RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528451

ద్రవ్య విధాన ప్రకటన 2021-22 ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC) ఆగస్ట్ 4-6, 2021

ఆగస్ట్ 06, 2021

ద్రవ్య విధాన ప్రకటన 2021-22
ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC)
ఆగస్ట్ 4-6, 2021

నేటి (ఆగస్ట్ 06, 2021) సమావేశంలో, ప్రస్తుత మరియు మార్పు చెందుతున్న స్థూల ఆర్దిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ విధంగా నిర్ణయించింది:

  • పాలసీ రెపో రేటు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (LAF) కింద మార్పు లేకుండా 4.00 శాతం గా కొనసాగుతుంది.

పర్యవసానంగా, రివెర్స్ రెపో రేట్ LAF కింద 3.35 శాతంగా; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు 4.25 శాతం గా కొనసాగుతాయి.

  • రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని MPC నిర్ణయించింది.

MPC యొక్క నిర్ణయం, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వుంది.

ఈ నిర్ణయం తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది:

అంచనాలు

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ

2. జూన్ 2-4, 2021 మధ్య జరిగిన MPC సమావేశం నుండి, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకించి వైరస్ యొక్క డెల్టా వేరియంట్ నుండి అంటువ్యాధులు పుంజుకోవడంతో గ్లోబల్ రికవరీ వేగం మితంగా కనిపిస్తోంది. జూన్ మరియు జులైలో, గ్లోబల్ కొనుగోలు నిర్వాహకుల సూచికలు (PMI లు) మే నెలలో గణనం చేసిన గరిష్టాల నుండి దిగజారిపోయాయి. పెరుగుతున్న ఏకాభిప్రాయం ఏమిటంటే, విభిన్నమైన రెండు-మార్గాల రీతిలో (మోడ్‌) రికవరీ జరుగుతోంది. టీకాలు వేయడంలో ముందున్న మరియు పాలసీ ఉద్దీపనను అందించగలిగిన లేదా నిర్వహించగలిగిన దేశాలు బలంగా పుంజుకుంటున్నాయి. ఇతర ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి తగ్గిపోతుంది మరియు కొత్త తరంగ అంటువ్యాధులకు గురవుతుంది. Q2: 2021లో గ్లోబల్ ట్రేడ్ వాల్యూమ్‌లలో వేగం మందగించింది, అధికమొత్తంలో షిప్పింగ్ ఛార్జీలు మరియు లాజిస్టిక్స్ ఖర్చులు ఎదురవుతున్నాయి.

3. వస్తువుల ధరలలో గణనీయమైన పెరుగుదల (ధృడత్వం) ఉంది, ముఖ్యంగా ముడి చమురు విషయంలో. పెట్రోలియం దేశాల ఆర్గనైజేషన్ లో తాజా ఒప్పందం (OPEC) ప్లస్ చమురు ఉత్పత్తిని పెంపొందించడానికి ఉత్పత్తిని సెప్టెంబర్ 2022 నాటికి ప్రీప్యాండమిక్‌కు పునరుద్ధరించే అవకాశం వల్ల జూలై ప్రారంభంలోని ఇటీవలి గరిష్ట స్థాయి నుండి ముడి చమురు ధరలు స్పాట్ మరియు భవిష్యత్తు (ఫ్యూచర్) కు స్వల్పకాలిక సరళతను చేకూర్చుతున్నాయి. అనేక అధునాతన ఆర్థిక వ్యవస్థలు (AE లు) అలాగే చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో(EME లలో) హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది; ఇది EME లలో కొన్ని కేంద్ర బ్యాంకులను ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి ప్రేరణ కల్పించింది. దీనికి విరుద్ధంగా, సార్వభౌమ బాండ్ ల దిగుబడి AE లలో మందగించింది ఎందువల్లనంటే మార్కెట్లు ద్రవ్యోల్బణం తాత్కాలికంగా ఉంటుందనే కేంద్ర బ్యాంకుల అభిప్రాయాలను ఎక్కువగా మన్నించినట్లు కనిపిస్తున్నది. EME లలో ద్రవ్యోల్బణం ఆందోళనలు మరియు సంబంధిత దేశీయ కారకాలవల్ల బాండ్ల దిగుబడి సాపేక్షంగా ఎక్కువగా ఉంటున్నది. విదేశీ మారక మార్కెట్లో, EME కరెన్సీలు జూన్ మధ్య నుండి రిస్క్ ఫ్యాక్టర్ కారకంతో పోర్ట్ఫోలియో అవుట్‌ఫ్లోల నేపథ్యంలో క్షీణించాయి, అయితే US డాలర్ బలపడింది.

