<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ – ఏకీకృత అంబుడ్జ్మన్ పథకం, 2021</font> - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ – ఏకీకృత అంబుడ్జ్మన్ పథకం, 2021
నవంబర్ 12, 2021 రిజర్వ్ బ్యాంక్ – ఏకీకృత అంబుడ్జ్మన్ పథకం, 2021 గౌరవనీయులయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి ఈరోజు ఏకీకృత అంబుడ్జ్మన్ పథకం, 2021 (పథకం) వర్చువల్ విధానంలో (ఎలక్ట్రానిక్ మాధ్యమంద్వారా పరోక్షంగా) ప్రారంభోత్సవం చేశారు. 2. ఈ పథకం, ప్రస్తుతం అమలులో ఉన్న మూడు ఆంబుడ్జ్మన్ పథకాలను – (1) బ్యాంకింగ్ అంబుడ్జ్మన్ పథకం, 2006 (2) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆంబుడ్జ్మన్ పథకం, 2018 మరియు (3) డిజిటల్ లావాదేవీల ఆంబుడ్జ్మన్ పథకం, 2019 – ఏకీకృతం చేస్తుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (10, 1949) సెక్షన్ 35 A; భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (2, 1934), సెక్షన్ 45 L మరియు పేమెంట్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 (51, 2007) క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఈ పథకం రూపొందించింది. దీనిద్వారా, రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలోగల సంస్థలలోగల సేవాలోపాలకు ఉచితంగా పరిష్కారం లభిస్తుంది (ఆ సంస్థలు 30 రోజులలోగా వినియోగదారుని ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించని సందర్భంలో). 3. పైన పేర్కొన్న మూడు పథకాలను ఏకీకృతం చేయడమేగాక, రూ. 50 కోట్లు అంతకు మించి డిపాజిట్లు గల నాన్- షెడ్యూల్డ్ ప్రైమరీ కో-ఆప రేటివ్ బ్యాంకులు కూడా ఈ పథకం పరిధిలో చేర్చబడ్డాయి. ఈ పథకం, ‘ఒక దేశం-ఒకే అంబుడ్జ్మన్’ సూత్రం అనుసరిస్తుంది. అందువల్ల, ఆర్ బి ఐ ఆంబుడ్జ్మన్, భౌగోళిక అధికార పరిధులు వర్తించవు. 4. ఈ పథకంలోని కొన్ని ముఖ్యాంశాలు: i) ఏ పథకం క్రింద ఫిర్యాదు చేయాలా అన్న సందేహం తొలగిస్తుంది. ii) ఫిర్యాదు చేయుటకు తగిన ‘సేవా లోపాలు’ నిర్వచింపబడ్డాయి (ప్రత్యేకించి మినహాయించబడ్డ అంశాల జాబితాతో సహా) iii) ఆంబుడ్జ్మన్ కార్యాలయ పరిధులు వర్తించవు. iv) ఏ భాషలోనైనా ఫిర్యాదుల స్వీకరణకు, వాటి ప్రాథమిక పరిశీలనకు, రిజర్వ్ బ్యాంక్, చండిగఢ్ కార్యాలయంలో, కేంద్రీకృత ‘రిసీట్ అండ్ ప్రోసెసింగ్ సెంటర్’ నెలకొల్పబడింది. v) నియంత్రిత సంస్థయొక్క ప్రతినిధిగా వ్యవహరించుటకు, కావలసిన సమాచారం అందించుటకు, ‘ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్’ బాధ్యత వహించవలెను (‘ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్’, ప్రభుత్వ బ్యాంకు, జనరల్ మానేజర్ లేక సమ స్థాయికి తక్కువ ఉండరాదు) vi) సకాలంలో, సంతృప్తికరమైన సమాచారం / పత్రాలు సమర్పించని కారణంగా, నియంత్రిత సంస్థకు వ్యతిరేకంగా ఆంబుడ్జ్మన్ తీర్పు ఇవ్వడం జరిగితే, ఆ సంస్థకు అపీల్ చేసుకొనే హక్కు ఉండదు. 5. ఈ పథకం క్రింద, వినియోగదారుల శిక్షణ మరియు సంరక్షణ విభాగం, రిజర్వ్ బ్యాంక్ యొక్క కార్య నిర్దేశకులు (ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా) అపెలేట్ అధికారిగా వ్యవహరిస్తారు. 6. ఫిర్యాదులు, https://cms.rbi.org.in ద్వారా ఆన్ లైన్లో దాఖలుచేయుట కొనసాగించవచ్చు. ప్రత్యేకంగా కేటాయించిన ఈ-మెయిల్ ద్వారా లేదా భౌతికంగా, ‘కేంద్రీకృత రిసీట్ అండ్ ప్రోసెసింగ్ సెంటర్’, 4 వ అంతస్తు, సెక్టార్ 17, చండిగఢ్ – 160017 చిరునామాకు, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తుచేయవచ్చు. ఇంతేగాక, ఉచిత నంబర్ 14448 (ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 వరకు) ద్వారా హిందీ, ఇంగ్లీష్ మరియు ఎనిమిది ప్రాంతీయ భాషలలొ సంభాషించగల సంపర్క కేంద్రం (కాంటాక్ట్ సెంటర్) అందుబాటులోకి తేవడం జరిగింది. ఇతర భాషలు త్వరలో చేర్చబడతాయి. ఈ సంపర్క కేంద్రాలు, వినియోగదారులు ఫిర్యాదులు దాఖలుచేయుటలో సహాయపడడంతోబాటు, ఫిర్యాదుల పరిష్కరణకు రిజర్వ్ బ్యాంకులోగల ఇతర మార్గాలగురించిన సమాచారం / వివరాలు తెలియచేస్తాయి. 7. పథకంయొక్క ప్రతి, రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ లో మరియు సి ఎమ్ ఎస్ పోర్టల్ (https://cms.rbi.org.in) లో లభిస్తుంది. ఈ పథకం ఈరోజునుండి అమలులోకి వస్తుంది. (యోగేశ్ దయాళ్) పత్రికా ప్రకటన: 2021-2022/1184 |