RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469693

సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16 (Sovereign Gold Bonds, 2015-16)

RBI/2015-16/218
DMD.CDD.No.939/14.04.050/2015-16

అక్టోబర్ 30, 2015

ది చైర్మన్‌ & మ్యానేజింగ్ డైరెక్టర్,
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(గ్రామీణ బ్యాంకులు మినహా)

అయ్యా/అమ్మా

సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16 (Sovereign Gold Bonds, 2015-16)

భారత ప్రభుత్వం, వారి అధికార ప్రకటన F.No.4(19)-W&M/2014, అక్టోబర్ 30, 2015, ద్వారా, నవంబర్ 05, 2015 నుండి నవంబర్ 20, 2015 వరకు, సార్వభౌమ పసిడి బాండ్లను (బాండ్లు) జారీ చేయాలని నిశ్చయించింది. ప్రభుత్వం, ముందు సూచన చేసి, ఈ పథకాన్ని, ప్రకటించిన కాల అవధి ముందే ముగించవచ్చు. బాండ్లు జారీ చేయడానికి సంబంధించిన నియమ, నిబంధనలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

1. అర్హత: బాండ్లు, దేశీయు భారత పౌరులు, వ్యక్తిగతంగా వారి పేరుమీదా, లేక మైనర్ల తరఫున, లేక వేరే వ్యక్తితో జతగా, కలిగి ఉండవచ్చు. దేశీయ భారత పౌరులు అనగా నిర్వచనం, విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 (Foreign Exchange Management Act, 1999), సెక్షన్‌ 2 (u) తో కలిపి 2(v) లో ఇవ్వబడింది.

2. సెక్యూరిటి జారీ చేసే రీతి: బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 (Government Securities Act, 2006), సెక్షన్‌ 3, అనుగుణంగా, భారత ప్రభుత్వ స్టాక్ రూపం లో జారీ చేయబడతాయి. పెట్టుబడిదార్లకు, ఫారం C (Form C) ప్రకారం ఒక హోల్డింగ్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. బాండ్లు డి-మ్యాట్ రూపం లోనికి మార్చుకోవచ్చు.

3. జారీ తేదీ: జారీ తేదీ, నవంబర్ 26, 2015.

దరఖాస్తులు, స్వీకరించే కార్యాలయాల్లో, బాండ్లకై, నవంబర్ 05, 2015 నుండి, నవంబర్ 20, 2015 తేదీ వరకు దరఖాస్తు చెయవచ్చు. భారత ప్రభుత్వం, తగిన ప్రకటన ఇచ్చి, నవంబర్ 20, 2015 కి ముందే జారీ నిలిపివేయవచ్చు.

4. డినామినేషన్‌: బాండ్లు, ఒక గ్రాము, (ఆ పై ఒకొక్క పూర్తి గ్రాము), బంగారంగా వ్యక్తీకరించబడతాయి. ప్రతి వ్యక్తి, ప్రతి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చ్), కనీసం 2 గ్రా. నుంచి గరిష్ఠంగా 500 గ్రా. వరకు పెట్టుబడి చేయవచ్చు. ఉమ్మడి పెట్టుబడిదార్ల విషయంలో ఈ పరిమితి, మొదటి దరఖాస్తు దారునికే వర్తిస్తుంది.

5. జారీ ధర: బాండ్ల ధర, అంతక్రితం వారం (సోమవారం- శుక్రవారం) భారత బులియన్‌ మరియు ఆభరణాల సంఘం (ఇండియా బులియన్‌ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్‌ లి. - ఐ బి జె ఏ) విడుదలచేసే 999 స్వఛ్ఛమైన బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా, రూపాయిల్లో నిర్ణయించడం జరుగుతుంది.

6. వడ్డీ: బాండ్ల ప్రారంభ పెట్టుబడిపై సాలీనా 2.75 శాతం (స్థిరమైన) వడ్డీ, అర్ధ సంవత్సరానికి ఒక సారి చెల్లించబడుతుంది. గడువు పూర్తి అయిన తరువాత, చివరి వడ్డీతోబాటు అసలు కూడా చెల్లించబడుతుంది.

7. దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలు: షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (గ్రామీణ బ్యాంక్‌లు మినహా), నిర్దేశించబడిన తపాలా కార్యాలయాలు, ప్రత్యక్షంగాగాని, ఏజంట్ల ద్వారాగాని, దరఖాస్తులు స్వీకరించుటకు అధికారికంగా అనుమతించబడ్డాయి.

8. చెల్లింపు మార్గాలు: బాండ్ల ధరను రూపాయిల్లో, నగదు/డిమాండ్ డ్రాఫ్ట్/చెక్/ఎలెక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. చెక్, డ్రాఫ్ట్, దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతించబడ్డ, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ల పేరుమీద, దరఖాస్తు చేసిన ప్రదేశం లో చెల్లింపబడేలా, జారీ చేయాలి.

