RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78517286

గవర్నర్ యొక్క ప్రకటన – ఫిబ్రవరి 05, 2021

ఫిబ్రవరి 05, 2021

గవర్నర్ యొక్క ప్రకటన – ఫిబ్రవరి 05, 2021

ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) 3, 4 మరియు ఫిబ్రవరి 5 తేదీలలో 2021, సమావేశమై దేశం లోపల మరియు ప్రపంచ వ్యాప్తంగా వర్తమానంలో స్థూలఆర్ధిక మరియు ఫైనాన్షియల్ పరిణామాల గురించి చర్చించింది. పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మారకుండా ఉండటానికి ఎంపిసి ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఇంకా, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న టార్గెట్ లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo నుండి ఉపశమనం తో పాటు, నిలకడతో వృద్ధి ని పునరుద్ధరించడం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంతమేరకు సర్దుబాటు ధోరణినే కొనసాగించాలని ఏకగ్రీవంగా ఓటు వేశారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 4.25 శాతంలో మార్పులేదు

2. మొదట, MPC నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న ప్రక్రియ మరియు దానికి అంతర్లీనంగా ఉన్న ప్రేరణ వాటి వివిధ స్వరూపాలను సంక్షిప్తంగా వివరిస్తాను. డిసెంబర్ సమావేశంలో వేసిన వృద్ధిఅంచానా కన్నా ద్రవ్యోల్బణం గత రెండు మాసాలుగా మెరుగ్గా ఉన్నది. COVID-19 టైంలో మొదటిసారిగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతం దిగువనే ఉంది. ముందుగా చూస్తె, రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణ పధం రూపొందించగల కారకాలు; ఖరీఫ్ పంట భారీగా మార్కెట్లకు రావడం , రబీలో మంచిపంట వచ్చే అవకాశాలు, కీలకమైన కూరగాయలు శీతాకాలంలో అధికంగా రావడం మరియు గ్రుడ్డు మరియు పౌల్ట్రీ గిరాకీ ఏవియన్ ఫ్లూ భయంతో మృదువుగా అవడం మొదలగునవి అన్ని, సమీపకాల దృక్పథం స్థిరంగా ఉంటుందని సూచిస్తున్నాయి.

3. జనవరి 7, 2021 న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన 2020-21 సంవత్సరానికి జిడిపి యొక్క ప్రాథమిక అంచనా MPC యొక్క డిసెంబర్ ప్రొజెక్షన్‌కు చాలా దగ్గరగా ఉంది మరియు సానుకూల వృద్ధి ప్రేరణలు బాగా బలపడడం తో వృద్ధి మీద ఔట్లుక్ బాగా మెరుగుపడింది, ఇంకా వ్యాక్సినేషణ్ అమలు జోరందుకుంటున్నందున ఇవన్నిదేశంలో మహమ్మారి ముగింపు భవిష్యత్తును చెబుతున్న చిహ్నములు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట లక్ష్య బ్యాండ్ దిగువనే ఉంది. టాలరెన్స్ బ్యాండ్‌లో ద్రవ్యోల్బణం దిగి వచ్చినందున, వృద్ధికి మద్దతు ఇవ్వడం, COVID-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడం మరియు ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథానికి తిరిగి తెసుకెళ్ళడం ఇప్పటి తక్షణ కర్తవ్యమని ఎంపిసి నిర్ణయించింది.

వృద్ధి మరియు ద్రవ్యోల్బణం యొక్క అంచనా

4. 2021 కొత్త సంవత్సరం ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పాటు భారతదేశంలో టీకా డ్రైవ్‌లతో బలమైన సానుకూల ధోరణితో ప్రారంభమైంది. COVID-19 గురించి భారతదేశం ప్రతిస్పందన మనకు మహాత్మాగాంధీ గారి ఉద్ఘోషణలోని ఒక సారాంశాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే - “determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history1". 2020 సంవత్సరం మన సామర్థ్యాలను మరియు ఓర్పును పరీక్షించగా, 2021 మన చరిత్రలో కొత్త ఆర్థిక శకానికి నాంది పలికింది.

అభివృద్ధి

5. ముఖ్యంగా, MPC చివరి సమావేశం నుండి రికవరీ సంకేతాలు మరింత బలపడ్డాయి. హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు వివిధ రంగాలు సాధారణ స్థితిని చేరుకోవడంను సూచిస్తున్నాయి. ఉత్పాదక రంగంలో సామర్థ్య వినియోగం త్రైమాసికం 2: 2020-21లో 63.3 శాతానికి మెరుగుదల వైపు ఆర్‌బిఐ సర్వే సూచించింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 47.3 శాతంగా ఉంది. వినియోగదారుల విశ్వాసం పుంజుకుంటుంది మరియు తయారీ, సేవలు మరియు మౌలిక సదుపాయాల యొక్క వ్యాపార అంచనాలు ఉత్సాహంగా ఉన్నాయి. సరకు రవాణా మరియు ప్రజల కదలికలు, ఇంకా డొమెస్టిక్ ట్రేడింగ్ కార్యకలాపాలు

