<font face="Mangal" size="3"> బంగారం నగలు/ఆభరణాల తాకట్టుపై రుణము</font> - ఆర్బిఐ - Reserve Bank of India
బంగారం నగలు/ఆభరణాల తాకట్టుపై రుణము
RBI/2015-16/207 అక్టోబర్ 15, 2015 అయ్యా/అమ్మా, బంగారం నగలు/ఆభరణాల తాకట్టుపై రుణము మా సర్క్యులర్లు UBD.CO.BPD.PCB.Cir.No.60/13.05.001/2013-14 తేదీ మే 09, 2014 మరియు RPCD.RRB.RCB.B.C.No.8/03.05.33/2014-15, తేదీ జులై 01, 2014 లోని పేరా 3, దయచేసి చూడండి. తాకట్టు బంగారం వెల నిర్ధారణ విధానాన్ని, ప్రమాణీకరించడానికీ, మరింత పారదర్శకంగా చేయడానికీ, ఇండియన్‌బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ [పూర్వపు, బాంబే బులియన్ అసోసియేషన్ లిమిటెడ్ (BBA)] పేర్కొన్న, ముందు గడిచిన 30 రోజుల 22 క్యారట్ల, సగటు బంగారం ధరతో వెలగట్టాలని సూచించడం జరిగింది. 2. ఈ విషయాన్ని, సమీక్షించి, సహకార బ్యాంకులు, కమొడిటీ ఎక్స్చేంజ్‌లు (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉన్నవి) బహిరంగంగా ప్రకటించిన, గడిచిన 30 రోజుల స్పాట్ బంగారం ధరల సమాచారాన్ని కూడా, ఆధారంగా తీసుకోవచ్చని నిశ్చయించడమైనది. విధేయులు, |