<font face="mangal" size="3">ప్రాధాన్యతా రంగాలకు అప్పులిచ్చేందుకు ప్రా - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాధాన్యతా రంగాలకు అప్పులిచ్చేందుకు ప్రాధమిక (ప్రైమరీ) (అర్బన్) సహకార (కో-ఆపరేటివ్) బ్యాంకులకు (యూసీబీలు) సవరించబడిన మార్గదర్శకాలు
ఆర్.బి.ఐ/2017-18/175 మే 10, 2018 చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ డియర్ సర్ / మేడమ్, ప్రాధాన్యతా రంగాలకు అప్పులిచ్చేందుకు ప్రాధమిక (ప్రైమరీ) (అర్బన్) సహకార (కో-ఆపరేటివ్) బ్యాంకులకు (యూసీబీలు) సవరించబడిన మార్గదర్శకాలు దయచేసి పైన పేర్కొన్న శీర్షిక విషయం మీద అక్టోబర్ 8, 2013 తేదీ నాటి మా సర్కులర్ నం.యూ.బి.డి./సీ.ఓ.బీపిడి(పి.సి.బి)యంసి.నం./18/09.09.001/2013-14 మరియు అందు నిమిత్తము ఎప్పటికప్పుడు చేసిన సవరణలను సంఘటితపరం చేయబడిన మాస్టర్ సర్కులర్ డి.సి.బి.ఆర్/బీ.పి.డి(పి.సి.బి) యంసి.నం. /11/09.09.001/2015-16 ను పరిశీలించవలసినది. ఇప్పుడున్న ఈ మార్గదర్శకాలను పునస్సమీక్షించడం జరిగింది మరియు పైన పేర్కొన్న మాస్టర్ సర్కులర్ లోని మార్గదర్శకాలకు బదులుగా సవరించబడిన మార్గదర్శకాలను (అనుబంధం-I రూపేణా) జారీ చేయాలని నిర్ణయం తీసుకోబడింది. 2. ఈ సవరించబడిన మార్గదర్శకాల ముఖ్యాంశాలు ఈక్రింద పేర్కొనబడినాయి:- i) మొత్తం ప్రాధాన్యతా రంగం మరియు బలహీన వర్గాలకు ఋణాల లక్ష్యం ఇపుడున్న విధంగా అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో ఏదైతే అధికమో, 40 శాతం మరియు 10 శాతం యధాక్రమముగా కొనసాగుతాయి. ii) వ్యవసాయo: ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యవసాయo మధ్యయున్నవ్యత్యాసము తొలగించబడినది. iii) ఆహార మరియు వ్యవసాయ(ఆగ్రో)శుద్ధి యూనిట్లకు ఇచ్చే బ్యాంకు ఋణాలు వ్యవసాయం లో భాగం అవుతాయి. iv) మధ్యస్థమైన (మీడియం) సంస్థలు, సాంఘిక (సోషల్) మౌళిక సదుపాయాల కల్పన మరియు పునరుద్ధరణీయ శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) ప్రాధాన్యతా రంగoలో భాగం అవుతాయి. v) అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 7.5 (ఏడున్నర) శాతం ఏదైతే అధికమో దానిని, సూక్ష్మ సంస్థల (మైక్రో ఎంటర్ప్రైజెస్) కు ఋణాల లక్ష్యం గా నిర్ధారింపబడింది. vi) స్వదేశీ మరియు విదేశీ విద్యా ఋణాల మధ్యయున్నవ్యత్యాసము తొలగించబడినది. vii) ప్రాధాన్యతా రంగం క్రింద మైక్రో క్రెడిట్ ప్రత్యేక క్యాటగరీ గా ఉండబోదు. viii) ప్రాధాన్యతా రంగం క్రింద అర్హతగల హౌసింగ్ ఋణాల పరిమితులు సవరించ బడినాయి. ix) ప్రాదాన్యతా రంగం అంచనా (అసెస్మెంట్) త్రైమాసం మరియు వార్షిక నివేదికల (స్టేట్మెంట్లు) ద్వారా పర్యవేక్షింప బడుతుంది. 3. సవరించిన మార్గదర్శకాలు ఈ సర్కులర్ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ తేదీకి పూర్వం జారీచేసిన మార్గదర్శకాలక్రింద మంజూరైన ప్రాధాన్యతా రంగం ఋణాలు వాటి గడువు/ రెన్యూవల్ వరకు ప్రాధాన్యతా రంగ వర్గీకరణ క్రిందనే కొనసాగుతాయి. 4. ప్రాధాన్యతా రంగ లక్ష్యాల కార్యసిద్ధి ప్రాధాన్యతా రంగ లక్ష్యాల సాధనను వివిధ ప్రయోజనాలకోసం రెగ్యులేటరీ క్లియరెన్సులు/ ఆమోదాలు మంజూరు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్ 1, 2018 వ తారీఖు నుండి ఒక UCB (యూసీబీ) వర్గీకరణ కోసం ఆర్ధికంగా పటిష్టం మరియు సరియైన నిర్వహణ (FSWM) యున్న దానిగా ప్రామాణీకరించడంలో, ప్రాధాన్యతా రంగ లక్ష్యాల కార్యసిద్ధి పరిగణనలోకి తీసుకోబడుతుంది. వరుసగా అక్టోబర్ 13, 2014 మరియు జనవరి 28, 2015 తేదీల నాటి మా సర్కులర్ UBD.CO.LS.(PCB) .No.20/07.01.000/2014-15 మరియు DCBR.CO.LS. (PCB).No.4/ 07.01.000/2014-15 లలో సూచించిన ప్రామాణీకరణ కు ఇది అదనం. 2018-19 ఆర్దిక సంవత్సంనకు గాను, మార్చి 31, 2018 తేదీ నాటి స్థితి ఆధారంగా ప్రాధాన్యతా రంగం లక్ష్యం/ఉపలక్ష్యాల తగ్గుదల అంచనా వేయబడుతుంది. 2018-19 వ ఆర్దిక సంవత్సరం నుండి, ప్రతి త్రైమాసం ముగింపునాటి ప్రాధాన్యతా రంగం లక్ష్యం/ఉపలక్ష్యాల సరాసరి ప్రగతి ఆధారం చేసుకొని, ఆర్దిక సంవత్సరం ముగింపునాటి లక్ష్యపురోగతి నిర్దారింపబడుతుంది. స్పష్టపఱచే ఉదాహరణ అనుబంధం-II నందు ఇవ్వబడింది. మీ విధేయులు (నీరజ్ నిగం) జతచేయబడినవి: అనుబంధం I మరియు II. |