RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78482228

అధీకృత‌ భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI

అక్టోబ‌ర్ 20, 2015

అధీకృత‌ భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు
ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్ర‌స్తుతం బిల్ పేమెంట్ల కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ, భార‌త బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ (BBPS‌) కింద అధీకృత‌ భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU)గా పని చేసేందుకు ఆస‌క్తి క‌లిగిన సంస్థ‌ల నుంచి ఇవాళ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. BBPS‌ భార‌త జాతీయ పేమెంట్ వ్య‌వ‌స్థ యొక్క అధీకృత చెల్లింపుల వ్య‌వ‌స్థ‌గా ప‌ని చేస్తుంది.

మొద‌టి నుండి చెప్పాలంటే, BBPS‌ కింద BBPOU లు విద్యుత్‌, నీరు, గ్యాస్‌, టెలిఫోన్‌, డైరెక్ట్-టు-హోమ్‌లాంటి రోజువారీ సేవ‌ల పున‌రుక్త‌ చెల్లింపులను స్వీక‌రించే సంస్థ‌లుగా ప‌ని చేస్తాయి. ప్ర‌స్తుతం అలాంటి బిల్ పేమెంట్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ, వాటిని కొన‌సాగించాల‌ని అభిల‌షిస్తున్న సంస్థ‌ల‌న్నీ త‌ప్ప‌న‌సరిగా పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చ‌ట్టం, 2007కు లోబ‌డి రిజ‌ర్వ్ బ్యాంక్ యొక్క అథ‌రైజేష‌న్ కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత ఫార్మాట్‌లో చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, పేమెంట్ మ‌రియు సెటిల్మెంట్ వ్య‌వ‌స్థ విభాగం, భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్‌, 14వ ఫ్లోర్‌, సెంట్ర‌ల్ ఆఫీస్ బిల్డింగ్‌, షాహీద్ భ‌గ‌త్ సింగ్ మార్గ్‌, ముంబై- 400001 కు పంపుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌ను న‌వంబ‌ర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే స‌మ‌యం వ‌ర‌కు అంగీక‌రిస్తారు.

సాధార‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు, దాంతోపాటు PSS చ‌ట్టం కింద ఒక పేమెంట్ వ్య‌వ‌స్థ‌గా ప‌ని చేసేందుకు అథ‌రైజేష‌న్ కోరుతూ నాన్‌-బ్యాంకింగ్ సంస్థ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ఫార్మాట్ /documents/87730/39711219/PSSACRT130215.doc. లో ల‌భ్య‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తులదారులు టెంప్లేట్‌ లో సూచించిన విధంగా అద‌న‌పు స‌మాచారాన్నికూడా జోడించ‌వచ్చు.

నాన్ బ్యాంకుల‌కు

అథ‌రైజేష‌న్ కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న, మ‌రియు BBPS‌ మార్గ‌ద‌ర్శకా‌ల‌లోని పేరా 13లో పేర్కొన్న అర్హ‌తా ప్ర‌మాణాలు క‌లిగిన బ్యాంకింగేతర సంస్థ‌లకు PSS చ‌ట్టం కింద BBPS‌ లో చేర‌డానికి ‘ఇన్-ప్రిన్సిపుల్‌’ అథ‌రైజేష‌న్‌ను జారీ చేయ‌డం జ‌రుగుతుంది. అథ‌రైజేష‌న్ కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని, ప్ర‌స్తుతం అర్హ‌తా ప్ర‌మాణాల‌ను అందుకోలేని సంస్థ‌లకు (BBPS‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌లోని పేరా 15లో పేర్కొన్న‌వి) ఆ అర్హ‌తా ప్ర‌మాణాల‌ను సాధించేందుకు గ‌డువును డిసెంబ‌ర్ 31, 2016 వ‌ర‌కు వ‌న్‌-టైమ్ పొడిగింపు ఇవ్వ‌డం జ‌రుగుతోంది. వారు ఈ మ‌ధ్య‌కాలంలో త‌మ బిల్ పేమెంట్ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. అయితే, ఆ సంస్థ‌లు డిసెంబ‌ర్ 31, 2016 నాటికి ఆ అర్హ‌తా ప్ర‌మాణాల‌ను సాధించలేక‌పోయిన‌ట్ల‌యితే, వారు ప్ర‌స్తుతం ఉన్న BBPOUల ఏజెంట్లుగా మారాలి లేదా మే 31, 2017 నాటికి వ్యాపారం నుంచి వైదొల‌గాల్సి ఉంటుంది.

