RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516321

గవర్నర్ యొక్క ప్రకటన – అక్టోబర్ 9, 2020

అక్టోబర్ 09, 2020

గవర్నర్ యొక్క ప్రకటన – అక్టోబర్ 9, 2020

జూన్ 2016 లో స్థాపించబడిన ద్రవ్య విధాన చట్రం పరిధి క్రింద ఇరవయ్యైదవ సందర్భంలో (25th); డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ మరియు డాక్టర్ శశాంక భిడేలతో (ఎక్స్టర్నల్ మెంబర్లు) కొత్తగా నియమించబడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి-MPC) తన తొలిసమావేశం అక్టోబర్ 7, 8 మరియు 9, 2020 తేదీలల్లో కలిసింది. ముందుగా నూతన సభ్యులకు స్వాగతం పలుకుతున్నాను మరియు భారత పరపతి విధానం వ్యవస్థీకృతంచేయడంలోను ఇంకా దాని నిర్వహణకు వారు అందిస్తున్న అమూల్య సేవలకు, వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా, భారతీయ రిజర్వు బ్యాంకు లోని మా టీం లకు వారి విశ్లేషణాత్మక మద్దతు ఇంకా లాజిస్టిక్ సహాయసహకారానికి ధన్యవాదాలు తెలుపడానికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను.

2. దేశీయ మరియు అంతర్జాతీయ స్థూలఆర్థిక మరియు ఆర్థిక స్థితిగతులను ఎంపిసి విశ్లేషించింది మరియు పాలసీ రెపో రేటును 4.00 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచేందుకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న టార్గెట్ లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo నుండి ఉపశమనం తో పాటు, నిలకడతో వృద్ధి ని పునరుద్ధరించడం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంతమేరకు సర్దుబాటు ధోరణి నే కొనసాగించాలని MPC నిర్ణయించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు ఎటువంటి మార్పు లేకుండా 4.25 శాతం వద్ద ఉన్నాయి. రివెర్స్ రెపో రేట్ మార్పేమీ లేకుండా 3.35 శాతంగా ఉన్నది.

3. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను క్లుప్తంగా సమీక్షిస్తాను. ఈ మహమ్మారిని అధిగమించడంలో మానవజాతి సామర్ధాన్ని ధృడంగా నమ్ముతూ ఎల్లప్పుడూ ఆశావాదిగా ధైర్యంతో ఉంటాను. గత కొద్ది నెలలుగా COVID-19 ప్రపంచవ్యాప్తంగా తన ఉగ్ర ప్రతాపాన్ని చూపెడుతున్నప్పుడు, తేరుకుంటామని మనం ఆశపడడం ఒక పెనుతుఫాను మధ్యలో మిణుకుచున్న దీపం పరిస్తితిలా గోచరించవచ్చు. కడు దుర్భరస్థితి లో కూడా రాబోయే రోజులు బాగుంటాయని ఆశించడం సహేతుకమే నని వీస్తున్న ప్రస్తుతగాలి సూచిస్తున్నది. అత్యంత దూరదృష్టి గల మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ A.P.J అబ్దుల్ కలాం ఇలా ఉద్ఘాటించారు: “ మీ కలలు నిజమవ్వాలంటే, ముందు మీరు కలలు కనాలి.... “మీ కల అనేది నిద్రలో చూసేది కాకూడదు, ఎలాగుండాలంటే అది మీకు నిద్ర పట్టనివ్వకూడదు”.

రికవరీ దిశగా ముందడుగులు

4. 2020 సంవత్సరo ద్వితీయ త్రైమాసికం లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిన తరువాత, అంతర్జాతీయ ఆర్ధిక కార్యకాలాపాలు తృతీయ త్రైమాసికం నుంచి క్రమానుగతంగా తేరుకుంటున్నట్లుగా తెలుస్తున్నది; అయితే దేశాల మధ్య వీటిల్లో అసమానత కొనసాగుతున్నది. తయారీ రంగం, కార్మిక మార్కెట్లు మరియు రిటైల్ అమ్మకాల్లో పెరుగుదల వల్ల కొన్ని దేశాల్లో రికవరీ మెరుగ్గాను, మిగతా కొన్ని దేశాలలో పైకెగుస్తున్నకొత్త ఇన్ఫెక్షన్లు అన్-లాకింగ్ పురోగతిని నిరోధించడo లేదా ఆంక్షలు తిరిగి ప్రవేశపెట్టడానికి దారితీసి, రికవరీ ఎదుగుదలకు నిరోధకం అయ్యాయి. పెట్టుబడులు తిరోగమనంలో ఉన్నాయి, మరోపక్క వినియోగం మరియు ఎగుమతుల్లో ఎదుగుదల మొదలయ్యింది. అనేక దేశాల్లో భారి పాలసీ మద్దతు వల్ల క్షీణత వేగo నిరోధించబడి; ఉపాధి, కుటుంబ ఆదాయం మరియు వ్యాపారాలకు కొంత ఊతం లభించింది. ఆర్ధిక పరిస్థితులు సౌమ్యంగా కొనసాగుతున్నాయి.

5. మహమ్మారిని ఎదుర్కొనే పోరులో భారత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తోంది. COVID పూర్వ స్థాయిలకు సంబంధించి, అనేక హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు ఆర్ధిక వ్యవస్థలో పెక్కు రంగాలలో సంకుచిత్వం సడలిందని మరియు వృద్ధి సంకేతాలు పొటమమరిస్తున్నాయని సూచించుతున్నాయి. వివరాలజోలికి వెళ్ళకుండా ఉన్న సమయాన్ని దృస్టిలో యుంచుకొని నేను వాటిని ఈ ప్రకటనకు అనుబంధం లో పొందుపరుస్తున్నాను. అందుతున్న సూచనలన్నింటి ప్రకారం, 2020-21 ప్రధమ త్రైమాసికం లో సంకుచిత్వం పట్టు బాగా సడలుతున్నది. దేశవ్యాప్తంగా అచలనంగా యున్న క్రియాశీల కేస్-లోడ్ వంపులందు వెండి జిలుగులు గోచరించుతున్నాయి. ప్రాణాంతక వైరస్ బిగిసిలి నుండి విడివడేదిశలో రెండవ దశ సంభవాన్ని నిరోధిస్తూ, COVID పూర్వ స్థితి వృద్ధి పధాన్ని పునరుద్ధరించడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉంది.

6. ఇంటువంటి వాతావరణం లో, దృష్టిని ఇపుడు కట్టడి మార్గం నుండి పునరుద్ధరణ వైపు మళ్ళించాలి. మహమ్మారిబారికి చెదరకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిస్తాపకంగా కనిపిస్తున్నది. ఖరీఫ్ లో నాట్లు క్రితం ఏడాది (ఎకరాల్లో) విస్తీర్ణాన్ని దాటాయి. అలాగే రిజర్వాయర్ లెవెల్స్ సౌఖ్యవంతంగా ఉండడంతో పాటు నేల తడి తగినంతగా పెరగడం రబీ సీజన్ దృక్పథంను ఆశావంతం చేశాయి. 2020-21 లో ఆహార ధాన్యాల ఉత్పత్తి మరో రికార్డును అధిగమించనున్నట్లు ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) కింద ఉద్యోగాల కల్పన గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలను, ఉపాధులను పెంపొందించింది. ఈలోగా, వలస కార్మికులు పట్టణ ప్రాంతాల్లో పనికి తిరిగి వస్తున్నారు, ఇంకా ఫ్యాక్టరీలు మరియు నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ఊపిరి పొసుకుంటున్నాయి. పెరుగుతున్న విద్యుత్ వినియోగం మరియు జనాభా రాకపోకల మూలంగా ఇది ప్రస్ఫుటమౌతున్నది. ఇక నగరాల్లో, ట్రాఫిక్ రద్దీ శరవేగంతో పెరుగుతోంది; ఆన్‌లైన్ వాణిజ్యం పురోగతిలో ఉంది; ఇంకా ప్రజానీకం కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. జాతి చిత్తవృత్తి అధైర్యం మరియు నిరాశల నుండి ఆత్మవిశ్వాసం మరి ఆశల పైపు మళ్ళుతోంది.

7 ఈ ఆశావాదం కొంత, ప్రజానీకం అంచనాలవల్ల వెలుగులోకి వస్తుంది. ఆర్బిఐ సర్వే యొక్క సెప్టెంబర్ 2020 రౌండ్ లో, కుటుంబ ద్రవ్యోల్బణం అంచనాలు, రాబోయే మూడు నెలల్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుతుందని సూచిస్తున్నాయి, సరఫరా సంకెళ్ళు సడలు తున్నాయనేదానికి ఇది సంకేతం. 2020-21 నాల్గవ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటుందని మా అంచనాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్లో నే నిర్వహించబడిన మా ఇతర సర్వేల వల్ల కూడా ఏడాది ముందస్తులో సాధారణ ఆర్ధిక పరిస్థితులు, ఉపాధి మరియు ఆదాయాల పై వినియోగదార్ల విశ్వాసం బాగా దృడంగా ఉన్నట్లు తేలింది. వ్యాపార పరిస్థితి ద్వితీయ త్రైమాసికం లో మొత్తంమీద కుదేలయినా, ఇది ప్రధమ త్రైమాసికం కనిష్ట స్థాయి కంటే పైకే ఉన్నది. వ్యాపార పరిస్థితులు, ఉత్పాదకత, ఆర్డర్ల సరళి, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు ఇంకా సామర్ధ్య వినియోగత వీటన్నిoటి భావికాలపు అంచనాలు మొత్తంగా ఆశావంతంగా ఉన్నాయి.

