<font face="mangal" size="3px">అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన</fo - ఆర్బిఐ - Reserve Bank of India
అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన
ఏప్రిల్ 05, 2018 అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన ఈ ప్రకటన, బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు; ఫైనాన్షియల్ మార్కెట్ లను విస్తృతపరచేందుకు మరియు బలోపేతం చేసేందుకు, కరెన్సీ నిర్వహణను మెరుగుమరచేందుకు; ఆర్దిక సమీకృతo మరియు అక్షరాస్యతను వృద్ధిపరిచేందుకు; మరియు సమాచార నిర్వహణను సులభతరం చేసేందుకు వివిధ అభివృద్ధి మరియు నియంత్రణా విధాన చర్యలను నిర్దేశిస్తుంది. I. నియంత్రణ మరియు పర్యవేక్షణ 1. వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ లో విధాయకమైన లోన్ కంపోనేంట్ నిర్వహణా మూలధన విత్త (వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్) ఋణ గ్రహీతలలో మంచి ఋణ చరిత్ర ను ప్రోత్సహించేందుకు, పెద్ద ఋణ గ్రహీతలకు ఫండ్ ఆధారిత వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ లో ఋణ భాగం (లోన్ కంపోనేంట్) కనీస స్థాయిని నిర్దేశించాలని ప్రతిపాదించబడింది. ఈ విషయంలో ప్రతిపుష్టి (అభిప్రాయo) కోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు. 2. కౌంటర్సైక్లికల్ క్యాపిటల్ బఫర్ (CCCB) రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఫిబ్రవరి 5, 2015 వ తేదీన జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కౌంటర్సైక్లికల్ క్యాపిటల్ బఫర్ యొక్క రూపురేఖలను (ఫ్రేంవర్క్) సంస్థాపితం చేయడం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు CCCB యాక్టివేట్ చేయబడుతుందని మరియు తగు నిర్నయాన్ని నాలుగు త్రైమాసికాల అవధితో సాధారణంగా ముందు అనౌన్సు చేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫ్రేంవర్క్ క్రెడిట్-టు-GDP గ్యాప్ ను ప్రధాన సూచిక (ఇండికేటర్) గా, ఇతర సప్లిమెంటరీ సూచికలతో అనగా, జరుగుతున్న మూడు సంవత్సరాల అవధి లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి (GNPA వృద్ధి మరియు క్రెడిట్-టు-జీడీపీ గ్యాప్ తో దాని నిర్దిష్ట సహసంబంధం), ఇండస్ట్రియల్ ఔట్లుక్ (IO) అంచనా సూచిక( GNPA వృద్ధి తో దాని సహసంబంధoనకు తగిన సూచన తో) మరియు ఇంటరెస్ట్ కవరేజ్ రేషియో (క్రెడిట్-టు-జీడీపీ గ్యాప్ తో దాని సహసంబంధాన్ని సూచిస్తూ) కలిపి వాడవచ్చని వెల్లడిస్తున్నది. CCCB ఇండికేటర్ల సరళ పరీక్షణం మరియు సమీక్ష ఆధారంగా, CCCB ని ప్రస్తుత సమయంలో యాక్టివేట్ చేయనవసరం లేదని నిర్ణయించబడింది. 3. భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలు (ఇండ్ ఏయస్) అమలు వాయిదా ఫిబ్రవరి 11, 2016 తేదీ నాటి మా సర్కులర్ ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ( ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మినహాయించి) ఏప్రిల్ 1, 2018 తేదీ నుండి భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను అమలు చేయాల్సిన అవసరం యున్నది. అయితే, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 మూడవ షెడ్యూల్ లో నిర్దేశింపబడినవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఇండ్ ఏయస్ అకౌంట్లకు అనుగుణంగా సిద్దం చేయడానికి తప్పనిసరి చట్ట సవరణలు ప్రభుత్వం వారి పరిశీలనలో ఉన్నాయి. దీనిని దృష్టిలో వుంచుకొని మరియు వివిధ బ్యాంకుల సంసిద్ధత ను పరిగణనలోకి తీసుకుని, ఇండ్ ఏయస్ అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని నిర్ణయించబడింది. దీనిలోగా చట్టo లో తప్పనిసరి మార్పులు జరుగుతాయని అంచనా. 4. చెల్లింపు వ్యవస్థ సమాచారం (డేటా) ను భద్రపరచడం ఇటీవలి కాలంలో నూతన చెల్లింపు (పేమెంట్) వ్యవస్థలు, సహభాగినులు మరియు వేదికల ఆవిర్భావంతో భారత్ లో పేమెంట్ పర్యావరణ వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. డిజిటల్ చెల్లింపులలో ఆరోగ్యపరమైన వృద్ధిని సాధించేందుకు పేమెంట్ వ్యవస్థల సమాచార సురక్షణ మరియు భద్రత భరోసా అత్యంత ఆవశ్యకం. అందుకోసం ఉత్తమ ప్రపంచ ప్రమాణాలను స్వీకరించడం మరియు వాటిని నిరంతరo పర్యవేక్షించడం మరియు వాటిపై నిఘా పెట్టడం అవసరం. దీనివల్ల సమాచారానికి గండిపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్లు మరియు వారి ఔట్సౌర్సింగ్ పార్టనర్లు చెల్లింపు వ్యవస్థల డేటా ను పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని భారత్ లో భద్రపరుస్తున్నట్లు గమనించబడింది. పర్యవేక్షణ లక్ష్యం నందు నిరాటంకంగా సమాచారాన్ని పొందడం కోసం, దేశంలోని అన్ని చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్లు వారి మొత్తం డేటాను ఆరు నెలల గడువు లోపల భారత్ లోనే భద్రపరిచేట్లు నిర్ధారణ చేయాలి. వీటిపై పూర్తి స్థాయి నిబంధనలు ఒక వారంలో జారీ చేయబడతాయి. II. ఫైనాన్షియల్ మార్కెట్లు 5. IRS మార్కెట్ లో ప్రవాసీయులకు (నాన్-రెసిడెంట్ లకు) ప్రవేశం రుపీ వడ్డీ రేట్ స్వాప్ (IRS) మార్కెట్ అనేది వడ్డీ రేట్ డెరివేటివ్ మార్కెట్లలో చాల తరళమైనప్పటికి , పెద్ద బ్యాంకులు వారి రిస్క్ లను నిభాయించుకొనేంతగా ఇంకా వృద్ధి చెందలేదు. పాల్గొనేవాళ్ళు తక్కువగా ఉండడం మరియు తదనుగుణంగా భిన్నాభిప్రాయాలు లభ్యంకాకపోవడం మూలాన ధర అసమర్థతలకు దారి తీస్తుంది, ఇది పాల్గొనడాన్ని మరింత నిరుత్సాహపరుస్తుంది. అదేసమయంలో, రుపీ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ కు ఆఫ్షోర్ లో చురుకైన మార్కెట్ ఉన్నదని తెలుసుకోబడింది. ఇదిగాక, భారతీయ మార్కెట్ ముఖ్యంగా ఋణ (debt) మార్కెట్ లో FPI లాంటి ప్రవాసీయులు పాల్గొనడం క్రమేణా పెరుగుతుండటం గమనించబడింది. IRS మార్కెట్ లో విభిన్న భాగస్వాములకు స్థానం కల్పించి, మార్కెట్ ఎదుగుదలకు దోహదం చేసేందులకు, భారత్ లో రుపీ IRS మార్కెట్ లోకి ప్రవాసీయులకు ప్రవేశం కల్పించాలని ప్రతిపాదించబడింది. పబ్లిక్ కామెంట్ల కోసం పూర్తిస్థాయి ముసాయిదా రెగ్యులేషన్ మే 2018 సమాప్తి లోపున జారీ చెయబడుతుంది. 6. రుపీ స్వాప్షణ్ ల పరిచయం P.G. ఆప్టే వర్కింగ్ గ్రూప్ రికమండేషన్లననుసరించి, డిసెంబర్ 2016 సంవత్సరంలో, ఆర్బీఐ వడ్డీ రేట్ ఆప్షన్స్ (IRO) లను ప్రవేశపెట్టిoది. మొదటగా, సాదా వెనిల్లా ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్లు అనుమతించబడ్డాయి. తదనంతరం, కార్పొరేట్లతో కూడి మార్కెట్ భాగస్వాములు ఇంట్రెస్ట్ రేట్ రిస్కును సమర్ధవంతంగా నిభాయించడానికి స్వాప్షణ్ ల అవసరాన్ని నొక్కి వక్కాణించారు. FIMMDA వారు వారి మెంబర్ల తరపున ఇదే తరహా విన్నపాన్ని తెలియచేశారు. అందువల్ల, ఎవరైతే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ను హెడ్జ్ చేసుకోదలచుకున్నారో, వారికి సమయాసమయ ఒదుగుబాటును కల్పిన్చేందుకు, రూపాయల్లో ఇంట్రెస్ట్ రేట్ స్వాప్షణ్లను అనుమతించాలని ప్రతిపాతించబడింది. ఏప్రిల్ 2018 సమాప్తి లోపు, నిబంధనలు జారీ చేయబడతాయి. 7. రిజిస్టర్ఐన ఇంట్రెస్ట్ మరియు ప్రిన్సిపల్ సెక్యూరిటీల విడి-విడి ట్రేడింగ్ (STRIPS) నిబంధనల సమీక్ష ఏప్రిల్ 2010 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ సెక్యూరిటీలలో స్త్రిప్స్ (STRIPS) ను ప్రవేశపెట్టిoది. కొంత ప్రారంభోత్సాహం ఉన్నప్పటికీ, మార్కెట్లో ఈ ప్రోడక్ట్ కు అనుకున్నంత ప్రాధాన్యత లభించలేదు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా దీనిని మరింత సరిదిద్ది మరియు పెట్టుబడిదారుల విభిన్న అవసరాలకు సరిపడేట్టు చేసి ఈ స్త్రిప్స్ లో ట్రేడింగ్ ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, ఈ నిబంధనలను సమీక్షించాలని ప్రతిపాదించబడింది. ఏప్రిల్ 2018 సమాప్తి లోపు, సవరించిన నిబంధనలు జారీ చేయబడతాయి. 8. వ్యక్తిగతంకాని మార్కెట్ భాగస్వాముల కోసం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయ్యర్ (LEI) ప్రపంచ ఆర్దిక సంక్షోభానంతరం, సమర్ధవంతంగా రిస్కును నిర్వహించడంకోసం ఫైనాన్షియల్ డేటా వ్యవస్థల నాణ్యత మరియు నిర్దుష్టతను మెరుగుపరచడంలో, LEI కోడ్ ఒక కీలక కొలమానంగా పరిగణించబడింది. LEI అనేది ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన పార్టీలకు