధి అవకాశాలతో IT సేవల నేతృత్వంలోని సేవల ఎగుమతులను ప్రోత్సహించడం వల్ల 2021-22లో CAD (Current Account Deficit) GDPలో 2.0 శాతానికి దిగువన ఉండే అవకాశం ఉంది. అదనంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవాహాలు బలంగా ఉన్నాయి, ఇవి ఇతర రకాల మూలధన ప్రవాహాలతో పాటుగా ఈ నిరాడంబరమైన స్థాయి లో ఉన్న CAD స్థాయికి సౌకర్యవంతంగా నిధులు సమకూర్చగలవని భావిస్తున్నారు.

23. విభిన్న ద్రవ్య విధాన వైఖరులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు మరియు నిరంతర సరఫరా పరిమితుల కారణంగా అత్యంత అస్థిర మరియు అనిశ్చిత గ్లోబల్ వాతావరణంలో, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నిరంతరం గ్లోబల్ స్పిల్‌ఓవర్‌ల కారణంగా అస్థిరతకు గురవుతాయి. అందువల్ల, మహమ్మారి నుండి కోలుకోవడం అసంపూర్ణంగా ఉన్నప్పటికీ, విధాన రూపకర్తలు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. తన వంతుగా, రిజర్వు బ్యాంకు దేశీయ ఆర్థిక వ్యవస్థను మరియు ఆర్థిక మార్కెట్లను ఈ స్పిల్‌ఓవర్‌ల నుండి ఇన్సులేట్ చేస్తుంది మరియు ఈ ప్రక్రియ ను కొనసాగిస్తుంది. ఇంకా, ఆర్‌బిఐ గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రాం ను సజావుగా అమలు చేయడంపై దృష్టి సారిస్తుంది, ఆర్ధిక పరిస్థితులను క్రమబద్ధంగా చక్కదిద్దడం మరియు యీల్డ్ కర్వ్ అభివృద్ధి లో మార్కెట్ పార్టిసిపెంట్ల వాటా చెప్పుకోదగ్గది. మార్కెట్ పార్టిసిపెంట్లు బాధ్యతాయుతంగా పాల్గొంటారని మరియు అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా వారి సహాయ సహకారాలను అందిస్తారని భావిస్తున్నారు.

అదనపు చర్యలు

24. మా నిరంతర మూల్యాంకనం ఆధారంగా ఈ రోజు కొన్ని అదనపు చర్యలు కూడా ప్రకటించబడుతున్నాయి. మానిటరీ పాలసీ స్టేట్‌మెంట్‌లోని డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్ (పార్ట్-బి)లో ఈ చర్యల వివరాలు పేర్కొనబడ్డాయి. అదనపు చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

అత్యవసర ఆరోగ్య సేవలకు మరియు కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్‌ల కోసం ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండో పొడిగింపు

25. అత్యవసర (ఎమర్జెన్సీ) హెల్త్ సర్వీసెస్ మరియు కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్‌ల కోసం వరుసగా 50,000 కోట్లు మరియు 15,000 కోట్ల విలువైన ఆన్-ట్యాప్ లిక్విడిటీ సౌకర్యాలు, మే మరియు జూన్ 2021 నెలల్లో మహమ్మారి రెండవ వేవ్ సమయంలో ప్రకటించబడ్డాయి. ఈ రెండు పథకాల కింద రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు నిర్దిష్ట ప్రోత్సాహకాలు అందించబడ్డాయి. మూడవ తరంగం ద్వారా కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా, ఈ రెండు పథకాలు మార్చి 31, 2022 నుండి జూన్ 30, 2022 వరకు పొడిగించబడుతున్నాయి.

స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం (వాలంటరీ రిటెన్షన్ రూట్) (VRR) - పరిమితులలో పెరుగుదల

26. ప్రభుత్వం మరియు కార్పొరేట్లు జారీ చేసే రుణ పత్రాలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) దీర్ఘకాలిక పెట్టుబడిని సులభతరం చేయడానికి వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR) పథకం మార్చి 2019లో ప్రారంభించబడింది. పథకానికి వచ్చిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అందువల్ల, ఈ పథకం కింద పెట్టుబడి పరిమితిని ప్రస్తుతం 1.5 లక్షల కోట్ల నుండి 2.5 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించబడింది, ఇది ఏప్రిల్ 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. ఇది ప్రభుత్వ సెక్యూరిటీలతో సహా దేశీయ డెట్ మార్కెట్ కోసం అదనపు మూలధన వనరులకు ప్రాప్తిని అందిస్తుంది.