8. కొత్తగా ఆర్డర్లు మరియు ఉత్పాదకత లో ఎదుగుదల వీటి ప్రేరణ మద్దతుతో తయారీరంగoలో ధరల నిర్ధాయక సూచీ (పియంఐ-PMI) జనవరి 2012 నుండి అత్యధికంగా 56.8 కు పెరిగింది. సేవలరంగం లో పియంఐ-PMI సెప్టెంబర్ లో 49.8 వద్ద సంకోచంగానే ఉంది, అయితే ఈ సూచీ ఆగస్ట్ లో 41.8 నుండి పెరిగింది. మనయొక్క వృద్ధి ప్రొజెక్షన్లలో ఈ అంచనాలు ఇమిడున్నాయి ఇవి, GDP లో వృద్ధి తన సంకోచం స్థితి నుండి బయటపడి నాల్గవ త్రైమాసికానికల్లా సానుకూలంగా మారవచ్చని సూచిస్తున్నాయి.

9. చైతన్యం (రికవరీ) స్వరూపం మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది V, U, L, లేదా W లా ఉంటుందా? ఇటీవల, రికవరీ K- రూపంలో ఉంటుందని కూడా ప్రస్తావించడం జరిగింది. నా దృష్టిలో, ఇది త్రీ-స్పీడ్ రికవరీ ముఖ్యంగా, ప్రతి రంగంలోను ఉన్న వాస్తవికతల ఆధారంగా వివిధ రంగాల పురోగతులలో తేడాలు ఉండవచ్చు. మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడు స్థితిస్తాపకంగా ఏ రంగాలున్నాయో, అవి త్వరితంగా కోలుకోవడంలో తమ ఖాతాను మునుముందుగా (ఓపెనింగ్ ది అకౌంట్) తెరుస్తాయి. వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు; వాడుక బాగున్న కన్స్యూమర్ గూడ్స్, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాలు మరియు ట్రాక్టర్లు; మందులు మరియు ఔషధీయ సంస్థలు, మరియు విద్యుదుత్పత్తి, ముఖ్యంగా పునరుద్ధరణీయ ఇంధన శక్తి లాంటివి ఈ మొదటి రకం లోకి వస్తాయి. ఇటువంటి పెక్కు ఏరియాలలో కొత్తగా పెట్టుబడుల ప్రవేశం కోసం సంస్కరణల వల్ల కొత్త కొత్త మార్గాలు తెరవబడ్డాయి, ఇవి వ్యవసాయమార్కెటింగ్, దాని అనుబంధంగా శీతల గిడ్డంగీకరణ; రవాణా మరియు ప్రాసెసింగ్‌; కార్మిక చట్టాలలో మార్పులు ఇంకా టీకాల ఉత్పత్తి మరియు పంపిణీ కెపాసిటీ ని సృష్టించడం లాంటివి.

10. నెమ్మది నెమ్మది గా తమ కార్యకలాపాల ఉచ్చస్థితికి చేరేవి, త్వరితంగా కోలుకొనే రంగంలోని రెండవ రకం (స్ట్రైక్ ఫామ్). ఇక మూడవ రకం లో చేరేవి అంకం చివరలో తేరుకుని (స్లాగ్ ఓవర్లలో) ఆర్ధిక పరిస్థితిని చివరకు ఒడ్డున చేర్చేవి. సామాజిక దూరం పాటింపు మరియు స్పర్శ తప్పనిసరి (కాంటాక్ట్ ఇంటెన్సివ్) వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాలు ఈ కోవలోకి వస్తాయి.

11. సెప్టెంబర్ 2020 లో వివిధ హై-ఫ్రీక్వెన్సీ సూచికలలో మొదలైన కొద్ది-రికవరీ 2020-21 ద్వితీయార్ధానికల్లా, ఆర్ధిక కార్యక్రమాలలో అన్-లాకింగ్ పురోగతి తో మరింత పుంజుకుంటుంది. వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు గ్రామీణగిరాకీ ని ధృడంగా చేయడం ద్వారా పునరుజ్జీవనానికి దారితీస్తాయి. 2020-21 తృతీయ త్రైమాసికంకల్లా తమ సామర్ధ్య వినియోగం తెప్పరిల్లుతుందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి, అలాగే తృతీయ త్రైమాసికం మొదలుకొని, కార్యకాలాపాలు కొంతవరకు గాడిన పడతాయని ఆశిస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబళ్ళు మరియు ఎగుమతులు రెండూ స్తబ్దుగా ఉంటాయి ఎందువల్లనంటే అంతర్జాతీయంగా గిరాకి ఇంకా బలహీనంగానే ఉంది. 2020-21 సంవత్సరం మొత్తానికి తీసుకుంటే రియల్ జిడిపి లో వృద్ధి, నష్టభయం తరిగే దిశ వైపుగా, (-) 9.5 శాతం వద్ద ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. ఒకవేళ వృద్ధి గనుక ఇపుడున్నట్లు స్థిరంగా నిలిస్తే, మరింత వేగంతో బలం పుంజుకోవడం సాధ్యపడొచ్చు.

