<font face="mangal" size="3">మాస్టర్ డైరెక్షన్ - లావాదేవీలను నివేదించకుం - ఆర్బిఐ - Reserve Bank of India
మాస్టర్ డైరెక్షన్ - లావాదేవీలను నివేదించకుండా, తప్పుగా/ఆలస్యంగా నివేదించినప్పుడు మరియు అనర్హమైన మొత్తాలను కరెన్సీ చెస్ట్ నిల్వలలో కలపడం కారణంగా కరెన్సీ చెస్ట్ ఫై అపరాధ వడ్డీ విధింపు
ఆర్.బి.ఐ/డిసిఎం/2017-18/59 అక్టోబర్ 12, 2017 1 అధ్యక్షుడు మరియు నిర్వాహక సంచాలకుడు / ముఖ్య కార్య నిర్వహణ అధికారి మేడం / డియర్ సర్, మాస్టర్ డైరెక్షన్ - లావాదేవీలను నివేదించకుండా, తప్పుగా/ఆలస్యంగా నివేదించినప్పుడు మరియు అనర్హమైన మొత్తాలను కరెన్సీ చెస్ట్ నిల్వలలో కలపడం కారణంగా కరెన్సీ చెస్ట్ ఫై అపరాధ వడ్డీ విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934 పీఠిక మరియు సెక్షన్ 45 క్రింద, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 యొక్క సెక్షన్ 35 A ప్రకారం, శుభ్రమైన నోట్ల విధానం (క్లీన్ నోట్ పాలసీ) క్రింద దాని లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, బ్యాంక్ మార్గదర్శకాలు/సూచనలను జారీచేస్తుంది. కరెన్సీ చెస్ట్ లావాదేవీలను ఖచ్చితముగాను మరియు సకాలంలోను నివేదించడం కొరకై ప్రయత్నాలను కొనసాగించి, బ్యాంకుల మధ్య క్రమశిక్షణను పెంచడానికి, ఈ అంశంపై మేము సూచనలను జారీ చేసాము. 2. ఈ అంశంపై, నవీకరించబడిన మార్గదర్శకాలు / సర్కులర్లు, జతచేయబడిన మాస్టర్ డైరెక్షన్ లో పొందుపరచబడ్డాయి. మాస్టర్ డైరెక్షన్ ఎప్పటికప్పుడు తాజా సూచనలతో నవీకరించబడుతుంది. 3. ఈ మాస్టర్ డైరెక్షన్ ఆర్బిఐ వెబ్సైట్ www.rbi.org.in లో ఉంచబడింది. మీ విధేయులు, (పి.విజయ కుమార్) జతపర్చినవి: పైన పేర్కొన్నవి 1. లావాదేవీలను నివేదించకుండా, తప్పుగా/ఆలస్యంగా నివేదించినప్పుడు కరెన్సీ చెస్ట్ ఫై అపరాధ వడ్డీ విధింపు 1.1 కరెన్సీ చెస్ట్ లావాదేవీలు నివేదించడం - కరెన్సీ చెస్ట్ నుండి డిపాజిట్ / ఉపసంహరణ కనీస మొత్తం రూ 1,00,000/- మరియు తరువాత రూ 50,000/- గుణకాలలో. 1.2 రిపోర్టింగ్ కోసం కాల పరిమితి 1.2.1 సురక్షిత వెబ్సైట్ (SWS) ద్వారా డేటాను అప్లోడ్ చేసి అదే రోజు రాత్రి 9 గంటల వరకు ICCOMS ద్వారా అన్ని లావాదేవీలను, కరెన్సీ చెస్ట్ తప్పనిసరిగా వాటి లింక్ కార్యాలయాలకు రిపోర్ట్ చెయ్యాలి. లింక్ కార్యాలయాలు అదే రోజు రాత్రి 11 గంటల వరకు ఇష్యూ కార్యాలయాలకు ఏకీకృత (consolidated) స్థితిని తప్పనిసరిగా నివేదించాలి. 