క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ (CDS) మార్గదర్శకాల సమీక్ష

27. 2013లో మొదట్లో జారీ చేయబడిన క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లు (CDS) సమీక్షించబడ్డాయి మరియు ప్రజల వ్యాఖ్యల కోసం ఫిబ్రవరి 2021లో డ్రాఫ్ట్ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. అందిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు CDSకి సంబంధించి తుది ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మార్గదర్శకాలు క్రెడిట్ డెరివేటివ్స్ మార్కెట్ ఆభివృద్ధిని సులభతరం చేస్తాయి మరియు భారత్ లో కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను మరింతగా పెంచడంలో సహాయపడతాయి.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ సెటిల్డ్ రుపీ డెరివేటివ్స్ మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి బ్యాంకులను అనుమతించడం

28. భారత్ లోని బ్యాంకులు నాన్-రెసిడెంట్‌లకు ఓవర్‌నైట్ ఇండెక్స్డ్ స్వాప్‌లు (OIS) వంటి రూపాయి వడ్డీ రేటు ఉత్పన్నాలను అందించడానికి ఇప్పటికే అనుమతించబడ్డాయి. . భారత్ లోని బ్యాంకులు ఆఫ్‌షోర్ ఫారిన్ కరెన్సీ సెటిల్డ్ ఓవర్‌నైట్ ఇండెక్స్‌డ్ స్వాప్ (FCS-OIS) మార్కెట్‌లో నాన్-రెసిడెంట్‌లు మరియు ఇతర మార్కెట్ మేకర్స్‌తో లావాదేవీలు జరిపేందుకు అనుమతించాలని ఇప్పుడు నిర్ణయించబడింది. ఇది ఆన్‌షోర్ మరియు ఆఫ్‌షోర్ మార్కెట్ల మధ్య విభజనను తగ్గిస్తుంది, మరింత సమర్థవంతమైన ధరల ఆవిష్కరణను అనుమతిస్తుంది మరియు భారత్ లో ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేస్తుంది.

ఈ-రుపీ (e-RUPI) (UPIని ఉపయోగించే ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్‌లు) కింద సీలింగ్‌లో పెరుగుదల

29. NPCI అభివృద్ధి చేసిన e-RUPI ప్రీ-పెయిడ్ డిజిటల్ వోచర్ ఆగస్టు 2021లో ప్రారంభించబడింది. సింగిల్ యూజ్ క్యాష్‌లెస్ పేమెంట్ వోచర్ 10,000 పరిమితిని కలిగి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే e-RUPI వోచర్‌ల పరిమితిని ఒక్కో వోచర్‌కు 10,000 నుండి 1,00,000కి పెంచాలని ప్రతిపాదించబడింది మరియు అటువంటి e-RUPI వోచర్‌లను ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించడానికి అనుమతించబడాలని ప్రతిపాదించబడింది. (వోచర్ మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు). దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధవంతంగా లబ్ధిదారులకు అందజేయడం మరింత సులభతరం అవుతుంది.

MSME రిసీవబుల్స్ ఫైనాన్సింగ్ కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రారంభించడం - TReDS సెటిల్‌మెంట్ కోసం NACH మాండేట్ పరిమితి ( mandate limit) ని పెంచడం

30. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్ (TReDS) మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEలు) యొక్క ట్రేడ్ రిసీవబుల్స్ ఫైనాన్సింగ్‌ను సులభతరం చేస్తుంది. TReDSలో లావాదేవీలు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) వ్యవస్థ ద్వారా పరిష్కరించబడతాయి. వాటాదారుల నుండి స్వీకరించబడిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని మరియు MSMEల పెరుగుతున్న ద్రవ్య అవసరాలకు ఫైనాన్సింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, TReDS సంబంధిత సెటిల్‌మెంట్ల కోసం NACH ఆదేశ(మాండేట్) పరిమితిని ప్రస్తుతం ఉన్న 1 కోటి నుండి 3 కోట్లకు పెంచాలని ప్రతిపాదించబడింది.

IT అవుట్‌సోర్సింగ్‌పై మాస్టర్ డైరెక్షన్ (MD) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్, రిస్క్, కంట్రోల్స్ అండ్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్‌పై మాస్టర్ డైరెక్షన్ (MD)

31. క్లిష్టమైన IT సేవలను విస్తృతంగా అవుట్‌సోర్సింగ్ చేయడంతో, RBI నియంత్రిత సంస్థలచే ఉపయోగించబడే సాంకేతికత మరియు కస్టమర్‌లచే డిజిటల్ ఛానెల్‌ల వినియోగం పెరగడంతో, నియంత్రిత సంస్థలు గణనీయమైన ఆర్థిక, కార్యాచరణ మరియు కీర్తిపరమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల, ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించి, ఏకీకృతం చేయవలసిన అవసరం ఏర్పడింది. దీని ప్రకారం, వాటాదారులు మరియు ప్రజల వ్యాఖ్యల కోసం రెండు డ్రాఫ్ట్ ఆదేశాలు జారీ చేయబడతాయి: (i) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (IT అవుట్‌సోర్సింగ్) ఆదేశాలు, 2022; మరియు (ii) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుడ్ గవర్నెన్స్, రిస్క్, కంట్రోల్ అండ్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్) ఆదేశాలు, 2022.

