శ్రీనివాస పద్మావతి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ తెలంగాణా పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీనివాస పద్మావతి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ తెలంగాణా పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
పట్టణ సహకార బ్యాంకులలో “ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు- లక్ష్యములు, వర్గీకరణ పై జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు, ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు లో ఏర్పడిన కొరత వలన, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎమ్ ఎస్ ఇ ) రీఫైనాన్స్ నిధికి ఆర్దిక సహకారమును అందించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన నిర్దేశిత ఆదేశాలను పాటించనందులకు గాను శ్రీనివాస పద్మావతి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ తెలంగాణా పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 18 మార్చ్, 2025 ద్వారా రు. 1.20 లక్షల (అక్షరాల ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు రుణాల విడుదలలో ఏర్పడిన కొరత ని అధిగమించడానికి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) చే నిర్వహింప బడే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎమ్ ఎస్ ఇ ) రీఫైనాన్స్ నిధి కి కొంత సొమ్మును డిపాజిట్ చేయ వలసినదిగా ఈ బ్యాంకుకి ప్రత్యేక ఆదేశాలను జారీ చేయడము జరిగినది. కానీ బ్యాంకు ఆ సొమ్మును జమ చేయలేదు. పైన జరిగిన ఆదేశాల ఉల్లంఘన, సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరములను పరిగణనలోకి తీసుకుని, బారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను పాటించ నందుకు గాను ఈ బ్యాంకు పై ఆర్ధిక జరిమానా ఎందుకు విధించ కూడదో వివరణ కోరుతూ నోటీసు జారీ చేయడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు రుణాల విడుదలలో ఏర్పడిన కొరత ని అధిగమించడానికి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) చే నిర్వహింప బడే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎమ్ ఎస్ ఇ) రీఫైనాన్స్ నిధి కి కొంత సొమ్మును ఈ బ్యాంకు జమ చేయలేదు. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆర్ధిక జరిమానా అడ్డంకి కాబోదు (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2024-2025/2429 |