1.2.2 సబ్ ట్రెజరీ కార్యాలయాలు (ఎస్.టి.ఓ.లు) అన్ని లావాదేవీలను రిజర్వు బ్యాంకు యొక్క జారీ కార్యాలయానికి నేరుగా అదే రోజు రాత్రి 11 గంటల వరకు నివేదించాలి. 1.2.3 బ్యాంకులలో సమ్మె వ్యవధికి రిలాక్సేషన్ - సాధారణ/ప్రత్యేక సమ్మె పరిస్థితిని బట్టి రిపోర్టింగ్ కాలంలో సడలింపు, కేస్ టు కేస్ ఆధారంగా పరిగణించబడుతుంది. 1.3 ఆలస్యం కోసం అపరాధ వడ్డీ విధించుట 1.3.1 కరెన్సీ చెస్ట్ లావాదేవీలు నివేదించడంలో జాప్యం జరిగితే, ఈ సర్కులర్ లోని పేరా 3 లో సూచించిన వడ్డీ రేటు చెస్ట్ హోల్డింగ్ బ్యాంకు ద్వారా బకాయి మొత్తం మీద ఆ జాప్యానికి గాను విధించబడుతుంది. అపరాధ వడ్డీ T+0 ఆధారంగా లెక్కించబడుతుంది, అంటే అదే రోజు రాత్రి 11 గంటల వరకు జారీ కార్యాలయానికి లింక్ కార్యాలయం నివేదించిన లావాదేవీలకు సంబంధించి, జరిమానా విధించబడుతుంది. ఏదేమైనప్పటికీ, రిజర్వు బ్యాంకు తన అభీష్టానుసారం, అపరాధ వడ్డీ వసూలు విషయంలో, తగిన గ్రేస్ కాలం మంజూరు చేయవచ్చు. 1.3.2 చెస్ట్ స్లిప్స్, సర్కిల్ యొక్క జారీ విభాగానికి నేరుగా నివేదించడానికి ఏకమాత్ర చెస్ట్/ సబ్ ట్రెజరీ కార్యాలయాల విషయంలో జాప్యానికి కూడా అపరాధ వడ్డీ వసూలు చేయబడుతుంది. 1.4 తప్పుగా నివేదించినప్పుడు అపరాధ వడ్డీ విధించుట తప్పుగా నివేదించిన అన్ని కేసుల విషయములోను రిజర్వ్ బ్యాంక్ ద్వారా సరైన నివేదిక అందుకున్న తేదీ వరకు, అదేవిధంగా జరిమానా విధించడం జరుగుతుంది. లింక్ కార్యాలయం సమర్పించిన నివేదికలోని గణాంకాల ఆధారంగా బ్యాంకుల వాడుక ఖాతాలపై డెబిట్/ క్రెడిట్లను పెంచడం వలన, చెస్ట్ స్లిప్స్ నివేదిక సరిగ్గా వున్నా, లింక్ కార్యాలయం తప్పుగా నివేదించడం వలన అపరాధ వడ్డీ విధించబడుతుంది. సంబంధిత కరెన్సీ చెస్ట్ ల ద్వారా నివేదించబడిన గణాంకాల ఖచ్చితత్వంను, లింక్ ఆఫీసులు నిర్ధారించుకోవాలి. కరెన్సీ చెస్ట్ కు క్రొత్త నోట్ల/నోట్ల తరలింపు, లింక్ కార్యాలయాల నివేదికల్లో 'డిపాజిట్' లావాదేవీలు గా నివేదించలేదని నిర్ధారించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 1.5 ఆర్బీఐ కి పాత నోట్ల (సాయిల్డ్ నోట్) తరలింపు ఫై నివేదిక/ఇతర చెస్ట్ లకు మళ్లింపు ఆర్బీఐ కి పాత నోట్ల (సాయిల్డ్ నోట్) తరలింపు /ఇతర చెస్ట్ లకు మళ్లింపు లను నగదు ఉపసంహరణ గా లింక్ కార్యాలయం/ కరెన్సీ చెస్ట్ లు చూపించకూడదు. అలాంటి సొమ్ము చెల్లింపులను 'ఉపసంహరణలు' గా తప్పుగా నివేదించినట్లయితే, 50,000/- జరిమానా విలువ/కాలంతో సంబంధం లేకుండా విధించబడుతుంది. 