RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78467857

పసిడి నగదీకరణ పథకం, 2015 పై (Gold Monetisation Scheme (GMS), 2015) భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ చే, మార్గదర్శకాలు జారీ

అక్టోబర్ 22, 2015

పసిడి నగదీకరణ పథకం, 2015 పై (Gold Monetisation Scheme (GMS), 2015) భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ చే, మార్గదర్శకాలు జారీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, పసిడి నగదీకరణ పథకం 2015, అమలుకై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, ఈరోజు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు (గ్రామీణ బ్యాంకులు మినహా) ఆదేశం జారీ చేసింది.

పథకం

ప్రస్తుతంఉన్న పసిడి డిపాజిట్ పథకం, 1999 (Gold Deposit Scheme, 1999) స్థానంలో ఈ GMS, 2015 పథకం అమలు లోకి వస్తుంది. అయితే, పసిడి డిపాజిట్ పథకంలో మిగిలి ఉన్న డిపాజిట్లు, వాటి కాల పరిమితి వరకు కొనసాగుతాయి (డిపాజిట్‌దారులు, కాల పరిమితికి ముందే తిరిగితీసుకొంటే తప్ప).

దేశంలో నివసించే భారత పౌరులు [(వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు, SEBI (మ్యూచువల్ ఫండ్) రెగ్యులేషన్స్, మరియు కంపెనీస్ క్రింద నమోదయిన అన్ని మ్యూచువల్ ఫండ్లు/ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల తోసహా, అన్ని ట్రస్టులు] ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు.

ఒక పర్యాయంలో చేయవలసిన డిపాజిట్, 995 స్వఛ్ఛత గల ముడి బంగారం [కడ్డీలు, నాణేలు, ఆభరణాలు (పొదగబడ్డ రాళ్ళు, ఇతర లోహాలు మినహాయించి)] కనీసం 30 గ్రాములకు సమానమై ఉండాలి. పథకంక్రింద, గరిష్ఠ పరిమితి లేదు. ఇండియన్‌ స్టాండర్డ్స్ బ్యూరోచే (BIS) ధృవీకరించబడి, కేంద్ర ప్రభుత్వంచే ప్రకటించబడిన సేకరణ, శుద్ధతా పరీక్షా కేంద్రాలు (CPTCs) బంగారాన్ని స్వీకరిస్తాయి. 995 స్వఛ్ఛత గల బంగారానికి సమంగా, బ్యాంకులు డిపాజిట్ సర్టిఫికేట్లు జారీ చేస్తాయి.

డిపాజిట్లపై అసలు, వడ్డీ, బంగారంలో వ్యక్తీకరించబడతాయి.

నిర్దేశిత బ్యాంకులు, డిపాజిట్లని, స్వల్పకాలిక (1-3 ఏళ్ళు), బ్యాంక్ డిపాజిట్ గా (STBD); లేక మధ్యమ కాలిక (5-7 ఏళ్ళు), దీర్ఘకాలిక (12-15 ఏళ్ళు) ప్రభుత్వ డిపాజిట్ పథకం (MLTGD) క్రింద, స్వీకరిస్తాయి. స్వల్పకాలిక డిపాజిట్లను, బ్యాంకులు తమ ఖాతా క్రింద, మధ్యమ/దీర్ఘ కాలిక డిపాజిట్లను, ప్రభుత్వంతరఫున అంగీకరిస్తాయి. డిపాజిట్లను కాలపరిమితి ముందే, తిరిగి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది (బ్యాంకులు నిర్ణయించిన వారి వారి, లాక్-ఇన్‌ పీరియడ్, జరిమానా నిబంధనలకు లోబడి).

డిపాజిట్లపై వడ్డీ, డిపాజిట్ చేసిన బంగారం శుద్ధి చేసిన తరువాత కడ్డీలుగా మార్చినప్పటినుంచి, లేదా CPTCకి/ డిజిగ్నేటెడ్ బ్యాంకుకు అందిన 30 రోజుల తరువాత నుంచి (ఏది ముందు జరిగితే ఆ తేదీనుండి) జమ అవుతుంది.

CPTC లేదా డిజిగ్నేటెడ్ బ్యాంకుకు బంగారం అందిన రోజునుంచి, వడ్డీ ఆర్జన ప్రారంభమయేవరకూ, డిపాజిట్ చేయబడ్డ బంగారం, డిజిగ్నేటెడ్ బ్యాంకులో 'సేఫ్ కస్టడీ' వలె పరిగణించబడుతుంది.

చట్టబద్ధ నిల్వలు: స్వల్పకాల బ్యాంక్ డిపాజిట్లకు, అమలులో ఉన్న నగదు నిల్వల (CRR)/చట్టబద్ధ ద్రవ్య నిల్వల (SLR), నిష్పత్తులు వర్తిస్తాయి. అయితే, బ్యాంక్ వద్దనున్నబంగారం నిల్వ, SLR అవసరాలకు అర్హమైనది గా పరిగణించబడుతుంది.

KYC అమలు: బంగారం డిపాజిట్ ఖాతాలు తెరవడానికి ఖాతాదారు గుర్తింపుకై, ఇతర డిపాజిట్లకు వర్తించే నిబంధనలే వర్తిస్తాయి.

GMS క్రింద సేకరించిన బంగారంవినియోగం: STBD క్రింద సేకరించిన బంగారాన్ని, డిజిగ్నేటెడ్ బ్యాంకులు, సార్వభౌమ పసిడి నాణేలు (IGC) ముద్రించడానికి MMTC కి, మరియు నగల వర్తకులకు అమ్మవచ్చు లేదా రుణంగా ఇవ్వవచ్చు. లేక, GMS లో పాల్గొంటున్న ఇతర డిజిగ్నేటెడ్ బ్యాంకులకు అమ్మవచ్చు. MLTGD క్రింద డిపాజిట్ అయిన బంగారం, MMTC చే లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఇతర సంస్థలచే, వేలం వెయ్యబడి, తద్వారా వచ్చిన సొమ్ము, RBI లో గల కేంద్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయబడుతుంది. RBI, MMTC, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇతర సంస్థలు, ఈ వేలంలో పాల్గొనవచ్చు. బ్యాంకులు, వేలంలో కొన్న బంగారాన్ని, పైన తెలిపిన ప్రయోజనాలకు, వినియోగించవచ్చు.

కలుగబోయే నష్టాలను వారించడం: డిజిగ్నేటెడ్ బ్యాంకులు, తమ నికర బంగారంపై, ధరల మార్పుల వల్ల నష్టం వాటిల్లకుండా, పరిమితులు నిర్ణయించుకోవడంతో సహా, ఒక తగిన వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఇందుకై, అంతర్జాతీయ ఎక్స్చేంజ్‌లు (International Exchange), లండన్‌ బులియన్‌ మార్కెట్ అసోసియేషన్‌ (London Bullion market Association), లేదా, ఇతర ఓవర్‌-ది-కౌంటర్ (Over-the-Counter) ఒప్పందాల ద్వారా, బంగారం ధరల మార్పుల వల్ల కలుగబోయే నష్టాలనుంచి కాపాడుకోవడానికి, రిజర్వ్‌బ్యాంక్, వారి మార్గదర్శకాల పరిధిలో, డిజిగ్నేటెడ్ బ్యాంకులకు అనుమతిచ్చింది.

ఫిర్యాదుల పరిష్కారం: డిజిగ్నేటెడ్ బ్యాంక్‌పై, రశీదులు/డిపాజిట్ సర్టిఫికేట్లు జారీ చెయ్యడం, డిపాజిట్ల రిడెంప్షన్‌, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులు, మొదట ఆ బ్యాంక్‌లోని ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంచే, ఆ తరువాత బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్‌, ఆర్ బి ఐ చే పరిశీలించబడతాయి.

భారత ప్రభుత్వం తమ ఆఫీస్ మెమొరాండం F.No.20/6/2015-FT, సెప్టెంబర్ 15, 2015 ద్వారా, పసిడి నగదీకరణ పథకాన్ని (Gold Monetisation Scheme) ప్రకటించిన విషయం, మీకు తెలిసినదే. ప్రజల దగ్గర, సంస్థల దగ్గర ఉన్న బంగారాన్ని సమీకరించి, ఫలప్రదమైన ప్రయోజనాలకి ఉపయోగపడేలా చేసి, మునుముందు దేశం పసిడి దిగుమతుల మీద ఆధార పడకుండా చేయడమే. ఈ పథకం, లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ సెక్షన్‌ 35A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (Section 35A of the Banking Regulation Act, 1949) తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ ఆదేశం జారీ చేసింది.

CPTC ల, శుద్ధి కేంద్రాల (Refiners) జాబితా తుది రూపు దిద్దుకొంటోంది, కేంద్ర ప్రభుత్వంచే త్వరలో ప్రకటించబడుతుంది. పథకం అమలుకు కావలసిన పత్రాలు, డిజిగ్నేటెడ్ బ్యాంకులు, CPTC లు, శుద్ధి కేంద్రాల మధ్య చేసుకోవలసిన త్రైపాక్షిక ఒప్పందం నమూనానీ, ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్‌ ఖరారు చేస్తోంది. పథకం అమలుకు అవసరమైన విధివిధానలని కూడా నిర్ణయిస్తోంది. పథకం ప్రారంభమయే తేదీ, రిజర్వ్ బ్యాంక్, త్వరలోనే ప్రకటిస్తుంది.

అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకతన: 2015-2016/974

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?