<font face="mangal" size="3">నాణేల స్వీకరణ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
నాణేల స్వీకరణ
ఆర్.బి.ఐ/2017-18/132 ఫిబ్రవరి 15, 2018 అధ్యక్షుడు మరియు నిర్వాహక సంచాలకుడు/ మేడం / డియర్ సర్, నాణేల స్వీకరణ బ్యాంక్ బ్రాంచీలు చిన్న విలువ నాణేలను/నోట్లను తమ కౌంటర్ల వద్ద బదిలీకై ఇవ్వబడినప్పుడు తిరస్కరించరాదని, పేరా 1 (డి) లో సూచించిన జూలై 03, 2017న జారీ చేసిన మా మాస్టర్ సర్క్యులర్ DCM (NE) నెం జీ -1/08.07.18/2017-18 వైపు మీ దృష్టిని ఆకర్షిస్తున్నాము. ఏదేమైనప్పటికీ, బ్యాంక్ శాఖలు నాణేలను ఆమోదించకపోవడం గురించి రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదులు రావడం జరుగుతోంది. ఈ విధమైన సేవలను తిరస్కరించడం, అమ్మకపుదారులు మరియు చిన్న వర్తకులచే అట్టి నాణేల నిరాకరణకు, ప్రజల అసౌకర్యానికి దారితీసింది. అందువల్ల, కౌంటర్లలో మార్పిడి లేదా డిపాజిట్ ఖాతాల కోసం ఇచ్చిన మొత్తం అన్ని నాణేలను ఆమోదించడానికి మీ అన్ని శాఖలను తక్షణమే ఆదేశించాలని మళ్ళీ సలహా ఇవ్వడమైనది. 2. 1 రూ. మరియు 2 రూ. యొక్క నాణేలు, బరువు మొత్తంగా అంగీకరించడం ఉత్తమం అని మేము సలహా ఇస్తున్నాము. ఏదేమైనా, పాలీథీన్ సంచులలో, 100 నాణేలు ప్యాక్ చేయబడి అంగీకరించడం వలన క్యాషియర్లకు మరియు వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటువంటి పాలిథిన్ సంచులు కౌంటర్ల వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. ఈ సేవ యొక్క సమాచారం ప్రజల కోసం, శాఖ ప్రాంగణం లోపల మరియు వెలుపల తగినట్లుగా ప్రదర్శించాలి. 3. శాఖల వద్ద నాణేల నిల్వ సమస్యలను తొలగించడానికి, ప్రస్తుత విధానం ప్రకారం నాణేలు కరెన్సీ చెస్ట్లకు తరలించాలి. కరెన్సీ చెస్ట్ నిల్వలను తిరిగి పంపిణీకి ఉపయోగించాలి. ఈ నాణేల నిల్వలకు గిరాకీ లేక చెస్ట్ యొక్క నిల్వ సామర్ధ్యం దాటినట్లయితే, నాణేల తరలింపుకు సర్కిల్ యొక్క జారీ విభాగాన్ని సంప్రదించవచ్చు. 4. నియంత్రణ కార్యాలయాలు శాఖలపై ఆకస్మిక తనిఖీలు చేసి నాణేల స్వీకరణ వివరాలను ముఖ్య కార్యాలయానికి పంపించాలి. నివేదికలు ముఖ్య కార్యాలయంలో సమీక్షించి, అవసరమైతే తక్షణ పరిష్కార చర్య తీసుకోవాలి. 5. ఈ విషయంలో నిబంధనలను పాటించనప్పుడు అది రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన సూచనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది మరియు ఎప్పటికప్పుడు అమలులో ఉన్న అపరాధ చర్యలతో సహా ఇతర చర్యలను ప్రారంభించవచ్చు. 6. దయచేసి ఈ సర్కులర్ ప్రాప్తిని తెలియజేయండి. మీ విధేయులు, (ఉమా శంకర్) |