ఫైనాన్షియల్ మార్కెట్ మార్గదర్శనం

12. గత కొద్ది వారాలుగా ఒకప్రక్క ఆర్‌బిఐ యొక్క రుణ నిర్వహణ (డెట్ మేనేజ్మెంట్) మరియు ద్రవ్య సంబంధిత కార్యకలాపాల పూర్వోద్దేశ్యo, వీటికి సంబంధించి మార్కెట్ అంచనాల రూపు కొద్దిగా విడిగా ఉంది. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిష్కరించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాను, తద్వారా మార్కెట్ భాగస్వాములు మరియు ఆర్బిఐ ఉమ్మడిగా అంచనాలను బేరీజు వేసుకుంటారు, తద్వారా మార్కెట్లో స్థితిగతులు క్రమబద్ధీకరించబడతాయి.

13. ఫైనాన్షియల్ మార్కెట్ల అభివృద్ధి మరియు నిర్వహణ ఇంకా పబ్లిక్ డెట్ నిర్వహణ విధులు నిర్వహించడంతోపాటు మానిటరీ పాలసీ అథారిటీగా రిజర్వు బ్యాంకు, మార్కెట్లు మరియు ఆర్ధిక సంస్థలు సజావుగా నడవడం, ఫైనాన్సింగ్ క్షితిగతులను సడలించడం మరియు వ్యవస్థపరంగాను లక్ష్యపరంగాను ద్రవ్యలభ్యత ఉండేట్లు చూడడంపై తన దృష్టిని ప్రధానంగా కేంద్రీకరించింది. ద్రవ్య విధానo వల్ల కల్గిన ప్రేరణలు సున్నితంగాను, నిరంతరాయంగా ప్రసరణ చేయడంలోను ఇంకా కేంద్రం మరియు రాష్ట్రాల మార్కెట్ రుణాలు సేకరింపు కార్యక్రమాలను అంతరాయం కలిగించని రీతిలో భారంగా కాకుండా పూర్తి చేయడానికి ఈ దృష్టి ముఖ్యం. ఫిబ్రవరి 2020 నుండి, ఆర్బిఐ ఈ దిశలో పలు చర్యలు తీసుకుంది. మార్కెట్ భాగస్వాములకు ద్రవ్య లభ్యతను మరియు సులభతర ఫైనాన్సింగ్ పరిస్థితుల పరంగా భరోసా ఇవ్వడానికి అవసరమైన తదుపరి చర్యలను చేపట్టడానికి ఆర్బిఐ సిద్ధంగా ఉంది

14. 2020-21 సంవత్సరానికి మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రాం హెచ్చుగాఉన్నప్పటికీ, ఆర్బిఐ ఈ సంవత్సరం ప్రదమార్ధం వరకు కేంద్రం మరియు రాష్ట్రాల మార్కెట్ ఋణాల జారీలను సజావుగా నిర్వహించింది. 2020-21 ప్రధమ అర్ధభాగంలో, 5.82 శాతంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల సగటు వ్యయం, గత 16 ఏళ్లలో అతి తక్కువ. అలాగే కేంద్రం యొక్క స్టాక్ బకాయిల యొక్క సగటు పరిపక్వత (మెచూరిటి) కూడా చాలా ఎక్కువే ఉన్నది. 2020-21 సంవత్సరoలో ఇంకా మిగిలియున్న, కేంద్రo మరియు రాష్ట్రాల ఋణ జారీ కార్యక్రమం ధర మరియు ఆర్థిక స్థిరత్వం విషయంలో రాజీ పడకుండా అంతరాయం కలిగించని రీతిలో పూర్తవుతుందని ఆర్బిఐ హామీ ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కేంద్రo యొక్క చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు - డబ్ల్యూఎంఏ) పరిమితి గతం ఏడాది ద్వితీయార్ధంలో 35,000 కోట్లతో పోలిస్తే, 1.25 లక్షల కోట్లుగా ఎక్కువగానే ఉంచబడింది. అదేవిధంగా, 2020-21 ప్రధమార్ధంలో 60 శాతం వరకూ పెరిగిన రాష్ట్రాల చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు - డబ్ల్యూఎంఏ) పరిమితి మరో 6 నెలల కాలానికి మార్చి 31, 2021 వరకు పొడిగించబడింది.

15. ఈ రోజు ప్రకటించిన ద్రవ్య విధాన వైఖరికి అనుగుణంగా, ఆర్‌బిఐ సానుకూల ద్రవ్య లభ్యతను కొనసాగిస్తుందని మరియు మార్కెట్ కార్యకలాపాలను ఔట్-రైట్ మరియు ప్రత్యేక బహిరంగ మార్కెట్ కార్యకలాపాల రూపంలో నిర్వహిస్తుందని మార్కెట్ భాగస్వాములకు భరోసా ఇస్తున్నది..మార్కెట్ భాగస్వాముల ప్రతిస్పందన ఆధారంతో, ఈ ఆక్షన్ల సైజు 20,000 కోట్లకు పెంచబడుతుంది. ఈ చొరవకు మార్కెట్ భాగస్వాములు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నారు.