ధృడoగా మరియు వేగంగా పెరుగుతున్నాయి. సెకండు వేవ్ యొక్క భయాలు తగ్గనప్పటికీ, ఎలక్ట్రిసిటీ మరియు ఎనర్జీ డిమాండ్ డిసెంబర్ నెలతో పోలిస్తే ఆర్థిక కార్యకలాపాల విస్తృత సాధారణీకరణను ప్రతిబింబిస్తుంది. ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రాల్లో విక్రయాల డేటా మరియు రెసిడెన్షియల్ యూనిట్ల కొత్త లాంచ్‌లు రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వాసాన్ని ద్విగుణీకృతము చేస్తున్నాయి. తయారీ, సేవలు మరియు కాంపోజిట్ కొనుగోలు నిర్వాహకుల సూచికలు (పిఎంఐ) విస్తరింపు జోన్ లో ఉన్నాయి - తయారీ పిఎంఐ జనవరి 2021 లో 57.7 కు పెరిగింది, 2020 డిసెంబర్‌లో 56.4 నుండి, మరియు పిఎంఐ 2021 జనవరిలో 52.8 కి పెరిగింది, 2020 డిసెంబర్‌లో 52.3 నుండి. ఇంకా, టీకా డ్రైవ్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాల పునరుద్ధరణకు ప్రేరణనిస్తుంది మరియు ప్రపంచ మార్కెట్లో భారతీయ ఫార్మా పరిశ్రమకు గొప్ప గుర్తింపుగా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత రికవరీపై విశ్వాసం ఉంచి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఇటీవలి మాసాల్లో ధృడంగా పెరిగాయి. మౌలిక సదుపాయాల రాబోయే విస్తరణ నేపధ్యంలో, జాతీయ రహదారుల నిర్మాణ వేగం పెరుగుతోంది మరియు జాతీయ రహదారి ప్రాజెక్టుల పురస్కారం 2020-21లో ఏటికేడాది రెట్టింపు అయ్యింది.

6. వాణిజ్య రంగానికి ఆర్థిక వనరుల విస్తరింపు మెరుగుపడుతోంది, ముఖ్యంగా ఆహారేతర బ్యాంక్ క్రెడిట్ విషయంలో మరియు కమర్షియల్ పేపర్ (సిపిలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల క్రెడిట్, కార్పొరేట్ బాండ్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ద్వారా, ఇంతకు మించి ఇంకేం కావాలి! ఈ వనరుల మొత్తం విస్తరింపు ఈ ఏడాది ఇప్పటివరకు 8.85 లక్షల కోట్లు (జనవరి 15, 2021 వరకు), గత ఏడాది ఇదే కాలంలో 7.97 లక్షల కోట్లు. ఆర్‌బిఐ యొక్క తాజా బ్యాంక్ రుణ సర్వే త్రైమాసికం 2: 2021-22 వరకు అన్ని రంగాలలో రుణ డిమాండ్‌ పై సెంటిమెంట్‌ మరింత మెరుగుదలని సూచిస్తుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రియల్ జిడిపి వృద్ధి 2021-22లో 10.5 శాతంగా అంచనా వేయబడింది – ప్రధమార్ధం 1 లో 26.2 నుండి 8.3 శాతం పరిధిలో మరియు త్రైమాసికం-3 లో 6.0 శాతం.

7. కేంద్ర బడ్జెట్ 2021-22 ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణ మరియు పరిశోధన వంటి రంగాల పునరుద్ధరణకు బలమైన ప్రేరణనిచ్చింది. రాబోయే రోజుల్లో ఇది అంత్యంత క్రియాశీలక గుణక ప్రభావాన్ని చూపెడుతుంది, ముఖ్యంగా పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో మరియు అంతర్గత డిమాండ్, ఆదాయం మరియు ఉపాధిని పునరుజ్జీవింపజేయడంలోను. పెట్టుబడి-ఆధారిత ఉద్దీపన క్రింద ఆత్మనిర్భర్ (AatmaNirbhar) 2.0 మరియు 3.0 (మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పుడు ఇవ్వబడ్డాయి) పనిచేయడం ప్రారంభించింది దాని ద్వారా మరియు ప్రభుత్వ పెట్టుబడి నాణ్యతతో పాటు, ఖర్చు వేగాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రెండూ కూడా మధ్యస్థ కాలానికి భారతదేశ వృద్ధి సామర్థ్యాన్ని తిరిగి పొందటానికి దోహదపడతాయి. మూలధన వ్యయంలో పెరుగుదల అంచనా సామర్థ్యం పెరగడానికి మరియు ప్రైవేట్ పెట్టుబడులలో రద్దీకి బాగా ఉపయోగపడుతుంది, తద్వారా వృద్ధికి అవకాశాలను మెరుగుపరుస్తుంది మరియు వ్యయం నాణ్యతచుట్టూరా విశ్వసనీయతను ఇంకా పెంచుతుంది.

