RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525631

ద్రవ్య విధాన ప్రకటన 2021-22
ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC)
ఫిబ్రవరి 8-10, 2022

ఫిబ్రవరి 10, 2022

ద్రవ్య విధాన ప్రకటన 2021-22
ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC)
ఫిబ్రవరి 8-10, 2022

నేటి (ఫిబ్రవరి 10, 2022) సమావేశంలో, ప్రస్తుతం ఉన్నటువంటి మరియు మార్పు చెందుతున్న స్థూల ఆర్దిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ విధంగా నిర్ణయించింది:

  • పాలసీ రెపో రేటు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (LAF) కింద మార్పులేకుండా 4.00 శాతం గా కొనసాగుతుంది.

రివెర్స్ రెపో రేట్ LAF కింద 3.35 శాతంగానూ; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు 4.25 శాతం గా మార్పులేకుండా కొనసాగుతాయి.

  • రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం ను పరిమితం చేసేందుకు, మన్నికైన వృద్ధి తో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని MPC నిర్ణయించింది.

MPC యొక్క నిర్ణయం, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వుంది.

ఈ నిర్ణయం తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది:

అంచనాలు

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ

2. డిసెంబర్ 2021లో MPC సమావేశం జరిగినప్పటి నుండి, అతివేగంగా వ్యాప్తి చెందగల ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ బాగా విస్తరించడం మరియు దానికి సంబంధించిన పరిమితుల విధింపుల వల్ల ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. గ్లోబల్ కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సేవా రంగం మరియు తయారీ రంగం రెండింటిలోనూ బలహీనo గా ఉండి, జనవరి 2022 లో 18 నెలల కనిష్ట స్థాయి 51.4 కి పడిపోయింది. ప్రపంచ కమోడిటీ వాణిజ్యం పెరుగుతూనే ఉంది. అయితే, నిరంతరం కంటైనర్లు మరియు కార్మికుల కొరత మరియు సరుకు రవాణా అధిక రేట్ల కారణంగా, అడ్డంకులు సృష్టించబడుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ యొక్క జనవరి 2022 అప్‌డేట్‌లో, దాని మునుపటి అంచనాలు 4.9 శాతం మరియు 6.7 శాతం నుండి 2022 సంవత్సారానికి గ్లోబల్ అవుట్‌పుట్ మరియు వాణిజ్య వృద్ధి అంచనాలను వరుసగా 4.4 శాతం మరియు 6.0 శాతానికి సవరించింది.

3. అతికొద్దికాలం దిద్దుబాటును నవంబర్ చివరిలో వెనక్కి తీసుకున్న తర్వాత, వస్తువుల ధరలు మళ్లీ కఠినతరం కాబడి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు జోడించబడ్డాయి. ఆస్తుల కొనుగోళ్లను ముగించడం మరియు పాలసీ రేట్లను ఊహించిన దాని కంటే ముందుగానే పెంచడం తో సహా, పలు కేంద్ర బ్యాంకులు పాలసీ సాధారణీకరణపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా మారాయి. అన్ని మెచ్యూరిటీలలో సావరిన్ బాండ్ ఈల్డ్‌లు బలపడ్డాయి మరియు ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్ జోన్‌లోకి ప్రవేశించాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఎకానమీలలో (EMEలు) ద్రవ్య మార్కెట్లు ఇటీవలి వారాల్లో సందిగ్ధ వైవిధ్యాన్ని ప్రదర్శించాయి, మొదటిది ఈక్విటీల నుండి బలమైన మూలధన ప్రవాహం కారణంగా మరియు రెండోది US రేట్ పెంపుదల వేగం మరియు పరిమాణం పై అధిక అనిశ్చితి కారణంగా. ఈ రెండోది US బాండ్ రాబడుల అస్థిరత పెరగడానికి దోహదపడింది.

దేశీయ ఆర్ధిక వ్యవస్థ

4. జనవరి 7, 2022న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన జాతీయ ఆదాయం యొక్క మొదటి ముందస్తు అంచనాలు (FAE), భారతదేశ వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధిని 2021-22కి 9.2 శాతంగా ఉంచింది, ఇది దాని మహమ్మారి (2019-20) పూర్వపు స్థాయిని దాటింది. ప్రైవేట్ వినియోగాన్ని మినహాయించి, GDPలోని అన్ని ప్రధాన భాగాలు వాటి 2019-20 స్థాయిలను దాటాయి. జనవరి 31 విడుదలలో, NSO 2020-21కి సంబంధించిన వాస్తవ GDP వృద్ధిని (-) 7.3 శాతం తాత్కాలిక అంచనా నుండి (-) 6.6 శాతానికి సవరించింది.

