RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516237

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

అక్టోబర్ 09, 2020

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

COVID-19 యొక్క ముప్పు ఇంకా తగ్గకపోయినా, క్రమంగా ప్రజల కదలికలపై ఆంక్షలను ఎత్తివేయడం మరియు దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలను ప్రారంభించడం ద్వారా, ఆర్థిక కార్యకలాపాల పున: ప్రారంభం పుంజుకుంటున్నది. రికవరీ యొక్క ఈ దశలో ఆర్థిక రంగం యొక్క పాత్ర, ఆర్థిక కార్యకలాపాల COVID పూర్వ స్థాయిలను చేరుకోవడానికి వ్యాపారాలను సులభతరం చేయడంలో ముఖ్యమైనది. గత కొన్ని నెలలుగా భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ చర్యల యొక్క దృష్టి, మొదట COVID-19 ప్రభావం నుండి రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కల్పించడం, ఋణ కిస్తీల వాయిదా మరియు ఇతర చర్యల పొడిగింపు ఆపై ఒత్తిడి ఉపశమన చట్రం (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్) ద్వారా ఒత్తిడి తగ్గింపును సుగమం చేయడం. అదేవిధంగా, అప్పిచ్చు సంస్థలు కూడా వారికార్యకలాపాలను పునరుద్ధరించడం తో పాటు రుణ కార్యాచరణపై ప్రధానంగా దృష్టి పెట్టడం ప్రారంభించాలి. దీని ప్రకారం, (i) ఆర్థిక వ్యవస్థ లక్ష్య కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఆర్థిక మార్కెట్లకు ద్రవ్య మద్దతును ఇతర రంగాలతో అనుసంధానం చేస్తూ పెంచడం, ii) ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందించడం; (iii) క్రెడిట్ డిసిప్లిన్ పరిధిని పాటిస్తూ, నిర్దిష్ట రంగాలకు మెరుగైన రుణ వసతి కల్పనకు మద్దతివ్వడం (iv) ఆర్థిక సమీకరణకు బాగాఊతమివ్వడం మరియు (v) వృద్ధికి చేయూతనిచ్చేందుకు, సులభతర వాణిజ్యం క్రింద వినియోగదారు సౌకర్యం మెరుగుపరిచేందుకు చెల్లింపు వ్యవస్థ సేవలను ఆధునీకరించడం మొదలగునవి చేయడం ఈ చర్యల ఉద్దేశ్యం.

I. ద్రవ్య సంబంధిత చర్యలు మరియు ఆర్థిక మార్కెట్లు

1. ఆన్-ట్యాప్ టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్ (టిఎల్‌టిఆర్‌ఓ- (TLTRO)

ఆర్బిఐ యొక్క ద్రవ్య సంబంధిత చర్యల దృష్టి ఇపుడు నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించి వృద్ధిని ప్రేరేపించడం మీద ఉంది. దీని ప్రకారం, పాలసీ రెపో రేటుతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ రేటు వద్ద మొత్తం 1,00,000 కోట్ల వరకు మూడు సంవత్సరాల కాలపరిమితి వరకు టిఎల్‌టిఆర్‌ఓ లు నిర్వహించబడతాయి. ఈ పథకం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది మరియు ఈ పథకం ప్రతిస్పందనను సమీక్షించిన అనంతరం ఈ మొత్తాన్ని దానితోపాటు కాలవ్యవధిని పెంచడానికి సులభంగా మార్పులు చేసే వీలుగా ఉంటుంది. ఈ పథకం క్రింద లభ్యమైన ద్రవ్యాన్ని బ్యాంకులు కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు మరియు ప్రత్యెక రంగాల సంబంధిత సంస్థలు జారీ చేసిన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో ఉంచాలి, వాటిల్లో పెట్టుబడి సెప్టెంబర్ 30, 2020 నాటి బ్యాంకులపరిమితి స్థాయికి పైబడి. ఈ రంగాలకు బ్యాంకు రుణాలు మరియు అడ్వాన్సులను విస్తరించడానికి కూడా ఈ పథకం క్రింద లభించే లిక్విడిటీని ఉపయోగించవచ్చు. ఈ సదుపాయం క్రింద బ్యాంకులు పెట్టిన పెట్టుబడులు హెచ్‌టిఎమ్ (HTM) పోర్ట్ ఫోలియో లో చేర్చబడతాయి, అవి 25 శాతానికి మించినప్పటికి. ఈ సదుపాయం క్రింద ఉన్న అన్ని ఎక్స్పోజర్లు, లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్‌వర్క్ (LEF) క్రింద లెక్కించకుండా మినహాయించబడుతుంది. అంతేకాకుండా, టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్ (టిఎల్‌టిఆర్‌ఓ మరియు టిఎల్‌టిఆర్‌ఓ-2.0 - TLTRO & TLTRO 2.0) క్రింద ఇంతకుముందు నిధులను పొందిన బ్యాంకులు ఈ లావాదేవీలను మెచ్యూరిటీకి ముందు రివెర్స్ చేసే అవకాశం ఉంది. 2020-21 ద్వితీయార్ధంలో కేంద్రం మరియు రాష్ట్రాల రుణాల అవసరాలు మరియు రికవరీ బలోపేతం అయినప్పుడు, ఋణం కోసం డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున అట్టి టిఎల్‌టిఆర్‌ఓలు ద్రవ్యతలేమి ఆటంకం ఒత్తిడికి తట్టుకుంటూ బ్యాంకులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి వీలుగా ఉద్దేశించబడ్డాయి. వ్యవస్థలో ద్రవ్యత కావలసినంత ఉండేలా చూడటం దీని లక్ష్యం. పథకం వివరాలను విడిగా ప్రకటించడం జరుగుతుంది.

2. హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎం-HTM) విభాగంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్-SLR) హోల్డింగ్స్

క్రమబద్ధమైన మార్కెట్ పరిస్థితులను పెంపొందించడానికి మరియు సానుకూల్యమైన ఫైనాన్సింగ్ ఖర్చులను నిర్ధారించడానికి, సెప్టెంబర్ 1, 2020 వరకు లేదా ఆ తర్వాత మార్చి 31, 2021 వరకు సమకూర్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలకు సంబంధించి రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 1, 2020 న హెల్డ్ టు మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్) వర్గం క్రింద పరిమితిని ఎన్‌డిటిఎల్‌లో 19.5 శాతం నుండి 22 శాతానికి పెంచింది. మార్చి 31, 2021 తరువాత ఎస్‌ఎల్‌ఆర్ సెక్యూరిటీలలో ఈ పెట్టుబడుల స్థితిగతుల గురించి మార్కెట్లకు మరింత ఖచ్చితత్వం ఇవ్వడానికి; సెప్టెంబర్ 1, 2020 మరియు మార్చి 31, 2021 మధ్య సమకూర్చుకున్న సెక్యూరిటీల కోసం 22 శాతంగా పెంచిన హెచ్‌టిఎమ్ లిమిట్ సదుపాయాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించాలని నిర్ణయం చేయబడింది. జూన్ 30, 2022 తో ముగిసే త్రైమాసికం నుండి, దశలవారీగా హెచ్‌టిఎమ్ పరిమితి 22 శాతం నుండి 19.5 శాతానికి పునరుద్ధరించబడుతుంది. HTM లిమిట్ ని నిమ్మళింపు పధంలో పూర్వపు స్థాయి కి చేరడం కోసం, బ్యాంకులు SLR సెక్యూరిటీలో పెట్టుబడి కి ప్లాన్ చేస్తాయని భావిస్తున్నారు.

3. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంఓ-OMO) నిర్వహణ - రాష్ట్ర అభివృద్ధి రుణాలు (ఎస్‌డిఎల్-SDL) లలో.

ప్రస్తుతం, ద్రవ్య సర్దుబాటు సౌకర్యం (ఎల్‌ఎఎఫ్) కొరకు కుదువబెట్టడానికి టి-బిల్లులు, డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీలు మరియు ఆయిల్ బాండ్లతో పాటు ఎస్‌డిఎల్‌లు కూడా అర్హమైనవి. మన్నిక ధర సాకారం చేసి ద్రవ్య లభ్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌డిఎల్‌లలో ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను (ఓఎంఓలు) ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రాలు జారీ చేసిన సెక్యూరిటీలతో కూడిన ఎస్‌డిఎల్‌ల కోసం ఓఎంఓలు లు నిర్వహించబడతాయి.

