<font face="Mangal" size="3">సెక్షన్ 35A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరే&# - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 35A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) అనుసారంగా, అమర్నాథ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బెంగళూరుకు జారీచేసిన, అన్ని సమగ్ర మార్గదర్శకాల పొడిగింపు
తేదీ: జులై 04, 2018 సెక్షన్ 35A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) అనుసారంగా, అమర్నాథ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమర్నాథ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బెంగళూరుకు ఏప్రిల్ 1, 2013 జారీచేయబడి, తదుపరి సవరించబడుతూ వచ్చిన ఆదేశాలు (చివరి ఆదేశాల సవరణ తేదీ, డిసెంబర్ 21, 2017) ప్రజాక్షేమం దృష్ట్యా ఇంకొక ఆరు నెలలు పొడిగించవలసిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావించడంవల్ల, అ నిర్దేశాలు మరొక ఆరు నెలలు పొడిగించబడ్డాయని ప్రజలకు తెలియజేయడమైనది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (కో-ఆపరేటివె సొసైటీలకు వర్తించేమేరకు), ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, అమర్నాథ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బెంగళూరుకు ఏప్రిల్ 1, 2013 తేదీన జారీచేయబడి తదుపరి పొడిగించబడుతూ, చివరి ఆదేశం ద్వారా జులై 04, 2018 వరకూ పొడిగించబడిన ఆదేశాలు, మరొక ఆరు నెలలవరకు, అనగా జనవరి 4, 2019 వరకు (సమీక్షకు లోబడి) అమలులో కొనసాగుతాయని ఆదేశిస్తున్నది. పైన పేర్కొన్న నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఏమార్పూ లేదు. రిజర్వ్ బ్యాంక్ ఈ ఆదేశాలు జారీచేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క అనుమతి రద్దుచేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో, బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈ ఆదేశాలలో మార్పులుచేయవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/23 |