బ్యాంకుల‌కు

BBPOUగా కావాల‌నుకుంటున్న బ్యాంకులు ఈ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్ట‌డానికి అనుమ‌తిస్తూ బోర్డు ఆమోదం తెలిపిన కాపీని, దాంతోపాటు ముంబైలోని భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ సెంట్ర‌ల్ ఆఫీస్ యొక్క పేమెంట్ అండ్ సెటిల్మెంట్ వ్య‌వ‌స్థ‌ల విభాగం నుంచి వ‌న్-టైమ్ అప్రూవ‌ల్ కోరుతూ రాసిన లేఖ‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు తాము BBPOUగా నిర్వ‌హిస్తున్న లేదా నిర్వ‌హించాల‌నుకుంటున్న బిల్ల‌ర్లు, బిల్లు చెల్లింపుల వివ‌రాలను కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. అవి ప్ర‌స్తుతం సేవ‌లు అందిస్తున్న బిల్ల‌ర్ల పూర్తి వివ‌రాల‌ను కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. బ్యాంకుల నుంచి ఈ విజ్ఞాప‌న ప‌త్రాల‌ను నవంబ‌ర్ 20, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసే వ‌ర‌కు స్వీక‌రించ‌డం జ‌రుగుతుంది.

BBPS‌ కింద ఉన్న బిల్లుల ప‌రిధిని క్ర‌మంగా ఇత‌ర పున‌రుక్త‌ చెల్లింపులకు కూడా విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. అలాంటి చెల్లింపుల కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న సంస్థ‌లకు BBPS‌లో భాగస్వామ్యం క‌ల్పించ‌డానికి, భ‌విష్య‌త్తులో త‌గిన స‌మ‌యంలో అథ‌రైజేష‌న్ విండోను తిరిగి తెర‌వ‌డం జ‌రుగుతుంది.

BBPS‌ ఒక సుల‌భ‌సాధ్య‌మైన‌, అంత‌ర‌నిర్వాహ‌క‌ బిల్లు చెల్లింపుల వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తే, బిల్ల‌ర్ల సొంత క‌లెక్ష‌న్ సెంట‌ర్ల వ‌ద్ద బిల్లు పేమెంట్ చెల్లింపులు ఎప్ప‌టిలాగే ఖాతాదారుల‌కు అందుబాటులో ఉంటాయి.

అథ‌రైజేష‌న్‌/ఆమోదం కొర‌కు దర‌ఖాస్తు చేసుకోవ‌డంలో విఫ‌ల‌మై, BBPS‌ ప‌రిధిలోకి వ‌చ్చే బిల్ పేమెంట్ సేవ‌ల‌‌లో కొన‌సాగే అన్ని సంస్థ‌లనూ (బ్యాంకుల‌తో స‌హా) పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్, 2007 కింద జారీ చేసిన BBPS‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా న‌డుచుకుంటున్న‌ట్లు భావించాల్సి వ‌స్తుంది. వాటిపై రిజ‌ర్వ్ బ్యాంక్ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొనడానికి అవ‌కాశ‌ముంది.

నేప‌థ్యం

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ న‌వంబ‌ర్ 28, 2014న భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ (BBPS‌) అమ‌లు కొర‌కు తుదిమార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది (స‌ర్క్యుల‌ర్ నెం. RBI/2014-15/327/DPSS.CO.PD.No.940/02.27.020/2014-15). ఈ స‌ర్క్యుల‌ర్ BBPS‌ కార్య‌క‌లాపాల ప్ర‌మాణాలు నిర్దేశించేందుకు భార‌త జాతీయ పేమెంట్ కార్పొరేష‌న్ (‌NCPI) భార‌త బిల్ పేమెంట్ సెంట్ర‌ల్ యూనిట్ (BBPCU)గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, అన్ని ఆప‌రేటింగ్ యూనిట్లు దానికి లోబ‌డి ఉండాల‌ని సూచించింది. అంతేకాకుండా, కాబోయే భాగ‌స్వాములు ‌NCPI తో ఇంట‌రాక్ట్ కావాల‌ని సూచించ‌డం జ‌రిగింది. ఖ‌చ్చితంగా ఏ తేదీ నుంచి/ఏ ఫార్మాట్‌లో అథ‌రైజేష‌న్‌/ఆమోదం కొర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించుకో్వాలో రిజ‌ర్వ్ బ్యాంక్ త్వ‌ర‌లో నోటిఫై చేస్తుంది.

