<font face="mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-19</font> - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-19
RBI/2018-19/57 తేదీ: అక్టోబర్ 08, 2018 చైర్‌మన్ & మానేజింగ్ డైరెక్టర్ అయ్యా /అమ్మా, సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-19 (ఎస్ జి బి, Sovereign Gold Bond Scheme 2018-19) భారత ప్రభుత్వం, వారి నోటిఫికేషన్ F.No. 4(22)-(W&M) /2018, తేదీ అక్టోబర్ 08, 2018 ద్వారా సార్వభౌమ పసిడి బాండ్ల (బాండ్లు) పథకం ప్రకటించినది. ఈ పథకంక్రింద సిరీస్ II మొదలు, ప్రతి విడత జారీచేసిన బాండ్లు ప్రత్యేక క్రమసంఖ్య కలిగి ఉంటాయి. ఇది మదుపరికి జారీ చేసిన బాండ్లపై సూచింపబడుతుంది. భారత ప్రభుత్వం ముందుగా ప్రకటించి, నిర్దిష్ట కాలానికి ముందే ఈపథకం ఆపివేయవచ్చు. బాండ్ల జారీకి సంబంధించిన నియమ, నిబంధనలు ఈక్రింద సూచించబడినవి: 1. మదుపుచేయుటకు అర్హత: భారత నివాసులైన వ్యక్తులు (persons resident in India), వ్యక్తిగత హోదాలో, లేక మైనర్ పిల్లల తరఫున లేక మరొక వ్యక్తితో ఉమ్మడిగా, ఈ బాండ్లు కలిగియుండవచ్చును. ఇంతేగాక, ట్రస్టులు, అవిభాజిత హిందూ కుటుంబాలు (ఎచ్ యు ఎఫ్‌లు, HUFs) ధార్మిక సంస్థలు, విశ్వవిద్యాలయాలుకూడా వీటిలో మదుపు చేయవచ్చును. భారత నివాసులు (persons resident in India) అనగా సెక్షన్ 2 (v) (సెక్షన్ 2(u) తో కలిపి) విదేశీ ముద్రా నిర్వహణ చట్టం, 1999 (Foreign Exchange Management Act, 1999)లో నిర్వచించబడినది. 2. బాండ్‌యొక్క రూపము: బాండ్లు, సెక్షన్ 3, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 ప్రకారం, భారత ప్రభుత్వ స్టాక్ రూపంలో జారీచేయబడతాయి. మదుపరులకు, హోల్డింగ్ సర్టిఫికేట్ (ఫార్మ్ C) జారీచేయబడుతుంది. బాండ్లు డి-మ్యాట్ రూపంలోకి మార్చుకొనవచ్చును. 3. జారీ తేదీ: ఒక వారంలో వచ్చిన దరఖాస్తులకు, తదుపరి వారం, పనిచేసే రెండవ రోజున, బాండ్లు జారీచేయబడును. 4. విలువ: (denomination): బాండ్లు ఒక గ్రాము బంగారం, దాని గుణిజములలో, విలువకలిగి ఉంటాయి. వ్యక్తులకు, కనీస పెట్టుబడి 1 గ్రా., గరిష్ఠ పరిమితి 4 కి. గ్రా.; హిందూ అవిభక్త కుటుంబాలకు గరిష్ట పరిమితి, 4 కి. గ్రా.; ట్రస్టులు, లేక ఆకోవకుచెందిన ఇతర సంస్థలకు [ప్రభుత్వంచే, ఎప్పటికప్పుడు ప్రకటించబడిన సంస్థలు] 20 కి. గ్రా. ఈ పరిమితులు, ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ - మార్చ్) వర్తిస్తాయి. అయితే, i. ఉమ్మడి దరఖాస్తుదారులుగల +సందర్భంలో, పైన తెలిపిన పరిమితులు, మొదటి దరఖాస్తుదారునికి మాత్రమే వర్తిస్తాయి. ii. ప్రథమ జారీలో కొనుగోలుచేసిన బాండ్లు (భారత ప్రభుత్వం జారీచేసిన వివిధ విడతలలో) మరియు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలుచేసిన బాండ్ల విలువ కలిపి, వార్షిక పరిమితిలో గణించబడుతుంది. iii. తాకట్టుగా బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థలు, వారివద్ద పెట్టుకొన్న బాండ్ల విలువ, వార్షిక పరిమితికి జోడించబడదు. 