RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516037

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన భారతీయ రిజర్వ్ బ్యాంక్

అక్టోబర్ 04, 2017.

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన
భారతీయ రిజర్వ్ బ్యాంక్

ఈ ప్రకటన వివిధ అభివృద్ధి మరియు నియంత్రణా విధాన చర్యల పురోగతిని సమీక్షించి, ద్రవ్య ప్రసరణం ను మరింత మెరుగు పరచేందుకు; బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు; ఫైనాన్షియల్ మార్కెట్ లను విస్తృతపరచేందుకు మరియు ఆర్దిక సేవల అందుబాటును, చెల్లింపులు మరియు ఒప్పందాల వ్యవస్థను మెరుగు పరచడం ద్వారా, మరింత విస్తృత పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.

I. ద్రవ్య విధాన ప్రసరణం ను మెరుగు పరచేందుకు చర్యలు

2. ఆగష్టు 2, 2017 నాటి అభివృద్ధి మరియు నియంత్రణా విధాన ప్రకటన లో సూచించిన విధంగా, ‘మార్జినల్ కాస్ట్ అఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్’ (MCLR) విధానంలోని వివిధ అంశాలను పరిశీలించి ద్రవ్య ప్రసరణం ను మరింత మెరుగు పరచేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఒక ఇంటర్నల్ స్టడీ గ్రూప్ (చైర్మన్: డాక్టర్ జనక్ రాజ్) ను ఏర్పాటు చేసింది. స్టడీ గ్రూప్ సెప్టెంబర్ 25, 2017 తేదీ నాటి తమ రిపోర్ట్ ద్వారా అంతర్గత బెంచ్మార్క్ లయిన బేస్ రేటు / MCLR ల ద్వారా ద్రవ్య విధాన ప్రసరణం సమర్ధవంతంగా జరగలేదని అభిప్రాయపడింది. బేస్ రేట్ / MCLRను మరియు వాటిమీద వేసే మిగతా భారం (స్ప్రెడ్) నిర్ధారించడంలోని నియంతృత్వ పోకడల వలన వడ్డీ రేటును నిర్ణయించడంలో వాటి పాత్రా చిత్త శుద్ధిని శంకించవలసి వస్తుంది. బ్యాంకు రుణాలకు వెల (ప్రైసింగ్) నిర్ణయించడంలో, ఈ బేస్ రేట్ / MCLR విధానాలు ప్రపంచవ్యాప్త (గ్లోబల్) పద్ధతులకు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల, స్టడీ గ్రూప్ వారు ‘ఎక్ష్టర్నల్ బెంచ్మార్క్’ వైపుకు ఒక నిర్ణీత గడువులోగా మార వలసినదిగా సిఫారసు చేసారు. స్టడీ గ్రూప్ వారి రిపోర్ట్ ను ఈ రోజు ఆర్బీఐ వెబ్సైటు లో ప్రజల మరియు భాగస్తుల (స్టేక్హోల్డర్ల) కామెంట్ల కొరకు విమోచనం (రిలీజ్) చేస్తారు. అక్టోబర్ 25, 2017 వరకు వచ్చిన ప్రతిపుష్టి (ఫీడ్ బ్యాక్) ఆధారంగా రిజర్వ్ బ్యాంక్, స్టడీ గ్రూప్ వారి సిఫారసులమీద తుది అభిప్రాయానికి వస్తారు.

II. బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణ

3. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్) తగ్గింపు: జనవరి 1, 2019 లోగా లిక్విడిటీ కవరేజ్ రేషియో నూరు శాతం చేరేలా, యస్ యల్ ఆర్ ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడo ద్వారా దానిని, అక్టోబర్ 14, 2017 తేదీనుండి మొదలయ్యే పక్షం నాటి బ్యాంకుల డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ (NDTL) లో, 20.0 శాతం నుంచి 19.50 శాతం కు తగ్గించడానికి ప్రతిపాదించడమైనది. హెల్డ్ టు మెచూరిటి (HTM) క్రింద యస్ యల్ ఆర్ సెక్యూరిటీస్ సీలింగ్ ను, బ్యాంకుల NDTL మీద 20.25 శాతం నుంచి 19.50 శాతoనకు దశలలో – 20 శాతం కు డిసెంబర్ 31, 2017 నుండి మరియు 19.50 శాతం మార్చ్ 31, 2018 నుండి - తగ్గిస్తారు.