II. ఎగుమతులకు మద్దతు

4. ఎగుమతిదారుల ఆటోమేటిక్ కాషన్-లిస్టింగ్ - సమీక్ష

ఎక్స్పోర్ట్ డేటా ప్రాసెసింగ్ మానిటరింగ్ సిస్టం (ఇడిపిఎంఎస్) యొక్క యాంత్రీకరణ లో భాగంగా, 2016 సంవత్సరంలో ఎగుమతిదారుల ‘కాషన్/డి-కాషన్ లిస్టింగ్' యాంత్రీకరణ చేయబడింది. దీని ప్రకారం, EDPMS లో రెండు సంవత్సరాలకు పైబడి వీరి షిప్పింగ్ బిల్లేదైనా బాకీ లో ఉండి, ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ రావడానికి ఎటువంటి ఎక్స్టెన్షన్ గనుక పొందకపోతే, ఎగుమతిదారులు ఆటోమేటిక్ గా కాషన్-లిస్టు చేయబడతారు. కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాల గడువుకు ముందే అధీకృత డీలర్ (AD) బ్యాంక్ సిఫారసుల ఆధారంగా కాషన్-లిస్టింగ్ సాదారణంగా చేయడం కొనసాగుతుంది. వ్యవస్థను మరింత ఎక్స్పోర్టర్ ఫ్రెండ్లీ గా చేయడానికి, ఆటోమేటిక్ కాషన్-లిస్టింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించడమైనది. అధీకృత డీలర్ బ్యాంక్ యొక్క నిర్దిష్ట కేసు సిఫారసుల ఆధారంగా భారతీయ రిజర్వు బ్యాంకు కాషన్-లిస్టింగ్ చేయడం ను కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి సంబంధిత నిబంధనలు త్వరలో జారీ చేయబడతాయి.

III. నియంత్రణ చర్యలు

5. నియంత్రిత రిటైల్ పోర్ట్ ఫోలియో - రిస్క్ వెయిట్ లిమిట్ రివిజన్

ప్రస్తుత ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, బ్యాంకుల నియంత్రిత రిటైల్ పోర్ట్ ఫోలియోలో చేర్చబడిన ఎక్స్పోజర్లకు 75 శాతం రిస్క్ వెయిట్ ను కేటాయిస్తారు. దీని కోసం, క్వాలిఫైయింగ్ ఎక్స్పోజర్లు, తక్కువ విలువ ఎక్స్పోజర్లు తో ఉండి, కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎక్స్పోజర్లు విలువ పరంగా, గరిష్ట యాగ్రగేటేడ్ రిటైల్ ఎక్స్పోజర్ ఒక్కో కౌంటర్పార్టీకి యాబ్సల్యూట్ త్రెషోల్డ్ లిమిట్ 5 కోట్లకు మించరాదని సూచించబడింది. వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలు (అంటే 50 కోట్ల వరకు టర్నోవర్‌తో), మరియు బాసెల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగానికి ఋణ వ్యయాన్ని తగ్గించడానికి, ఈ పరిమితిని అన్ని తాజా మరియు ఇంక్రిమెంటల్ క్వాలిఫైయింగ్ ఎక్స్పోజర్లకు సంబంధించి 7.5 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ చర్య చిన్న వ్యాపార విభాగానికి అవసరమైన రుణ సౌలభ్యం ను పెంచుతుందని ఆశిస్తున్నారు.

6. వ్యక్తిగత గృహ రుణాలు - రిస్క్ వెయిట్ ల హేతుబద్ధీకరణ

బ్యాంకుల వ్యక్తిగత గృహ రుణాల పై క్యాపిటల్ ఛార్జ్ ఫర్ క్రెడిట్ రిస్క్ నిబంధనల ప్రకారం, లోన్ సైజును బట్టి మరియు లోన్ టు వాల్యూ రేషియో (ఎల్టివి) ఆధారంగా వివిధ రిస్క్ వెయిట్స్ వర్తిస్తాయి. ఉపాధి కల్పనలోను మరియు ఇతర పరిశ్రమలతో ఉన్న పరస్పర లింకులను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక రికవరీలో రియల్ ఎస్టేట్ రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరియు దాని సజావు కోసం, మార్చి 31, 2022 వరకు మంజూరు చేయబడ్డ గృహ రుణాల రిస్క్ వెయిట్స్ అన్నింటినీ ఎల్‌టివి నిష్పత్తులతో మాత్రమే అనుసంధానించడం ద్వారా హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఎల్‌టివి 80 శాతం కంటే తక్కువ లేదా సమానంగా వున్న రుణాలు 35 శాతం రిస్క్ వెయిట్ కలిగి మరియు ఎల్‌టివి 80 శాతానికి మించి మరియు 90 శాతం కంటే తక్కువ లేదా సమానంగా వున్న రుణాలు 50 శాతం రిస్క్ వెయిట్ కలిగి ఉంటాయి. ఈ చర్య వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి మరిన్ని బ్యాంకు రుణాలు ఇవ్వడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