1.6 ICCOMS లో మళ్లింపులు నివేదించడం ICCOMS లో మళ్లింపులను నివేదించినప్పుడు, "2A మరియు 4A" కాలమ్ లో నివేదించబడాలి, అంటే మళ్లింపును స్వీకరించిన చెస్ట్ 2A కాలం క్రింద, మరియు తరలింపు చెస్ట్ 4A క్రింద ఆలస్యం లేకుండా చెస్ట్ స్లిప్ లో నివేదించాలి. మళ్లింపు మొత్తాలు, అదే బ్యాంకు చెస్ట్ కి కూడా, "ఉపసంహరణ" మరియు "డిపాజిట్" 4E మరియు 2E క్రింద నివేదించకూడదు (ఇవి కరెన్సీ బదిలీ లావాదేవీలకు). 1.7 వసూలు చేయబడే గరిష్ట అపరాధ వడ్డీ తప్పుగా/ఆలస్యంగా చేసిన నివేదికలకు గరిష్ట అపరాధ వడ్డీ పరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. అన్ని వర్తించదగిన కేసుల్లో చెస్ట్ లావాదేవీల సమయానుసారమైన మరియు సరైన నివేదికను పొందాలనే ఉద్దేశ్యంతో, మొత్తం తో/అపరాధ వడ్డీ తో సంబంధం లేకుండా, అపరాధ వడ్డీ మొత్తాన్ని సమీప రూపాయికి సవరించి, వసూలు చేయబడుతుంది. 2. కరెన్సీ చెస్ట్ నిల్వలలో అనర్హమైన మొత్తాలను చేర్చినప్పుడు అపరాధ వడ్డీ వసూలు 2.1 తప్పుగా నివేదించడం/ఆలస్యంగా నివేదించడం వల్ల రిజర్వు బ్యాంకు వాడుక ఖాతాలో 'అనర్హమైన' జమ వాడుకున్న అన్ని కేసులలో అపరాధ వడ్డీ విధించబడుతుంది. చెస్ట్ నిల్వలలో/ తరలింపులలో కొరతలు, మోసాల వలన కొరత, చెస్ట్ నిల్వలలో/ తరలింపులలో నకిలీ బ్యాంకు నోట్లను గుర్తించినప్పుడు, అమలులోవున్న "పెనాల్టీల పథకం" ప్రకారం పీనల్ చర్యలు తీసుకుంటారు. 2.2. ఇంకా, ఉమ్మడి సంరక్షకుల అదుపులో ఏ అడ్డంకీ లేకుండా లభించే విధంగా వున్న నగదు, కరెన్సీ చెస్ట్ నిల్వలకు అర్హమవుతాయి. ఈ విధంగా, ఉమ్మడి సంరక్షకుల అదుపులో కాక, ఇతర ఏ అధికారి/ల యొక్క కస్టడీ క్రింద ఏ విధంగా వున్నా/మూసివేసిన కవరులో సురక్షితమైన కస్టడీలో వున్నా, కరెన్సీ చెస్ట్ నిల్వలకు అనర్హమౌతాయి. కరెన్సీ చెస్ట్ నిల్వల లో అటువంటి మొత్తాలను చేర్చినట్లయితే, వీటిని తప్పుగా నివేదించే సందర్భాలుగా పరిగణిస్తారు మరియు అది పేరా 3. 