4. ‘ప్రజా రుణ రెజిస్ట్రీ (పబ్లిక్ క్రెడిట్ రెజిస్ట్రీ - PCR) పై హైలెవెల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు: . ఆగష్టు 2, 2017 నాటి అభివృద్ధి మరియు నియంత్రణా విధాన ప్రకటన లో ప్రకటించిన విధంగా, ప్రజా రుణ రెజిస్ట్రీ (పబ్లిక్ క్రెడిట్ రెజిస్ట్రీ - PCR) పై ఒక హైలెవెల్ టాస్క్ ఫోర్స్ (చైర్మన్: శ్రీ యశ్వంత్ దియోస్థలి) ఏర్పఱుపఁబడినది. ఈ టాస్క్ ఫోర్స్ లో వివిధ భాగస్వామ్య పక్షాలైన రిజర్వ్ బ్యాంక్, బ్యాన్కిన్గేతర ఆర్దిక సంస్థలు, పరిశ్రమా ప్రతినిధులు మరియు సమాచార సాంకేతిక శాస్త్ర (IT) నిపుణులు ప్రతినిధులు. ఈ టాస్క్ ఫోర్స్, ప్రస్తుతం లభించుతున్న రుణ సమాచారం, ఉన్నటువంటి సమాచార లభ్యతల (యుటిలిటీస్) పరిపూర్ణతల మీద మరియు ఉన్నటువంటి లోపాలను (గ్యాప్స్) ఎటువంటి PCR ద్వారా పూరించ వచ్చో, సమీక్ష చేస్తుంది. PCR పరిధిని నిర్ణయించడం మరియు PCR ఎటువంటి సమాచారo మఱియు క్రెడిట్ మార్కెట్ల ను కవర్ చేయాలి అనే వాటి గురించి అంతర్జాతీయoగా ఉన్న మంచి పద్ధతులను ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించే అత్యంత ఆధునిక సమాచార వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థలు ఏకీకృతమవడానికి మరియు మరింత బలోపేతo అవడానికి వీలుకల్పిస్తుంది. పారదర్శకంగాను, సమగ్రంగాను మరియు నియర్` రియల్ టైం కు సమానంగా ఉండే భారతీయ రెజిస్ట్రీ తయారు చేయడానికి క్రమజాలమైన, ప్రాదాన్యతా రోడ్ మ్యాపును కూడా సూచిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుండి ఆరు నెలల అంటే ఏప్రిల్ 4, 2018 లోపున, రిపోర్ట్ ను సమర్పిస్తారు.

5. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయ్యర్ (LEI)

ఏ బ్యాంక్ నుంచైనా గాని రూ. 5 కోట్లు ఆ పైన ఫండ్ మరియు నాన్ ఫండ్ బేస్డ్ ఎక్ష్పొజరు ఉన్న కార్పోరేట్ సంస్థలకు LEI రిజిస్ట్రేషన్ ను విధిగా చేసినట్లు బ్యాంకులు ఆదేశించాలని, ఆ రిజిస్ట్రేషన్ ను బ్యాంకులు పొందాలని, తరువాత ‘సెంట్రల్ రేపోసిటరి అఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్’ (CRILIC) లో చిక్కించాలని (capture), నిర్ణయిoచారు. దీనివల్ల కార్పోరేట్ గ్రూపుల సమిష్టి అప్పులు అంచనావేయడానికి వీలవటమే గాకుండా, ఎంటిటీల / గ్రూప్ ల ఆర్దిక వ్యక్తిత్వాన్ని పర్యవేక్షణ చేయవచ్చు. ఈ ఆవశ్యకతను క్రమాంకితంలో(క్యాలిబ్రేటెడ్) ఒక నిర్దిష్ట సమయంలోగా అమలు పరుస్తారు. తప్పనిసరి సూచనలు అక్టోబర్ 2017 చివర లోగా ఇస్తారు.

