<font face="mangal" size="3">ఋణ సాధనాల రూపంగా (‘ఇన్ డెట్’) విదేశీ పోర్ట్ ఫో&# - ఆర్బిఐ - Reserve Bank of India
ఋణ సాధనాల రూపంగా (‘ఇన్ డెట్’) విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్ల (ఎఫ్ పి ఐ లు) పెట్టుబడులు – సడలింపు - వాలంటరీ రిటెన్షన్ రూట్ (వి ఆర్ ఆర్)
RBI/2019-20/239 మే 22, 2020 అందరు అధికృత వ్యక్తులకు, అమ్మా / అయ్యా, ఋణ సాధనాల రూపంగా (‘ఇన్ డెట్’) విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్ల (ఎఫ్ పి ఐ లు) పెట్టుబడులు – సడలింపు - వాలంటరీ రిటెన్షన్ రూట్ (వి ఆర్ ఆర్) క్యాటగరి – I, ఆతరైజ్డ్ డీలర్లు, నోటిఫికేషన్ నం. FEMA.396/2019-2020, అక్టోబర్ 17, 2019 (ఎప్పటికప్పుడు సవరణలు చేయబడ్డ) విదేశీ మారక నిర్వహణ (డెట్ ఇన్స్ట్రుమెంట్స్) నిబంధనలు, 2019, తత్సంబంధంగా జారీచేయబడిన మార్గదర్శకాలు దయచేసి చూడండి. దీనితోబాటు, వాలంటరీ రిటెన్షన్ రూట్ (వి ఆర్ ఆర్) క్రింద, పెట్టుబడుల పరిమితులు తిరిగి కేటాయించుటకు సంబంధించి, A.P.(Dir Series) సర్క్యులర్ నం. 34, తేదీ మే 24, 2019 (ఇకమీదట మార్గదర్శకాలు అని పిలువబడతాయి) (A.P.(Dir Series) సర్క్యులర్ నం. 19, తేదీ జనవరి 23, 2020 తో కలిపి) మరియు పత్రికా ప్రకటన జనవరి 23, 2020 కూడా చూడండి. 2. మార్గదర్శకాల అనుబంధం 6(a) అనుసారంగా, ఎఫ్ పి ఎలు, వారి ‘కమిటెడ్ పోర్ట్ ఫోలియో సైజులో, సి పి ఎస్’) కనీసం 75%, కేటాయించిన తేదీనుండి మూడునెలలలోపుగా పెట్టుబడిచేయాలి. కోవిడ్–19 వల్ల కలిగిన అంతరాయాల కారణంగా, జనవరి 24, 2020 (పెట్టుబడుల పరిమితుల కేటాయింపు, తిరిగి ప్రారంభించిన తేదీ), ఏప్రిల్ 30, 2020 తేదీల మధ్య పెట్టుబడుల పరిమితులు కేటాయించబడ్డ ఎఫ్ పి ఐలకు, వారి సి పి ఎస్ లో 75% పెట్టుబడిచేయుటకు, మరొక మూడు నెలల సమయం కేటాయించాలని, నిర్ణయించబడింది. అదనపు సమయం వినియోగించుకోవాలనుకొన్న ఎఫ్ పి ఐలకు, పెట్టుబడులు ఉంచుకోవలసిన సమయం, (పెట్టుబడుల పరిమితి కేటాయించిన సమయంలో వారి అంగీకరించిన) వారు సి పి ఎస్ లో 75% పెట్టుబడులు చేసిన తేదీనుండి ప్రారంభమయేలా, సవరించబడుతుంది. 3. ఈ సర్క్యులర్ లోని ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (డింపుల్ భాండియా) |