అమానత్ సహకార బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 35A క్రింద ఆల్ ఇంక్లూజివ్ నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపు
తేది: 04/07/2019 అమానత్ సహకార బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు – అమానత్ సహకార బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు ఫై మొదటగా విధించిన ఏప్రిల్ 1, 2013 నాటి నిర్దేశం, చివరగా ఇచ్చిన డిసెంబర్ 21, 2018 నాటి దానితో కలిపి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశం కాల పరిమితిని మరో ఆరు నెలలపాటు పొడిగించడానికి నిర్ణయించిందని ప్రజలకు తెలియజేయడమైనది. తదనుసారముగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 35A(1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని అమానత్ సహకార బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు ఫై విధించిన ఏప్రిల్ 1, 2013 నాటి నిర్దేశం, సమయానుసారంగా జులై 04, 2019 వరకు చివరిగా పొడిగించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశం కాల పరిమితి మరో ఆరు నెలల కాలానికి అంటే జులై 5, 2019 నుండి జనవరి 4, 2020 వరకు, సమీక్షకు లోబడి పొడిగించబడింది. నిర్దేశం క్రింద వున్న ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీ చేసిన ఫై నిర్దేశాలు, బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు పరిమితులతోకూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకు కొనసాగించవచ్చు. పరిస్థితుల మీద ఆధారపడి, భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాల మార్పులను పరిశీలించవచ్చు. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/50 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: