<font face="mangal" size="3">వస్తు సేవా పన్ను (GST) క్రింద నమోదు చేసిన సూక్ష్మ - ఆర్బిఐ - Reserve Bank of India
వస్తు సేవా పన్ను (GST) క్రింద నమోదు చేసిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రుణగ్రహీతల కోసం రిలీఫ్
ఆర్బిఐ/2017-18/129 February 07, 2018 అన్ని బ్యాంకులు మరియు భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రించే అన్ని నాన్ బ్యాంకింగ్ మేడం / డియర్ సర్, వస్తు సేవా పన్ను (GST) క్రింద నమోదు చేసిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రుణగ్రహీతల కోసం రిలీఫ్ ప్రస్తుతం భారతదేశంలో సాధారణంగా రుణ ఖాతా 90 రోజులు దాటినప్పుడు బ్యాంకులు, 120 రోజులు దాటినప్పుడు ఎన్ బి ఎఫ్ సిలు వాటిని నిరర్ధక ఆస్తులు (ఎన్ పి ఎ) గా పరిగణిస్తున్నాయి. పరిణామ దశలో మార్పుల సమయంలో వస్తు సేవా పన్ను క్రింద నమోదు చేయడం ద్వారా, చిన్న సంస్థలు బ్యాంకులు మరియు ఎన్ బి ఎఫ్ సిలకు వారి తిరిగి చెల్లించవలసిన బాధ్యతలను ఎదుర్కొనేటప్పుడు నగదు ప్రవాహాలపై వ్యాపారం ప్రతికూలత ఉంటుందని మాకు అభ్యర్ధనలు వచ్చాయి. లాంఛనప్రాయీకృత వ్యాపార పరిస్థితులకై ఈ సంస్థలకు మద్దతు ఇచ్చే కొలమానంగా, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సంస్థగా వర్గీకరించబడిన రుణగ్రహీతలకు బ్యాంకులు మరియు ఎన్ బి ఎఫ్ సిలు ఇచ్చే రుణాలు, క్రింది నిబంధనలకు లోబడి, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME), చట్టం, 2006 ప్రకారం ప్రామాణిక ఆస్తిగా వర్గీకరించబడుతుంది: i. జనవరి 31, 2018 నాటికి రుణగ్రహీత వస్తు సేవా పన్ను క్రింద నమోదు చేసుకొని ఉండాలి ii. బ్యాంకులకు, ఎన్ బి ఎఫ్ సిలకు నిధుల ఆధారిత సదుపాయాలతో సహా రుణగ్రహీత యొక్క మొత్తం ఎక్స్పోజర్, జనవరి 31, 2018 నాటికి ₹ 250 మిలియన్లు మించకూడదు. iii. ఆగష్టు 31, 2017 నాటికి రుణగ్రహీత యొక్క ఖాతా ప్రామాణిక ఆస్తిగా వర్గీకరించబడి ఉండాలి. iv. సెప్టెంబరు 1, 2017 నాటికి రుణగ్రహీత నుండి వచ్చే బకాయి మొత్తం మరియు సెప్టెంబరు 1, 2017 మరియు జనవరి 31, 2018 మధ్య రుణగ్రహీత నుండి వచ్చే చెల్లింపులు మొత్తం 180 రోజుల కంటే తక్కువ వ్యవధి కాలంలో, వాటి అసలు గడువు తేదీ నుండి చెల్లింపబడాలి. v. ఈ సర్కులర్ లోని నిబంధనల ప్రకారం నిరర్ధక ఆస్తులు గా వర్గీకరించని ఎక్స్పోజర్లకు, బ్యాంకులు / ఎన్ బి ఎఫ్ సిలు 5 శాతం ప్రొవిజిన్ చేయాలి. ఖాతా సంబంధించి 90/120 $ రోజుల బకాయి నియమానికి మించి మొత్తం చెల్లించనప్పుడు, ఈ నియమావళిని మార్చవచ్చు. vi. అదనపు సమయం కేవలం ఆస్తి వర్గీకరణకు మాత్రమే కానీ, ఆదాయ గుర్తింపు కోసం కాదు అనగా రుణగ్రహీత నుండి 90/120* కన్నా ఎక్కువ రోజుల పాటు వడ్డీ బకాయి వున్నట్లైతే, హక్కు కలుగజేసేదిగా గుర్తించడం సాధ్యం కాదు. మీ విధేయులు, (ఎస్. కె. కర్) |