5. అందుబాటులో ఉన్న హై ఫ్రీక్వెన్సీ సూచికలు జనవరి 2022లో డిమాండ్‌లో కొంత బలహీనతను సూచిస్తున్నాయి, ఇది దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి నుండి కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలపై నిరోధం ను ప్రతిబింబిస్తున్నది. గ్రామీణ డిమాండ్ సూచికలు - ద్విచక్రవాహనం మరియు ట్రాక్టర్ విక్రయాలు - డిసెంబర్-జనవరిలో కుదేలయ్యాయి. పట్టణ డిమాండ్ సూచికలలో, సరఫరా పరంగా పరిమితుల కారణంగా వినియోగదారుల డ్యూరబుల్స్ మరియు ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు నవంబర్-డిసెంబర్‌లో తగ్గాయి, ఇంకోపక్క, జనవరిలో దేశీయ విమాన ట్రాఫిక్ బలహీనపడింది ఓమిక్రాన్ ప్రభావంతో. పెట్టుబడి కార్యకలాపాలు మిశ్రమ చిత్రాన్ని చూపించాయి - డిసెంబర్‌లో మూలధన వస్తువుల (క్యాపిటల్ గూడ్స్) దిగుమతులు పెరిగాయి, అయితే నవంబర్‌లో y-o-y ప్రాతిపదికన మూలధన వస్తువుల ఉత్పత్తి క్షీణించింది. కమోడిటీ ఎగుమతులు జనవరి 2022లో వరుసగా పదకొండవ నెలలో పుంజుకున్నాయి; దేశీయ డిమాండ్ నేపథ్యంలో చమురుయేతర బంగారేతర (నాన్-ఆయిల్ మరియు నాన్-గోల్డ్) దిగుమతులు కూడా విస్తరిస్తూనే ఉన్నాయి.

6. ఉత్పాదక PMI జనవరిలో 54.0 వద్ద విస్తరణ జోన్‌లో కొనసాగింది, అయితే ఇది గత నెల 55.5 కంటే తక్కువగా ఉంది. సేవల రంగ సూచికలలో, రైల్వే సరుకు రవాణా, ఇ-వే బిల్లు మరియు టోల్ వసూళ్లు డిసెంబర్-జనవరిలో ఏటికేడాది ప్రాతిపదికన వృద్ధిని నమోదు చేశాయి; పెట్రోలియం వినియోగంలో నెమ్మదిగా వృద్ధి నమోదు చేయబడింది మరియు పోర్ట్ ట్రాఫిక్ క్షీణించింది. పూర్తయిన ఉక్కు వినియోగం జనవరిలో ఏటికేడాది ప్రాతిపదికన తగ్గినప్పటికీ, డిసెంబర్‌లో సిమెంట్ ఉత్పత్తి మాత్రం రెండంకెలకు పెరిగింది. PMI సేవలు, డిసెంబర్ లో 55.5 నుండి కొంత బలహీనపడినప్పటికీ, జనవరి 2022లో 51.5 వద్ద తమ విస్తరణను చూపుతూనే ఉన్నాయి.

7. బలీయమైన ప్రతికూల బేస్ ఎఫెక్ట్‌ల కారణంగా నవంబర్‌లో 4.9 శాతం ఉన్న హెడ్‌లైన్ CPI ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో ఏటికేడాది ప్రాతిపదికన 5.6 శాతానికి పెరిగింది. ప్రధానంగా కూరగాయలు, మాంసం మరియు చేపలు, వంట నూనెలు మరియు పండ్ల కారణంగా ఆహార సమూహం (ఫుడ్ గ్రూప్) డిసెంబర్‌ ధరలలో గణనీయమైన క్షీణతను నమోదు చేసింది, అయితే కూరగాయల ధరల యొక్క తీవ్రమైన ప్రతికూల మూల ప్రభావాలు ఏటికేడాది ప్రాతిపదికన ద్రవ్యోల్బణంలో పెరుగుదలకు దారితీశాయి. డిసెంబరులో ఇంధన ద్రవ్యోల్బణం కొంత తగ్గినప్పటికీ రెండంకెల స్థాయిలోనే ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం లేదా CPI ద్రవ్యోల్బణం, ఆహారం మరియు ఇంధనం మినహాయించి, ప్రధానంగా రవాణా మరియు కమ్యూనికేషన్, ఆరోగ్యం, హౌసింగ్ మరియు విహారం మరియు వినోదం రంగాల కారణంగా నవంబర్‌లో 6.2 శాతం నుండి డిసెంబర్‌లో స్వల్పంగా 6.0 శాతానికి తగ్గబడినప్పటికీ, అధికంగానే ఉంది.

