RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490417

గ్రామీణ ప్రాంతాల‌కు న‌గ‌దు కేటాయింపు

RBI/2016-17/207
DCM (Plg) No.2200/10.27.00/2016-17

జ‌న‌వ‌రి 03, 2017

ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
(కరెన్సీ ఛెస్ట్ లు కలిగిన అన్ని బ్యాంకులు)

డియ‌ర్ స‌ర్‌/మేడ‌మ్‌,

గ్రామీణ ప్రాంతాల‌కు న‌గ‌దు కేటాయింపు

దయచేసి గ్రామీణ ప్రాంతాలలో నగదు లభ్యతపై మేము నవంబర్ 22, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1345/10.27.00/ 2016-17 మరియు డిసెంబర్ 2, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1508/10.27.00/ 2016-17 ను చూడండి.

2. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న బ్యాంకు నోట్లు గ్రామీణ జనాభా అవసరాలను తీర్చలేకపోతున్నాయని గమనించిన నేపథ్యంలో పైన పేర్కొన్న సర్క్యులర్లలోని అంశాలను అనుసరించి ఇప్పటికే కొన్ని చర్యలను తీసుకోవడం ప్రారంభమైంది. బ్యాంకు నోట్లలో కనీసం 40 శాతం నోట్లను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేయాలని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో పైన పేర్కొన్న చ‌ర్య‌ల‌కు తోడు కరెన్సీ చెస్ట్ లను నిర్వహించే బ్యాంకులు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.

పంపిణీ మార్గాలు, కరెన్సీ కేటాయింపు నిష్పత్తి

i. గ్రామీణ ప్రాంతాలలో నగదు పంపిణీకి ముఖ్య మార్గాలుగా భావించే RRBలు, DCCBలు, వాణిజ్య బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎంలు మరియు పోస్ట్ ఆఫీసులకు కొత్త నోట్లను పంపే ఏర్పాట్లను మొదటి ప్రాధాన్యతగా వేగవంతం చేయాలని బ్యాంకులు తమ కరెన్సీ చెస్ట్ లను ఆదేశించాలి.

ii. CASA డిపాజిట్లు మ‌రియు డిపాజిట్ అకౌంట్ల సంఖ్యను అనుసరించి జిల్లా నుంచి జిల్లాకు గ్రామీణ అవసరాలు మారుతాయి కాబట్టి; గ్రామీణ, పట్టణ మిశ్రమాన్ని అనుస‌రించి Annex -1 ప్ర‌కారం ప్రతి జిల్లా అవసరాలకు అనుగుణంగా కొంత న‌గ‌దును కేటాయించడం జరిగింది.

iii. తదనుగుణంగా, జిల్లాలో నిర్వహించబడుతున్న అన్ని ఛెస్ట్ లు పైన పేర్కొన్న పంపిణీ మార్గాల ద్వారా సూచించిన నిష్ప‌త్తికి అనుగుణంగా బ్యాంకు నోట్లను జారీ చేయాలి. జారీ చేసే నోట్ల నిష్ప‌త్తిని రోజువారీగా అనుసరించడం కష్టమ‌ని భావిస్తున్న‌ నేపథ్యంలో, పైన పేర్కొన్న నిష్ప‌త్తిని ప్ర‌తి చెస్ట్ స్థాయిలో వారాంతపు సగటు ప్రాతిపదికగా నిర్వహించాలి.

ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌కు నివేద‌న

iv. కరెన్సీ ఛెస్ట్ లు పైన పేర్కొన్న విభాగాలకు తాము రోజూ జారీ చేసే కరెన్సీ నోట్ల వివరాలను, ఛెస్ట్ స్లిప్పులతో సహా, ప్రతి శుక్రవారం బ్యాంకు లావాదేవీలు ముగిసిన పిమ్మట లింక్ ఆఫీసుల (LO)కు వారాంతపు నివేదిక ద్వారా సమర్పించాలి. తమకు అందిన ఆ నివేదికలను LOలు సమీక్ష నిమిత్తం సంబంధిత RBI ప్రాంతీయ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది (నివేదించాల్సిన ఫార్మాట్ ను జతపరచడమైనది). ఇది ఛెస్ట్ బ్యాలెన్స్ రిపోర్టింగ్ వ్యవస్థ (Annex- 2) కు దగ్గర రూపంలో ఉండవచ్చు. కేటాయింపులు అపసవ్యంగా లేకుండా సక్రమంగా జరిగేలా LOలు రోజువారీ నివేదికలను పర్యవేక్షించవచ్చు.

నోట్ల మిశ్ర‌మం

v. ఛెస్ట్ లు బ్యాంకు నోట్లను రూ.500, అంతకన్నా తక్కువ విలువ రూపంలో జారీ చేయాలి. మరీ ప్రత్యేకించి WLAOలతో పాటు ఏటీఎంలకు రూ.500 మరియు రూ.100 నోట్లను విడుదల చేయాలి. ఖాతాదారులకు చేరాల్సిన చివరి దశ ప్రాముఖ్య‌త నేప‌థ్యంలో ఏటీఎం విభాగంలో ఆన్ సైట్ ఏటీఎంలతో పోలిస్తే ఆఫ్ సైట్ ఏటీఎంలకు ఎక్కువ నగదును విడుదల చేయాలి.

vi. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న త‌క్కువ విలువ క‌లిగిన నోట్ల‌ను విరివిగా పంపిణీ చేయాలి.

vii. బ్యాంకులు నాణేల కొరకు ఇండెంట్లు పెట్టాలి, అవసరమైతే, రిజర్వ్ బ్యాంక్ యొక్క ఇష్యూ విభాగాల నుంచి వాటిని తీసుకొని, ప్రాధాన్యతా క్రమంలో అవి ప్రజలకు అందేలా చూడాలి.

3. ద‌య‌చేసి అందిన‌ట్లు తెలుప‌గ‌ల‌రు.

మీ విశ్వ‌స‌నీయులు,

(పి. విజ‌య కుమార్‌)
చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

జ‌త‌ప‌ర‌చిన‌వి: పైన పేర్కొన్న‌వి

Annex 1: (జ‌త‌ప‌ర‌చ‌బ‌డిన‌ది)


Annex 2

ఆర్ బీ ఐ యొక్క స్థానిక కార్యాల‌యాల‌కు లింక్ ఆఫీసుల ద్వారా రోజువారీ నివేదిక‌
(రూ. కోట్ల‌లో

బ్యాంకు తేదీ గ్రామీణ ఏటీఎంల‌కు పంపిణీ చేసిన న‌గ‌దు గ్రామీణ శాఖ‌ల‌కు పంపిణీ చేసిన న‌గ‌దు గ్రామీణ WLAల‌కు పంపిణీ చేసిన
న‌గ‌దు
గ్రామీణ ప్రాంతాల‌లోని పోస్ట్ ఆఫీసుల‌కు పంపిణీ చేసిన
న‌గ‌దు
మొత్తంగా గ్రామీణ ప్రాంతాల‌కు పంపిణీ చేసిన న‌గ‌దు
RRBలు వాణిజ్య బ్యాంకులు DCCBలు
                 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?