6. సహకార బ్యాంకులకు (కో ఆపరేటివ్ బ్యాంకులకు) కరెంట్‌ ఖాతా (కరెంట్ అకౌంట్) తెరవడం – ప్రస్తుతం, నాన్-షెడ్యూల్డు సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ లో కరెంట్‌ ఖాతా తెరవడానికి ఇపుడు నిర్దేశించబడిన కొన్నిఆవస్యకతలను పాటించడంలో ఇబ్బుందులు ఎదుర్కొంటున్నాయి. దాని ఫలితంగా, సహకార బ్యాంకులు నిర్బంధంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ల లోను, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకుల లోను మరియు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకుల లోను నగదు నిల్వల నిష్పత్తి కొరకు నిల్వలు ఉంచాల్సి వస్తుంది. ఉంచిన ఈ నిల్వలను ఇంటర్-బ్యాంక్ డిపాజిట్లు గా ఎంచుతారు. ఈ ఇంటర్-బ్యాంక్ డిపాజిట్లు, క్రితం సంవత్సరం బ్యాలెన్స్ షీట్ తేదీ నాటి, మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 20 శాతం ను మించరాదు. దీనివల్ల, సహకార బ్యాంకులు తమ క్లియరింగ్ / సెటిల్మెంట్ కొరకు, ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీలు, రెమిటెన్స్ మరియు కరెన్సీ చెస్ట్ లావాదేవీల కొరకు తగినంత లిక్విడ్ ఫండ్స్ ను కొనసాగించడంలోఇబ్బందులు పడుతున్నాయి. అంచేత, సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ లో కరెంట్‌ ఖాతా తెరవడానికి మరియు నగదు నిల్వల నిష్పత్తి కొరకు నిల్వ కొనసాగించడానికి, నియంత్రణా నియమాలు సులువు చేయబడ్డాయి. అనుమతిపత్రము (లైసెన్సు) ఉన్న అన్ని సహకార బ్యాంకులకు (అల్-ఇంక్లూసివ్ ఆదేశాలక్రింద ఉన్నవి కాకుండా) కరెంట్‌ ఖాతా తెరవడానికి ‘నో-అబ్జెక్షెన్-పత్రం’ జారీ చేయమని రిజర్వ్ బ్యాంక్ అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు తెలియచేశాము.

7. బ్యాన్కిన్గేతర ఆర్దిక సంస్థల నియంత్రణ – పీర్-టు-పీర్ (P2P) - ఒక బ్యాన్కిన్గేతర ఆర్దిక సంస్థ గా పీర్-టు-పీర్ (P2P) అప్పిచ్చే వేదిక (లెండింగ్ ప్లాట్ ఫామ్) నియంత్రణ పై రిజర్వ్ బ్యాంక్ ఒక చర్చాపత్రం ను జారీ చేసింది. ఈ పీర్-టు-పీర్ (P2P) వేదికను, సెప్టెంబర్ 18, 2017 నాడు ప్రచురించన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45I (f)(iii) క్రింద, బ్యాన్కిన్గేతర ఆర్దిక సంస్థగా (NBFC) ప్రకటించడం (నోటిఫై) జరిగింది. అందువల్ల, రిజర్వ్ బ్యాంక్, ఈ రోజున NBFC (P2P)కు నిబంధనలను (రేగులేషేన్స్) జారీ చేస్తుంది.

8. వయోవృద్ధులకు మరియు భిన్న సామర్ధ్యాలు గలవారికి బ్యాంకింగ్ సౌకర్యం వయోవృద్ధులను మరియు భిన్న సామర్ధ్యాలు గలవారిని బ్రాంచిలలో బ్యాంకింగ్ సౌకర్యాలు ఉపయోగించుకోకుండా, బ్యాంకులు నిరుత్సాహపరుస్తున్నాయని లేదా తరిమివేస్తున్నాయని రిపోర్ట్ చేయబడింది. ఎటీయం ల వాడకం మరియు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యం ఉన్నప్పటికీ, వయోవృద్ధులు, భిన్న సామర్థ్యాలు గల వారితో సునిశితంగా వ్యవహరించాలి. వారికి పరిమిత సేవాభావన అని అభిప్రాయపడకుండా, వారి బాంకింగ్ అవసరాలను తీర్చడానికి బ్యాంకులు స్పష్టమైన యేర్పాటు చేయాలని, బ్యాంకులను ఆదేశించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భం లో, వచ్చే ఫిర్యాదు లపై శ్రద్ధ వహించాలని అంబుడ్స్మన్ లకు (ombudsmen) తెలియచేయడం జరుగుతుంది. తప్పనిసరి సూచనలు అక్టోబర్ 2017 చివర లోగా ఇస్తారు.

