<font face="mangal" size="3px">భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య ప్రదర్శనశాలĸ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య ప్రదర్శనశాలలో మైసూర్ నాణేల విశేష ప్రదర్శన
ఆగస్టు 28, 2015 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య ప్రదర్శనశాలలో మైసూర్ నాణేల విశేష ప్రదర్శన భారతీయ రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య ప్రదర్శనశాల, ఆగస్ట్ 20, 2015 తేదీన మైసూర్ నాణేల విశేష ప్రదర్శన ఆవిష్కరించింది. డా. దీపాలీ పంత్ జోషి, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా, మైసూర్ నాణేలపై, 20 పేజీల సమాచార కరపత్రం కూడా విడుదల చేయబడింది. శ్రీ యు ఎస్ పాలివాల్, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్; ప్రొ. దామోదర్ ఆచార్య, డైరెక్టర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బోర్డ్ మరియు శ్రీ ఎస్ రామస్వామి, రీజి నల్ డైరెక్టర్, ముంబయి కార్యాలయం, ఈ వేడుకకు హాజరయ్యారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య ప్రదర్శనశాలలో, మైసూర్ నాణేల విశేష ప్రదర్శన ఈ ప్రదర్శనలో 112 మైసూర్ నాణేలు ఉన్నాయి (13 బంగారు, 6 వెండి, 93 రాగి నాణేలు). ఇవి, క్రీ. శ. 1565 నుంచి, తళ్ళికోట యుద్ధం తరువాత, నాలుగు శతాబ్దాల మైసూర్ ద్రవ్య చరిత్రను తెలుపుతాయి. ఈ ప్రదర్శనలో, మైసూర్ వొడయార్లు, హైదర్ ఆలి, టిపూ సుల్తాన్ జారీచేసిన నాణేలు ప్రముఖమైనవి. మైసూర్ పాలకుల వద్ద బంగారు నాణేలు పెద్ద సంఖ్యలో ఉండేవి. బంగారు నాణేలు మొదటిసారిగా జారీ చేసిన పాలకుడు కంఠీరవ నరసరాయ. ఈయన జారీ చేసిన కంఠీరవ 'వరహా' (3.5 గ్రా. బరువు) అర్ధ 'వరహా' (1.7 గ్రా. బరువు) ఉండేవి. వీటిపై, ఒకవైపు లక్ష్మీ నరసింహుడి రూపు, మరోవైపు మూడు పంక్తుల్లో 'నగరి' లిపిలో రాసిన అయన పేరు ఉండేవి. ఇంకా, నరసింహ రూపు ఒకవైపు, ఆయన పేరు మరొవైపుగల 'పణం' బంగారు నాణేన్ని(0. 35 గ్రా. బరువు) కూడా ఈయన జారీ చేశారు. ఆ తరువాతి కాలంలో, దివాన్ పూర్ణయ్య, కృష్ణరాజ III హయాములో (క్రీ. శ. 1799 – 1832) గిద్ద కంఠీరవ పణం తిరిగి ప్రవేశ పెట్టారు (గిద్ద అంటే, మందమైన అని అర్థం). ఈ సంప్రదాయం, హైదర్ ఆలి, టిపూ సుల్తాన్ కాలంలో కూడా కొనసాగింది. వీటిని, ఇంకా మరిన్ని విశేషాలని చూడడానికి, అమర్ బిల్డింగ్ (గ్రౌండ్ ఫ్లోర్), సర్ పి ఎమ్ రోడ్, ఫొర్ట్, ముంబయి-400001లో గల భారతీయ రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య ప్రదర్శనశాలను దర్శించండి. సమయం: మంగళవారం నుంచి ఆదివారం వరకు, 10.45 నుంచి 17.15 వరకు. సోమవారాల్లో, బ్యాంక్ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. అల్పన కిల్లావాల పత్రికా ప్రకటన: 2015-2016/519 |