కేటాయించిన ఇరవై క్యారెక్టర్ల విశిష్ట గుర్టింపు కోడ్. ఇంట్రెస్ట్ రేట్, కరెన్సీ మరియు క్రెడిట్ మార్కెట్ల ఓవర్-ది-కౌంటర్ డేరివేటివ్ ప్రోడక్ట్ ల మార్కెట్ భాగస్వాములందరికీ RBI LEI కోడ్ ను అమలుచేసింది. పెద్ద పెద్ద కార్పొరేట్ రుణగ్రహీతలకు కూడా ఇది వర్తింపజేయబడింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో పారదర్శకత్వాన్ని మెరుగుపరిచే ఈ ప్రక్రియ కొనసాగింపుకు, ఇంట్రెస్ట్ రేట్, కరెన్సీ మరియు క్రెడిట్ మార్కెట్లలో వ్యక్తులు కాని వారిచే చేపట్టిన అన్ని ఆర్థిక మార్కెట్ లావాదేవీలకు LEI విధానం అమలుచేయాలని ప్రతిపాదించబడింది. ఏప్రిల్ 2018 సమాప్తిలోగా, ముసాయిదా నిబంధనలు జారీ చేయబడతాయి. 9. భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నివేదించేందుకు ఒకే ఒక మాస్టర్ ఫారంను ప్రవేశపెట్టబడింది భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (తిరిగి చెల్లింపు పధ్ధతి లో) యోగ్యమైన ఉపకరణాలద్వారా - అంటే, పెట్టుబడిదారు సంస్థ జారీచేసిన ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రేఫెరేన్సు షేర్లు, కంపల్సరిలీ కన్వర్టిబుల్ డిబెంచెర్లు, షేర్ వారెంట్లు, మొదలగునవి లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (LLP) లో మూలధనాన్ని తోడ్పాటు చేయడం - ప్రవాసీయులచే పెట్టబడుతున్నాయి. ప్రస్తుతం, పైన పేర్కొన్న లావాదేవీల ద్వారా చేకూరిన విదేశీ పెట్టుబడుల రిపోర్టింగ్ వేర్వేరు ప్లాట్ఫారములు / మోడ్ ల ద్వారా విడదీయబడిన పద్ధతిలో నివేదించబడుతున్నది. రిజర్వ్ బ్యాంకు జూన్ 30, 2018 కల్లా, ఒకేఒక మాస్టర్ ఫారం మాధ్యమం తో ఆన్లైన్లో నివేదించడం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. విదేశీ పెట్టుబడులు ఏ ఉపకరణం రూపేణా వచ్చినా దానితో సంబంధం లేకుండా, అన్ని రిపోర్టింగ్ ఆవశ్యకతలను ఇది నెరవేరుస్తుంది. 10. అధీకృత (ఆథరైజ్డ్) డీలర్ల చే రిపోర్టింగ్ ప్రస్తుతం చెల్లింపుదారు (రేమిటార్) ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంతో అధీకృత డీలర్ బ్యాంకులు సరళీకృత చెల్లింపు పథకం (LRS) క్రింద లావాదేవీలను అనుమతించుచున్నారు. దీనివల్ల, అధీకృత డీలర్ బ్యాంకులు పర్యవేక్షణ చేయడం / తదితర బ్యాంకులకు వెళ్ళడం మూలాన ఆ చేల్లిమ్పుదారు నిర్దేశించబడిన పరిమితి ఉల్లంఘన చేయలేదని రూడి చేయడం కష్టతరమౌతుంది. మెరుగైన పర్యవేక్షణ మరియు LRS పరిమితి అమలు నిబద్ధతను కట్టుదిట్టం చేసే ఉద్దేశ్యంతో, బ్యాంకులు వ్యక్తిగత లావాదేవీలను రోజూ నివేదించే ఒక పద్ధతిని ఏర్పాటుచేయాలని నిర్ణయించడమైనది. దీనితో అధీకృత డీలర్ బ్యాంకులు వ్యక్తులవారి చెల్లింపులను అనుమతించడానికి ముందుగానే, ఇప్పటికే వారు పంపిన చెల్లింపులను