III. ఫైనాన్షియల్ మార్కెట్లు

9. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫాం అనుమతించడం (ఆధరైసేషన్) కొరకు చట్రం (ఫ్రేంవర్క్) – ప్రపంచ వ్యాప్తంగా, ఎలక్ట్రానిక్ వేదిక (ప్లాట్ఫాం) మీద ట్రేడింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తుంటారు, ఎందువల్లనంటే ధర పారదర్శకత, ప్రాసెసింగ్ సామర్ధ్యం మరియు ప్రమాద నియంత్రణ మెరుగుపడతాయి. దీనివల్ల మార్కెట్ పర్యవేక్షణ బాగుంటుంది. ఇది మార్కెట్ దుర్వినియోగాన్ని మరియు అన్యాయమైన వ్యాపార పద్ధతులను నిరుత్సాహపరుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ లోని ఫైనాన్షియల్ మార్కెట్ ఉపకరణాలకై (ఇన్స్ట్రుమెంట్స్) ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫాం అనుమతించడం కోసం, రిజర్వ్ బ్యాంక్ ఒక చట్రం (ఫ్రేంవర్క్) ను ప్రవేశపెట్టాలి. ఈ చట్రం (ఫ్రేంవర్క్) అర్హత ప్రమాణ వివరాలు, టెక్నాలజీ అవసరాలు మరియు నివేదిక ప్రామాణికలు (రిపోర్టింగ్ స్టాండర్డ్స్) విశదీకరించేదై ఉండాలి. అన్ని కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫాములు ఈ చట్రం (ఫ్రేంవర్క్) క్రింద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇపుడు ఉన్న ట్రేడింగ్ ప్లాట్ఫాములు కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి పోస్ట్-ఫాక్టో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2017 నెల చివరిలోగా ప్రజాభిప్రాయం పంపడం కోసం, వొక ముసాయిదా చట్రం (ఫ్రేమ్వర్క్) ను రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ లో ఉంచుతారు.

10. రిటైల్ వినియోగదారుల కొరకు విదేశీ మారక వాణిజ్య ప్లాట్ ఫామ్ - విదేశీ మారక మార్కెట్ లో రిటైల్ వినియోగదారుల (వ్యక్తులు మరియు మైక్రో, స్మాల్ మరియు మీడియం సంస్థలు) కోసం ఒక పారదర్శకమైన మరియు సరసమైన ధర వొసంగె విధానం ఉండాలనీ పబ్లిక్ ఇంటరాక్షన్స్ లోను మరియు వివిధ ఫోరం లలోను చెప్తున్నారు. ధర నిర్ధారణ ను మెరుగుపరచడానికై ‘రిటైల్ వినియోగదారుల’ (లావాదేవీల పరిమాణం బట్టి) కోసం ఒక విధానo ప్రతిపాదించడమైoది. ఈ విధానo లో, క్లైంట్ లకు ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫాం యాక్సెస్ ను ఇవ్వడం ద్వారా క్లైంట్ ప్రైసింగ్ ను మార్కెట్ డైరెక్ట్ గా నిర్ణయిస్తుంది. అంటే క్లైంట్లు మరియు ఆథరైజ్డ డీలర్ల బిడ్ / ఆఫెర్ లు అజ్ఞాతంగా మరియు స్వయంచాలకంగా మ్యాచ్ చేయబడతాయి. ఇటువంటి విధానంలో పారదర్సకత మరియు కాంపిటీషన్ పెరిగి వినియోగదారులకు సరసమైన ధర లభిస్తుంది. వినియోగదారులు డైరెక్ట్ గా ఆర్డర్లు ఎక్షికూట్ చేయడం వలన, బ్యాంకులకు మార్కెట్ లాట్ తయారు కొరకై లావాదేవీలను వేర్హౌసింగ్ (warehousing) చేయాల్సిన రిస్క్ తగ్గిపోతుంది. అడ్మినిస్త్రేటివ్ ఖర్చుల కొరకై ముందుగా అంగీకరించిన ఫ్లాట్ ఫీజును బ్యాంకులు తమ వినియోగదారులకు ఛార్జ్ చేయవచ్చు మరియు పబ్లిక్ గా డిక్లేర్ చేయవచ్చు. ఈ విధానం ఫారెన్ ఎక్స్చేంజి మార్కెట్ లో రిటైల్ వినియోగదారులు ఎదుర్కొనే మొత్తం ధరను తగ్గిస్తుంది. క్లియరింగ్ కార్పోరేషన్ అఫ్ ఇండియా వారు తమ FX-క్లియర్ ప్లాట్ఫామ్ కు ఇంటర్నెట్-బేస్డ్ అప్లికేషను ద్వారా యాక్సెస్ ను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రతిపాదన మీద ప్రజా వ్యాఖ్యలకై (పబ్లిక్ కామెంట్స్) ఒక డిస్కషన్ పత్రాన్ని అక్టోబర్ 2017 నెల చివరిలోగా జారీ చేస్తారు.