అల్ప‌నా కిల్లావాలా
ప్రిన్సిప‌ల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

ప్రెస్ రిలీజ్: 2015-2016/956


BBPSOU‌గా అథ‌రైజేష‌న్ పొందేందుకు దర‌ఖాస్తుతో పాటు స‌మ‌ర్పించాల్సిన
అద‌న‌పు స‌మాచారం

1. ద‌ర‌ఖాస్తు చేస్తున్న సంస్థ‌ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేష‌న్ (MoA) లో BBPOU గా చేప‌ట్టాల‌నుకుంటున్న కార్య‌క‌లాపాల‌ వివ‌రాలు ఉండాలి. దానిలో సంబంధిత‌ క్లాజుల వివ‌రాలు స‌మ‌ర్పించాలి.
2. ఒక‌వేళ దర‌ఖాస్తు సంస్థలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ఉంటే, అథ‌రైజేష‌న్ కోరే సంద‌ర్భంలో క‌న్సాలిడేటెడ్ పాల‌సీ ఆన్ FDI కింద పారిశ్రామిక విధానం, ప్రోత్సాహ‌క విభాగం (DIPP) నోటిఫై చేసిన విధానానికి అనుగుణంగా, మ‌రియు విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిర్వ‌హ‌ణా చ‌ట్టం (FEMA) కింద రూపొందించిన నిబంధ‌న‌లకు అనుగుణంగా త‌గిన అధికారిక సంస్థ నుంచి అవ‌స‌ర‌మైన అనుమతులు ఉన్న‌ట్లు తెలిపే కాపీ.
3. దరఖాస్తు చేస్తున్న సంస్థకు చివరగా ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం కనీసం రూ.100 కోట్ల నెట్ వర్త్ ఉన్న‌ట్లు ఆధారాలు చూపేందుకు త‌గిన ప‌త్రాలు.
4. అది ఆన్ లైన్‌లో ఉందా, కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు ఆ సంస్థ‌కు ఎంత స్థలం ఉంది త‌దిత‌ర వివ‌రాల‌తో పాటు బిల్ పేమెంట్ల విష‌యంలో గ‌తంలో ఎంత అనుభ‌వం ఉంది త‌దిత‌ర వివ‌రాలు.
5. BBPOU గా అది నిర్వ‌హిస్తున్న‌/లేదా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న ప‌లు ర‌కాల బిల్ల‌ర్లు/బిల్ పేమెంట్ల వివ‌రాలు, ఒక‌వేళ అథ‌రైజ్డ్ అయిన‌ట్ల‌యితే. ప్ర‌స్తుతం సేవ‌లు అందిస్తున్న బిల్ల‌ర్ల పూర్తి జాబితా స‌మ‌ర్పించాలి.
6. ద‌ర‌ఖాస్తుపై ప్ర‌భావం చూపే ఏ ఇత‌ర అద‌న‌పు స‌మాచారాన్నైనా ఆయా సంస్థ‌లు స‌మ‌ర్పించ‌ద‌ల‌చుకుంటే, వాటిని స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

గ‌మ‌నిక‌: నెట్ వ‌ర్త్ లెక్కించ‌డం కోసం ద‌య‌చేసి /en/web/rbi/-/notifications/computation-of-net-worth-9490 ను సంద‌ర్శించండి.

సంబంధిత ప్రెస్ రిలీజ్

నవంబ‌ర్13, 2015 భారత్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా అథ‌రైజేష‌న్ కొర‌కు దర‌ఖాస్తుల చివ‌రి తేదీ గ‌డువును పొడిగించిన RBI

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?