వీక్షించడానికి వీలవుతుంది మరియు వ్యక్తుల అనేకమైన అధీకృత డీలర్ బ్యాంకులను వాడుకోవడం ద్వారా LRS పరిమితిని ఉల్లంఘించే అవకాశం తొలగిపోతుంది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నిబంధనలు త్వరలో జారీ చేయబడతాయి. III కరెన్సీ నిర్వహణ 11. క్యాష్-ఇన్-ట్రాన్సిట్ (CIT) ఇండస్ట్రి కోసం నియమాలు - CIT ఇండస్ట్రి చే స్వీయ నియంత్రణా సంస్థ ను ప్రోత్సహించడం ఫిబ్రవరి 7, 2018 నాటి అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటనయందు, రిజర్వ్ బ్యాంకు, కరెన్సీ నిర్వహణ (ఖజానా కదలికల భద్రత ను కలుపుకుని) మెరుగుపరచేందుకు తగు సలహాలు ఇవ్వడానికై తనచే ఏర్పాటు చేయబడిన రెండు హై-లెవెల్ ఇంటర్-ఏజెన్సీ కమిటీల సిఫారసుల అమలుకై వొక కాలవ్యవధిని ప్రకటించింది. ఈ కమిటీలు, మిగతా ఇతర విషయాలతోపాటు, క్యాష్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీ కి కనీస ప్రమాణాలను మరియు స్వీయ నియంత్రణా సంస్థ ను నిర్దేశించాలని సిఫారసు చేశాయి. i) నవంబర్ 2006 లో రిజర్వ్ బ్యాంక్ చే జారీ అయిన “ఆర్దిక సేవల్లో ఔట్సౌర్సింగ్ నిర్వహణలో రిస్కులు మరియు ప్రవర్తన కోడ్” మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ స్థాయి లో నగదు నిర్వహణ మరియు దాని లాజిస్టిక్స్ పెద్దయెత్తున CIT సంస్థలకు మరియు నగదు భర్తీ ఏజెన్సీలకు (CRAస్స్) ఔట్సౌర్స్ చేయడం జరిగింది. అయితే, ప్రస్తుతం ఈ పరిశ్రమపై ఎలాంటి నియంత్రణ లేదా పర్యవేక్షణ లేదు. ఈ రంగం లో ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు ఈ సంస్థల ద్వారా కరెన్సీ తరలింపు సంబంధిత రిస్కులను తగ్గించడానికోసం, బ్యాంకులచే నియమించబడిన CIT సంస్థలు / CRAలు నిర్దేశిత కనీస ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్లు ఆయా బ్యాంకులు నిర్దారించడం తప్పనిసరియని రిజర్వ్ బ్యాంకు అపేక్షించుతున్నది. ఈ సందర్భంలో బ్యాంకులకు సూచనలు వొక నెలలోగా జారీ చేయబడతాయి. ii) CIT ఇండస్ట్రీ కనీస ప్రమాణాల నిబద్ధతకై మరియు ఇతర వర్తింపు చట్టాలకు అనుగుణంగా ఉండేట్లు చేయడానికై; చట్టబద్ధ ఏర్పాట్లు చేసేంతవరకు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పరిశ్రమ స్వీయ నియంత్రణ కోసం స్వీయ నియంత్రణ సంస్థ (SRO)ను నెలకొల్పడానికి రిజర్వు బ్యాంక్ నగదు నిర్వహణ ఇండస్ట్రీ ను ప్రోత్సహిస్తుంది. 