RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518187

ది భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, భీమవరం(ఆంధ్రప్రదేశ్) కు భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్దేశాల జారీ

ఏప్రిల్ 15, 2019

ది భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, భీమవరం(ఆంధ్రప్రదేశ్) కు భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్దేశాల జారీ

ప్రజల ప్రయోజనాల కోసం, ది భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, భీమవరం (ఆంధ్రప్రదేశ్) కు కు కొన్ని నిర్దేశాలను జారీ చేయడం అవసరం అని భారతీయ రిజర్వు బ్యాంక్ గుర్తించింది. తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35 ఏ, సబ్ సెక్షన్ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు) తో పాటు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 56 క్రింద నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు సంక్రమించిన అధికారాలతో, ది భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, భీమవరం (ఆంధ్రప్రదేశ్) మార్చి 28, 2019 తేదీ పనిముగింపు వేళ నుండి, ఈ క్రింద పేర్కొన్మ మేరకు మరియు సూచించిన పద్ధతిలో తప్ప, భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతిపొందనిదే, వారు లోనులు మరియు అడ్వాన్సులను ఇవ్వరాదు మరియు నవీకరించరాదు; ఎటువంటి చెల్లింపులు చేయరాదు; అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపాజిట్లు అంగీకరించడంతో సహా, ఎటువంటి రుణభారం స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నేరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి రాజీ, సర్దుబాటు ఒప్పందములు కుడుర్చుకోరాదు; మరియు వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ చేయరాదని ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు:-

(అ) డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక ఏదేని పేరుతొ పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి కేవలం 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) ఉపసంహరించడానికి అనుమతించబడతారు; అయితే అటువంటి డిపాజిటుదారు బ్యాంకుకు ఏ విధంగానైనా ఋణపడి ఉంటే, అంటే రుణగ్రహీతగా గాని లేదా జామీనుదారుగా గాని, ఆ మొత్తాన్ని ముందుగా సంబంధిత ఋణ ఖాతా/ఖాతాలకు సర్దుబాటు చేసిన తరువాతనే.

(ఆ) అదే పేరు మరియు అదే సామర్ధ్యం (కెపాసిటీ) కలిగి ఉన్న ప్రస్తుత కాలపరిమితి డిపాజిట్లు గడువు తీరితే వాటిని పునరుద్ధరించవచ్చు.

(ఇ) శీర్షిక ఆదేశాలలో అనుమతించిన విధంగా ఖర్చులు భరించవచ్చు.

(ఈ) ప్రభుత్వ / యస్.యల్.ఆర్ ఆమోదిత (SLR approved) సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రత్యేకంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి లిఖిత పూర్వక అనుమతి పొందనిదే ఆ బ్యాంక్ ఎటువంటి ఇతర బాధ్యతలు జరపడం లేదా రద్దు చేయడం కుదరదు.

వివరాలతో కూడిన ఆదేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.

రిజర్వ్ బ్యాంక్ చే నిర్దేశాల జారీ ని, స్వతహాగా బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసినట్లుగా ఎంతమాత్రం భావింపరాదు. బ్యాంక్ తన ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే వరకూ, నిబంధనలకు లోబడి, తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ ఆదేశాలు మార్చి 28, 2019 తేదీ పనిముగింపు వేళ నుండి ఆరు నెలల కాలం పాటు అమలులో ఉంటాయి మరియు సమీక్షకు లోనవుతాయి.

(అనిరుద్ధ డి.జాధవ్)
జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2454

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?