RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512268

కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర) - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద ఆదేశాల జారీ

తేది: 15/06/2020

కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర) - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద ఆదేశాల జారీ

బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ చట్టం 1949, సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి), సబ్-సెక్షన్‌ (1) క్రింద తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, వారి ఉత్తరువులు DoS.CO.UCBs-West/D-1/12.07.157/2019-20, తేదీ జూన్ 15, 2020 ద్వారా కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర) కు, కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. వీటిని అనుసరించి, జూన్ 15, 2020, పని ముగింపువేళనుండి, పైన పేర్కొన్న బ్యాంకు అడ్మినిస్ట్రేటర్, రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, జూన్ 15, 2020 తేదీన జారీచేసిన ఆదేశాలను అతిక్రమించి, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతోసహా ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదని నిర్దేశించడమైనదని, ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమైనది. జూన్ 15, 2020 తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రతి, కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర), ప్రాంగణంలో ప్రజల సమాచారం కోసం, ప్రదర్శింపబడినది. ప్రత్యేకించి, సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతా నుండి, రూ. 500 (ఐదు వందల రూపాయిలు) మించి, విత్‌డ్రా చేయుటకు అనుమతించరాదు.

2. పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులను సమీక్షించి, రిజర్వ్ బ్యాంక్ ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.

3. ఈ నిర్దేశాలు జూన్ 15, 2020 పని ముగింపువేళనుండి, ఆరు నెలలకాలం అమలులో ఉంటాయి.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/2501

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?