12. కేంద్రీయ బ్యాంకు డిజిటల్ కరెన్సీ ప్రైవేట్ డిజిటల్ టోకెన్ల ఆవిర్భావం మరియు ఆజ్ఞా కాగితం/ మెటాలిక్ డబ్బు నిర్వహణ లో పెరుగుతున్న ఖర్చుల లాంటి అంశాలతో పాటు పేమెంట్స్ ఇండస్ట్రీ ప్రకృతిచిత్రoలో వేగంగా వస్తున్నమార్పులు, ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు ఆజ్ఞా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే అవకాశాన్ని అన్వేషించేందుకు దారితీసాయి. అనేక కేంద్రీయ బ్యాంకులు ఇప్పటికీ ఈ చర్చలో నిమగ్నమైయున్నప్పటికి, ఒక అంతర్విభాగ బృందాన్ని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ బృందం కేంద్రీయ బ్యాంకు ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురావడంలోని సాధ్యాసాధ్యాలపై పరిశోధన చేసి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఈ నివేదికను జూన్ 2018 లో సమర్పిస్తారు. 13. వర్చువల్ కరెన్సీల నుంచీ నియంత్రించబడుతున్న ఎంటిటి లకు రింగ్ ఫెన్సింగ్ వర్చువల్ కరెన్సీలు సహా సాంకేతిక వినూత్నతలు ఆర్థిక వ్యవస్థ సంఘటితాన్ని మరియు బలాన్ని పెంచే సామర్థ్యం ఉన్నవే. అయితే వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టో కరెన్సీలు(ఊహాజనిత కరెన్సీ) లేదా క్రిప్టో ఆస్తులు అనేవి వినియోగదారు ప్రయోజనాలపై , మనీలాండరింగ్ అవకాశాన్ని మరియు మార్కెట్ సమగ్రతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీల (బిట్ కాయిన్ లను కలుపుకుని) వినియోగదార్లు, ట్రేడర్లు, కొనుగోలుదార్లకు ఎప్పటికప్పుడు వాటిలో ఉండే నష్టభయాల గురించి ఆర్‌బీఐ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సహసంబంధి నష్టభయాలను పరిగణలోకి తీసుకుని, తక్షణం అమల్లోకి వచ్చేలా, నియంత్రించబడుతున్న ఎంటిటిలు(బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతరత్రా నియంత్రణ సంస్థలు) వర్చువల్ కరెన్సీలతో ముడిపడి ఉన్న, వ్యాపారం చేస్తున్న వ్యక్తులు, వ్యాపారాలకు వెంటనే సేవలను నిలిపేయాల్సిందని నిర్ణయించబడింది. ఇప్పటికే అలాంటి వారికి సేవలు అందిస్తున్నట్లయితే ఆ సేవలను నియంత్రించబడుతున్న ఎంటిటి లు నిర్దిష్ట సమయంలోపల నిలిపివేయాలి. ఈ విషయంలో ఒక సర్కులర్ ను ప్రత్యేకంగా జారీ చేస్తున్నారు. IV. ఆర్దిక సమీకృత మరియు అక్షరాస్యత 14. వ్యక్తీకరించిన ఆర్థిక అక్షరాస్యత విషయం (కంటెంట్) ఆర్దిక విద్యను అందించడంలో ‘ఒకే కొలత అందరికీ సరిపోతుంది’ అనే దృష్టికోణం ప్రాధాన్యత లోపించింది. విభిన్న టార్గెట్ గ్రూపులకు అందించబోయే ఆర్దిక విద్యా విషయాలను టార్గెట్ గ్రూపుల ఆదర్శప్రాయ అవసరాలకు తగ్గట్టు మార్పులుచేయాలి. రిజర్వ్ బ్యాంకు ఐదు ప్రత్యెక టార్గెట్ గ్రూపులకు అనగా రైతులు, చిన్న వ్యవస్థాపకులు, బడిపిల్లలు, స్వయం సేవా సంఘాలు మరియు వయో వృద్దుల కోసం వ్యక్తీకరించిన ఆర్దిక విషయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నది. ఈ సామాగ్రిని శిక్షకులు ఉపయోగించుకోవచ్చు. ఐదు పుస్తకాల రూపంలో ఉన్న ఈ సామాగ్రి (కంటెంట్స్) 15 రోజుల్లోపు విడుదల చేయబడతాయి. 