16. ప్రభుత్వ సెక్యూరిటీల (జి-సెక్) మార్కెట్లో, అంటే ప్రైమరీ మరియు సెకండరీ మార్కెట్ విభాగాల రెండింటిలోను, రాబళ్ళు సానుకూలద్రవ్యలభ్యత పరిస్థితుల అమరిక దిశకు అనుగుణంగా పెంపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్బిఐ యొక్క విధాన పరమైన చర్యలు మరియు కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల ఫైనాన్సింగ్ పరిస్థితుల నుండి లబ్ది పొందటానికి, జి-సెక్ రాబడి రేఖను ప్రమాణంగా (బెంచ్మార్క్ గా) ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లకు వెలగట్టే ఆర్థికమార్కెట్లవిభాగాలకు, ఇది చాలా ముఖ్యమైనది.

17. ఫైనాన్షియల్ మార్కెట్ స్థిరత్వం మరియు క్రమబద్ధ పరిణామ రాబడి రేఖ ఈ రెండూ ప్రజల సొత్తు; మార్కెట్ భాగస్వాములు మరియు ఆర్బీఐ ఉభయులూ వీటి భాద్యత ను పంచుకోవాలి. మహమ్మారి నుండి ఉపశమనం పొందుటకై ఆర్థిక ఉద్దీపన అగత్యాల వల్ల మరియు పన్ను ఆదాయాన్ని కోల్పోవడం వల్ల, 2020-21 సంవత్సరానికి హెచ్చింపు ఋణాలు సేకరించడం ఎంతైనా అవసరం. ఇది సెక్యూరిటీలు మెండుగాఉండడంతో మార్కెట్‌పై ఒత్తిడినివిధించినప్పటికీ, ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ద్రవ్యతలేమిని పారదోలేందుకు మరియు మార్కెట్ కండీషన్ ను క్రమబద్ధీకరించేందుకు వివిధసాధనాలద్వారా అవసరమైనవిధంగా మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్బిఐ సిద్ధంగా ఉంది. మార్కెట్ భాగస్వాములు విశాల సమయస్ఫూర్తిని కలిగియుండి, ద్రవ్య విధానం మరియు పబ్లిక్ డెట్ నిర్వహణలో ఆర్బిఐ నుండి వచ్చే సంకేతాలకు అనుగుణంగా ప్రతిబింబించే బిడ్డింగ్ ప్రవర్తనను ప్రదర్శించాలి. మేము ఈ సంవత్సరo రెండో అర్ధభాగo నకు సంబంధించిన మిగిలిన ఋణ సేకరణ కార్యక్రమానికి సానుకూల పరిష్కారాలతో ఎదురుచూస్తున్నాము; మార్కెట్ లో పోటీని అధిగమించే విషయoలో రెండో అభిప్రాయం లేదని గట్టిగా చెప్పవచ్చు.

18. ఈ సందర్భంలో, ద్రవ్యోల్బణ డైనమిక్స్ అంతర్లీనతగురించి ఇంకా దృక్పథంగురించి మా అంచనాను నిర్దేశించడం సముచితంగా ఉంటుంది. 2020 సంవత్సారానికి ఏప్రిల్ మరియు మే మాసాలను మినహాయిస్తే, హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం మార్చి 2020 స్థాయిల నుండి పెరిగింది మరియు లక్ష్యం యొక్క టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంది. మా అంచనా ఏమిటంటే ఇది సెప్టెంబర్-గుర్తుగా ఉద్ధృతంగానే ఉంటుంది, కాని Q3 మరియు Q4 అంతానికల్లా, క్రమంగా లక్ష్యo దరి చేరడoలో సుళువవుతుంది. ప్రధాన రంగాల సరఫరాల్లో అంతరాయం మరియు మార్జిన్లు పెరగడం ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని మా విశ్లేషకుల అభిప్రాయం. సరఫరా సంకెళ్ళు చేధించబడితే, ఈ బిగింపులు సడలిపోతాయి. గిరాకీ మొత్తంగా స్తబ్దుగా ఉంది, దీనికి ప్రధాన కారణం నిధుల అలభ్యత.

ఆహార ధాన్యాలు మరియు ఉద్యాన ఉత్పత్తుల సరఫరా బాగా పుష్కలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు వ్యవసాయానికి సంబంధించి దృక్పథం ఉజ్వ్జలంగా ఉంది. ముడిఆయిల్ ధరలు దరిదాపు-రేంజి లోనే వున్నాయి. ఇందువల్ల, MPC వర్తమాన ద్రవ్యోల్బణం మూపుర స్థితి బహుకొద్దికాలమనితలoచి, వృద్ధిని ప్రోధి చేయడం మరియు COVID-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడoలో ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించింది. MPC యొక్క తీర్మానంలో పేర్కొన్నవిధంగా సర్దుబాటు ధోరణి కొనసాగింపును ముందుకు నడపడoలో తగు సమయాన్ని అందించింది.