IV. ఆర్థిక సంఘటితం

7. కో-ఒరిజినేషన్ మోడల్ - సమీక్ష

కొన్ని షరతులకు లోబడి ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ద్వారా కో-ఒరిజినేషన్ రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు 2018 లో ఒక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటనేది రుణం మంజూరులో ఇరువురి పాత్ర, ఇంకా వారి మధ్య సహకారo విశిష్టతను, నష్టాలు మరియు రివార్డులను సమానంగా పంచుకుంటూ వారి వ్యాపార లక్ష్యాలను చేరుకోవడo కోసం ఉద్దేశించబడింది. స్టేక్-హోల్డర్స్ నుండి వచ్చిన ఫీడ్-బ్యాక్ ఆధారంగా, బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) మధ్య సానుకూల తారతమ్యాలను దృష్టిలో యుంచుకొని ఆర్థిక వ్యవస్థ లో అస్సలు సేవ పొందని మరియు సేవసరిపోని రంగాలకు రుణ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం, అన్ని ఎన్‌బిఎఫ్‌సిలకు (హెచ్‌ఎఫ్‌సిలతో సహా), అన్ని ప్రాధాన్యత రంగ రుణాలను ఈ పథకానికి అర్హులుగా చేయడానికి మరియు రుణ సంస్థలకు మరింత కార్యాచరణ సౌలభ్యాన్ని ఇవ్వడానికి; అవుట్‌సోర్సింగ్, కెవైసి మొదలగు వాటిపై నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరంతో ఈ పథకం విస్తరించడానికి నిర్ణయించబడింది. ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ "కో-లెండింగ్ మోడల్" గా పిలుస్తారు. సవరించిన మార్గదర్శకాలు అక్టోబర్ 2020 చివరి నాటికి జారీ చేయబడతాయి.

V. చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థలు

8. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (RTGS) యొక్క నిరంతర లభ్యత

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ్యవస్థను, 24x7x365 ప్రాతిపదికన డిసెంబర్ 2019 లో అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది మరియు అప్పటి నుండి ఈ వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. పెద్ద వేల్యూ RTGS వ్యవస్థ ప్రస్తుతం వారంలోని అన్ని పనిదినాలలో (నెలలో రెండవ మరియు నాల్గవ శనివారాలు మినహా) ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. భారతీయ ఆర్థిక మార్కెట్ల అంతర్జాతీయకరణ లక్ష్యంగా కొనసాగుతున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలను అభివృద్ధి చేయడంలో దేశ ప్రయత్నాలను సులభతరం చేయడానికి మరియు దేశీయ కార్పొరేట్‌లకు మరియు సంస్థలకు విస్తృత చెల్లింపు సౌలభ్యాన్ని అందించడానికి, అన్నిదినాలలోను నిరంతరం RTGS వ్యవస్థను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనితో, 24x7x365 పెద్ద వేల్యూ RTGS వ్యవస్థతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటవుతుంది. ఈ సౌకర్యం డిసెంబర్ 2020 నుండి అమలులోకి వస్తుంది.

9. చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లకు (PSOs) జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) కు శాశ్వత చెల్లుబాటు సౌకర్యం

ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు) జారీచేస్తున్న, వైట్ లేబుల్ ఎటిఎంలు (డబ్ల్యుఎల్‌ఎ) లేదా ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్స్ (టిఆర్‌డిఎస్) నడుపుతున్న లేదా భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్లు (BBPOU) గా నడపబడుతున్న బ్యాంకేతర సంస్థలకు ప్రస్తుతం భారతీయ రిజర్వు బ్యాంకు నిరంతర ఆథరైజేషన్ సౌకర్యాన్ని “చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థ చట్టం, 2007” క్రింద కల్పిస్తున్నది. అటువంటి PSO ల యొక్క అధికారం (ఆథరైజేషన్ పునరుద్ధరణతో సహా) ఎక్కువగా ఐదేళ్ల వరకు, పేర్కొన్న కాలానికి ఉంటుంది. చెల్లింపు వ్యవస్థ యొక్క పరిణామం ప్రారంభదశలో ఇటువంటి పరిమిత కాల లైసెన్సులు తప్పనిసరి అయినప్పటికీ ఇది PSOల వ్యాపార అనిశ్చితికి మరియు రెన్యువల్ ప్రాసెస్ లో తప్పనిసరి అరుదైన రెగ్యులేటరీ వనరుల వినియోగానికి దారితీస్తున్నది.

ఇంతేగాకుండా, పరిణితిగల సమగ్ర పర్యవేక్షణ చట్రం దిశలో రిజర్వు బ్యాంకు పాత్రత దృష్ట్యా PSO ల పై మెరుగైన పర్యవేక్షణ అవసరం ఎంతైనా ఉంది. లైసెన్సింగ్ అనిశ్చితులను తగ్గించడానికి మరియు పిఎస్‌ఓలు తమ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి మరియు తప్పనిసరి అరుదైన రెగ్యులేటరీ వనరుల వినియోగాన్ని అవసరమైనంతమేరకు తగ్గించడానికి, కొన్ని షరతులకు లోబడి, అన్ని పిఎస్‌ఓలకు (కొత్త దరఖాస్తుదారులు మరియు ప్రస్తుత పిఎస్‌ఓలు) శాశ్వత ప్రాతిపదికన ఆథరైజేషన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. వివరణాత్మక సూచనలు విడిగా జారీ చేయబడతాయి.

(యోగేశ్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/454

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?