15. లీడ్ బ్యాంక్ పథక పునర్వ్యవస్థీకరణ బ్యాంకులు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం ఏర్పాటు తో జిల్లాలు / రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి లీడ్ బ్యాంక్ పథకo ప్రారంభించబడింది. శ్రీమతి ఉషా తోరట్ , ఒకప్పటి డిప్యూటీ గవర్నర్ - భారతీయ రిజర్వ్ బ్యాంక్, అధ్యక్షురాలుగా యున్నఉన్నత స్థాయి కమిటీ, ఇంతకుపూర్వం 2009 వ సంవత్సరంలో లీడ్ బ్యాంక్ పథకo (లీడ్ బ్యాంక్ స్కీం) సమీక్ష జరిపింది. ఆర్దిక రంగంలో కాలానుగుణంగా జరుగుతున్నమార్పుల దృష్ట్యా , భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ పథకo సార్ధకతను పరిశీలనచేసి మరియు దీని ఔన్నత్వం కై తగిన సూచనలను ఇవ్వడానికోసం బ్యాంక్ ఎగ్జిక్యూటివు డైరెక్టర్ లతో ఒక కమిటీని నియమించింది. కనుక ఈ కమిటీ తన సిఫార్సులను సమర్పించింది మరియు సిఫార్సుల ఆధారంగా లీడ్ బ్యాంక్ పథకoను ప్రస్తుత స్థితికి సరిపడేవిధంగా పునరీక్షణం చేయాలని నిర్ణయించబడింది. సవరించిన పథకం యొక్క నిబంధనలు బ్యాంకులకు 15 రోజులలో జారీ చేయబడతాయి. V. డేటా నిర్వహణ విభిన్న భాద్యతలతో - ద్రవ్యోల్బణం నిర్వహణ, కరెన్సీ నిర్వహణ, ఋణాల నిర్వహణ, నిధుల నిర్వహణ, బ్యాంకుల నియంత్రణ మరియు పర్యవేక్షణ, ఆర్దిక సమీకృతం, ఫైనాన్షియల్ మార్కెట్ గూఢచర్యం మరియు విశ్లేషణ మరియు సమగ్ర ఆర్థిక స్థిరత్వం - సంపూర్ణ సేవల నేపథ్యం గల ఆర్బీఐ లాంటి కేంద్రీయ బ్యాంకుకు పాలసీ సూత్రీకరణకు అన్నివిధాలా సహాయకారిగా తగిన డేటాను నియోగించడం మరియు సరైన ఫిల్టర్లను వాడి తన ముందస్తుఅంచనాలను, ఇప్పటిఅంచనాలను, నిఘాను మరియు ముందస్తు హెచ్చరికల గుర్తింపు సామర్ధ్యం మెరుగుపరచుకోవడం అనేటువంటిది చాల క్లిష్టమైనది. సమాచార సేకరణ, కంప్యూటింగ్ సామర్ధ్యం మరియు విశ్లేషణాత్మక సాధనాల యందు కోనసాగుతున్న విస్ఫోటనం నేపథ్యం లో ప్రణాళిక తయారీ అనేది రెగ్యులేటరీ రిటర్న్ ల లేదా సర్వేల ద్వారా సేకరించిన డేటా నుండే గాకుండా, ఈ డిజిటల్ ప్రపంచంలో వినియోగదార్లతో పరస్పర చర్చల నుండి సేకరించిన స్ట్రక్చర్డ్ లేదా అన్-స్ట్రక్చర్డ్ రియల్-టైం సమాచారం నుండి కూడా ప్రయజనoపొందుతుంది. తదనుగుణంగా, RBI లోపల ఒక డేటా సైన్సెస్ ప్రయోగశాల ఏర్పాటు చేసి , బిగ్-డేటా విశ్లేషణల శక్తిని పెంచుకోవాలని నిర్ణయించబడింది, ఇందులో నిపుణులు మరియు వర్ధమాన విశ్లేషకులు – అంతర్గతంగా అలాగే బయటనుంచి – ఇతర విషయాలకు తోడు, కంప్యూటర్ సైన్సు, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్ మరియు/లేదా ఫైనాన్స్ లో శిక్షణ ఎవరు గడించారో వారంతా కూడియుంటారు. డిసెంబర్ 2018 నాటికి ఈ యూనిట్ కార్యకలాపాలు నిర్వహించబడుతుందని పరికించబడింది. జోస్ జె.కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2642 |