ద్రవ్యోల్బణం

8. జూన్ 2020 నుండి నిరంతరం గరిష్ట లక్షిత పరిమితిని ఉల్లంఘించిన తరువాత, లాక్డౌన్ అనంతర కాలంలో మొదటిసారిగా సిపిఐ ద్రవ్యోల్బణం డిసెంబరులో 6 శాతానికి దిగువకు చేరుకుంది, అనుకూలమైన బేస్ ఎఫెక్ట్స్ మరియు గణనీయంగా తగ్గిన కీలకమైన కూరగాయల ధరల మద్దతుతో. నవంబర్, డిసెంబర్ నెలల్లో హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం 90 శాతం క్షీణించడానికి, తగ్గిన కీలకమైన కూరగాయల ధరలే కారణం. ఈ అనుకూలమైన అభివృద్ధికి అధికంగా కీలకమైన కూరగాయలు రావడo మరియు సప్లై పరంగా క్రియాశీల జోక్యం రెండూ దోహదపడ్డాయి. కూరగాయల ధరలు సమీప కాలంలో అదుపులోనే ఉంటాయని భావిస్తున్నారు, అయితే కొన్ని కీలకమైన ఆహార పదార్థాలలో ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవలి మాసాల్లో కనిపించే వ్యయ-ఒత్తిడి, ఒత్తిళ్ల పెరుగుదల ద్వారా కోర్ ద్రవ్యోల్బణం దృక్పథం ప్రభావితమవుతుంది. ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ ముడి ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తి ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి మరియు అధిక పరోక్ష పన్నులు కేంద్రం మరియు రాష్ట్రాలలో అలానే ఉన్నాయి. వీటితోపాటు, పారిశ్రామిక ముడి పదార్థాల (ఇండస్ట్రియల్ రామెటీరియల్) ధరల పెరుగుదల ఫలితంగా ఇటీవలి నెలల్లో సేవలు మరియు ఉత్పాదక ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. కొనసాగుతున్న ధరల పెంపు మరింత పెరగకుండా చూసుకోవడం కోసం కేంద్రం మరియు రాష్ట్రాల సమిష్టి విధాన చర్య చాలా అవసరం. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా త్రైమాసికం-4: 2020-21 కి 5.2 శాతం, ప్రధమార్ధభాగం: 2021-22 కి 5.2 నుండి 5.00 శాతం, త్రైమాసికం-3: 2021-22 కి 4.3 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, సవరించబడింది.

9. మార్చి 2021 నాటికి, ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సమీక్షిస్తుంది., COVID-19 కాలాన్ని మినహాయించి, ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్ఆరంభంనుంచి ధరల స్థిరత్వాన్ని విజయవంతంగా నిర్వహించడలోని అనుభవం మరియు ద్రవ్య విధానానికి గణనీయంగా విశ్వసనీయత సాధించిన అనుభవం ను రాబోయే సంవత్సరాల్లో మళ్ళీ బలోపేతం చేయాలి; ఒకవేళ మహమ్మారి నుంచి బయటపడ్డప్పటికీ మరియు పోస్ట్-కోవిడ్ ప్రపంచoలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆర్ధిక వ్యవస్థలో ధరలు స్థిరంగా ఉండటమే గట్టి పునాది, దానిపై ధర్మచక్రం ఉన్నత శిఖరాలను చేరడానికి ఫైనాన్షియల్ సేవింగ్స్ మరియు పెట్టుబడులు ఎక్కువచేయడం, పెట్టుబడి మరియు వేతన నిర్ణయాలలో సంస్థలకు అనిశ్చితులు తొలగి పోవడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో టరం మరియు రిస్క్ ప్రీమియా తగ్గడం బయటి పోటీతత్వం పెరగడం ముఖ్యం.

లిక్విడిటీ మార్గదర్శనం

10. మహమ్మారి కాలంలో రిజర్వు బ్యాంకు మరియు మార్కెట్లు అవగాహన ను పంచుకుంటూ, సహకారoతో పరిష్కారాలను అభివృద్ధి చేశాయి. కార్పొరేట్ బాండ్ల జారీ రికార్డు స్థాయికి చేరుకుంది ( ఏప్రిల్ - డిసెంబర్, 2020 కాలంలో 5.8 లక్షల కోట్లు, 2019 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.6 లక్షల కోట్లతో పోలిస్తే). 2020-21 మధ్యకాలంలో ద్రవ్య విధానం నిర్వహణలో ముందుచూపుతో మార్గదర్శకత్వం చేయడం ఒక వినూత్న లక్షణం. నిరంతరం అధిక ద్రవ్యోల్బణ ప్రింటులు మరియు ప్రభుత్వ పేపర్ల సరఫరా వల్ల మార్కెట్ల అసౌకర్యాన్ని పరిష్కరించడంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ నిర్వహణ, క్రమభద్ధమైన రాబడి రేఖ పరిణమింపజేయడం అనేవి పబ్లిక్ ఆస్తులు గా పరిగణించబడ్డాయిగావున, ఆర్ధిక వ్యవస్థలో భాగస్వాములందరికి ప్రయోజనం అందాలి. ఆర్‌బిఐ యొక్క మార్కెట్ కార్యకలాపాలు ద్రవ్యత్వలేమి భయాలను తొలగించాయి మరియు ఆర్థిక మార్కెట్ మనోభావాలను పెంచాయి. ఆర్‌బిఐ యొక్క కమ్యూనికేషన్ మరియు చర్యలకు నమ్మకంకలిగి మార్కెట్ భాగస్వాములు సమకాలికంగా మరియు సహకారంతో స్పందించారు, ఇది ఫార్వర్డ్ మార్గదర్శకత్వం ప్రభావితానికి సాక్ష్యమిస్తుంది.

