<font face="mangal" size="3">వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా ర - ఆర్బిఐ - Reserve Bank of India
వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం.
తేదీ: 04/06/2021 వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, 1. పురోగమనశీల మరియు నియంత్రణ విధానాల నివేదికలో ప్రకటించినట్లు, ప్రత్యక్ష సంపర్కం అవసరమయిన ప్రత్యేక రంగాలకై రూ. 15,000 కోట్లతో, మూడు సంవత్సరాల వరకు కాలపరిమితితో, నిరంతరం రెపో రేటుకు లభించే మరొక ప్రత్యేక ద్రవ్యత సదుపాయం మార్చి 31, 2021 వరకు కల్పించాలని, నిశ్చయించబడింది. ఈ సదుపాయం, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు; పర్యటన/పర్యాటన ఏజంట్లు; విహార యాత్రా నిర్వాహకులు; సాహస /సాంస్కృతిక యాత్రలకు సదుపాయాలు; విమానయాన మరియు తత్సంబంధిత సేవలు - ప్రయాణీకుల మరియు సరఫరాల నిర్వహణ; ప్రైవేటు బస్ నిర్వాహకులు, కారు మరమ్మత్తు / అద్దె కారు సేవలు; కార్యక్రమాల / సమావేశాల నిర్వాహకులు; ఆరోగ్య చికిత్సశాలలు; సౌందర్య పోషణ కేంద్రాలు / క్షవరశాలలు మొదలైనవాటికొరకు ఉద్దేశించబడింది. 2. బ్యాంకులు, ఈ పథకంక్రింద ప్రత్యేక ‘కోవిడ్ లోన్ బుక్’ ప్రారంభించాలి. ఇందుకు ప్రోత్సాహకంగా, బ్యాంకులు ‘కోవిడ్ లోన్ బుక్’ విలువమేరకు, వారి వద్ద గల అధిక ద్రవ్యతను, రెపో రేటుకన్న 25 బేసిస్ పాయింట్ల తక్కువ రేటుకు, రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రెపోలో దాచి ఉంచుకోవచ్చు. 3. రిజర్వ్ బ్యాంకునుండి నిధులు కోరకుండా, వారి స్వంత నిధులనుండి పైన తెలిపిన రంగాలకు రుణాలు జారీచేయాలనుకొన్న బ్యాంకులుకూడా, పైన పేరా 2లో తెలిపిన ప్రోత్సాహకాలకు అర్హులు. 4. పథకం యొక్క విధి విధానాలు అనుబంధం-1 లో ఇవ్వబడ్డాయి. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/323 వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం – విధి విధానాలు (a) ఈ పథకం జూన్ 07, 2021 నుండి మార్చి 31, 2022 వరకు అమలులో ఉంటుంది. (b) లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ ఏ ఎఫ్) క్రింద అర్హులయిన అన్ని బ్యాంకులు ఈ పథకంలో పాల్గొనవచ్చు. ఈ పథకం క్రింద నిధుల జారీ, బ్యాంకుల దరఖాస్తు తేదీన నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అనగా, రూ. 15,000 కోట్లు అప్పటికే వినియోగించబడి ఉంటే, సొమ్ము జారీ చేయబడుతుందన్న హామీ ఉండదు. ఇంతేగాక, రిజర్వ్ బ్యాంకునుండి నిధులు తీసికొన్న 30 రోజులలోగా బ్యాంకులు రుణం జారీచేయాలి. ఈ పథకం క్రింద బ్యాంకులు రుణాలు జారీచేయడానికి కాల పరిమితిలేదు. అయితే, పథకం అమలులో ఉన్నంత కాలం, రిజర్వ్ బ్యాంక్ నుండి తీసికొన్న నిధులు, పూర్తిగా పైన పేర్కొన్న రంగాలకు ఋణాలుగా ఇచ్చి ఉండాలి. (c) ఈ పథకం నిరంతరం అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు నిధులకొరకు, అనుబంధం-2 లో ఇచ్చిన నమూనాలో ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ అట్టి దరఖాస్తులన్నీ కలిపి, ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తుంది. (సోమవారం సెలవు అయితే, తదుపరి పనిదినం). దరఖాస్తుచేసిన బ్యాంకుతో 3 సంవత్సరాల రెపో కాంట్రాక్ట్ చేసుకోబడుతుంది. (d) బ్యాంకు, ఒకేవారంలో అనేక దరఖాస్తులుచేస్తే, అన్నిటికీ కలిపి, లావాదేవీ జరిగే రోజు ఒకే రెపో కాంట్రాక్ట్ చేసుకోబడుతుంది. (e) లావాదేవీ జరిగే రోజు, దరఖాస్తు చేసుకొన్న సొమ్ము, మిగిలిన సొమ్ము కన్నా అధికంగా ఉంటే, ఆ మిగిలిన సొమ్మును అందరు దరఖాస్తుదారులకు, దరఖాస్తు చేసిన నిష్పత్తిలో కేటాయించబడుతుంది. (f) ఎంత సొమ్ము కేటాయించాలి, ఏదేని దరఖాస్తు పూర్తిగా లేక పాక్షికంగా అంగీకరించాలా / తిరస్కరించాలా అనే నిర్ణయం, కారణం చూపకుండా తీసికొనే హక్కు రిజర్వ్ బ్యాంకుకు ఉంది. (g) ఎల్ ఏ ఎఫ్ లావాదేవీలకు వర్తించే కోలేటరల్, మార్జిన్ నియమాలే దీనికి వర్తిస్తాయి. దరఖాస్తు చేస్తున్న బ్యాంకు, లావాదేవీ జరిగే రోజు రెపో ‘కాన్స్టిట్యుఎంట్ అకౌంటులో’ తగినంత, సొమ్ము ఉండేలా ధ్రువపరచుకోవాలి. ఎల్ ఏ ఎఫ్ లావాదేవీలకు వర్తించే అన్ని ఇతర నియమ నిబంధనలూ (సెక్యూరిటీ బదలాయింపు సౌకర్యంతో సహా), తగిన మార్పులతో ఈ పథకానికి వర్తిస్తాయి. (h) ‘కోవిడ్ లోన్ బుక్’ విలువ మేరకు, బ్యాంకులు తమ నిధులను ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.30 మరియు 1.00 మధ్య నిర్వహించే ప్రత్యేక 14 రోజుల రివర్స్ రెపో క్రింద ఉంచవచ్చు. ఇటువంటి మొట్టమొదటి ప్రక్రియ, జూన్ 18, 2021 తేదీన జరుగుతుంది. 14 రోజుల ప్రత్యేక రివర్స్ రెపో కార్యకలాపాలు మార్చి 31, 2022 వరకు కొనసాగుతాయి. ఆ తరువాత సమీక్షించబడుతుంది. ప్రత్యేక 14 రోజుల రివర్స్ రెపోలో సోమ్ము ఉంచేముందు పై షరతులు ఖచ్చితంగా పాటించాలి. (i) రిజర్వ్ బ్యాంకునుండి నిధులు కోరకుండా, వారి స్వంత నిధులు ఈ పథకానికై వినియోగించదలచిన బ్యాంకులు, పైన పేరా ‘హెచ్’ లో తెలిపిన ప్రోత్సాహకాలకు అర్హులౌతారు. పై నిర్దిష్ట రంగాలకు, స్వంత నిధులు వినియోగించే బ్యాంకులు, ఈ పథకం ముగిసేవరకు, మునుపటి వారంలో ‘కోవిడ్ లోన్ బుక్’ లో కలిగిన మార్పులను, ప్రతి సోమవారం, ‘ఫైనాన్షియల్ మార్కెట్స్ అపరేషన్స్ డిపార్ట్మెంటుకు’, ఇ-మెయిల్ ద్వారా తెలియచేయాలి. (j) ఈ పథకం క్రింద వినియోగించిన నిధుల వివరాలు, ‘మనీ మార్కెట్ ఆపరేషన్స్ (ఎమ్ ఎమ్ ఒ)’ పత్రికా ప్రకటనద్వారా మార్కెట్ భాగస్వాములందరికీ తెలియచేయబడతాయి. (k) ఈ పథకం విధి విధానాలపై సందేహాలకు సమాధానాలు / స్పష్టీకరణలు, ‘ఫైనాన్షియల్ మార్కెట్స్ అపరేషన్స్ డిపార్ట్మెంటు’ నుండి ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా (022-22630982) పొందవచ్చు. సాంకేతిక సమస్యలు ఇ-కుబేర్, సహాయ సేవల ఇ-మెయిల్ ekuberhelpdesk@rbi.org.in ద్వారా, (laffmd@rbi.org.in కి ప్రతిని పంపి) మరియు /లేదా టెలిఫోన్ (022-27595662/67/022-27595591/92/93/94) ద్వారా పొందవచ్చు. |