అదనపు చర్యలు

19. ఈ నేపథ్యంలో, మరియు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రేరణనివ్వడానికి, ఈ రోజు కొన్ని అదనపు చర్యలు ప్రకటించబడుతున్నాయి. ఈ చర్యల ఉద్దేశ్యం (i) ఆర్థిక మార్కెట్లకు ద్రవ్య లభ్యతను పెంచడo; (ii) క్రెడిట్ డిసిప్లిన్ నిబంధనల పరిధిలోనే నిర్దిష్ట రంగాలకు పరపతిసదుపాయం మెరుగుపరచడానికి నియంత్రణ మద్దతు (iii) ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందించడం; మరియు (iv) ఆర్థిక సమీకరణకు బాగాఊతమివ్వడం మరియు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి చెల్లింపు వ్యవస్థ సేవలను ఆధునీకరించడం మొదలగునవి చేయడం.

(i) ద్రవ్యలభ్యత కోసం చర్యలు

(a) ఆన్-ట్యాప్ టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్ (టిఎల్‌టిఆర్‌ఓ- (TLTRO)

20. ఆర్బిఐ యొక్క ద్రవ్య సంబంధిత చర్యల దృష్టి ఇపుడు నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించి వృద్ధిని ప్రేరేపించడం మీద ఉంది. దీని ప్రకారం, పాలసీ రెపో రేటుతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ రేటు వద్ద మొత్తం 1,00,000 కోట్ల వరకు మూడు సంవత్సరాల కాలపరిమితి వరకు టిఎల్‌టిఆర్‌ఓ లు నిర్వహించబడతాయి. ఈ పథకం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది మరియు ఈ పథకం ప్రతిస్పందనను సమీక్షించిన అనంతరం ఈ మొత్తాన్ని దానితోపాటు కాలవ్యవధిని పెంచడానికి సులభంగా మార్పులు చేసే వీలుగా ఉంటుంది. ఈ పథకం క్రింద లభ్యమైన ద్రవ్యాన్ని బ్యాంకులు కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు మరియు ప్రత్యెక రంగాల సంబంధిత సంస్థలు జారీ చేసిన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో ఉంచాలి, వాటిల్లో పెట్టుబడి సెప్టెంబర్ 30, 2020 నాటి బ్యాంకులపరిమితి స్థాయికి పైబడియున్నా. ఈ రంగాలకు బ్యాంకు రుణాలు మరియు అడ్వాన్సులను విస్తరించడానికి కూడా ఈ పథకం క్రింద లభించే లిక్విడిటీని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్ (టిఎల్‌టిఆర్‌ఓ మరియు టిఎల్‌టిఆర్‌ఓ-2.0 - TLTRO & TLTRO 2.0) క్రింద ఇంతకుముందు నిధులను పొందిన బ్యాంకులు ఈ లావాదేవీలను మెచ్యూరిటీకి ముందు రివెర్స్ చేసే అవకాశం ఉంది. 2020-21 ద్వితీయార్ధంలో కేంద్రం మరియు రాష్ట్రాల రుణాల అవసరాలు మరియు రికవరీ బలోపేతం అయినప్పుడు, ఋణం కోసం డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున అట్టి టిఎల్‌టిఆర్‌ఓలు ద్రవ్యతలేమి ఆటంకం ఒత్తిడికి తట్టుకుంటూ బ్యాంకులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి వీలుగా ఉద్దేశించబడ్డాయి. వ్యవస్థలో ద్రవ్యత కావలసినంత ఉండేలా చూడటం దీని లక్ష్యం.

(b) హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎం-HTM) విభాగంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్-SLR) హోల్డింగ్స్

21. క్రమబద్ధమైన మార్కెట్ పరిస్థితులను పెంపొందించడానికి మరియు సానుకూల్యమైన ఫైనాన్సింగ్ ఖర్చులను నిర్ధారించడానికి, సెప్టెంబర్ 1, 2020 వరకు లేదా ఆ తర్వాత మార్చి 31, 2021 వరకు సమకూర్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలకు సంబంధించి రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 1, 2020 న హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్) వర్గం క్రింద పరిమితిని ఎన్‌డిటిఎల్‌లో 19.5 శాతం నుండి 22 శాతానికి పెంచింది. మార్చి 31, 2021 తరువాత ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలలో ఈ పెట్టుబడుల స్థితిగతుల గురించి మార్కెట్లకు మరింత ఖచ్చితత్వం ఇవ్వడానికి; సెప్టెంబర్ 1, 2020 మరియు మార్చి 31, 2021 మధ్య సమకూర్చుకున్న సెక్యూరిటీల కోసం 22 శాతంగా పెంచిన హెచ్‌టిఎమ్ లిమిట్ సదుపాయాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించాలని నిర్ణయం చేయబడింది. HTM లిమిట్ ని నిమ్మళింపు పధంలో పూర్వపు స్థాయి కి చేరడం కోసం, బ్యాంకులు SLR సెక్యూరిటీలో పెట్టుబడి కి ప్లాన్ చేస్తాయని భావిస్తున్నారు.

(c) ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంఓ-OMO) నిర్వహణ - రాష్ట్ర అభివృద్ధి రుణాలు (ఎస్‌డిఎల్-SDL) లలో.

