RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115041290

తూత్తుకుడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తూత్తుకుడి, తమిళనాడు వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

మోసాలు - వర్గీకరణ, నివేదన మరియు పర్యవేక్షణ కోసం మార్గదర్శకాలకు సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను పాటించనందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా మే 06, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా తూత్తుకుడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తూత్తుకుడి, తమిళనాడు, (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ పర్యవేక్షణ ఫలితంగా, NABARD రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యం విషయమై సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన పిమ్మట బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.నోటీసుకు స్పందనగా బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో ప్రత్యక్ష సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, అలాగే బ్యాంకు సమర్పించిన అదనపు సమాచారం ఆధారంగా జరిగిన మోసాన్ని NABARD కు నివేదించడంలో జాప్యం జరిగిందన్న విషయం ఋజువైనందున సదరు బ్యాంకుపై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు చర్య చేపట్టవలసివచ్చినది.ఇట్టి జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటుకు గానీ లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘనలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.

 (యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/274

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?