9. తిరిగి చెల్లింపు (రిడెంప్షన్‌):

  1. బాండ్లు, జారీ చేసిన ఎనిమిది ఏళ్ళతరువాత తిరిగి చెల్లింపబడతాయి. కాలపరిమితికి ముందే రిడెంప్షన్‌ కావాలనుకొంటే, అయిదు ఏళ్ళతరువాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో, పొందవచ్చు.

  2. బాండ్లపై నగదు తిరిగి పొందే ధర, అంతక్రితం వారం (సోమవారం - శుక్రవారం), 999 స్వఛ్ఛత గల బంగారం సామాన్య సగటు ముగింపు ధర ఆధారంగా, రూపాయిల్లో నిర్ణయించబడుతుంది. భారత బులియన్‌ మరియు ఆభరణాల సంఘం (ఐ బి జె ఏ) ప్రకటించిన ధర ప్రామాణికంగా తీసుకోబడుతుంది.

10. తిరిగి చెల్లింపు తేదీ: పెట్టుబడి స్వీకరించిన కార్యాలయం, గడువు తేదీకి ఒక నెల ముందే, ఖాతాదారుకు తెలపవలెను.

11. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తికి (SLR) అర్హత: బాండ్ల లో పెట్టుబడి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తికి అర్హమైనవిగా పరిగణించబడతాయి.

12. రుణ సౌకర్యం: బాండ్లను, రుణాలకు హామీగా జతచేసు కోవచ్చు. రిజర్వ్ బ్యాంక్, సామాన్య బంగారం రుణాలపై కాలానుగతంగా విధించే మార్గదర్శకాలే ఈ బాండ్ల రుణం/విలువ నిష్పత్తి (లోన్‌-టు-వేల్యూ - LTV) కి కూడా వర్తిస్తాయి. బాండ్ల పై హక్కు, అధికృత బ్యాంకులు డిపాజిటరీలో నమోదుచేస్తాయి.

13. పన్ను మదింపు: బాండ్లపై ఆర్జించే వడ్డీపై, ఆదాయపన్ను చట్టం, 1961 (Income Tax Act, 1961) ప్రకారం, పన్ను విధించబడుతుంది. బంగారంపై వలెనే, మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.

14. దరఖాస్తులు: బాండ్లలో పెట్టుబడికై, నిర్దేశించిన ఫారం A (Form ‘A’) లో, లేదా, దానికి దగ్గరగా సరిపోయే ఇతర ఫారంలో దరఖాస్తు చేయాలి. దీనిలో గ్రాముల్లో బంగారం విలువ, దరఖాస్తుదారుని పూర్తి పేరు, చిరునామా స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తు స్వీకరించిన కార్యాలయం, ఫారం ‘B’ లో రశీదు జారీ చెయ్యాలి.

15. నామినేషన్‌: భారత ప్రభుత్వ గజెట్, తేదీ డిసెంబర్ 1, 2007, లో (భాగం III, సెక్షన్‌ 4) ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006 (38, 2006) (Government Securities Act, 2006 (38 of 2006) మరియు ప్రభుత్వ సెక్యూరిటిల నిబంధనలు, 2007 (Government Securities Regulations, 2007) కు అనుగుణంగా, నామినేషన్‌/లేక దాని రద్దు, ఫారం'D’/‘E’ల ద్వారా చేయవలెను.

16. బదలాయింపు (Transferability): భారత ప్రభుత్వ గజెట్ తేదీ డిసెంబర్ 1, 2007, లో (భాగం III, సెక్షన్‌ 4) లో ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006 (38, 2006) (Government Securities Act, 2006 (38 of 2006) మరియు ప్రభుత్వ సెక్యూరిటిల నిబంధనలు, 2007 (Government Securities Regulations, 2007) లకు అనుగుణంగా, ఫారం 'F’ నమూనాలోని లిఖితపూర్వక బదిలీపత్రం ద్వారా, బాండ్లను బదిలీ చేయవచ్చును.

17. అమ్మకం/కొనుగోలు లావాదేవీలు (ట్రేడబిలిటీ): రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తేదీనుండి, బాండ్ల అమ్మకం/కొనుగోలు చేయవచ్చు.

18. బాండ్ల జారీ పై కమిషన్‌: స్వీకరించిన పెట్టుబడి మొత్తంపై నూటికి ఒక్క రూపాయి కమిషన్‌ చెల్లించబడుతుంది. ఈ కమిషన్‌ మొత్తంలో 50% ప్రతినిధులు, ఉప ప్రతినిధులతో, వారి ద్వారా వచ్చిన వ్యాపారనికై, పంచుకోవలసి ఉంటుంది.

19. భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance), ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs), F.No.4 (13) W&M/2008, తేదీ అక్టోబర్ 8, 2008 లో వివరించిన ఇతర నియమ నిబంధనలు, ఈ బాండ్లకు వర్తిస్తాయి.

విధేయులు,
చందన్‌ కుమార్
డెప్యూటీ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?