RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525880

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

తేదీ: ఫిబ్రవరి 10, 2022

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

ఈ ప్రకటన, i) ద్రవ్య సంబంధిత (లిక్విడిటీ) చర్యలు; (ii) ఫైనాన్షియల్ మార్కెట్లు; (iii) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు మరియు; (iv) నియంత్రణ మరియు పర్యవేక్షణకు సంబంధించి వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది.

I. ద్రవ్య సంబంధిత చర్యలు

1. అత్యవసర ఆరోగ్య సేవలకు ₹50,000 కోట్ల టర్మ్ లిక్విడిటీ సౌకర్యం పొడిగింపు

మే 5, 2021 వ తేదీన, మూడు సంవత్సరాల వ్యవధితో దేశంలో COVID-19 సంబంధిత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదు`పాయాలు మరియు సేవలను మెరుగుపరచడానికి తక్షణ లిక్విడిటీని పెంచడానికి రెపో రేటు వద్ద ₹50,000 కోట్ల ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండో ప్రకటించబడింది. అటువంటి రుణాలకు ప్రాధాన్యతా రంగ వర్గీకరణను మార్చి 31, 2022 వరకు పొడిగించడం ద్వారా పథకం కింద రుణాలను త్వరగా పంపిణీ చేయడానికి బ్యాంకులు ప్రోత్సహించబడ్డాయి. ఈ పథకం కింద బ్యాంకులు కోవిడ్-19 రుణ పుస్తకాన్ని సిద్ధం చేయాలని భావించారు. అదనపు ప్రోత్సాహకంగా, అటువంటి బ్యాంకులు తమ మిగులు లిక్విడిటీని రివర్స్ రెపో విండో కింద కోవిడ్-19 లోన్ బుక్ మేరకు రెపో రేటు కంటే 25 బిపిఎస్‌ల తక్కువ రేట్ తో అంటే రివర్స్ రెపో రేటు కంటే 40 బిపిఎస్‌లు ఎక్కువ రేటు తో జమ చేయాడానికి అర్హత పొందాయి. COVID2-19 కు సంబంధించిన అత్యవసర ఆరోగ్య సేవల కోసం, బ్యాంకులు ₹9,654 కోట్ల మేరకు వారి నిధులను (ఫిబ్రవరి 4, 2022 నాటికి) వినియోగించుకున్నాయి. స్కీమ్‌కి వచ్చిన ప్రతిస్పందన దృష్ట్యా, ఈ విండోను ముందు ప్రకటించిన మార్చి 31, 2022 వ తేదీ నుండి జూన్ 30, 2022 వరకు పొడిగించాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది.

2. కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్‌ల కోసం ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండో పొడిగింపు

జూన్ 4, 2021వ తేదీన, మార్చి 31, 2022 వరకు మూడు సంవత్సరాల వ్యవధి మేరకు అందుబాటులో ఉండే నిర్దిష్ట కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్‌ల కోసం రెపో రేటు వద్ద ₹15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండోను తెరవాలని నిర్ణయించారు. ప్రోత్సాహకంగా, ఆయా బ్యాంకులు తమ మిగులు లిక్విడిటీని స్కీమ్ కింద సృష్టించిన కోవిడ్-19 లోన్ బుక్ మొత్తం వరకు RBI వద్ద డిపాజిట్ చేయడానికి అర్హత కలిగి ఉన్నాయి. కోవిడ్-19 లోన్ బుక్‌లోని ఈ మొత్తం లిక్విడిటీ, రెపో రేటు కంటే 25 బిపిఎస్ దిగువన లేదా వేరే విధంగా చెప్పాలంటే, రివర్స్ రెపో రేటు కంటే 40 బిపిఎస్ అధిక రేటు తో డిపాజిట్ చేయబడింది. ఆర్‌బిఐ నుండి నిధులు పొందకుండా తమ స్వంత వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ఈ పథకం కింద రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్న బ్యాంకులు కూడా ఈ ప్రోత్సాహకానికి అర్హులు. కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టార్ కింద ఉన్న ఎంటిటీల కోసం బ్యాంకులు తమ ₹5,041 కోట్ల కార్పస్‌ను (ఫిబ్రవరి 04, 2022 నాటికి) ఉపయోగించాయి. పథకానికి వచ్చిన ప్రతిస్పందన దృష్ట్యా, ఇప్పుడు ఈ విండోను జూన్ 30, 2022 వరకు పొడిగించాలని ప్రతిపాదించబడింది.

