RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104375837

శ్రీ ఛని నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వడోదర (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 03/04/2023

శ్రీ ఛని నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వడోదర (గుజరాత్)పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చి 29, 2023 నాటి ఆదేశం ద్వారా, శ్రీ ఛని నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వడోదర (గుజరాత్) (ది బ్యాంకు)పై 4.00 లక్షల (రూ. నాలుగు లక్షలు మాత్రమే) జరిమానా విధించింది. ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలు - 'అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ప్రొఫెషనల్‌లైజేషన్ మరియు వారి పాత్ర - చేయవలసినవి మరియు చేయకూడనివి', 'ప్రూడెన్షియల్ నిబంధనల ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు', ‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు - డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా - స్పష్టీకరణ', 'UCBలలో మోసాలు: మానిటరింగ్ మరియు రిపోర్టింగ్ మెకానిజంలో మార్పులు' మరియు 'మాస్టర్ డైరెక్షన్ - మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC), 2016' ల ఉల్లంఘనకు ఫై జరీమానా విధించడం జరిగింది.

ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు.

నేపధ్యము

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్‌బిఐ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ, దానికి సంబంధించిన తనిఖీ నివేదిక మరియు రిస్క్ అసెస్‌మెంట్ నివేదిక మరియు సంబంధిత అన్ని ఉత్తరప్రత్యుత్తరాల పరిశీలనలో, ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంక్ (i) ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్‌గా ఉన్న దాని డైరెక్టర్లలో ఒకరి నుండి దాని ఉద్యోగుల కోసం బీమా పాలసీ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది, (ii) దాని ఆస్తులను నిరర్ధక ఆస్తులు (NPAలు)గా కొనసాగుతున్న ప్రాతిపదికన గుర్తించలేదు, (iii) దాని డైరెక్టర్లలో ఒకరు ష్యూరిటీ/గ్యారంటర్‌గా ఉన్న సంబంధిత రుణాన్ని మంజూరు చేసింది, (iv) నిర్దేశించిన కాలక్రమంలో ఐదు మోసాల కేసులను ఆర్‌బిఐ కి నివేదించలేదు మరియు (v) నిర్దేశించిన ఆవర్తన ప్రకారం ఖాతాల యొక్క కాలానుగుణ నవీకరణను నిర్వహించలేదు. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

జారీ చేయబడిన నోటీసుకు బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణ అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్‌బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/4

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?