5. జారీధర: పెట్టుబడి తేదీలకు ముందువారంలోని ఆఖరి 3 పనిదినాలలో, ఇండియా బులియన్ మరియు జ్యూవెలర్స్ అసోసియేషన్ లి. ప్రకటించిన, 999 స్వచ్ఛత గల బంగారపు సాధారణ సగటు ముగింపు ధరల ఆధారంగా, భారత కరెన్సీలో నిర్ణయించబడుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసి, డిజిటల్ మాధ్యమంద్వారా చెల్లింపుచేసిన మదుపరులకు, ఒక గ్రాముకు, రూ. 50/- తగ్గింపు ఇవ్వబడుతుంది. 6. జారీ తేదీలు: ఈ పథకంక్రింద పెట్టుబడులు, క్రింది సెక్షన్ 7 లో తెలిపిన విధంగా స్వీకరించబడతాయి. భారత ప్రభుత్వం ముందుగా ప్రకటించి, నిర్దిష్ట కాలానికి ముందే, ఈ పథకం ఆపివేయవచ్చు. 7. జారీకి కాలసూచిక
8. వడ్డీ: జారీ తేదీనుండి బాండ్ల అసలు విలువపై 2.5% స్థిరమైన వార్షిక వడ్డీ, 6 నెలలకు ఒకసారి చెల్లించబడుతుంది. గడువు ముగిసిన తరువాత, అసలు మొత్తంతోబాటు, ఆఖరి వడ్డీ చెల్లించబడుతుంది. 9. దరఖాస్తులు స్వీకరించే కార్యాలయలు: షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), నిర్దిష్ట పోస్ట్ ఆఫీసులు (ప్రకటించబడినవి), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లి., మరియు గుర్తింపుపొందిన స్టాక్ ఎక్స్చేంజిలు (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లి., బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ లి.), ప్రత్యక్షంగాగానీ, ఏజంట్లద్వారాగానీ, దరఖాస్తులు స్వీకరించుటకు అనుమతించబడినవి. 10. ధర చెల్లింపు విధానాలు: భారత కరెన్సీలో, రూ. 20,000 వరకు, నగదు చెల్లింపు అంగీకరించబడుతుంది లేదా డిమాండ్ డ్రాఫ్ట్, చెక్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. స్వీకరించే కార్యాలయంపేరున, చెక్ లేక డిమాండ్ డ్రాఫ్ట్ జారీచేయవలెను. 11. తిరిగిచెల్లింపు విధానం (redemption): i) పసిడి బాండ్ల విలువ, జారీచేసిన తేదీనుండి ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి ఇవ్వబడుతుంది. గడువుకుముందు చెల్లింపు, జారీచేసినతేదీనుంచి ఐదు సంవత్సరములు గడిచిన తరువాతనుండి, వడ్డీచెల్లింపు తేదీలలో అనుమతించబడుతుంది. ii) తిరిగిచెల్లింపు విలువ, భారతకరెన్సీలో, చెల్లింపుతేదీకి ముందరి 3 వ్యాపార దినాల, 999 స్వఛ్చత గల బంగారపు సామాన్య సగటు ముగింపు ధరపై (ఇండియా బులియన్ మరియు జ్యూవెలర్స్ అసోసియేషన్ లి. ప్రకటించిన ధర) ఆధారపడి నిర్ణయించబడుతుంది. 12. తిరిగిచెల్లింపు: (repayment) RBI / డిపాజిటరీ, బాండ్‌యొక్క గడువుతేదీ, మదుపరికి, ఒక నెల ముందు, తెలియచేస్తాయి. 13. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తికి (Statutory Liquidity Ratio) అర్హత: బ్యాంకులు, లీన్ (lien) / హైపాథికేషన్ / ప్లెడ్జ్ హక్కులు వినియోగించి పొందిన పసిడిబాండ్లు మాత్రమే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తికి అర్హమౌతాయి. 14. బాండ్లపై రుణాలు: ఈబాండ్లను, రుణాలకు పూచీకత్తుగా వినియోగించుకోవచ్చు. రుణం / విలువల నిష్పత్తి, రిజర్వ్ బ్యాంక్ సామాన్య బంగారంపై రుణాలకు, ఎప్పటికప్పుడు నిర్దేశించిన విధంగానే ఉంటుంది. ఈబాండ్లపై లీన్, అధికృత బ్యాంకులు, డిపాజిటరీలో నమోదుచెయ్యాలి. బాండ్ల హామీపై రుణం జారీచేయడం, బ్యాంకు / సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బాండ్ కలిగియున్నవారు, దీనిని హక్కుగా భావించరాదు. 