RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133672194

చిత్తూరు పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్ర ప్రదేశ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు

‘ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-UCBs’, మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC)’ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన కొన్ని నిర్దిష్ట మార్గనిర్దేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణా చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జూన్ 23, 2025 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా చిత్తూరు పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్ర ప్రదేశ్ వారిపై రూ.1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించడమైనది.

మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగా, ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో బ్యాంకు వారి లోపాలను గుర్తించినందున, ఇట్టి వైఫల్యానికిగాను బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన ద్రవ్య జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

ఈ బ్యాంకు:

(i) బ్యాంకు ప్రుడెన్షియల్ ఇంటర్‌బ్యాంక్ (స్థూల) మరియు కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితిని ఉల్లంఘించినట్లు వెల్లడైనది మరియు

(ii) నిర్దిష్ట గడువులోపు ఖాతాదారుల KYC రికార్డులను కేంద్ర KYC రికార్డు రిజిస్ట్రీకి నవీకరించి సమర్పించడంలో విఫలమైంది.

ఇట్టి చర్య బ్యాంక్ యొక్క చట్టబద్ధమైన ఆదేశాలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటుకు గానీ లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. అంతేగాక ఇట్టి ద్రవ్య జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.

(పునీత్ పంచోళీ) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రిక ప్రకటన: 2025-2026/599

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?