11. పాలసీ రేటు కోతలు, ప్రోయాక్టివ్ లిక్విడిటీ మేనేజ్‌మెంట్ మరియు గ్లోబల్ స్పిల్‌ఓవర్ల నేపథ్యములో రెగ్యులేటరీ సహనం మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ద్వారా ఆర్బిఐ తీసుకున్న చర్యలు మార్కెట్ స్పెక్ట్రం అంతటా పాలసీ రేటు కోతలను సజావుగా ప్రసారం చేశాయి, నష్ట భయాలను తగ్గించాయి మరియు కార్పొరేట్ బాండ్ల మార్కెట్ ను మరోమారు సునిశ్చితం చేశాయి. రిస్క్-ఫ్రీ బెంచ్‌మార్క్‌లు అభివృద్ధి చెందుతున్న జి-సెక్ మార్కెట్లో, రికార్డు స్థాయిలో a low weighted average cost of 5.78 per cent మరియు elongated weighted average maturity of 14.9 years అనేవి ఆర్‌బిఐ యొక్క ద్రవ్య మరియు ద్రవ్య నిర్వహణ కార్యకలాపాల విశ్వసనీయతకు నిదర్శనం.

12. జనవరి 11 న, ఆర్‌బిఐ తన సర్దుబాటు విధాన వైఖరిని రివర్స్ చేస్తుందని గ్రహించిన మార్కెట్ అపోహలపై మనీ మార్కెట్ రేట్లు మరియు జి-సెక్ రాబడి బలపడ్డాయి. ఈ సందర్భంలో, సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ క్రింద వేరియబుల్ రేట్ రివర్స్ రెపో వేలం ఇప్పటికే మా ఇన్స్ట్రుమెంట్స్-మెనూలో ప్రధాన పరికరంగా ఉందని మరియు మహమ్మారికి ముందు క్రియాశీలకంగా ఉపయోగంలో ఉన్నవని గుర్తుంచుకోవడం శ్రేయస్కరం. ఇవి స్వచ్ఛందంగా ఉంటాయి, ఏదేమైనా, ఓవర్నైట్ ఫిక్సెడ్ రేట్ రివర్స్ రెపో రికోర్స్ కు రోజువారీగా అందుబాటులో ఉంటుంది. వేరియబుల్ రివర్స్ రెపో రేట్ వేలం ఫిక్సెడ్ రేటు రివర్స్ రెపో కంటే ఎక్కువ రెమ్యూనరేషణ్ ఇస్తుంది, దీర్ఘ అవధి ని(14-రోజులు) దృష్టిలో పెట్టుకుంటే. లిక్విడిటీ నిర్వహణ వైఖరి సర్దుబాటు ధోరణితో కొనసాగుతుంది మరియు ద్రవ్య విధాన వైఖరికి పూర్తిగా అనుగుణంగా ఉంది. వ్యవస్థలో తగినంత ద్రవ్యత లభ్యమయ్యేలా చేయాడానికి ఆర్బిఐ కట్టుబడి ఉంది మరియు తద్వారా రికవరీకి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ గమనించ వలసిన ముఖ్య విషయం ఏమిటంటే, కరెన్సీ డిమాండ్ మూలంగా రిజర్వ్ మనీ ఏటికేడాదీ (వై-ఓ-వై) (జనవరి 29, 2021 న) 14.5 శాతం పెరిగింది, మరోవైపు, జనవరి 15, 2021 నాటికి మనీ సప్లై (ఎం 3) కేవలం 12.5 శాతం మాత్రమే పెరిగింది.

13. టీకాలు వేయడం మరియు అదనపు విధాన ఉద్దీపనపై వార్తల నేపథ్యంలో నవంబర్ 2020 ఆరంభం నుండి, అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ కారకాలు రిస్క్ అపటైట్ తిరిగి పెంచి రాబడి కోసం తీవ్ర శోధనకు కారణమయ్యాయి, ఫలితంగా భారతదేశం వంటి EME లలో క్యాపిటల్ ఫ్లోలు పెరిగాయి మరియు తత్ఫలితంగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరత పెరుగుతున్నది. ఏదేమైనా, ఆర్బిఐ దేశీయ ఆర్థిక మార్కెట్లను గ్లోబల్ స్పిల్ఓవర్ల నుండి నిరోధించడానికి మరియు పర్యవసానంగా ఏర్పడ్డ అస్థిరతకు తగిన చర్యలు తీసుకుంది.

14. నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్ఆర్) యొక్క రెండు దశల సాధారణీకరణను - నేను ప్రకటించబోతున్నాను - ఈ సందర్భంలో గమనించాలి. అయితే, వ్యవస్థలో ద్రవ్యత్వం తరువాతి సంవత్సరంలోను సౌకర్యవంతంగా ఉంటుంది. వాస్తవానికి, CRR సాధారణీకరణ అదనపు ద్రవ్యతను ఇంజెక్ట్ చేయడానికి వివిధ రకాల మార్కెట్ కార్యకలాపాలకు చోటు కల్పిస్తుంది. ఈ ఏరియాలలో మా ప్రయత్నం యొక్క అంతర్లీన ఇతివృత్తం, ఆర్బిఐ యొక్క విధాన లక్ష్యాలలో ప్రధానమైన ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా మా ఆయుధశాలలోని అన్ని పరికరాలను సముచితంగా ఉపయోగించడం.

15. వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వం స్థూలంగా మార్కెట్ నుంచి 12 లక్షల కోట్లను సమీకరించనుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఋణాల నిర్వహణదారు, బ్యాంకరుగా ఈ పధకం ను ఎటువంటి ఇబ్బందులు లేని విధానంలో (నాన్-డిస్రప్షణ్) , ఆర్‌బిఐ పూర్తి చేసేలా చేస్తుంది. ఈ సందర్భంలో, 2021-22 మధ్య మార్కెట్ ప్లేయర్లు మరియు ఆర్‌బిఐల మధ్య సాధారణ అవగాహన మరియు సహకార విధానం కొనసాగింపు కై మేము ఎదురుచూస్తున్నాము.

అదనపు చర్యలు

16. ఈ నేపథ్యంలో, ఆర్‌బిఐ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనే దాని ముఖ్య లక్ష్యంతో పట్టుదలతో ఉంటూ, (i) ద్రవ్య నిర్వహణ మరియు లక్షిత రంగాలకు మద్దతు; (ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ (iii) ఆర్థిక మార్కెట్లను విస్తృతపరచడం (iv) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలను నవీకరణ చేయడం మరియు (v) వినియోగదారుల భద్రత ను ధృడతరం చేయడం వంటి, వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది. చర్యల వివరాలు ద్రవ్య విధాన ప్రకటన యొక్క అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై (పార్ట్-బి)ఇచ్చిన ప్రకటనలో పేర్కొనబడ్డాయి.

(i) ద్రవ్యలభ్యత కోసం చర్యలు

టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – NBFCలను చేర్చడం

17. బాహుళ్యవ్యాప్తి మరియు గుణక ప్రభావంతో వృద్ధిని ప్రేరేపించే నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో, అక్టోబర్ 9, 2020 న ఆర్‌బిఐ టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్ ట్యాప్) స్కీమ్‌ను ప్రకటించింది. తుది మజిలి వరకు అరువు అందించే విషయంలోను మరియు వివిధ రంగాలకు తగినంతగా అరువు విస్తారణ చేయగల బలిష్ఠమైన గుణకాలుగా ఎన్‌బిఎఫ్‌సిలు బాగా పేరొందినందున, ఈ రంగాలకు అదనoగా రుణాలుఇచ్చేందుకు టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం క్రింద ఎన్‌బిఎఫ్‌సిలకు నిధులు సమకూర్చాలని ప్రతిపాదించబడింది.

మార్చి 2021 నుండి రెండు దశల్లో నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్) పునరుద్ధరణ

18. కోవిడ్-19 వల్ల కలిగిన మార్పుల ఆటుపోట్లనుండి తట్టుకోవడానికి బ్యాంకులకు మద్దతిచ్చేందుకు అన్ని బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్), ఒక సంవత్సరం పాటు మార్చి 26, 2021 తుది వరకు 100 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 3.00 శాతం కు తగ్గించబడింది. ద్రవ్య మరియు ద్రవ్యత్వ పరిస్తితుల సమీక్షలో, సిఆర్ఆర్ ను రెండు దశలలో అంతరాయం కలిగించని రీతిలో పునరుద్ధరించాలని నిర్ణయించారు. బ్యాంకులు ఇప్పుడు సిఆర్ఆర్ ను మార్చి 27, 2021 నుండి 3.5 శాతం వద్ద మరియు మే 22, 2021 4.00 శాతం వద్ద నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతకుముందు సూచించినట్లు, CRR సాధారణీకరణ అదనపు ద్రవ్యతను ఇంజెక్ట్ చేయడానికి ఆర్‌బిఐ వివిధ రకాల మార్కెట్ కార్యకలాపాలకు చోటు కల్పిస్తుంది.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) – సడలింపుల యొక్క పొడిగింపు

19. పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి ఎన్‌డిటిఎల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం యన్డిటియల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. మార్చి 31, 2021 వరకు దశలవారీగా విస్తరించబడినన ఈ సదుపాయం ఇప్పుడు మరో ఆరు నెలల కాలానికి అందుబాటులో ఉంటుంది, అనగా సెప్టెంబర్ 30, 2021 వరకు బ్యాంకుల ద్రవ్య అవసరాలపై, ఈ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పంపిణీ వల్ల, 1.53 లక్షల కోట్ల మేరకు నిధులకు అధిక ప్రాప్యత కలుగుతుంది..

(ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ

హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎం-HTM) విభాగంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్-SLR) హోల్డింగ్స్

20. సెప్టెంబర్ 1, 2020 న రిజర్వు బ్యాంకు, సెప్టెంబర్ 1, 2020 న లేదా ఆ తర్వాత మార్చి 31, 2021 వరకు సమకూర్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలకు సంబంధించి హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్) వర్గం క్రింద పరిమితిని ఎన్‌డిటిఎల్‌ లో 19.5 శాతం నుండి 22 శాతానికి పెంచింది. ఈ వెసులుబాటు మార్చి 31, 2022 వరకు లభిస్తుంది. 2021-22 సంవత్సరానికి కేంద్రం మరియు రాష్ట్రాల రుణ సమీకరణ నేపధ్యంలో మార్కెట్ మదుపర్లకు ఖచ్చితత్వాన్ని తెలియచేయడానికి, ఏప్రిల్ 1, 2021 మరియు మార్చి 31, 2022 మధ్య సమకూర్చుకున్న సెక్యూరిటీల కోసం 22 శాతంగా పెంచిన హెచ్‌టిఎమ్ లిమిట్ సదుపాయాన్ని మార్చి 31, 2023 వరకు పొడిగించాలని నిర్ణయం చేయబడింది.

జూన్ 30, 2023 తో ముగిసే త్రైమాసికం నుండి, దశలవారీగా హెచ్‌టిఎమ్ పరిమితి 22 శాతం నుండి 19.5 శాతానికి పునరుద్ధరించబడుతుంది. HTM లిమిట్ ని నిమ్మళింపు పధంలో పూర్వపు స్థాయి కి చేరడం కోసం, బ్యాంకులు SLR సెక్యూరిటీలో పెట్టుబడి కి ప్లాన్ చేస్తాయని భావిస్తున్నారు.

MSME పారిశ్రామికవేత్తలకు ఋణాలు

21. సూక్ష్మ, లఘు మరియు మధ్యస్థ వ్యవస్థాపక (ఎంఎస్‌ఎంఇ) రుణగ్రహీతలకు’ కొత్తగా ఋణాలను అందించడం ను ప్రోత్సహించడానికి, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ ఎన్‌డిటిఎల్ నుండి ‘కొత్త ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు’ పంపిణీ చేసిన ఋణాలను నగదు రిజర్వ్ నిష్పత్తి (సిఆర్ఆర్) లెక్కింపు నుండి తగ్గించుకోవడానికి అనుమతించబడతాయి. ఈ మినహాయింపు పొందడానికి, ‘జనవరి 1, 2021 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఎటువంటి రుణ సదుపాయాలను పొందని MSME రుణగ్రహీతలు ‘కొత్త MSME రుణగ్రహీతలు’ గా నిర్వచించబడతారు. ఈ మినహాయింపు అక్టోబర్ 01, 2021 తో ముగిసే పక్షం వరకు రుణగ్రహీతకు 25 లక్షల వరకు ఎక్స్‌పోజర్‌లకు రుణం లభిస్తుంది. పథకం యొక్క వివరాలు సర్కులర్ లో ఇవ్వబడతాయి.

మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి) మరియు నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో(ఎన్ఎస్ఎఫ్ఆర్)

22. రిజర్వు బ్యాంకు రెగ్యులేటరీ జోక్యoల ప్రాముఖ్యత రికవరీకి మద్దతు తెలుపుతూ దాన్ని మరింత పెంచడం వైపుకు పయనించుతుంది. మహమ్మారి తరువాత వెంటనే తీసుకున్న కొన్ని నియంత్రణ చర్యలు క్రమంగా దశలవారీగా తొలగించబడుతున్నప్పటికీ, రికవరీ ప్రక్రియకు అవసరమైన సహాయాన్ని అందించడం కొనసాగించడానికి బ్యాంకులను అనుమతించడం అవసరం. అందువల్ల, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ (సిసిబి) యొక్క 0.625 శాతం చివరి విడత అమలును మరియు నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో (ఎన్ఎస్ఎఫ్ఆర్) అమలును కూడా ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 1 వరకు మరో ఆరు నెలల వరకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోబడింది.

మైక్రోఫైనాన్స్ మీద నియంత్రణ చట్రం (రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్) యొక్క సమీక్ష

23. అవసరమైన సెగ్మెంట్ ల ఆఖరి మజిలీ వరకు క్రెడిట్ పంపిణీలో మైక్రోఫైనాన్స్ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి లో ఈ రంగం యొక్క పాత్ర మరియు ఆఖరి మజిలీ వరకు క్రెడిట్ యొక్క మెరుగైన పంపిణీ కోసం బలమైన యంత్రాంగ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇంకా వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి రిజర్వు బ్యాంకు, వివిధ నియంత్రిత రుణదాతలు (ఎన్‌బిఎఫ్‌సి - మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి-ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు) మైక్రో ఫైనాన్స్ తావులకు వర్తించు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లను సమన్వయపరిచేందుకు సంప్రదింపుల పత్రంతో ముందుకు వస్తుంది.

ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకుల మీద నిపుణుల కమిటీ ఏర్పాటు

24. ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు పరపతి నిర్మాణక్రమం లో మహత్వపూర్వమైన పాత్ర పోషిస్తున్నాయి. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక సమీకరణను విస్తృతం చేయడానికి రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో అనేక చర్యలు చేపట్టింది. ఇటీవలికాలంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 కు చేసిన సవరణలు ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య నియంత్రణ మరియు పర్యవేక్షక అధికారాలలో సమానత్వం ను తీసుకువచ్చాయి, వీటిలో పాలన, ఆడిట్ మరియు రిజల్యూషను కు సంబంధించినవి ఉన్నాయి. శాసన సవరణల ఆధారంగా రంగాన్ని బలోపేతం చేయడానికి మీడియం-టర్మ్ రోడ్ మ్యాప్‌ను అందించడానికి నిపుణుల కమిటీ (ఇసి) ఏర్పాటు చేయబడుతుంది. EC నిర్మాణము మరియు దాని పరిశీలన అంశాలు త్వరలో ప్రకటించబడతాయి.

లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఐఎఫ్‌ఎస్‌సి లకు చెల్లింపులు

25. వర్తమానం లో, నివాసిత వ్యక్తులు (రెసిడెంట్ వ్యక్తులు) లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతదేశంలో స్థాపించబడిన ఐఎఫ్‌ఎస్‌సిలకు చెల్లింపులు చేయడానికి అనుమతి లేదు. IFSC లను మరింత అభివృద్ధి చేయడానికి మరియు వాటిని ఇతర అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలతో సమానంగా తీసుకురావడానికి, నివాసిత వ్యక్తులకు IFSC లలో ప్రవాస సంస్థలు జారీ చేసిన సెక్యూరిటీలలో పెట్టుబడి కోసం IFSC లకు చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ప్రతిపాదించబడింది ఈ నిర్దిష్ట ప్రయోజనం కోసం, నివాసిత వ్యక్తులు IFSC లలో వడ్డీ లేని విదేశీ కరెన్సీ ఖాతా (FCA) ను తెరవడానికి అనుమతించబడతారు.

(iii) ఫైనాన్షియల్ మార్కెట్లను విస్తృత పరచడం

26. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు అనేక చర్యలు తీసుకున్నాయి. ప్రాధమిక వేలంలో పోటీయేతర బిడ్డింగ్‌ను ప్రవేశపెట్టడం, స్టాక్ ఎక్స్చేంజిలను ప్రాధమిక కొనుగోళ్లకు అనుమతించడం మరియు ద్వితీయ విఫణిలో నిర్దిష్ట రిటైల్ విభాగాన్ని అనుమతించడం, వీటిలో ఉన్నాయి. ఈ ప్రయత్నాల కొనసాగింపుగా, రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కు –(both primary and secondary) ప్రాధమిక మరియు ద్వితీయ - నేరుగా రిజర్వు బ్యాంకు (‘రిటైల్ డైరెక్ట్’) ద్వారా ఆన్‌లైన్ ప్రాప్యత (యాక్సెస్‌) ను అందించాలని ప్రతిపాదించబడింది. ఇదే విధమైన సదుపాయాలను కలిగి ఉన్న కొన్ని దేశాలలో భారతదేశాన్ని ఉంచే ప్రధాన సంస్కరణ ఇది. ఈ చర్య, HTM సడలింపు కలిసి, 2021-22లో ప్రభుత్వ రుణ స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయడానికి దోహదపడుతుంది.

డిఫాల్టెడ్ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు

27. కార్పొరేట్ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) పెట్టుబడులను మరింత ప్రోత్సహించడానికి, డిఫాల్ట్ చేయబడిన కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ పెట్టుబడి షార్ట్ టర్మ్ లిమిట్ మరియు మీడియం-టర్మ్ ఫ్రేమ్‌వర్క్ క్రింద మినిమమ్ రెసిడ్యుయల్ మెచూరిటి రిక్వైర్మెంట్ నుండి మినహాయించబడుతుంది.

(iv) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు (పేమెంట్ అండ్ సెటిల్మెంట్సిస్టమ్స్)

డిజిటల్ చెల్లింపు సేవల కోసం 24 x 7 సేవా కేంద్రం (హెల్ప్‌లైన్) ఏర్పాటు

28. డిజిటల్ చెల్లింపుల లో ఉన్న సుళువు మరియు సామర్ధ్యం నేపధ్యంలో, ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు వివిధ డిజిటల్ చెల్లింపు ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడానికి మరియు అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలపై సమాచారం ఇవ్వడానికి పరిశ్రమ-వ్యాప్తంగా కేంద్రీకృతమైన 24x7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలి. రాబోయే రోజుల్లో, హెల్ప్‌లైన్ ద్వారానే కస్టమర్ ఇబ్బందులు పరిష్కరింపబడాలి. ఇది డిజిటల్ చెల్లింపుల పరిణామం పై వినియోగదారుల నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుచుంది

అధీకృత చెల్లింపు వ్యవస్థల భాగస్వాములు మరియు ఆపరేటర్లకు పొరుగు సేవలపై (అవుట్‌సోర్సింగ్‌) మార్గదర్శకాలు

