<font face="mangal" size="3px">అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూ - ఆర్బిఐ - Reserve Bank of India
అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు- బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, (AACS) సెక్షన్ 35A ప్రకారం ఆల్ ఇంక్లూజివ్ నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపు
జనవరి 04, 2018 అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు- బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫై విధించిన ఏప్రిల్ 1, 2013 నాటి నిర్దేశం (డైరెక్టివ్), చివరగా ఇచ్చిన జూన్ 29, 2017 నాటి దానితో కలిపి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశం కాల పరిమితిని మరో ఆరు నెలలపాటు పొడిగించడానికి నిర్ణయించిందని ప్రజలకు తెలియజేయడమైనది. దీని ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A (సహకార సొసైటీలకు వర్తించేది) యొక్క ఉప విభాగం (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫై విధించిన ఏప్రిల్ 1, 2013 నాటి నిర్దేశం, సమయానుసారంగా జనవరి 4, 2018 వరకు, చివరిగా పొడిగించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశం కాల పరిమితి మరో ఆరు నెలల కాలానికి అంటే జనవరి 5, 2018 నుండి జులై 4, 2018 వరకు, సమీక్ష అధికారాలతో పొడిగించింది. నిర్దేశం క్రింద వున్న ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. ఆర్బిఐ ద్వారా జారీ చేసిన ఫై నిర్దేశాలు, బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. దాని ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు పరిమితులతోకూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. పరిస్థితుల మీద ఆధారపడి, రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్దేశాల మార్పులను పరిశీలిస్తుంది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1834 |