<font face="mangal" size="3">ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC) ఏప్రిల్ - ఆర్బిఐ - Reserve Bank of India
ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC) ఏప్రిల్ 5-7, 2021
ఏప్రిల్ 07, 2021 ద్రవ్య విధాన కమిటీ యొక్క తీర్మానం (MPC) నేటి (ఏప్రిల్ 07, 2021) సమావేశంలో, ప్రస్తుత మరియు మార్పు చెందుతున్న స్థూల ఆర్దిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ విధంగా నిర్ణయించింది:
పర్యవసానంగా, రివెర్స్ రెపో రేట్ LAF కింద 3.35 శాతంగా; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు 4.25 శాతం గా కొనసాగుతాయి.
MPC యొక్క నిర్ణయం, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వుంది. ఈ నిర్ణయం తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది: అంచనాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ 2. ఫిబ్రవరిలో MPC సమావేశం నుండి, Q4:2020 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో మందగమనం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవలి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అసమానతల తో రికవరీ ఉండొచ్చని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో COVID-19 యొక్క కొత్త మ్యుటేషన్ లు, రెండవ మరియు మూడవ వేవ్ ఇన్ఫెక్షన్లు, టీకాకరణ అసమానతల వల్ల, టీకా రోల్ అవుట్ ల నుండి ఎంతోకాలంనుంచి ఆశించిన ఆర్ధిక కార్యకాలాపాల వృద్ధి కొంత మేర నిరోధించబడింది. ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు Q4: 2020 మరియు జనవరి 2021 లో మెరుగుపడ్డాయి. తాజా లాక్డౌన్లు మరియు అణగారిన డిమాండ్, పెరుగుతున్న షిప్పింగ్ ఛార్జీలు మరియు కంటైనర్ ల కొరత లాంటి COVID-19 సంబంధిత కారణాలు ఆందోళనలను కల్గిస్తున్నాయి. ద్రవ్య విధానాల సర్దుబాటు వైఖరి, ఇంకా ఉద్దీపన పథకాల మూలాన మార్కెట్ ఆధారిత సూచికల ద్రవ్యోల్బణం అంచానాల ఆందోళనలు ప్రపంచ వ్యాప్త బాండ్ మార్కెట్లను అస్థిరతకు గురిచేసినప్పటికీ, అభివృద్ధిచెందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థల (AE లు)లో ద్రవ్యోల్బణం నిరపాయంగా ఉంది. అయితే, కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో (EME లు) ద్రవ్యోల్బణం లక్ష్యాలకు మించి ఉంటున్నది, ప్రధాన కారణం గ్లోబల్ కమోడిటీ ధరలు బలపడడం వల్ల. ఇది వారిలో కొంతమందిని పాలసీ రేట్లను పెంచడానికి కూడా ప్రేరేపించింది. దీర్ఘకాల బాండ్ల రాబడులు పెరగడం ఇంకా రాబడి రేఖలు క్రిందికి దిగడం తో ఈక్విటీ మరియు కరెన్సీ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయి. అయితే, ఈ మధ్యనే సాధారణ స్థితి నెలకొంది. మరియు ప్రధాన ఈక్విటీ మార్కెట్లు మార్చి లో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికన్ డాలర్ ఫర్మ్ గా ఉండడంతో, కరెన్సీ మార్కెట్లు మిక్స్డ్ గా ట్రేడ్ అయ్యాయి. బాండ్ల మార్కెట్లలో అమ్మకాల జోరుతో, EMEలలో అసెట్ లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికిదారితీసి, క్యాపిటల్ అవుట్-ఫ్లో భయంతో EMEల కరెన్సీలు మార్చి నెలలో బలహీనతకు గురైయాయి. దేశీయ ఆర్ధిక వ్యవస్థ 3. ఫిబ్రవరి 26, 2021 న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన 2020-21 రెండవ ముందస్తు(అడ్వాన్స్) అంచనాలు ఈ సంవత్సరం భారతదేశం యొక్క రియల్ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 8.00 శాతం మేరకు కుంచించుకుపొతుందని సూచించాయి. హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు – వాహనాల అమ్మకాలు, రైల్వే సరుకు రవాణా, టోల్ కలెక్షన్లు, GST వసూళ్లు, ఇ-వే బిల్లులు మరియు ఉక్కు వినియోగం - మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) తయారీ మరియు సేవల రంగాలలో జరిగిన మేళ్ళు Q4 లో కూడా కొనసాగుతాయని చెబుతున్నాయి. మార్చ్ 2021 తయారీ రంగం పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI), ఫిబ్రవరి స్తాయి కంటే తక్కువగా, విస్తరణ దశలో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక జనవరి 2021 లో కొంతమేరకు సంకోచం స్థితి కి పడిపోయింది, తయారీ మరియు గనుల రంగం దెబ్బతినడంతో. కోర్ పరిశ్రమలు కూడా ఫిబ్రవరి లో సంకుచితమైనాయి. ఆహార ధాన్యాలు మరియు ఉద్యాన ఉత్పత్తుల ద్వారా వ్యవసాయం యొక్క స్థితిస్థాపకత 2020-21 లో స్పష్టంగా తెలుస్తున్నది, ఇవి వరుసగా 2.0 శాతం మరియు 1.8 శాతం 2019-20 తుది అంచనాల కంటే అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. 