<font face="mangal" size="3">వస్తు, సేవల పన్ను (GST) వసూళ్ళపై ఏజన్సీ కమిషన్‌</font> - ఆర్బిఐ - Reserve Bank of India
వస్తు, సేవల పన్ను (GST) వసూళ్ళపై ఏజన్సీ కమిషన్
RBI/2017-18/95 నవంబర్ 16, 2017 అన్ని ప్రాతినిధ్య బ్యాంకులకు (All Agency Banks) అయ్యా/అమ్మా, వస్తు, సేవల పన్ను (GST) వసూళ్ళపై ఏజన్సీ కమిషన్ 'ప్రాతినిధ్య బ్యాంకులచే ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ – ఏజన్సీ కమిషన్ చెల్లింపు' పై జులై 01, 2017 తేదీన జారీచేసిన మాస్టర్ సర్క్యులర్, పేరా 15, దయచేసి చూడండి. 2. వస్తు, సేవల పన్ను విధానం అమలుపరిచిన తరువాత, మాస్టర్ సర్క్యులర్లోని పేరా 15 సవరించాలని నిశ్చయించడం జరిగింది. పేరా 15 ఈ క్రింది విధంగా, సవరించబడింది: "ప్రాతినిధ్య బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన క్లైములు, CAS, నాగ్పూర్కు; రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన క్లైములు, వారి ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలకు, సమర్పించవలసి ఉంది. అయితే, GST వసూళ్ళకు సంబధించిన, క్లైములు రిజర్వ్ బ్యాంక్, ముంబై, ప్రాంతీయ కార్యాలయంద్వారా మాత్రమే సెటిల్ చేయబడతాయి. అందువల్ల, GST వసూలు చేయడానికి అనుమతించబడ్డ ప్రాతినిధ్య బ్యాంకులు, వారి క్లైములు, కేవలం ముంబై ప్రాంతీయ కార్యాలయానికి మాత్రమే సమర్పించాలి. ప్రాతినిధ్య బ్యాంకులు, ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేయడానికి ఉపయోగించవలసిన, సవరించిన ఫార్మాట్లు; విడిగా శాఖా అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సంతకం చేయవలసిన ప్రత్యేక ధ్రువపత్రాల సవరించిన ఫార్మాట్లు, అనుబంధం - 2 లో ఇవ్వబడ్డాయి. జమ చేయవల్సిన పెన్షన్ బకాయిలు లేవు/ నియమిత పెన్షన్, వాటిపై బకాయిలు జమచేయడంలో జాప్యం లేదు అని తెలుపుతూ, ED / CGM (ప్రభుత్వ వ్యవహారాలకు బాధ్యులుగా ఉన్న) మామూలుగా సమర్పించే ధ్రువ పత్రాలకు అదనంగా, ఇవి సమర్పించాలి." 3. మాస్టర్ సర్క్యులర్లోని అన్ని ఇతర ఆదేశాలలో, ఎట్టి మార్పూ లేదు. మీ విశ్వాసపాత్రులు, (పార్థా చౌదరి) |