29. డిజిటల్ చెల్లింపుల లో ఉన్న ఆపరేషన్ రిస్క్ వ్యవస్థను క్రమానుగతంగా అప్-గ్రేడ్ చేయడం తో తొలగించబడుతుంది. అధీకృత చెల్లింపు వ్యవస్థల భాగస్వాములు మరియు ఆపరేటర్లకు చెప్పుకోదగ్గ నష్టభయం పొరుగు సేవల వల్లనే. పోరుగుసేవల కూడాఉండే రిస్కులను తట్టుకోవడానికి మరియు సెటిల్మెంట్ సంబంధిత సేవలను అవుట్‌సోర్సింగ్ చేసేటప్పుడు ప్రవర్తనా నియమావళి కట్టుబడి ఉందని నిర్ధారించుకోవడానికి, రిజర్వు బ్యాంకు అధీకృత చెల్లింపు వ్యవస్థల్లో భాగస్వాములు మరియు ఆపరేటర్లకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

అన్ని బ్యాంక్ శాఖలకు CTS క్లియరింగ్‌

30. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సిటిఎస్) కవరేజ్ అన్ని లెగసీ క్లియరింగ్ హౌస్‌లకు సెప్టెంబర్ 2020 నాటికి విస్తరింపజేయడం జరిగింది. సుమారు 18,000 బ్యాంక్ శాఖలు ఇప్పటికీ అధికారిక క్లియరింగ్ ఏర్పాట్ల వెలుపల ఉన్నట్లు తెలియవఛ్ఛింది. సెప్టెంబర్ 2021 నాటికి ఈ శాఖలన్నింటినీ సిటిఎస్ క్లియరింగ్ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. ఈ చర్యతో దేశంలోని అన్ని బ్యాంకు శాఖలు సిటిఎస్ పరిధిలోకి వస్తాయి. ఇది కస్టమర్ లకు సౌలభ్యాన్ని పెంచుతుంది, ఇంకా కాగిత ఆధారిత క్లియరింగ్ వ్యవస్థకు కార్యాచరణ లో సామర్ధ్యత ను తెస్తుంది.

V. వినియోగదారుల భద్రత (కన్స్యూమర్ ప్రొటెక్షన్)

3సమీకృత అంబుడ్స్ మన్ పధకం (ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీం)

31. ప్రస్తుతం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార చట్రం పరిధిలో, బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు మరియు నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ చెల్లింపు జారీదారులు (పిపిఐలు) కోసం మూడు వేర్వేరు అంబుడ్స్‌మన్ పథకాలు ఉన్నాయి. ఈ మూడు పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై రెండు అంబుడ్స్‌మన్ కార్యాలయాల నుండి ఆర్‌బిఐ నిర్వహిస్తున్నది. అంబుడ్స్‌మన్ యంత్రాంగాన్ని సులభతరంగాను, సమర్థవంతంగా మరింత ప్రతిస్పందించేలా చేయడానికి, మూడు అంబుడ్స్‌మన్ పథకాలను ఏకీకృతం చేయాలని మరియు ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్’ విధానాన్ని అనుసరించి ఫిర్యాదుల కేంద్రీకృత ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టాలని ఇప్పుడు నిర్ణయం చేయడం జరిగింది. బ్యాంకుల, ఎన్‌బిఎఫ్‌సిల మరియు పిపిఐలను జారీచేసే బ్యాంకేతర సంస్థల కస్టమర్లు తమ ఫిర్యాదుల పరిష్కారానికై ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కింద కేంద్రీకృతమైన ఒకే రిఫరెన్స్ పాయింట్‌వద్ద తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడం ద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ పధకం ఉద్దేశించబడింది. ఈ ఏడాది జూన్ కల్లా (జూన్ 2021) ఈ ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీం’ తీసుకురావాలని లక్ష్యం గా పెట్టబడింది.

ముగింపు

32. ముగింపుగా, నేను చెప్పాలనుకుంటున్నాను, రాబోయే రోజుల్లో, భారత ఆర్ధిక వ్యవస్థ పూనికగా ఒకే దిశలో కదలడానికి సిద్ధంగా ఉంది, అది పైకేగిసే దిశనే. భావిసూచనల దన్నుగా, ఇది మా ధృడమైన నిశ్చయం, 2021-22 సంవత్సరంలో, ఆర్ధిక వ్యవస్థకు కోవిడ్-19 కలిగించిన నష్టాన్ని తప్పకుండా సరిచేస్తాము. గందరగోళం మరియు నిరాశ తో గడచిన గత సంవత్సరoలో మనమందరం కలిసి ప్రయాణించాము, కలిసే ముందుకు ప్రయాణాన్ని కొనసాగించుదాం, మొత్తంగా పరిస్థితిని మహాత్మాగాంధీ గారి మాటల్లో బాగా చెప్పవచ్చు, “ మేం రోజూ చూస్తున్న నిన్నటి అసాధ్యమైన దృగ్విషయo సాధ్యం కాబోతుంది ఈనాడు.....” (“We are daily witnessing the phenomenon of the impossible of yesterday becoming the possible of today …” 2.)

ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/1049


1 Gandhi, M. K. (1936). Harijan, November 19, 1936, pp. 341-2.

2 Mahatma Gandhi; XXVI-68 Epigrams From Gandhiji - Compiled by: S.R. Tikekar First Edition: 1971 Published by: Publications Division Ministry of Information & Broadcasting

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?