<font face="mangal" size="3">బ్యాంకుల కొరకు సవరించిన తక్షణ దిద్దుబాటు చర - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకుల కొరకు సవరించిన తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) ఫ్రేంవర్క్
ఆర్.బి.ఐ/2016-17/276 ఏప్రిల్ 13, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మేడం/డియర్ సర్ బ్యాంకుల కొరకు సవరించిన తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) ఫ్రేంవర్క్ తక్షణ దిద్దుబాటు చర్య పథకం (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) క్రింద దయచేసి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన DBS.CO.PP.BC.9/11.01.005/2002-03 తేదీ డిసెంబర్ 21, 2002 మరియు DBS.CO.PP.BC.13/11.01.005/2003-04 తేదీ జూన్ 15, 2004 నాటి సర్క్యులర్లు చూడండి. 2. బ్యాంకుల కోసం ఉన్న పిసిఎ ఫ్రేంవర్క్ ను సమీక్షించి సవరించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు అనుబంధం లో పొందుపరచబడ్డాయి. 3. సవరించిన పిసిఎ ఫ్రేంవర్క్ యొక్క నిబంధనలు మార్చి 31, 2017 తో ముగిసిన బ్యాంకుల ఆర్థిక సంవత్సరానికి, ఏప్రిల్ 1, 2017 నుంచి అమలులోకి వస్తాయి. మూడు సంవత్సరాల తరువాత ఈ ఫ్రేంవర్క్ ను సమీక్షించడం జరుగుతుంది. 4. నిర్దేశించిన దిద్దుబాటు చర్యలకు అదనంగా, అవసరమైన ఇతర చర్యలను తీసుకోవడానికి పిసిఎ ఫ్రేంవర్క్ భారతీయ రిజర్వు బ్యాంకును నిబంధించదు. 5. ఈ సర్క్యులర్ లోని విషయాలను బ్యాంకు బోర్డు యొక్క డైరెక్టర్ల దృష్టికి తీసుకురావచ్చును. మీ విశ్వసనీయులు (పార్వతీ వి. సుందరం) బ్యాంకుల కోసం సవరించిన పిసిఎ ఫ్రేంవర్క్ యొక్క ప్రధానాంశాలు ఎ. మూలధనం, ఆస్తి నాణ్యత మరియు లాభదాయకత, సవరించిన ఫ్రేంవర్క్ లో పర్యవేక్షణ కోసం కీలక అంశాలు కొనసాగుతాయి. బి. మూలధనం, ఆస్తి నాణ్యత మరియు లాభదాయకత, సిఆర్ఎఆర్/సాధారణ ఈక్విటీ టైర్ I నిష్పత్తి1, నికర ఎన్ పి ఎ నిష్పత్తి2, ఆస్తుల ఫై రిటర్న్ కోసం సూచికలను3 ట్రాక్ చెయ్యడం. సి. పిసిఎ ఫ్రేంవర్క్ లో భాగంగా లివరేజ్ అదనంగా పర్యవేక్షించబడుతుంది. డి. ఏదేని ప్రమాద పరిమితుల ఉల్లంఘన (క్రింద వివరించినట్లుగా), పిసిఎ ప్రారంభానికి పిలుపునిస్తుంది.
ఇ. గుర్తించబడిన సూచికల ప్రమాద పరిమితుల ఉల్లంఘన ఆధారంగా, పిసిఎ ఫ్రేంవర్క్, భారతదేశంలో పనిచేస్తున్న అన్ని బ్యాంకులు, చిన్న బ్యాంకులు, శాఖలు లేదా అనుబంధాల ద్వారా పనిచేసే విదేశీ బ్యాంకులతో సహా, మినహాయింపు లేకుండా వర్తిస్తుంది. ఎఫ్. ఆర్.బి.ఐ ద్వారా ఆడిట్ చేసిన వార్షిక ఆర్ధిక ఫలితాలు మరియు పర్యవేక్షక అంచనాల ఆధారంగా, పిసిఏ ఫ్రేంవర్క్ కింద ఒక బ్యాంకు ఉంచబడుతుంది. ఏదేమైనా, పరిస్థితులు అలా అవసరమైతే, ఆర్.బి.ఐ ఒక సంవత్సర కాలంలో (ఒక ప్రమాద పరిమితి నుండి మరొక ప్రమాద పరిమితికి వెళ్ళేవాటితో సహా) ఏ బ్యాంకులోనైనా పిసిఎను విధించవచ్చు.
సానుకూల పరిష్కార చర్యలను ఎంపిక చేయడానికి సాధారణ పట్టిక 1. ప్రత్యేక పరస్పర పర్యవేక్షక చర్యలు
2. వ్యూహాత్మక సంబంధిత చర్యలు బ్యాంక్ బోర్డుకు ఆర్బిఐ క్రింది విధంగా సలహా ఇస్తుంది:
3. పాలన సంబంధిత చర్యలు
4. మూలధన సంబంధిత చర్యలు
5. క్రెడిట్ రిస్క్ సంబంధిత చర్యలు
6. మార్కెట్ రిస్క్ సంబంధిత చర్యలు
7. హెచ్ ఆర్ సంబంధిత చర్యలు
8. లాభాల సంబంధిత చర్యలు
9. ఆపరేషన్స్ సంబంధిత చర్యలు
బ్యాంకు యొక్క నిర్దిష్టమైన పరిస్థితులను పరిగణనలో ఉంచుకొని, ఆర్బిఐ తీసుకొనే ఏదైనా ఇతర చర్య 1 CET 1 నిష్పత్తి - ఆర్బిఐ బాసెల్ III మార్గదర్శకాలలో వివరించిన విధంగా కోర్ ఈక్విటీ క్యాపిటల్, రెగ్యులేటరీ సర్దుబాటుల మొత్తం, మొత్తం రిస్క్ వెయిటెడ్ ఆస్తులకు 2 NNPA నిష్పత్తి - నికర అడ్వాన్స్లకు నెట్ NPA ల శాతం 3 ROA - సగటు మొత్తం ఆస్తులు పన్ను తర్వాత లాభం శాతం 4 టైర్ 1 పరపతి నిష్పత్తి - పరపతి నిష్పత్తిలో ఆర్బిఐ మార్గదర్శకాలలో నిర్వచించిన ఎక్స్పోజర్ కొలతకు మూలధన కొలత శాతం. |