<font face="mangal" size="3">భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్య - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
తేది: 15/07/2019 భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా (i) ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC), (ii) వాడుక ఖాతాలను (కరెంట్ అకౌంట్) తెరవడానికి మరియు నిర్వహించడానికి ప్రవర్తనా నియమావళి మరియు సెంట్రల్ రిపోజిటరీ అఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) పై డేటాను నివేదించడం మరియు (iii) మోసపూరిత కార్యకలాపాల రిస్క్ నిర్వహణ మరియు మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు వాటి నివేదిక సమర్పించడం కోసం జారీ చేసిన ఆదేశాలు పాటించనందుకు, భారతీయ స్టేట్ బ్యాంకు ఫై మే 14, 2018 నాటి ఆదేశం ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 70 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47A(1)(c) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని విధించడం జరిగింది. ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించనందుకు మాత్రమే తప్ప, బ్యాంకుతో వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు ప్రామాణికత పై అభిప్రాయ వ్యక్తీకరణ కాదు. నేపధ్యం బ్యాంకు యొక్క మార్చి 31, 2017 నాటి ఆర్థిక స్థితిగతుల గురించి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిపిన చట్టబద్ధమైన తనిఖీలో మిగతా విషయాలతోపాటు, ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ (IRAC), కస్టమర్ల గురించి ఇతర బ్యాంకులతో సమాచారాన్ని పంచుకోవడం, సెంట్రల్ రిపోజిటరీ అఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) పై డేటాను నివేదించడం మరియు మోసపూరిత కార్యకలాపాల రిస్క్ నిర్వహణ మరియు మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు వాటి నివేదిక సమర్పించడం కోసం ఆర్.బి.ఐ జారీ చేసిన ఆదేశాల అనుపాలనలో బ్యాంకు విఫలమైనట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక మరియు అందిన ఇతర దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/154 |