దేశీయ ఆర్ధిక వ్యవస్థ

4. దేశీయంగా, కొన్నిరాష్ట్రాలు మహమ్మారి నియంత్రణ చర్యలను సడలించడం మూలాన, జూన్-జులై లో ఆర్థిక కార్యకలాపాలు కొంత వేగం పుంజుకున్నాయి. వ్యవసాయానికి సంబంధించి, నైరుతి రుతుపవనాలు విరామం తర్వాత జూలై మధ్యలో బాగా విస్తరించాయి, సంచిత వర్షపాతం ఆగష్టు 1, 2021 దీర్ఘకాల సగటు కంటే ఒక శాతం తక్కువగా ఉంది. ఖరీఫ్ పంటల నాట్లు జులై లో వేగం పుంజుకున్నాయి; అలాగే గ్రామీణ గిరాకీ హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు ముఖ్యంగా ట్రాక్టర్లు మరియు ఎరువుల అమ్మకాలు కూడా.

5. బలవంతమైన మూలాలను ప్రతిబింబిస్తూ, పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ లో భారీగా పెరగడంతో ఏటికేడాది ప్రాతిపదికన (y-o-y) మే 2021 లో రెండు అంకెలకు 13.9 శాతం కు విస్తరించింది, అయినప్పటికీ మే, 2019 స్థాయి కంటే తక్కువే. తయారీ కొనుగోలు నిర్వాహకుల సూచిక (PMI) పదకొండు నెలల్లోమొదటిసారి జూన్‌లో సంకోచం చెంది 48.1 కి పడిపోయింది, అయితే జులై లో 55.3 రీడింగ్ తో విస్తరణ జోన్‌లో బాగా పుంజుకుంది. హై-ఫ్రీక్వెన్సీ గణాంకాల - ఇ-వే బిల్లులు; టోల్ వసూళ్లు; విద్యుత్ ఉత్పత్తి; ఎయిర్ ట్రాఫిక్; రైల్వే సరుకు రవాణా; పోర్ట్ కార్గో; ఉక్కు వినియోగం, సిమెంట్ ఉత్పత్తి; మూలధన వస్తువుల యొక్క దిగుమతి; ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు; ద్విచక్ర వాహనాల అమ్మకాలు - జూన్/జూలై లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. COVID సంబంధిత ప్రోటోకాల్‌లను పాటించడం మరియు కట్టడిని సడలించడాన్ని, ఇవి ప్రతిబింబిస్తున్నాయి. కోవిడ్ -19 సంబంధిత ఆంక్షల మూలంగా సేవారంగం PMI కుదింపు జోన్ లోనే ఉన్నది, అయితే దీని వేగం జూన్ 2021 లో 41.2 నుండి జులై లో 45.4 కు కొంత పుంజుకుంది. మొదలు, నాన్-ఫైనాన్షియల్ కార్పొరేట్ల Q1:2021-22 త్రైమాసిక ఫలితాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల నేతృత్వంలో అమ్మకాలు, వేతన పెరుగుదల మరియు లాభదాయకతలో ఆరోగ్యకరమైన వృద్ధిని చూపుతున్నాయి.

6. మే 2021 లో 207 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత హెడ్‌లైన్ సిపిఐ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.3 శాతంగా ఉంది. వంట నూనెలు, పప్పులు, గుడ్లు, పాలు మరియు సిద్ధం చేసిన భోజనం మరియు కూరగాయల ధరలలో ఎదుగుదల మూలంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా, జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. LPG, కిరోసిన్ మరియు వంటచెరకు మరియు చిప్స్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో, ఇంధన ద్రవ్యోల్బణం 2021 మే-జూన్‌లో రెండు అంకెలకు ఎదిగింది. హౌసింగ్, ఆరోగ్యం, రవాణా మరియు కమ్యూనికేషన్, విందు మరియు వినోదం, పాదరక్షలు, పాన్, పొగాకు మరియు ఇతర మత్తు పదార్థాల ద్రవ్యోల్బణం సరళత్వం మూలంగా (ఒక సంవత్సరం క్రితం విధించిన ఒకేసారి పన్నుపోటు లాక్డౌన్ తరువాత క్షయమవడంతో) మరియు వ్యక్తిగత సంరక్షణ మరియు ప్రభావకాల (బంగారంలో ద్రవ్యోల్బణం బాగా తగ్గిన కారణంగా) మూలంగా మే నెలలో 6.6 శాతం వరకు పెరిగిన తరువాత ప్రధాన ద్రవ్యోల్బణం జూన్‌లో 6.1 శాతానికి క్షీణించింది.