2.3 లో పేర్కొన్న రేటుపై అపరాధ వడ్డీ ఆకర్షిస్తుంది. పైన పేర్కొన్న కేసుల్లో (చెస్ట్ నిల్వలలో/ తరలింపులలో కొరతలు, మోసాల వలన కొరత, చెస్ట్ నిల్వలలో/తరలింపులలో నకిలీ బ్యాంకు నోట్లను గుర్తించినప్పుడు) కరెన్సీ చెస్ట్ నిల్వల నుండి అటువంటి మొత్తంలో మినహాయింపు వరకు చెస్ట్ నిల్వలలో 'అనర్హమైన' మొత్తాలను చేర్చే తేదీ నుండి జరిమానా విధించబడుతుంది. చెస్ట్ నిల్వలలో/ తరలింపులలో కొరతలు, మోసాల వలన కొరత, చెస్ట్ నిల్వలలో/ తరలింపులలో నకిలీ బ్యాంకు నోట్లను గుర్తించినప్పుడు, అమలులోవున్న "పెనాల్టీల పథకం" ప్రకారం పీనల్ చర్యలు తీసుకుంటారు. చెస్ట్ నిల్వలలో 'అనర్హమైన' మొత్తాలను చేర్చడం/తప్పుగా నివేదించడం/ఆలస్యంగా నివేదించడం/అసలు నివేదించకపోవడం జరిగినప్పుడు, ప్రస్తుత బ్యాంక్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున జరిమానా విధించడం జరుగుతుంది. 4. ట్రెజరీలలో వున్న కరెన్సీ చెస్ట్లపై అపరాధ వడ్డీ విధించుట పైన ఉదహరించిన సూచనలు ట్రెజరీ/ఉప ట్రెజరీలలో వున్న కరెన్సీ చెస్ట్ కార్యాలయాలకు కూడా వర్తిస్తాయి. 5. అభ్యర్ధనలు 5.1 ఆలస్యం చేసిన నివేదికల అపరాధ వడ్డీ విధించుటకు ఏకైక ప్రమాణం, ఆలస్యం రోజుల సంఖ్య కనుక, వ్యక్తిగత సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్ణయం పునఃపరిశీలన కోసం బ్యాంకులు అభ్యర్థించవలసిన అవసరం ఉండదు. ఏది ఏమయినప్పటికీ, కొండచరియ /మారుమూల ప్రాంతాలలో మరియు ప్రకృతి వైపరీత్యములతో బాధపడుతున్న చెస్టులు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందుల వలన ఏవైనా అభ్యర్ధనలు ఉంటే, వాటికి సంబంధించిన ముఖ్య/కంట్రోలింగ్ కార్యాలయం ద్వారా సంబంధిత జారీ కార్యాలయానికి బ్యాంకు యొక్క డెబిట్ తేదీ నుండి ఒక నెలలోపు పంపించాలి. 5.2 తప్పుగా నివేదించడం విషయంలో, మినహాయింపు కోసం అభ్యర్ధనలు పరిగణించబడవు. {చూ. పేరా 1 (ఇ) పైన} 5.3 అపరాధ వడ్డీ విధించడం యొక్క ఉద్దేశం, బ్యాంకుల మధ్య క్రమశిక్షణను పెంపొందించడం, తద్వారా సరైన/తక్షణ రిపోర్టును పొందడం. తప్పుగా నివేదించడం/ఆలస్యంగా నివేదించడం/అసలు నివేదించకపోవడం/రిజర్వు బ్యాంకు ఫండ్స్ ను ఉపయోగించనప్పుడు/ CRR/SLR నిర్వహణలో బ్యాంకులు విఫలమైనందుకు/క్లెరిక్ తప్పులు/యాదృచ్ఛిక లేదా అంకగణిత లోపాల ఫలితంగా/మొదటిసారి లోపం/సిబ్బందికి అనుభవం లేకపోవటం మొదలగు కారణాలు, అపరాధ వడ్డీ యొక్క మినహాయింపు కోసం చెల్లుబాటు అయ్యే మార్గాలుగా పరిగణించబడవు. అంతేకాక, అటువంటి వైఫల్యాలను రిజర్వు బ్యాంకు తీవ్రంగా పరిగణిస్తుంది. |