II. ఫైనాన్షియల్ మార్కెట్లు

3. స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం (VRR) - పరిమితులలో పెరుగుదల

దేశం లో జారీ చేయబడిన ఋణ సెక్యూరిటీలలో స్థిరమైన పెట్టుబడిని సులభతరం చేయడానికి, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) ప్రభుత్వ మరియు కార్పొరేట్ రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికై స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం (VRR) మార్చి 01, 2019 వ తేదీన ప్రారంభించబడింది. ఈ VRR మార్గం, FPIలకు విస్తృతమైన నియంత్రణల నుంచి విముక్తి కోసం దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యం తో ప్రత్యేక ఛానెల్‌ని అందించింది. VRR కింద పెట్టుబడి కోసం ₹1,50,000 కోట్ల పెట్టుబడి పరిమితి నిశ్చయించబడింది. VRRకి వచ్చిన సానుకూల స్పందనను పరిగణనలోకి తీసుకుని (పరిమితి ముగింపుకు చేరువలో ఉన్నందున), VRR కింద పెట్టుబడి పరిమితిని, ఏప్రిల్ 01 2022 వ తేదీ నుండి మరో ₹1,00,000 కోట్లు పెంచి, మొత్తంగా ₹2,50,000 కోట్లకు, పెంచాలని ప్రతిపాదించబడింది. సవరించిన పెట్టుబడి పరిమితిని ఈరోజు నోటిఫై చేస్తున్నారు.

4. క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ (CDS) మార్గదర్శకాల సమీక్ష

క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ (CDS) మార్గదర్శకాలు మునుపు జనవరి 2013 లో జారీ చేయబడ్డాయి. కార్పొరేట్ బాండ్‌ల లిక్విడిటీ మార్కెట్ (ముఖ్యంగా తక్కువ రేటింగ్ ఉన్న జారీదారుల బాండ్లు) అభివృద్ధి కోసం CDS మార్కెట్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ మార్గదర్శకాలను సమీక్షించాలని డిసెంబర్ 04, 2020 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై ప్రకటనలో ప్రకటించబడింది. దీని ప్రకారం, ప్రజా సంప్రదింపుల కోసం ఫిబ్రవరి 16, 2021న ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తుది ఆదేశాలు జారీ చేస్తున్నారు.

5. ఆఫ్‌-షోర్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ సెటిల్డ్ రుపీ డెరివేటివ్స్ మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి బ్యాంకులను అనుమతించడం

భారతదేశంలోని బ్యాంకులు తమ వడ్డీ రేటు రిస్క్‌ను నియంత్రించడానికి నాన్-రెసిడెంట్‌లకు రుపీ ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్‌లను అందించడానికి జూన్ 2019 లో అనుమతించబడ్డాయి. విదేశీ సంస్థలు ఓవర్‌నైట్ ఇండెక్స్‌డ్ స్వాప్‌లను (OIS) భారత్ లోని మార్కెట్ మేకర్ యొక్క విదేశీ బ్రాంచ్ / పేరెంట్ / గ్రూప్ ఎంటిటీ (విదేశీ సమానమైన) ద్వారా నేరుగా లేదా బ్యాక్-టు-బ్యాక్ ప్రాతిపదికన (భారత్ లోని బ్యాంకులతో హెడ్జ్ ప్రయోజనం కోసం కాకుండా) ఇతర ప్రయోజనాల కోసం చేపట్టవచ్చు. ఈ చొరవ దేశీయ OIS మార్కెట్‌లో లిక్విడిటీని పెంచింది, భాగస్వామ్య వైవిధ్యతను ప్రోత్సహించింది మరియు ఆన్‌-షోర్ మరియు ఆఫ్‌-షోర్ మార్కెట్ల మధ్య విభజనను తగ్గించింది. దేశంలో ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్‌ల మార్కెట్‌ను మరింత పెంచడం, ఆన్‌-షోర్ మరియు ఆఫ్‌-షోర్ మార్కెట్ల మధ్య విభజనను తగ్గించడం మరియు ధరల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం, భారతదేశంలోని బ్యాంకులను ఆఫ్‌షోర్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ సెటిల్డ్ రుపీ డెరివేటివ్స్ మార్కెట్‌లో నాన్-రెసిడెంట్ ల తోను మరియు ఇతర మార్కెట్ మేకర్ల తో లావాదేవీలు చేపట్టడానికి అనుమతించాలని నిర్ణయం చేయడమైనది. బ్యాంకులు భారతదేశంలోని వారి శాఖలు, వారి విదేశీ శాఖలు లేదా వారి IFSC బ్యాంకింగ్ యూనిట్ల ద్వారా పాల్గొనవచ్చు. ఈరోజు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

III. చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు

6. ఈ-రుపీ (e-RUPI )(UPIని ఉపయోగించే ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్‌లు) కింద సీలింగ్‌లో పెరుగుదల

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసి, ఆగస్టు 2021లో జారీ చేసిన e-RUPI ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్ అనేది వ్యక్తి-నిర్దిష్టo మరియు ప్రయోజనం-నిర్దిష్టo తో నగదు రహిత వోచర్ మరియు వ్యక్తులు, కంపెనీలు లేదా ప్రభుత్వాలు ఉపయోగించవచ్చు. e-RUPI వోచెర్ UPI ప్లాట్‌ఫారమ్‌పై చెలామణిలో ఉంటుంది మరియు ఒక్కో వోచర్‌కు ₹10,000/- పరిమితిని కలిగి ఉంటుంది మరియు ప్రతి వోచర్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు/రీడీమ్ చేయవచ్చు. ప్రస్తుతం e-RUPI వోచర్‌లు కోవిడ్-19 టీకా ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు e-RUPI వోచర్‌ల ఇతర వినియోగo కోసం చురుకుగా పరిశీలిన చేస్తున్నాయి.