22. మన్నిక ధర సాకారం చేసి ద్రవ్య లభ్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌డిఎల్‌లలో ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను (ఓఎంఓలు) ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. సెకండరీ మార్కెట్ లో కార్యక్రమాలు దీంతో పెరుగుతాయి, అంతే గాకుండా ఎస్‌డిఎల్-SDL కు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల కు మధ్య రాబడి తేడాలు తగ్గిపోతాయి. ఈ చర్య, దీంతోపాటు మార్చి 2022 వరకు HTM పొడిగింపు, వల్ల మార్కెట్లో ద్రవ్య అలభ్యత సడలుతుంది. మొత్తంగా వ్యవస్థ నుండి ఈ యేడాది ప్రభుత్వ ఋణ సేకరణలు సజావుగా జరుగుతాయి.

(ii) ఎగుమతులకు మద్దతు - ఎగుమతిదారుల ఆటోమేటిక్ కాషన్-లిస్టింగ్ - సమీక్ష

23. మహమ్మారి మూలంగా కుదేలయిన విదేశీగిరాకీవల్ల మన ఎగుమతులు బాగా ప్రభావితమయ్యాయి. ఇటువంటి తరుణంలో, ఎగుమతిదారులకు ఎక్స్పోర్ట్స్ ప్రొసీడ్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలి, దీనివల్ల ఓవర్సీస్ కొనుగోలుదారు తో బేరాలు సులువవుతాయి. వ్యవస్థను మరింత ఎగుమతులకు సులభతరం చేయడానికి, ఆటోమేటిక్ కాషన్-లిస్టింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించడమైనది. అధీకృత డీలర్ బ్యాంక్ యొక్క నిర్దిష్ట కేసు సిఫారసుల ఆధారంగా భారతీయ రిజర్వు బ్యాంకు కాషన్-లిస్టింగ్ చేయడం ను మాత్రం యదావిధిగా కొనసాగిస్తుంది.

(iii) నియంత్రణ చర్యలు

24. ప్రస్తుత తరుణంలో, ఆర్ధిక పునరుద్ధరణ మొగ్గ దశ నుండి ముందుకుపోవడానికి ఫైనాన్షియల్ సెక్టారు ముఖ్య భూమిక వహిస్తుంది. ఈ సందర్భంను దృష్టిలో వుంచుకొని ఆర్బీఐ కొన్ని ప్రత్యెక చర్యలను ప్రకటిస్తున్నది, వీటి మూలంగా కుంటుపడిన ఉత్పత్తి రంగాలు తగు పరపతి సౌలభ్యంతో ఆర్థికవ్యవస్థ వొక గాటన పడుతుంది.

(a) నియంత్రిత రిటైల్ పోర్ట్ ఫోలియో - రిస్క్ వెయిట్ లిమిట్ రివిజన్

25. ప్రస్తుత ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, ఎక్స్పోజర్లు విలువ పరంగా, గరిష్ట యాగ్రగేటేడ్ రిటైల్ ఎక్స్పోజర్ ఒక్కో కౌంటర్పార్టీకి యాబ్సల్యూట్ త్రెషోల్డ్ లిమిట్ 5 కోట్లకు మించరాదని సూచించబడింది. వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలు (అంటే 50 కోట్ల వరకు టర్నోవర్‌తో), మరియు బాసెల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగానికి ఋణ వ్యయాన్ని తగ్గించడానికి, ఈ పరిమితిని అన్ని తాజా మరియు ఇంక్రిమెంటల్ క్వాలిఫైయింగ్ ఎక్స్పోజర్లకు సంబంధించి 7.5 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ చర్య చిన్న వ్యాపార విభాగానికి అవసరమైన రుణ సౌలభ్యం ను పెంచుతుందని ఆశిస్తున్నారు.

(b) వ్యక్తిగత గృహ రుణాలు - రిస్క్ వెయిట్ ల హేతుబద్ధీకరణ

26. బ్యాంకుల వ్యక్తిగత గృహ రుణాల పై నిబంధనల ప్రకారం లోన్ సైజును బట్టి మరియు లోన్ టు వాల్యూ రేషియో (ఎల్టివి) ఆధారంగా వివిధరీతుల రిస్క్ వెయిట్స్ వర్తిస్తాయి. ఉపాధి కల్పనలోను మరియు ఇతర పరిశ్రమలతో ఉన్న పరస్పర లింకులను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక రికవరీలో రియల్ ఎస్టేట్ రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరియు దాని సజావు కోసం, మార్చి 31, 2022 వరకు మంజూరు చేయబడ్డ గృహ రుణాల రిస్క్ వెయిట్స్ అన్నింటినీ ఎల్‌టివి నిష్పత్తులతో మాత్రమే అనుసంధానించడం ద్వారా హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఈ చర్య వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి మరిన్ని బ్యాంకు రుణాలు ఇవ్వడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

