ది చెంబూర్ నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,ముంబై మహారాష్ట్ర పై - భారతీయ రిజర్వు బ్యాకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది చెంబూర్ నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,ముంబై మహారాష్ట్ర పై - భారతీయ రిజర్వు బ్యాకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు వారు, “డిపాజిట్ల ఖాతాల నిర్వహణలో” పట్టణ సహకార బ్యాంకులకు జారీ చేసిన నిబంధనలను సక్రమముగా అమలుపరచనందులకు గాను, తమ ఉత్తర్వు తేది 20-11-2023 నాటి ద్వారా ది చెంబూర్ నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,ముంబై, మహారాష్ట్ర పై రు.1.00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధించడము జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్ట బద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరు బ్యాంకు తమ ఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు. నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట, ఈ బ్యాంకు, తమ బ్యాంకు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల ఖాతాలలో కనీస నిల్వ ఉంచనందులకు గాను . కనీస నిల్వ కంటే తక్కువ పడిన మొత్తానికి దామాషా ప్రకారము అపరాధ రుసుము విధించ కుండా నిర్దుష్ట అపరాధ చార్జీలను విధించింది. అంతే కాక, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో కనీస నిల్వ కంటే తక్కువ ఉన్నట్లయితే, ఆ కొరతను నోటీసు ఇచ్చిన నెల రోజులలోగా భర్తీ చేయాలని, లేని యెడల అపరాధ చార్జీలు పడతాయని, ఖాతాదారులకు బ్యాంకు తెలియ పరచలేదు. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది . యోగేష్ దయాళ్ పత్రిక ప్రకటన విడుదల 2023-24/1406 |