11. హేడ్జింగ్ రుపీ (INR) ఇన్వాయిజ్డ్ ట్రేడ్ ఎక్ష్పొజరు – నాన్ రెసిడెంట్ ఎగుమతి మరియు దిగుమతిదారులకు కార్యాచరణ సౌలభ్యత: బహుళజాతీయసంస్థల నాన్ రెసిడెంట్ సెంట్రలైజ్డ్ ట్రజరీలు తమ భారతీయ అనుబంధ సంస్థల రుపీ (INR) కరెంట్ అకౌంట్ లావాదేవీలను హెడ్జ్ చేసుకోడానికి, రిజర్వ్ బ్యాంక్ మార్చ్ 2017 నెలలో అనుమతించారు. ఈ చొరవ పరిధిని విస్తరించడం ద్వారా, నాన్ రెసిడెంట్ ఎగుమతి మరియు దిగుమతిదారులు రెసిడెంట్ల తో కుదుర్చుకొనే రుపీ (INR) ఇన్వాయిజ్డ్ ట్రేడ్ లావాదేవీల రుపీ (INR) ఎక్ష్పొజరు ను వారి సెంట్రలైజ్డ్ ట్రజరీలు/గ్రూపు ఎంటిటీల ద్వారా హెడ్జ్ చేసుకోవడానికి అనుమతించాలని, నిర్ణయించబడింది. దీనివల్ల రుపీ (INR) ఇన్వాయిజ్డ్ ట్రేడ్ లావాదేవీలు ప్రోచ్చహించ బడటమేగాకుండా, రూపాయి యొక్క అంతర్జాతీయకరణ సులభతరం అవుతుంది, అంతేగాకుండా నాన్ రెసిడెంట్ల INR రిస్క్ కు, ఆన్ షోర్ హెడ్జ్ ని ప్రోత్సహించినట్లవుతుంది. ఇందుకోసం ఒక సర్కులర్ ను అక్టోబర్ 2017 చివర లోగా జారీ చేస్తారు.

12. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పిఐలు) విధాన సమీక్ష

క్యాపిటల్ అకౌంట్ నిర్వహణ అనే పెద్ద చట్రం లో, ఎఫ్‌పిఐల రుణ (డెట్) పెట్టుబడుల నియంత్రణ పధ్ధతి అనేది ఒక భాగం. ఈ నియంత్రణా చట్రం, క్యాపిటల్ ప్రవాహాలు మరియు స్థూల ఆర్థిక పరిస్థితుల పరిణామాల ద్వారా ప్రభావితం అవుతూ, సంవత్సరాలుగా ఉద్భవించింది. భారతదేశం మీద ఎఫ్‌పిఐల ఆసక్తి గణనీయంగా పెరిగింది. అందువల్ల, స్థూల సూచికలకు అనుగుణంగా ఎఫ్‌పిఐలు పెట్టుబడులు ప్రాసెస్‌ చేయడానికి, హెడ్జింగ్‌ చేసుకోవడానికి, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పిఐలు) విధానాన్ని వివరణాత్మకంగా సమీక్ష చేయవలసిన అగత్యం ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల నిబంధనలు సమీక్షించి తదనుగుణంగా కొత్త నియంత్రణలను ప్రకటించి వాటిని అమలులోకి వచ్చేలా చేయవలసిన అగత్యం ఉన్నది. ప్రభుత్వంతోను, సెబితోను చర్చించి, వచ్చే ఏప్రిల్‌ నాటికి అమలులోకి వచ్చేలా కొత్త నిబంధనలకు తుది రూపం ఇవ్వడం జరుగుతుంది.

13. షార్ట్ సెల్లింగ్ ఆదేశాలపై సమీక్ష: వడ్డీ రేటు వీక్షణలలో వైవిధ్యంను (diversity) ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2005 సంవత్సరం లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ-సెక్) లో ప్రారంభించిన షార్ట్-సెల్లింగ్ ఫలితంగా, జీ-సెక్ మార్కెట్ మరింత చురుకుగా ఉంది. మార్కెట్ లో క్రమబద్ధమైన పనితీరు కోసం, షార్ట్ సేల్ లావాదేవీల సున్నిత పరిష్కారం ముఖ్యం. ఈ దిశగా, తీసుకున్న నిర్ణయం ఏమిటంటే – i) షార్ట్ సెల్లర్ ‘నోషనల్ షార్ట్ సేల్స్’ కొరకు సెక్యూరిటీస్ ని కొనవలసిన అవసరం లేదు, అయితే సెక్యూరిటీ బ్యాంకుల ‘హెల్డ్ ఫర్ ట్రేడింగ్ / అవైలబుల్ ఫర్ సేల్/హెల్డ్ టు మేచూరిటి’ పోర్ట్ ఫోలియో క్రింద ఉన్నా కూడా ఇది అవసరం ; ii) ఎఫ్‌పిఐలు ఓవర్-ది-కౌంటర్ జీ-సెక్ లావాదేవీలను T+1 లేదా T+2 ఆధారంగా ఒప్పందం చేసుకోవచ్చు. ఈ విషయంలో, ఆదేశాలను అక్టోబర్ 2017 మాసాంతానికి జారీ చేస్తారు.

14. రాష్ట్రాల మార్కెట్ రుణాలు - ఉత్తమ పద్ధతుల (బెస్ట్ ప్రాక్టీసులు) స్వీకరణ (అడాప్షన్) – రాష్ట్రాల మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రాం అభివృద్ధి దిశలో, అనేక ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసులను) మార్కెట్ లో ఉంచడం జరిగింది. స్టేట్ డెవలప్మెంట్ లోన్ (యస్డియల్) (SDL) మార్కెట్ లో లిక్విడిటీని ఇంకా డెవలప్ చేసేందుకు; యస్డియల్ జారీని విస్తృతపరిచేందుకు, రాష్ట్రాల ఫిస్కల్ రిస్క్ మేట్రిక్స్ తో స్పందించే మార్కట్ ధర దిశగా కదిలేందుకు; ఆక్షన్ ఫలితాల ప్రకటనలలోని అనిశ్చిత పరిస్తితులను తగ్గించేందుకు, ఈ క్రింది చర్యలు ప్రతిపాదించబడ్డాయి:

  • రాష్ట్ర ప్రభుత్వ రుణాల ఏకీకరణను పునఃజారీలు మరియు బైబ్యాక్ జరపడం ద్వారా యస్డియల్ (SDL) లో లిక్విడిటీ మెరుగుపడుతుంది; కాబట్టి రెడంప్షణ్ ఒత్తిడి నివారించబడుతుంది మరియు రేసిడ్యుయల్ మేచూరిటి పెరుగుతుంది.

  • యస్డియల్ వేలం ఒక వారం ఆధారంగా నిర్వహించబడుతుంది. వేలం ఫలితం అదే రోజు సాయంత్రం 3.00 గం. ల లోపు ప్రకటించబడుతుంది.