4. జనవరి 2021 లో 4.1 శాతానికి దిగివచ్చిన తరువాత, హెడ్-లైన్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి లో 5.00 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో మొత్తం ఆహార ద్రవ్యోల్బణo 4.3 శాతం నమోదు లో, పన్నెండు ఫుడ్-సబ్-గ్రూపుల కు గాను ఐదు, రెండంకెల ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. ఫిబ్రవరి లో, ఇంధన ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంతవరకు తగ్గినా, కోర్ (ప్రధాన) ద్రవ్యోల్బణం ధృఢమై 50 బేసిస్ పాయింట్లు పెరిగి 6.00 శాతానికి చేరుకుంది. 5. సగటు రోజువారీ లిక్విడిటీ గ్రహింపు ₹ 5.9 లక్షల కోట్లతో, ఫిబ్రవరి మరియు మార్చి 2021 లో వ్యవస్థలో లిక్విడిటీ అధిక మిగులుతో ఉంది. కరెన్సీ డిమాండు పెరగడంతో, రిజర్వ్ మనీ (ఆర్‌ఎం) 2021 మార్చి 26 నాటికి 14.2 శాతం (వై-ఓ-వై) ఏటికేడాది ప్రాతిపదికన పెరిగింది. రుణ వృద్ధి 5.6 శాతంగా ఉండడంతో, 2021 మార్చి 26 నాటికి డబ్బు సరఫరా (ఎం 3) 11.8 శాతం పెరిగింది. 2020-21 లో (2021 ఫిబ్రవరి వరకు) ₹ 6.8 లక్షల కోట్ల కార్పొరేట్ బాండ్ల జారీ, గత ఏడాది ఇదే కాలం ₹ 6.1 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. కమర్షియల్ పేపర్ (సిపి) జారీ 2020 డిసెంబర్ నుండి దశ తిరిగి, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, డిసెంబర్ 2020 నుండి మార్చి 2021 వరకు 10.4 శాతం పెరిగింది . భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు 2020-21లో 99.2 బిలియన్ డాలర్లు పెరిగి 2021 మార్చి చివరి నాటికి 577.0 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, ఇది 18.4 నెలల దిగుమతులను మరియు 102 శాతం అంతర్జాతీయ అప్పును సంభాళింపు (కవర్ చేయ) చేయగలదు. దృక్పథం (ఔట్లుక్) 6. మార్పుచెందుతున్న సిపిఐ ద్రవ్యోల్బణ పథం ఎగుడుదిగుడు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. 2020-21 ఆహార ధాన్యాల బంపర్ ఉత్పత్తి రాబోయే రోజుల్లో తృణధాన్యం ధరల మ్రుదుత్వాన్ని నిలపోచ్చు. పప్పుధాన్యాల ధరలు, ముఖ్యంగా కందిపప్పు మరియు మినప్పప్పులు, అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్లలో వచ్చే రబీ పంట చేరికలు మరియు 2020-21 లో మొత్తం దేశీయ ఉత్పత్తుల పెరుగుదలలు ఇంకా వీటి దిగుమతుల మూలంగా, సప్లై పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా రాబోయే దినాల్లో వీటి ధరలను కొంత అదుపు చేయవచ్చు. వంట నూనెల ద్రవ్యోల్బణం అంతర్జాతీయ ధరల ధృడత్వం తో ఆకాశాన్ని తాకుతున్నది, అయితే ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించడం ఇంకా దేశీయంగా వాటి ఉత్పత్తికి ప్రోత్సాహాలు ప్రకటించడం లాంటి చర్యల వల్ల మధ్యావధికి డిమాండ్ సప్లై సమతౌల్యాన్ని సాధించవచ్చు. పెట్రోలియం ఉత్పత్తులు మరియు వాటి పంపింగ్ ధరలు అధికంగానే ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీలు ఇంకా సెస్సులు మరియు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గిస్తే, వినియోగదారులకు కొంత ఊరట కలిగించవచ్చు, దీనికితోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా సరళం గానే ఉన్నాయి. ఈ చర్యలవల్ల సెకండ్ వేవ్ దుష్ప్రభావాన్నికొంత తగ్గించ వచ్చు. అంతర్జాతీయంగా వస్తువుల అధిక ధరలు మరియు పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చుల ప్రభావం దేశీయంగా తయారీ మరియు సేవల రంగాలను ప్రభావితం చేస్తున్నాయి. చివరగా, పట్టణ గృహపరివార ఒకసంవత్సరం ముందు హోరిజోన్ ద్రవ్యోల్బణ అంచానాలు మూడు మాసాల ముందు హోరిజోన్ ద్రవ్యోల్బణం అంచానాల కంటే స్వల్పంగా పెరిగాయని రిజర్వు బ్యాంకు మార్చ్ 2021 సర్వే సూచిస్తున్నది. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా త్రైమాసికం-4: 2020-21 కి 5.00 శాతంగా అంచనా వేయబడింది; త్రైమాసికం-1: 2021-22 కి 5.2 శాతం, త్రైమాసికం-2: కి 5.2 శాతం గా, త్రైమాసికం-3 కి 4.4 శాతం మరియు త్రైమాసికం-4 కి 5.1 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, ఇపుడు ప్రొజెక్ట్ చేయబడింది (చార్ట్-1). 7. ఇక వృద్ధి యొక్క దృక్పథం వైపుకు మళ్ళితే, గ్రామీణ గిరాకీ గణనీయంగా ఉంది మరియు వ్యవసాయంలో ఉత్పత్తి మంచి ఫలితాన్నిస్తుంది. ఆర్ధిక కార్యకలాపాలు సాధారణీకరణచెందడంతో పట్టణ ప్రాంత గిరాకీ బలపడి ఇంకా, జోరుగా జరుగుతున్న టీకా డ్రైవ్ వల్ల ఊపందుకుంటుంది. ఆర్ధిక ఉద్దీపనల రూపేణా కేంద్ర బడ్జెట్ 2021-22 కింద పెరిగిన మూల-ధన వ్యయo కేటాయింపులు ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) పథకం ను విస్తారించడం మరియు పెరుగుతున్న సామర్థ్య వినియోగం (క్యూ 2 లో 63.3 శాతం నుండి క్యూ 3: 2020-21లో 66.6 శాతానికి) పెట్టుబడి డిమాండ్ కు మరియు ఎగుమతులకు బలమైన మద్దతు ఇవ్వాలి. మార్చి 2021 లో రిజర్వు బ్యాంకు పోల్ చేసిన తయారీ, సేవలు మరియు మౌలిక సదుపాయాలలో నిమగ్నమైన సంస్థలు 2021-22 వరకు డిమాండ్ మరియు వ్యాపార కార్యకలాపాల విస్తరణ గురించి ఆశాజనకంగా ఉన్నాయి. మరోవైపు, వినియోగదారుల విశ్వాసం కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల COVID ఇన్ఫెక్షన్ల పెరుగుదలతో కుంగిపోయింది, ఇది దృక్పథానికి అనిశ్చితిని ఇస్తుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రియల్ జిడిపి వృద్ధి అంచనా 2021-22లో 10.5 శాతంగానే ఉంచబడింది – ఇందులో Q 1 లో 26.2 శాతం, Q 2 లో 8.3 శాతం, Q 3 లో 5.4 శాతం, Q 4 లో 6.2 శాతం కూడి ఉంది (చార్ట్ 2). 8. ద్రవ్యోల్బణంపై సప్లై సైడ్ ఒత్తిడి కొనసాగుతుందని మరియు డిమాండ్-సైడ్ ప్రేరణ మితంగా ఉంటుందని MPC పేర్కొంది. కాస్ట్-పుష్ ఒత్తిళ్లు పెరిగినప్పటికీ, విశ్వవ్యాప్తంగా సరఫరా లింకుల సాధారణీకరణతో ఆ ఒత్తిళ్ళు పాక్షికంగా తొలగింపబడతాయి. గ్లోబల్ కమాడిటీ ధరల నుండి దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణంపై, కేంద్రం మరియు రాష్ట్రాల తక్షణ సమన్వయ మరియు సమన్వయ విధాన చర్యలు పెట్రోల్ మరియు డీజిల్ మీద పన్నులు మరియు అధిక రిటైల్ మార్జిన్లు లాంటి దేశీయ ఇన్పుట్ ఖర్చులను తగ్గించగలవు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో COVID-19 అంటువ్యాధుల పునరుద్ధరణ మరియు అనుబంధిత స్థానికీకరించిన లాక్‌డౌన్లు కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలకు డిమాండ్‌ను తగ్గించగలవు, వృద్ధి ప్రేరణలను నిరోధించగలవు మరియు సాధారణ స్థితికి తిరిగిరావడాన్ని జాప్యం చేయగలవు. ఇటువంటి వాతావరణంలో, నిరంతర విధాన మద్దతు చాలాఅవసరం. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని MPC నిర్ణయించింది.. 9. MPC సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ – పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉండటానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఇంకా, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న టార్గెట్ లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo పరిమితం చేసేందుకు, వృద్ధి లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని ఓటు వేశారు. 10. MPC యొక్క వివరాల టిప్పణి (మినిట్స్) ను ఏప్రిల్ 22, 2021 లోగా ప్రచురించడం జరుగుతుంది. 11. ఎంపిసి తదుపరి సమావేశం జూన్ 2 నుండి 4, 2021 వరకు జరుగుతుంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2021-2022/16 |