<font face="mangal" size="3">అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని <span style="font-family:Aria - ఆర్బిఐ - Reserve Bank of India
అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని ₹ 10 నాణేలు జారీ
జులై 30, 2015 అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని ₹ 10 నాణేలు జారీ అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని భారత ప్రభుత్వo చే ముద్రించబడిన ₹ 10 నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది. ఈ నాణేల నమూనా (డిజైన్) వివరాలేమిటంటే: ముందువైపు: ఈ నాణెం ముందు వైపు అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) మధ్యలో ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య చెక్కబడి ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం దేవనాగరి లిపిలో మరియు కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో ముద్రించబడి ఉంటాయి. సింహ బురుజు (capitol) క్రింద రూపాయి చిహ్నం “₹“ మరియు నాణెం విలువ (డినామినేషన్) “10” అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. వెనుకవైపు: నాణెం వెనుకవైపున అంతర్జాతీయ యోగాదినమ్ (International Day of Yoga) గుర్తింపు చిహ్నం (లోగో) ఉండి; "सामंजस्य एवं शान्ति के लिए योग" అని దేవనాగరి లిపిలో మరియు "YOGA FOR HARMONY AND PEACE" అని లోగో మరియు డిజైన్ చుట్టూర ముద్రించి ఉంటుంది. తారీఖు “21 జూన్” (“21 JUNE”) అని గుర్తింపు చిహ్నం (లోగో) క్రింద లిఖించబడి ఉంటుంది. నాణెం ఎడమపరిధి వైపున "अंतर्राष्ट्रीय योग दिवस" అని దేవనాగరి లిపిలో మరియు కుడిపరిధి వైపున “INTERNATIONAL DAY OF YOGA” అని ముద్రించబడి ఉంటుంది. సంవత్సరం “2015” అని అంతర్జాతీయ సంఖ్యలలో క్రిందిపరిధి వైపున సరిగ్గా గుర్తింపు చిహ్నం (లోగో) క్రిందుగా లిఖించబడి ఉంటుంది ఈ నాణెం ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతుంది. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. ఈ నాణెం నమూనా (డిజైన్) వివరాలు ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, జూన్ 10, 2015 వ తారీఖున ప్రచురించిన భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i), నం.387 {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) – No.387} లో ప్రకటించ(నోటిఫై)బడినవి. అల్పన కిల్లావాల ప్రెస్ రిలీజ్: 2015-2016/265 |