7. సిస్టమ్ లిక్విడిటీ LAF కింద రోజువారీ సగటు ఆవశోషణ(గ్రహింపుతో)తో జూన్‌లో 5.7 లక్షల కోట్ల నుంచి జులైలో 6.8 లక్షల కోట్లకు మరియు ఆగస్టులో ఇప్పటివరకు (ఆగస్టు 4, 2021 వరకు) 8.5 లక్షల కోట్లు పెరిగి పుష్కలంగా ఉంది. వేలం ద్వారా Q2: 2021-22 లో ఇప్పటివరకు సెకండరీ మార్కెట్ కింద మొత్తం 40,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల సముపార్జన కార్యక్రమం (G-SAP) దిగుబడి రేఖ సిగ్మెంట్ల ద్రవ్యలేమిత విభాగాల్లో లిక్విడిటీని అంతటా సమం చేసింది. నగదు నిల్వ (రిజర్వ్ మనీ) (మొదటి రౌండ్ ప్రభావం కోసం సర్దుబాటు చేయబడింది నగదు నిల్వ నిష్పత్తిలో మార్పులతో) జులై 30, 2021 నాటికి y-o-y ప్రాతిపదికన 11.0 శాతం వరకు విస్తరించింది, కరెన్సీ డిమాండ్ మూలంగా. జూలై 16, 2021 నాటికి, వాణిజ్య బ్యాంకుల ద్వారా డబ్బు సరఫరా (M3) మరియు బ్యాంక్ క్రెడిట్ వరుసగా 10.8 శాతం మరియు 6.5 శాతం పెరిగాయి. భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021-22లో, US $ 43.1 బిలియన్లు (జూలై చివరి వరకు) పెరిగి US $ 620.1 బిలియన్లకు చేరాయి.

దృక్పథం (ఔట్లుక్)

8. భవిష్యత్తులో, నైరుతి రుతుపవనాల పునఃప్రారంభం మరియు ఖరీఫ్ నాట్లలో పురోగతి, తగు ఆహార నిల్వల భద్రత ధాన్యపు ధరల ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడాలి. సరఫరా పరంగా ప్రభుత్వ జోక్యంతో వంట నూనెలు మరియు పప్పుధాన్యాల ధరలలో కొంత ఒత్తిడి తగ్గించాలని హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. ఉత్పాదక మరియు సేవల రంగాలలో ఇన్‌పుట్ ధరలు పెరుగుతున్నాయి, అయితే బలహీన డిమాండ్ మరియు వ్యయ తగ్గింపు దిశగా ప్రయత్నాలు అవుట్‌పుట్ ధరలకు సర్దుబాటును (పాస్-త్రూను) నిరోధిస్తున్నాయి. కేంద్రం మరియు రాష్ట్రాలు పరోక్ష పన్ను భాగాన్ని ఒక క్రమాంకన పధ్ధతిలో తగ్గిస్తే ముడి చమురు పంపింగ్ ధరలలో వ్యయ ఒత్తిడిని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా 2021-22 నందు 5.7 శాతంగా అంచనా వేయబడింది; త్రైమాసికం:2 కి 5.9 శాతం, త్రైమాసికం:3 కి 5.3 శాతం గా, మరియు త్రైమాసికం:4 కి 5.8 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, ఇపుడు ప్రొజెక్ట్ చేయబడింది. సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం త్రైమాసికం:1 2022-23 కు 5.1 శాతం గా ప్రొజెక్ట్ చేయబడింది. (చార్ట్-1).