8. LAF కింద సగటు శోషణ (స్థిర మరియు వేరియబుల్ రేట్ రివర్స్ రెపోల ద్వారా) అక్టోబరు-నవంబర్ 2021లో ₹8.6 లక్షల కోట్ల నుండి జనవరి 2022లో ₹6 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ, మొత్తం గా సిస్టమ్ లిక్విడిటీ బాగా మిగులులోనే ఉంది. ఫిబ్రవరి 4, 2022న రిజర్వ్ మనీ (నగదు నిల్వల నిష్పత్తిలో మార్పు వల్ల ఫస్ట్ రౌండ్ ప్రభావం సర్దుబాటు మూలంగా) 8.4 శాతానికి (ఏటికేడాది ప్రాతిపదికన) విస్తరణకు లోనయ్యింది. జనవరి 28, 2022 వరకు వాణిజ్య బ్యాంకుల ద్రవ్య సరఫరా (M3) మరియు బ్యాంక్ క్రెడిట్ వరుసగా 8.4 శాతం మరియు 8.2 శాతం పెరిగాయి (Y-o-Y). భారతదేశ విదేశీ మారక నిల్వలు, 2021-22లో (4 ఫిబ్రవరి 2022 నాటికి) US$ 55 బిలియన్లు పెరిగి US$ 632 బిలియన్లకు చేరుకున్నాయి.

దృక్పథం (ఔట్లుక్)

9. డిసెంబర్ 2021 MPC సమావేశం నుండి, CPI ద్రవ్యోల్బణం ఆశించిన పథంలో కదిలింది. రాబోయే రోజుల్లో, శీతాకాలపు పంట రానున్నసందర్భంగా కూరగాయల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. సరఫరా పరంగా ప్రభుత్వం వారి జోక్య పరంపరలు మరియు పెరిగిన దేశీయ ఉత్పత్తి మూలంగా పప్పులు మరియు వంట నూనెల ధరలలో సడలింపు కొనసాగుతుంది. రబీ పంట బాగుండే అవకాశo వల్ల ఆహార ధరలు అందుబాటులో ఉండవచ్చు. అయితే, బేస్ ఎఫెక్ట్ ల ప్రతికూలతలు జనవరిలో ఆహార ద్రవ్యోల్బణంలో గణనీయమైన తగ్గింపును నిరోధించవచ్చు. 2022లో సరఫరా పరంగా పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ముడి చమురు ధరల అంచనా అనిశ్చితంగానే ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణంపై వ్యయ-ఆధారిత ఒత్తిళ్లు సమీప కాలంలో కొనసాగవచ్చు, అయితే రిజర్వు బ్యాంకు యొక్క సర్వేలు రాబోయే కాలంలో తయారీ మరియు సేవల సంస్థల ద్వారా అమ్మకాల ధరల పెరుగుదల వేగంలో కొంత నియంత్రణను సూచిస్తున్నాయి, ఇది బలహీనమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది (పాస్-త్రూ). మొత్తంమీద, 2021-22 ద్రవ్యోల్బణం అంచనా 5.3 శాతం వద్ద ఉంచబడింది, నాల్గవ త్రైమాసికంలో 5.7 శాతంతో కూడి. 2022లో సాధారణ రుతుపవనాలు ఉంటాయని అంచనాలతో, 2022-23కి CPI ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేయబడింది, ఇది 2022-23 Q1లో 4.9 శాతం నుండి; రెండో త్రైమాసికంలో 5.0 శాతం; మూడో త్రైమాసికంలో 4.0 శాతం; మరియు 2022-23 నాలుగో త్రైమాసికంలో 4.2 శాతంగా ఉండవచ్చని అంచనా (రిస్క్‌లు స్థూలంగా సమతుల్యం) (చార్ట్ 1) .

