<font face="mangal" size="3px">‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’ (Connectivity and Information Technolo - ఆర్బిఐ - Reserve Bank of India
‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’ (Connectivity and Information Technology) ఇతివృత్తం తో కొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలు
మార్చ్ 26, 2009 ‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’ (Connectivity and Information భారత ప్రభుత్వం ఈ క్రింద పేర్కొన ఇతివృత్తం తో జారీ చేసిన క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది: ‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’
నమూనా (డిజైన్) : ముందువైపు: నాణెం ఈ వైపు రెండు సమాంతర రేఖలతో మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది. మధ్యభాగం లో అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి, దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య చెక్కబడి ఉంటుంది. ఉపరి భాగం “भारत” అని హిందీ మరియు “India” అని ఇంగ్లీషు పదం కలిగి ఉంటుంది. అడుగు భాగం అంతర్జాతీయ సంఖ్యలతో సంవత్సరమును కలిగి ఉంటుంది. వెనుకవైపు: నాణెం ఈ వైపున పై పరిధిలో, బయటికి వ్యాపిస్తున్నమాదిరిగాచిత్రము వృద్ధి మరియు సంధాయకత ను వర్ణించుచున్నది. నాణెం మధ్యలో, డినామినేషన్ విలువ “10” అంతర్జాతీయ సంఖ్యలలో మరియు క్రింది పరిధిలో “रुपये” అని హిందీ పదం మరియు “RUPEES” అని ఇంగ్లీష్ పదం ఉన్నాయి. ఈ క్రొత్త పది రూపాయల నాణెం ‘ భారతీయ కాయినేజ్ యాక్ట్ 1906’ (Indian Coinage Act 1906) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2008-2009/1593 |