<font face="mangal" size="3">అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్.,  - ఆర్బిఐ - Reserve Bank of India
అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., చెన్నపట్న, కర్ణాటక ఫై జరిమానా
June 05, 2018 అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., చెన్నపట్న, కర్ణాటక ఫై జరిమానా అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., చెన్నపట్న, కర్ణాటక ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 100,000/- (లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. ఏప్రిల్ 29, 2003 తేదీ నాటి భారతీయ రిజర్వు బ్యాంకు సర్కులర్ సంఖ్య BPD 50/13.05.00/2002-03 లో నిర్దేశించిన సంచాలకులు (డైరెక్టర్లు) /వారి బంధువులకు మరియు ఫర్మ్స్/సంస్థలకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఫై జరిమానా విధించడం జరిగింది. భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ వ్యక్తిగత విచారణను అర్థించింది. ఈ కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ నివేదన లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/3182 |