ముగింపు వాక్యాలు

32. COVID-19 యొక్క తదుపరి మ్యుటేషన్ గురించి ఖచ్చితమైన విషయజ్ఞానం లేనప్పుడు మనం నైట్‌యన్ అనిశ్చితి2 ప్రపంచంలో జీవిస్తున్నట్లే. ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యం వైరస్ యొక్క వికాసంపై చాలా ఆధారపడి ఉంటుంది, ఒకరోగ నిరూపణ అంత మంచిదా లేదా అంత చెడుగా ఉందా లేదా మరో విధంగానా మరియు స్వల్పకాలికంగానా. గత రెండేళ్ళలో వైరస్‌తో జీవించడం మనకు ఏదైనా నేర్పితే, అది వినయంగా ఉండటమేగానీ మనం ఆత్మవిశ్వాసంతో దృఢంగా నిలబడాలి, ధైర్యం మరియు ఆశావాదాన్ని కోల్పోవద్దు. మనం ఇటీవలే కోల్పోయిన గానకోకిల లతా మంగేష్కర్ ఇలా - ఆమె అమర స్వరంలో పాడింది: "ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై". ఈ అందమైన పాట యొక్క తదుపరి లైన్ వెనుక ఉన్న స్ఫూర్తితో, ఆమె ఆశావాదం యొక్క శాశ్వతమైన సందేశాన్ని అందించారు.

33. రిజర్వు బ్యాంకు నందు మనం, స్థూల ఆర్థిక స్థిరత్వంతో బలమైన మరియు స్థిరమైన అభివృద్ధి పునాదులను పునర్నిర్మించేటప్పుడు, దేశీయ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం మరియు నమ్మకాన్ని కాపాడేందుకు నిబద్ధతతో స్థిరంగా ఉన్నాము. అనిశ్చితి సముద్రంలో ఇదియే మనకు ఊతకర్ర మరియు లంగరు. సవాళ్ల మధ్య నిరంతరం శ్రమించే మహాత్మా గాంధీ స్ఫూర్తితో మనం ప్రేరణ పొందాము: "తృప్తి అనేది ప్రయత్నంలో ఉంటుంది, ......పూర్తి ప్రయత్నం పూర్ణ విజయం3."

ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1692.


1 రోజు చివరిలో బ్యాంకులు తమ CRR బ్యాలెన్స్‌లను నిర్వహించడంలో మరింత సౌలభ్యాన్ని అందించడానికి, RBI ఆగస్టు 2020లో ఐచ్ఛిక ఆటోమేటిక్ స్వీప్-ఇన్ మరియు స్వీప్-అవుట్ (ASISO) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది, దీని కింద బ్యాంకులు నిర్దిష్ట (లేదా పరిమితి)ను సెట్ చేయవచ్చు. వారు రోజు చివరిలో నిర్వహించాలనుకుంటున్న మొత్తాన్ని ముందే సెట్ చేయగలరు. బ్యాంకులు నిర్వహణలో బ్యాలెన్స్ ఏదైనా తగ్గినా లేదా పెరిగినా (అదనం), ASISO సౌకర్యం స్వయంచాలకంగా రివర్స్ రెపో బిడ్‌ల లేదా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) క్రింద ట్రిగ్గర్ చేస్తుంది.

2 ఎకనామిక్స్‌లో, నైటియన్ అనిశ్చితి అనేది కొన్ని సాధ్యమయ్యే సంఘటనల గురించి ఎటువంటి పరిమాణాత్మక జ్ఞానం లేకపోవడం, ఇది పరిమాణాత్మక ప్రమాదానికి విరుద్ధం. ఇది అసంపూర్ణ జ్ఞానం యొక్క అంగీకారం భవిష్యత్ సంఘటనలను తప్పనిసరిగా ఊహించలేనిదిగా చేస్తుంది. ఈ దృగ్విషయానికి చికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థికవేత్త అయిన ఫ్రాంక్ నైట్ (1885-1972) పేరు పెట్టారు, దీని ప్రాథమిక రచన “రిస్క్, అనిశ్చితి మరియు లాభం” 1921లో ప్రచురించబడింది.

3 కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ (CWMG), వాల్యూం 26, పేజి 293

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?