9. రెండో తరంగం (సెకండ్ వేవ్)వడసిపోవటంతో దేశీయ ఆర్ధిక కార్యకలాపాలు కోలుకోవడం ప్రారంభించాయి. వచ్చేరోజుల్లోచూస్తే, వ్యవసాయ ఉత్పత్తి మరియు గ్రామీణ డిమాండ్ స్థితిస్థాపకంగా ఉంటుందని భావిస్తున్నారు. గడచిన చాలాకాలంతర్వాత పట్టణ గిరాకీ మారేఅవకాశంఉంది, ఎందుకంటే తయారీ మరియు నాన్-కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసులు బలమైన వేగంతో పునఃప్రారంభం కావడం మొదలైంది మరియు టీకాకరణ గతిలో పురోభివృద్ధి అణగారిన గిరాకీ కి ఉతమివ్వగలుగుతుంది. ఎగుమతులలో ఉల్లాసం, మూలధన వ్యయంతో సహా ప్రభుత్వ వ్యయంలో ఆశించిన పెరుగుదల మరియు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ డిమాండ్‌మొత్తానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి. పెట్టుబడి డిమాండ్ ఇప్పటికీ నీరసంతో ఉన్నప్పటికీ, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరచడం మరియు అనుకూలమైన ద్రవ్య మరియు ఆర్థిక పరిస్థితులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పునరుద్ధరణకు తగు సన్నాహాలు చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు సర్వే లో ఎన్నికైన కంపెనీలు Q2: 2021-22 లో ఉత్పత్తి వాల్యూమ్‌లలో పురోభివృద్ధిని మరియు కొత్తగా ఆర్డర్‌లు పెరిగి నాల్గవ త్రైమాసికం వరకు ఇటువంటి స్థితి నిలబడే అవకాశం ఉందని అంచానా వేస్తున్నాయి. అయితే, గ్లోబల్ కమోడిటీ ధరలు మరియు ఫైనాన్షియల్ మార్కెట్ అస్థిరత అనేవి ప్రధానంగా ప్రతికూలతలు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రియల్ జిడిపి వృద్ధి అంచనా 2021-22లో 9.5 శాతంగానే ఉంచబడింది – ఇందులో Q 1 లో 21.4 శాతం, Q 2 లో 7.3 శాతం, Q 3 లో 6.3 శాతం, ఇంకా Q 4 లో 6.1 శాతం కూడి ఉంది. Q1:2022-23 లో రియల్ జిడిపి వృద్ధి 17.2 శాతం గా ప్రొజెక్ట్ చేయబడింది (చార్ట్ 2).

Chart 1 and 2

10. ద్రవ్యోల్బణ ఒత్తిడిని నిశితంగా మరియు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. MPC ద్రవ్యోల్బణ అంచనాలను దృష్టిలోయుంచుకుని కార్యక్రమ నిర్వాహ సంధానకర్త గా తన సంకల్పానికి కట్టుబడి ఉంది. మొత్తంగా గిరాకీ యొక్క దృక్పథం మెరుగుపడుతోంది, కానీ మహమ్మారి కారణంగా ఇంకా బలహీనంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగింపు పెద్ద మొత్తంలో ఉంది, మహమ్మారి పూర్వ స్థాయి కంటే ఉత్పత్తి ఇంకా తక్కువగానే ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం Q1: 2021-22 నందు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రతికూల సరఫరా షాక్‌ల తో కూడి ఉంటాయి, చాలావరకు ఇవి తాత్కాలికమే. సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, సరఫరా-డిమాండ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ దిశలో సమష్టి ప్రయత్నాలు అవసరం. విత్త పరంగాను, ద్రవ్యవిధాన పరంగానూ మరియు వివిధ రంగాలను ఉత్తేజపరచడంతోను నవజనితమైన మరియు ఊగిసలాడుతున్న రికవరీ కి ప్రోది చేసి నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనాఉంది. తదనుగుణంగా, MPC పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉంచాలని మరియు రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని నిర్ణయించింది.

11. MPC సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ – పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు.

12. ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ మినహా, మిగాతా సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని ఓటు వేశారు. ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ తీర్మానం యొక్క ఈ భాగం మీద అభిప్రాయాన్నిరిజర్వు చేశారు.

13. MPC యొక్క వివరాల టిప్పణి (మినిట్స్) ని ఆగస్ట్ 20, 2021 తేదీన ప్రచురించడం జరుగుతుంది.

14. ఎంపిసి తదుపరి సమావేశం అక్టోబర్ 6 నుండి 8, 2021 వరకు జరుగుతుంది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/644

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?