15. పన్నులు: బాండ్లపై వచ్చిన వడ్డీపై, ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, పన్ను విధించబడుతుంది. వ్యక్తులకు ఎస్ జి బిలు తిరిగిచెల్లించుటవల్ల కలిగిన మూలధన లాభాలపై, పన్ను మినహాయించబడినది. బాండ్ బదిలీచేయుటవల్ల వ్యక్తులకు కలిగిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై, 'ఇండెక్సేషన్' ప్రయోజనం లభిస్తుంది. 16. దరఖాస్తులు: బాండ్లకొరకు దరఖాస్తు, ఫార్మ్ ‘A’ లో లేదా దాదాపు అవే వివరాలు కలిగిన ఫార్మ్‌లో చేయవలెను. ఎన్నిగ్రాముల బంగారం కావలెనో మరియు దరఖాస్తుదారుని పూర్తి పేరు, చిరునామా స్పష్టంగా పేర్కొనవలెను. ప్రతి దరఖాస్తు, ఆదాయపన్ను శాఖ మదుపరులకు జారీచేసిన 'పాన్ (PAN)' సంఖ్య కలిగిఉండవలెను. స్వీకరించిన కార్యాలయం, దరఖాస్తుదారునికి, ఫార్మ్ ‘B’ లో రశీదు జారీచేయును. 17. నామినేషన్: నామినేషన్ ఫార్మ్ ‘D’ ద్వారా, దాని రద్దు, ఫార్మ్ ‘E’ ద్వారా చేయవలెను. (ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 (38 ఆఫ్ 2006) మరియు డిసెంబర్ 1, 2007 తేదీ ప్రభుత్వ గజెట్, పార్ట్ III, సెక్షన్ 4 లో ప్రకటించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007 ప్రకారం). నాన్-రెసిడెంట్ ఇండియన్ (వ్యక్తిగత), మరణించిన మదుపుదారు యొక్క నామినీ అయినట్లయితే, సెక్యూరిటీని ఈ క్రింది షరతులకులోబడి, తన పేరుపై బదిలీ చేయించుకోవచ్చును: i. నాన్-రెసిడెంట్ ఇండియన్, ముందస్తు చెల్లింపు లేదా గడువుతీరే తేదీవరకు సెక్యూరిటీని అట్టిపెట్టుకోవలెను. ii. వడ్డీ మరియు గడువు ముగిసిన తరువాత అందిన మొత్తం, విదేశమునకు తిరిగిపంపరాదు (non- repatriable). 18. బదిలీ: ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 (38 ఆఫ్ 2006) మరియు డిసెంబర్ 1, 2007 తేదీ ప్రభుత్వ గజెట్, పార్ట్ III, సెక్షన్ 4 లో ప్రకటించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007 ప్రకారం, ఫార్మ్ ‘F’ బదిలీపత్రం ద్వారా, బాండ్లు బదిలీచేయవచ్చును. 19. బాండ్లలో ట్రేడింగ్: బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తేదీనుండి, ట్రేడ్ చేయవచ్చు. 20. నిధుల సమీకరణపై కమిషన్: దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలకు, సేకరించిన వంద రూపాయిల పెట్టుబడులపై, ఒక రూపాయి కమిషన్ లభిస్తుంది. దీనిలో కనీసం 50%, ఏజంట్లకు / సబ్ ఏజంట్లకు, వారిద్వారా వచ్చిన వ్యాపారానికై, పంచవలెను. 21. ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగము) వారి నోటిఫికేషన్ F. No.4(2)W&M/2018 తేదీ 27 మార్చ్ 18, 2018లో తెలిపిన అన్ని ఇతర నియమనిబంధనలు, ఈబాండ్లకు వర్తిస్తాయి. 22. సార్వభౌమ పసిడి బాండ్ల, నిర్వహణకై మార్గదర్శకాలు, మా సర్క్యులర్ IDMD.CDD.No. 822/14.04.050/2018-19 తేదీ అక్టోబర్ 08, 2018 ద్వారా జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (షైని సునిల్) జతపరచినవి: పైన తెలిపినవి |