  • రిజర్వ్ బ్యాంక్ అందుబాటులో ఉన్న, రాష్ట ప్రభుత్వాల ఫైనాన్సెస్ లకు సంబందించిన అధిక ఫ్రీక్వెన్సీ డేటాను, బ్యాంక్ వెబ్సైటు లో వెల్లడి చేయబడుతుంది.

తుది మార్గదర్శకాలు అక్టోబర్ 2017 నెల చివరలోగా జారీచేయబడతాయి. తదుపరి 12 నెలల లో రిజర్వ్ బ్యాంక్ ఆవిష్కరించనున్న మొత్తం సంస్కరణల ప్రారంభ చర్యలు ఈ మార్గదర్శకాలలో ఉంటాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న రిస్క్ అసమానతలు (risk asymmetries) తగినంతగా యస్డియల్ (SDL) మార్కెట్లో ప్రతిబించట్లేదు. (ఉదాహరణకు fiscal responsibility అండ్ budget management review committee report, ఏప్రిల్ 2017 లో గుర్తించిన విధంగా).

15. ప్రైమరీ వేలం (ఆక్షన్)లో రిటైల్ భాగస్వామ్యం – అగ్రిగేటర్స్ గా స్టాక్ ఎక్స్చేంజిలు: జీ-సెక్ మార్కెట్ లో పెట్టుబడిదారుల బేస్ విస్తరణ మొత్తం వ్యూహంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంటు మరియు రిజర్వ్ బ్యాంక్ వివిధ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదనలలో కొన్ని ఏమిటంటే: గవర్నమెంటు సెక్యూరిటీస్ యాక్ట్, 2006 లో మార్పు, NDS-OM సెకండరీ మార్కెట్లో బేసి మాట్లను ప్రవేశపెట్టింది, సెటిల్మెంట్ మెకానిజం ను మెరుగుపరచడం, ప్రైమరీ డీలర్ల చే జీ-సెక్ రిటైలింగ్; మరియు ప్రైమరీ ఆక్షన్లలో నాన్-కాంపిటీటివ్ బిడ్డింగ్ ను ప్రవేశబెట్టడం . యూనియన్ బడ్జెట్ 2016-17 లో ప్రకటించిన విధంగా, ప్రైమరీ మరియు సెకండరీ మార్కెట్లలో స్టాక్ ఎక్స్చేంజిల ద్వారా రిటైల్ భాగస్వామ్యం (పార్టిసిపేషన్) ను రిజర్వ్ బ్యాంక్ సులభతరం చేస్తుంది. తదనుగుణంగా, సెబీతో సంప్రదించిన తరువాత, ప్రతిపాదించడమేమిటంటే: -

  • భారత ప్రభుత్వ డేటెడ్ సెక్యూరిటీస్ మరియు ట్రెజరీ బిల్లుల ఆక్షన్ల నాన్-కాంపిటీటివ్ సెగ్మెంట్ లోని రిటైల్ ఇన్వెస్టర్ బిడ్స్ లకు అగ్రిగేటర్స్ / ఫెసిలిటేటర్స్ గా షెడ్యూల్డ్ బ్యాంకులు మరియు ప్రైమరీ డీలర్లతో పాటు, పేర్కొన్న(స్పెసిఫైడ్) స్టాక్ ఎక్షెన్జీలు అనుమతించబడతాయి.

తుది మార్గదర్శకాలు అక్టోబర్ 2017 నెల చివరలోగా జారీచేయబడతాయి.

IV – చెల్లింపులు మరియు పరిష్కారాలు

16. ప్రీపెయిడ్ సాధనాలపై (PPI) మాస్టర్ డైరెక్షన్స్ – ఎలక్ట్రానిక్ చెల్లింపుల్లో సమర్ధతను, భద్రతను పెంచేందుకు ప్రీపెయిడ్ సాధనాల్లో (PPI) సమన్వయo తెచ్చేందుకు ఒక వారం రోజుల్లో అంటే అక్టోబర్ 11, 2017 లోగా కొత్త మార్గదర్శకాలు జారీచేయ బడతాయి.

జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

ప్రెస్ రిలీజ్: 2017-2018/924.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?