RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499200

సభ్యులు కాని వారికి నిర్ణీతకాల డిపాజిట్లపై రుణాలు

RBI/2016-17/57
DCBR.BPD (PCB).BC.No.3/12.05.001/2016-17

సెప్టెంబర్ 1, 2016

చీఫ్ ఎక్జెక్యూటివ్ అధికారులు,
వేతనదారుల ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు

అయ్యా/అమ్మా,

సభ్యులు కాని వారికి నిర్ణీతకాల డిపాజిట్లపై రుణాలు

ఆగస్ట్ 8, 2001 తేదీన జారీచేసిన మా సర్క్యులర్ UBD.No.BL.(SEB)5A/07.01.00-2001/02 ప్రకారం, శాఖలు తెరవడానికి అనుమతికోసం దరఖాస్తుచేసే వేతనదారుల ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు (SEBs) వారి బై లాస్‌లో, బయటివారిని (వేతనదారులు కానివారిని) సభ్యులుగా/నామమాత్రపు సభ్యులుగా చేర్చుకొని, రుణాలు జారీ చేయడానికి వీలు కల్పించే నిబంధనలు లేవని నిర్ధారించుకోవాలి.

2. డిసెంబర్ 14, 2015 న జరిగిన 32 వ స్థాయీ సలహా సంఘం
సమావేశంలో జరిపిన చర్చల అనంతరం, SEBలు సభ్యులు కానివారికి కూడా, ఈ క్రింది షరతులకు లోబడి రుణాలు జారీ చేయవచ్చని, నిర్ణయించబడింది:

  1. మా సర్క్యులర్లు UBD.CO.LS (PCB) Cir.No.20/07.01000/2014-15 తేదీ ఆక్టోబర్ 13, 2014 మరియు DCBR.CO.LS (PCB) Cir.No.4/07.01.000/2014-15 తేదీ జనవరి 28, 2015 లో సూచించిన విధంగా SEB, ఆర్థికంగా పటిష్టంగా నిర్వహించబడుతున్నదై ఉండాలి.

  2. మా సర్క్యులర్ UBD.No.Plan.(PCB).9/09.06.00-94/95 తేదీ జులై 25, 1994 లో సూచించిన విధంగా ఏర్పాటు చేయబడి, పనిచేస్తున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, ఆడిట్ కమిటీ కలిగి ఉండవలెను.

  3. బై లాస్‌, సభ్యులు కానివారికి నిర్ణీతకాల డిపాజిట్లపై రుణాలు మంజూరు చెయ్యడానికి అనుమతిస్తూ నిబంధనలు కలిగి ఉండవలెను.

  4. వారి బోర్డ్ విధానం ప్రకారం ఇటువంటి రుణాలపై ఎల్లప్పుడూ తగినంత మార్జిన్‌ నిర్వహించవలెను.

  5. నిర్ణీతకాల డిపాజిట్లపై రుణంతప్ప, సభ్యులు కానివారికి మరి ఎటువంటి పరపతి సౌకర్యాలు మంజూరు చేయరాదు.

3. మా సర్క్యులర్‌ UBD.No.BL (SEB) 5A/07.01.00-2001/02 తేదీ ఆగస్ట్ 8, 2001 లో పేర్కొన్నఇతర నిబంధనలు అన్నీ యథాతథంగా ఉంటాయి.

విధేయులు,

(ఏ జి రే)
జనరల్ మానేజర్-ఇన్‌-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?