వివిధ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డిజిటల్ డెలివరీ చేయడానికి, ప్రభుత్వాలు జారీ చేసిన e-RUPI వోచర్‌ల పరిమితిని ఒక్కో వోచర్‌కు ₹1,00,000/-కి పెంచాలని మరియు e-RUPI వోచర్‌ల పలుమార్లు వినియోగాన్ని అనుమతించాలని (వోచర్ మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు) ప్రతిపాదించబడింది. NPCIకి అవసరమైన ఆదేశాలు, విడిగా జారీ చేయబడతాయి.

7. MSME రిసీవబుల్స్ ఫైనాన్సింగ్ కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రారంభించడం - TReDS సెటిల్‌మెంట్ కోసం NACH మాండేట్ పరిమితి ( mandate limit) ని పెంచడం

ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (TReDS) మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEలు)ల రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ / ఫైనాన్సింగ్‌ను సులభతరం చేస్తుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) సిస్టమ్‌లో మాండేట్ (mandate) ల ద్వారా TReDS సెటిల్‌మెంట్లు నిర్వహించబడతాయి. ప్రస్తుతం NACH mandate యొక్క పరిమితి మొత్తం ₹1 కోటికి పరిమితం చేయబడింది..

భాగస్వామ్యం ను పెంపొందించడం ద్వారా ఆవిష్కరణలు మరియు పోటీని ప్రోత్సహించడానికి, TReDS ఆపరేటర్ల యొక్క 'ఆన్-ట్యాప్' ఆధరైజేషణ్ ( అధికారాన్ని) ను అక్టోబర్ 2019లో రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టింది. అంతేగాక, MSMEల నిర్వచనాన్ని, జూలై 01, 2020 తేదీ నుండి, వాటి వార్షిక టర్నోవర్‌తో లింక్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సవరించింది. MSMEల పెరుగుతున్న లిక్విడిటీ అవసరాలు మరియు TReDS ప్లాట్‌ఫారమ్‌ల నుండి స్వీకరించబడిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, TReDS సెటిల్‌మెంట్ల కోసం NACH మాండేట్ పరిమితిని ₹3 కోట్లకు పెంచాలని ప్రతిపాదించబడింది.

అవసరమైన సూచనలు విడిగా జారీ చేయబడతాయి.

IV - నియంత్రణ మరియు పర్యవేక్షణ

8. IT అవుట్‌సోర్సింగ్‌పై మాస్టర్ డైరెక్షన్ (MD) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్, రిస్క్, కంట్రోల్స్ అండ్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్‌పై మాస్టర్ డైరెక్షన్ (MD)

ఫైనాన్షియల్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఫిన్‌టెక్ ప్లేయర్‌ల ద్వారా కొత్త సాంకేతికతలను సులభంగా యాక్సెస్ చేయడానికి కీలకమైన IT సేవలను అవుట్‌సోర్సింగ్ మరియు అవుట్‌సోర్సింగ్ చేయడం యొక్క భారీ ప్రయోజనాలను నియంత్రిత సంస్థలు తెలుసుకోగలిగాయి. అయితే ఈ ఏర్పాట్లు వారిని ముఖ్యమైన ఆర్థిక, కార్యాచరణ మరియు కీర్తిపరమైన నష్టాలకు గురిచేస్తాయి. అదేవిధంగా, బ్యాంకింగ్ సేవలను పొందేందుకు డిజిటల్ ఛానెల్‌లపై వినియోగదారులు(కస్టమర్లు) ఆధారపడటం పెరగడం వలన నియంత్రిత సంస్థలు కార్యాచరణ సౌలభ్యంపై దృష్టి పెట్టడం అత్యంత ఆవశ్యకం.

అందువల్ల, రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్, ఏకాగ్రత-రిస్క్ నిర్వహణ, పీరియాడిక్ రిస్క్ అసెస్‌మెంట్ మరియు విదేశీ సర్వీస్ ప్రొవైడర్లకు అవుట్‌సోర్సింగ్ వంటి ఐటి అవుట్‌సోర్సింగ్ అంశాలకు తగిన నియంత్రణ మార్గదర్శకాల అవసరం ఉందని భావించబడింది. సమాచార భద్రత, సుపరిపాలన మరియు నియంత్రణ, వ్యాపార కొనసాగింపు నిర్వహణ మరియు సమాచార వ్యవస్థల ఆడిట్‌పై మార్గదర్శకాలు కూడా నవీకరించబడాలి మరియు ఏకీకృతం కావాలి.

దీని ప్రకారం, పై అంశాలను పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదించింది. వాటాదారులు మరియు ప్రజల వ్యాఖ్యల కోసం రెండు డ్రాఫ్ట్ ఆదేశాలు జారీ చేయబడతాయి: (i) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (IT అవుట్‌సోర్సింగ్) ఆదేశాలు, 2022; మరియు (ii) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుడ్ గవర్నెన్స్, రిస్క్, కంట్రోల్ అండ్ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్) ఆదేశాలు, 2022.

(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1694.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?