గుజరాత్‌లోని ఖేడా జిల్లా పిజ్‌లో గల పిజ్(pij) పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్‌లోని ఖేడా జిల్లా పిజ్‌లో గల పిజ్(pij) పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలోని పిజ్ ప్రాంతంలో గల పిజ్(pij) పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.2 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకుకు చెందిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలమైనట్లు తేలడంతో ఆర్ బి ఐ ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీలు చేపట్టింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో బ్యాంకు ప్రమాదకరమైన ఖాతాల వర్గీకరణ విషయంలో కాలానుగుణంగా సమీక్ష చేపట్టడంలో విఫలైనట్లు తెలిసింది. దీంతో తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రిజర్వు బ్యాంకు పిజ్ సహకార బ్యాంకు లిమిటెడ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని, మార్గదర్శకాల ఉల్లంఘన చర్యల కింద పిజ్(pij) సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించాలని నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1205 |