10. ప్రైవేట్ వినియోగం మరియు కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు మహమ్మారి ముందు స్థాయి కంటే తక్కువగా ఉన్నందున దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు ఇంకా విస్తృతంగా కోలుకోలేదు. రాబోయే కాలంలో, రబీ పంటల అవకాశాలు వ్యవసాయం మరియు గ్రామీణ డిమాండ్‌కు మంచి ఊతమిస్తున్నాయి. రికవరీపై, కొనసాగుతున్న మహమ్మారి యొక్క మూడవ తరంగ ప్రభావం మునుపటి తరంగాలతో పోల్చిచూస్తే పరిమితం గానే ఉండే అవకాశం ఉంది, అందుచేత ఈ పరిస్థితి కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు మరియు పట్టణ డిమాండ్‌కు గల అవకాశాలను మెరుగుపరుస్తుంది. కేంద్ర బడ్జెట్ 2022-23లో మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వo మౌలిక సదుపాయాలను పెంచడానికి చేసిన ప్రకటనల వల్ల , గుణక ప్రభావం తో ప్రైవేట్ పెట్టుబడులు బాగా వృద్ధి చెందుతాయని ఇంకా వీటి రద్దీ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహారేతర బ్యాంకు క్రెడిట్‌లో వృద్ధి, దీనికి దన్నుగా ద్రవ్య మరియు లిక్విడిటీ పరిస్థితులు, కమోడిటీ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరచడం మరియు స్థిరమైన వాణిజ్య అవకాశాలు సమిష్టి డిమాండ్‌కు మంచి ఊతమిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, 2022-23 సంవత్సారానికి వాస్తవ GDP వృద్ధి ని 7.8 శాతంగా అంచనా వేయబడింది; మొదటి త్రైమాసికం-2022-23 లో 17.2 శాతం; రెండో త్రైమాసికంలో 7.0 శాతం; మూడో త్రైమాసికంలో 4.3 శాతం; మరియు 2022-23 నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉండవచ్చని అంచనా (చార్ట్ 2).

Chart 1

11. 2022-23 ప్రథమార్థంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత లక్ష్య రేటుకు చేరువయ్యే అవకాశం ఉందని, సర్దుబాటులో ఉండటానికి అవకాశం కల్పిస్తుందని MPC పేర్కొంది. ప్రభుత్వం నుండి సకాలంలో మరియు సరైన సరఫరా వైపు చర్యలు ద్రవ్యోల్బణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడ్డాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్‌పుట్ ఖర్చులలో సంభావ్య పెరుగుదల అనివార్యం అవుతుంది. మహమ్మారికి ముందు ఉన్న ట్రెండ్‌తో దేశీయంగా రికవరీ వేగవంతం అవుతున్నది, అయితే ప్రైవేట్ వినియోగం ఇప్పటికీ వెనుకబడి ఉంది. COVID-19 స్థితి భవిష్యత్తు అవకాశాలకు కొంత అనిశ్చితిని అందజేస్తూనే ఉంది. కేంద్ర బడ్జెట్ 2022-23 సంవత్సరంలో ప్రకటించిన అనేక చర్యలు మొత్తం డిమాండ్‌లో పెరుగుదలకు దారితీయాలి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థూల ఆర్ధిక వాతావరణం గ్లోబల్ డిమాండ్ లో క్షీణతను సూచిస్తున్నది. సిస్టమిక్-అధునాతన ఆర్థిక వ్యవస్థలలో (AEs) ద్రవ్య విధాన సాధారణీకరణ మరియు నిరంతరం సప్లై వైపు జనించిన ఆటంకాల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక మార్కెట్ అస్థిరతతో ఒత్తిళ్లకు లోనవుతున్నది. ఈ నేపథ్యంలో, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని MPC నిర్ణయించింది.

12. MPC సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ – పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు.

13. ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ మినహా, మిగాతా సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని ఓటు వేశారు. ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ తీర్మానం యొక్క ఈ భాగం మీద అభిప్రాయాన్నిరిజర్వు చేశారు.

14. MPC యొక్క వివరాల టిప్పణి (మినిట్స్)ని ఫిబ్రవరి 24, 2022 వ తేదీన ప్రచురించడం జరుగుతుంది.

15. ఎంపిసి తదుపరి సమావేశం ఏప్రిల్ 6 నుండి 8, 2022 వరకు జరుగుతుంది.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1693.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?