(iv) ఆర్థిక సంఘటితం

కో-ఒరిజినేషన్ మోడల్ - సమీక్ష

27. కొన్ని షరతులకు లోబడి ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ద్వారా కో-ఒరిజినేషన్ రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు 2018 లో ఒక చట్రాన్ని ఏర్పాటు చేసింది. స్టేక్-హోల్డర్స్ నుండి వచ్చిన ఫీడ్-బ్యాక్ ఆధారంగా, బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) మధ్య సానుకూల తారతమ్యాలను దృష్టిలో యుంచుకొని ఆర్థిక వ్యవస్థ లో అస్సలు సేవ పొందని మరియు సేవసరిపోని రంగాలకు రుణ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం, అన్ని ఎన్‌బిఎఫ్‌సిలకు (హెచ్‌ఎఫ్‌సిలతో సహా), అన్ని ప్రాధాన్యత రంగ రుణాలను ఈ "కో-లెండింగ్ మోడల్" పథకానికి అర్హులుగా చేసి పధకాన్ని విస్తారించాలని నిర్ణయించబడింది.

(v) చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థలు

(a) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (RTGS) యొక్క నిరంతర లభ్యత

28. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ్యవస్థను, 24x7x365 ప్రాతిపదికన డిసెంబర్ 2019 లో అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది మరియు అప్పటి నుండి ఈ వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. భారతీయ ఆర్థిక మార్కెట్ల అంతర్జాతీయకరణ లక్ష్యంగా కొనసాగుతున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలను అభివృద్ధి చేయడంలో దేశ ప్రయత్నాలను సులభతరం చేయడానికి మరియు దేశీయ కార్పొరేట్‌లకు మరియు సంస్థలకు విస్తృత చెల్లింపు సౌలభ్యాన్ని అందించడానికి, డిసెంబర్ 2020 నుండి అన్నిదినాలలోను నిరంతరం RTGS వ్యవస్థను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనితో, 24x7x365 పెద్ద వేల్యూ RTGS వ్యవస్థతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటవుతుంది. దీనివల్ల సులభతర వాణిజ్యం సులువవుతుంది.

(b) చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లకు (PSOs) జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) కు శాశ్వత చెల్లుబాటు సౌకర్యం

29. ప్రస్తుతం “చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థ చట్టం, 2007” క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు ఆన్-ట్యాప్ ఆథరైజేషన్ సౌకర్యాన్ని కొద్ది కాలం అంటే ఐదేళ్ల వరకు కల్పిస్తున్నది. లైసెన్సింగ్ మరియు వ్యాపార అనిశ్చితి ని తొలగించే ఉద్దేశ్యం తో అన్ని పిఎస్‌ఓలకు (కొత్త దరఖాస్తుదారులు మరియు ప్రస్తుత పిఎస్‌ఓలు) కొన్ని షరతులతో శాశ్వత ప్రాతిపదికన ఆథరైజేషన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల కంప్లయన్స్ ఖర్చులు కొంత తగ్గుతాయి; సులభతర పెట్టుబడులు, ఎక్కువగా ఉపాధి, కొత్త ట్యాలెంట్ మరియు కొత్త టెక్నాలజీ సుగమo అవుతుంది.

ముగింపు

30. COVID-19 మా ఓర్పును పరీక్షించింది మరియు మా వనరులను హరించి, తీవ్రంగా విస్తరించింది. మా కష్టాలు ఇంకా ముగియలేదు మరియు అంటువ్యాధుల పునరుద్ధరణ ప్రమాదకరంగానే ఉంది. అయినప్పటికీ, మనం ఆత్మవిశ్వాసం మరియు సడలని ధైర్యంతో ప్రయాణం చేయకుండానే రోడ్డుపై, చాలా దూరం వచ్చాము. రాబోయే రోజుల్లో COVID-19 విసిరే బలీయమైన సవాళ్ళు ఏవైనాసరే మనం మరింత సహనం మరియు లోతైన మనో నిగ్రహం తో వాటిని అధిగమించాలి. విజయం సాధించే వరకు మనం స్థైర్యంతో ఉండాలని సంకల్పిస్తే, మహమ్మారిని అణచివేయడానికి అవసరమైన శక్తులను సమీకరిస్తామని నాకు నమ్మకం ఉంది. నేను మహాత్మా గాంధీ మాటల్ని ఇక్కడ ఉటంకిస్తున్నాను .... "... నేను, దీనిని చేయగలననే ఆత్మవిశ్వాసం తో ఉంటే గనుక, దానిని చేయడానికై ఖచ్చితంగా తగిన శక్తి సామర్థ్యాలను పొందగలుగుతాను....”1, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, మనం తప్పకుండా ప్రయత్నిoచుదాo మరి పునరుద్ధరణ సాధించుదాం. ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.


Chart 1

Chart 1

1 ది కలెక్టేడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ (ఎలక్ట్రానిక్ బుక్), న్యూ ఢిల్లీ, పబ్లికేషన్స్ డివిజన్, భారత ప్రభుత్వం, 1999, వాల్యూం 79.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?